భారత ప్రధాని నరేంద్ర మోడి నుండి ఇంతవరకు వినని మాటలు వినబడుతున్నాయి. దాదాపు ప్రతి (భారతీయ) మతానికి చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ముస్లింల టోపీ (skull cap) ధరించడానికి మాత్రం నిర్ద్వంద్వంగా నిరాకరించిన నరేంద్ర మోడి ఈ రోజు ముస్లింల దేశభక్తిపై పొగడ్తల వర్షం కురిపించారు.
“నా అవగాహన ఏమిటంటే, వాళ్ళు మన దేశ ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ ముస్లింలు వారి ట్యూన్ లకు నాట్యం చేస్తారని ఎవరైనా భావించినట్లయితే వారు భ్రమల్లో ఉన్నట్లే” అని నరేంద్ర మోడి సి.ఎన్.ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడి కొద్ది రోజుల క్రితం వెలువడిన ఆల్-ఖైదా ప్రకటన గురించి వ్యాఖ్యానిస్తూ ఈ మాటలు చెప్పారు. భారత ఉపఖండంలో తమ శాఖను ఏర్పాటు చేశామని స్వయం ప్రకటిత ఆల్-ఖైదా నేత అయిమన్ ఆల్-జవహిరి ఓ వీడియోలో ప్రకటించారు. ఈ ప్రకటన దరిమిలా హోమ్ మంత్రిత్వ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది.
“భారతీయ ముస్లింలు భారత దేశం కోసమే జీవిస్తారు. భారత దేశం కోసమే చనిపోతారు. భారత దేశానికి వారు ఎన్నడూ చెరుపు చేయరు” అని మోడి సి.ఎన్.ఎన్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మానసిక, మత విశ్లేషణలు చేసేందుకు తాను తగినవాడిని కాదని చెబుతూనే ఆయన మరికొన్ని మాటలు చెప్పారు.
“కానీ ప్రశ్న ఏమిటంటే ప్రపంచంలో మానవత్వాన్ని కాపాడుకోవాలా లేదా అన్నదే. ఆస్తికులు అయినా కాకపోయినా సరే మానవత్వం విషయంలో ఐక్యం కావలసిందే. ఇది మానవతకు వ్యతిరేకంగా తలెత్తిన సంక్షోభం. ఏదో ఒక దేశానికో లేక జాతికో వ్యతిరేకంగా తలెత్తిన సంక్షోభం కాదు. కనుక మనం దీనిని మానవతకు, అమానవీయతకు మధ్య జరుగుతున్న పోరాట చట్రంలో భాగంగా చూడాలి. ఇంకేదీ కాదు” అని మోడి వివరించారు.
ప్రధాని మోడి మాటలను ఎవరు కాదనగలరు? మతోన్మాద గబ్బులో పడి దొర్లుతున్నవారు తప్ప!
మోడి అభిమానులూ, వింటున్నారా? భారతీయ ముస్లింల దేశభక్తిని శంకించేవారిని భ్రమల్లో మునిగి ఉన్న వెధవాయిలుగా ప్రధాని తేల్చిపారేశారు. ఆయన మాటల అర్ధం మీ బుర్రలకు ఎక్కుతోందా? ముస్లింలు అంటేనే ఒంటికాలి పైన లేస్తూ ఎక్కడో బర్మాలో ముస్లింలు ఊచకోతకు గురైనా సంబరాలు చేసుకునే మతోన్మాదులకు మోడి మాటలు కళ్ళు తెరిపిస్తాయని ఆశిద్దాం.
కానీ ఇవే మాటల్ని ప్రధాని మోడి, ముఖ్యమంత్రిగా, 13 సం.ల క్రితం గుజరాత్ వీధుల్లో మతోన్మాదం కట్లు తెంచుకుని వికృత నరమేధం సాగిస్తున్న వేళ చెప్పి ఉన్నట్లయితే 2,000 మందికి పైగా అమాయకుల ప్రాణాలు ఇప్పటికీ నిలిచి ఉండేవి కాదా?
ఉన్మాదం ఆవహించిన మూకలు తన ఇంటిని చుట్టుముట్టి నెత్తుటి రుచి కోసం కోరలు సాచి నర్తిస్తుండగా తమను ‘కాపాడమంటూ’ భారత పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీ పదే పదే రాష్ట్ర ప్రభుత్వ సమస్త అంగాలకు ఫోన్లు చేసి వేడుకున్నప్పుడు ఇదే అవగాహనను తమ పార్టీ కార్యకర్తలకు ఆనాటి ముఖ్యమంత్రీ మోడి బోధించి ఉంటే, ఈ రోజు జకీయా జాఫ్రీ, ముదిమి మీదపడిన జీవన సంధ్య వేళ ఎక్కిన మెట్టు, దిగిన మెట్టుగా కోర్టుల చుట్టూ తిరిగే దుర్గతి తప్పి ఉండేది కాదా?
ఎక్కడెక్కడో తమ తమ జీవితాలు గడుపుతున్న ముస్లిం యువతీ, యువకులను ఒక దగ్గరికి చేర్చి, వారికి ఉగ్రవాద ముద్ర తగిలించి మోడిని హత్య చేయబోతున్నారంటూ కధలు అల్లి, బూటకపు ఎన్ కౌంటర్ కు గుజరాత్ పోలీసులు గురి చేయబోతున్నప్పుడే ఈ మాటలు చెప్పి ఉంటే ఈ రోజు అంతమంది అగ్రపోలీసు బాసులు కటకటాలను లెక్కించే దుర్గతి తప్పి ఉండేది కదా?
నిన్నగాక మొన్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బి.జె.పి నేత, ఎం.పి అయిన యోగి ఆదిత్య నాధ్ ‘లవ్ జిహాద్’ అంటూ ముస్లిం వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ మాటలు ఎందుకు లేకుండాపోయాయి?
లేక ది హిందూ సంపాదకీయం చెప్పినట్లుగా మతోన్మాదాన్ని సహించేది లేదని ఉత్తర ప్రదేశ్, రాజస్ధాన్ ఫలితాల ద్వారా జనం స్పష్టం చేసినందునే ఈ మతసామరస్య భావనలు వెల్లువలా పొంగుకొస్తున్నాయా?
మారింది ఎవరు? మారనిది ఎవరు?
ఎన్నికల సమయంలో నేను హిందీ చానెల్లు చూసాను. తాము కులమతాలకి అతీతం అని బి.జె.పి. నాయకులు ప్రకటనలు ఇచ్చుకున్నారు. బి.జె.పి. స్థాపించినపుడు తాము శ్యాం ప్రసాద్ ముఖర్జీ హిందూత్వ సిద్ధాంతాలని నమ్ముతామని చెప్పుకున్నారు. వీళ్ళు అంత తొందరగా కులమతాలకి అతీతులవుతారంటే ఎలా నమ్మాలి?
sir, tibetians delhi lo maku nyayam cheyani rallys chestunararu enduku .china tibet ku chestunna injustice emiti, please vivarinchagalaru
Soviet Union had many nations (jatulu) and even China has so. Tibetans want to be separated from China and anti-communist media gives free publicity for them.
అంటే,మోడీ చెబుతున్న ఈ వచనాలు నోటినుండే గానీ మనసు నుండి కాదన్నమాటా!
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయా? తను చెప్పేదొకటి,చేసేదొకటి అనా?
లేక ప్రాదాన మంత్రిపదవిలో ఉన్నానుకనుక సుద్దుచెప్పకతప్పదనా?
లేక ముస్లింలపై తన అభిప్రాయాలు మార్చుకొన్నాననా?(రియలైజ్ అవ్వడం మూలానా)
BJP supporters must agree that selfishness is not confined to caste and religion.
Copied from Facebook:
Harsha Vadlamudi
ముస్లిం పునరావాస శిబిరాలనుద్దేశించి ”ఇవి సంతానోత్పత్తి కేంద్రాలు. ఐదుగురి సంతానం ఐదుపదులు” అని అసహ్యమైన వ్యాఖ్యానాలు చేసిన విషయం మర్చిపోలేదు నేను ఇంకా.అధికారిక గణాంకాల ప్రకారం 2000మంది ముస్లింల మారణకాండకు కారణమైన 2002 సంవత్సరం గుజరాత్ హింసాఘటనలకు నిరసనగా పార్లమెంటులోని విపక్ష పార్టీలన్నీ పార్లమెంటును స్తంభింపజేశాయి. వామపక్షాలు, డి.ఎం.కె., టిడిపి, ఎఐఎడిఎంకె. పార్టీలు మోడీ రాజీనామాను కోరాయి. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, గుజరాత్ హింసా ఘటనల తర్వాత ప్రజలను భేదభావంతో చూడవద్దని మోడీకి సలహా చెప్పడమే గాక ఆయనను దూరంగా వుంచారు కూడా. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని కూడా ఆదేశించారు. 2004 సాధారణ ఎన్నికలలో భాజపా ఓటమికి గుజరాత్ హింసాఘటనలు కూడా ఒక కారణమని, ఆ ఘటనలకు వెంటనే మోడీని తొలగించకపోవడం తప్పని అంగీకరించారు. ఈ అమానవీయ సంఘటనలను దేశ, విదేశాలలో ఎందరు నిరసించినా సిగ్గు పడకుండా తన మాతృ సంస్ధ ఆరెస్సెస్ ఎజెండాను ముందుకు తీసుకుపోయారు మోడీ. మారణ హోమానికి గురయిన పర మతస్తులను కుక్కలతో పోల్చారు. ఈ నాటికి కూడా అసంఘటనలకు పశ్చాత్తప పడలేదు. ఇటీవలి కాలంలో టివి9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కరుడుగట్టిన ఈ మతవాదానికి ”హిందు జాతీయవాదమని”ముద్దు పేరు పెట్టారు.లవ్ జీహాద్ ని ఖండించకుండా ముస్లింల మీద ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకంట!. మోడీని వ్యతిరేకించే వాళ్ళందరూ పాకిస్తాన్ కి పోండి అన్నది ఎవరైనా అనిపించింది మోడీ కాదా?. అమిత్ షా నియామకం, యోగి ఆదిత్యా ముస్లింలను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలీదా?.మర్మాంగాల్లోకి జొనిపిన ఇనుప రాడ్లుత్రిశూలాలకి గుచ్చి ఊరేగించిన పిండాలుభయంతో వణికి బయటకి రాని గుజరాతీలునీరు దొరక్క ……….తాగి బతికిన పిల్లలునిండు గర్బిణితో కిరోసిన్ తాగించిన నీ అనుచరులుసామూహిక అత్యాచారాలకి గురైన మహిళలుఊర్లకు ఊర్లు ఖాళీ చేసి పోయిన కుటుంబాలుఅక్కడే (పునరావాస కేంద్రం) పుట్టి అక్కడే సమాదైన పసి మొగ్గలునువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోలేనుఓ అభివృద్ది తోలు కప్పుకున్న మతోన్మాదీఈ ఎన్నికల ఆటలు ఇంకా ఎన్నాళ్ళాడతావ్ఎవరికి తెలియదు నీ హిందూత్వ భాగోతంగెలిచావని అడిగే దమ్ము ఎవరికీ లేదనుకుంటున్నావేమోనా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను అసహ్యించుకుంటూనే ఉంటానునిన్ను అసహ్యించుకునే వాళ్ళందరినీ సమీకరించే ప్రయత్నం చేస్తాను నీ మతోన్మాదాన్ని చావుదెబ్బ కొట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానుమతం ఉన్నంత వరకు గెలుస్తూనే ఉంటావుమానవత్వమే మేల్కొంటే ఆ రోజు ఏమౌతావునియంతలనే మట్టి కరిపించారు నా జనంనువ్వెంతటి వాడివైనా ఆగదు ప్రభంజనం — feeling Secu”LIAR”ism.
From a FB wall..
దేశం కోసం ప్రాణాలివ్వాలా..? ముందు వీటికి సమాధానమివ్వండి?
2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో మాయా కొందానీ అనే బి.జె.పీ MLA, దగ్గరుండి 95 మంది ముస్లిం స్త్రీలని, పిల్లన్ల్ని చంపించింది. ఈ విషయాన్ని కోర్టు 2012 లో నిర్ధారించింది. కానీ, మీరు ఈవిడ్ని 2007 లో గుజరాత్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. మీరు ఆమెను మంత్రిగా నియమించారంటే, ఆమె చేసింది అసలు నేరమే కాదని మీ ఉద్ద్యేశ్యమై ఉండాలి. లేదా, ఆమె ఆ నేరంలో భాగస్వామురాలనే విషయం అసలు మీదృష్టికి రాకపోయి ఐనా ఉండాలి. మొదటిదే నిజమైతే, ఈ దేశాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు.( నీలాంటోడికి ఓట్లేసినందుకు) . పోనీ రెండోది నిజమనుకుంటే, 2012 లో కోర్టు ఆమె నేరాన్ని నిర్ధారించాకైనా, ఈవిడ గురించి తెలీక నేను మంత్రిని చేశాను, క్షమించండి అని ఒక్కసారైనా అన్నావా? వీల్లకెందిలే చెప్పేది బోడి అనుకున్నావా? మరి అలాంటప్పుడు, ఏ ముఖం పెట్టుకుని, దేశం కోసం నా ప్రాణాలు కావాలంటున్నావ్?
2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో మాయా కొందానీ అనే బి.జె.పీ MLA, దగ్గరుండి 95 మంది ముస్లిం స్త్రీలని, పిల్లల్ని చంపించింది. ఈ విషయాన్ని కోర్టు 2012 లో నిర్ధారించింది.
అలా నిర్థారించిన కోర్టూవారు మరి ఆ మాయా కొందానీకి ఎందుకని ఉరిశిక్ష విధించలేదూ? 95 మందిని చంపించిన నేరం అత్యంత అరుదైన నేరం క్రింద ఉరిశిక్షకు అర్హమైనదే కదా? ఐతే యావజ్జీవ శిక్షవేసారా?
ఈవిడ్ని 2007 లో గుజరాత్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు.
అలా ఎలా జరిగిందీ? 2002నుండి 2007వరకు ఐదేళ్ళో అంతకన్నా కొంచెం తక్కువో కదా? యవజ్జీవశిక్ష పడ్ద ఆవిడకు సత్ప్రవర్తన అనే సాకు చెప్పి విడుదల చేయటమూ పైగా మంత్రిని చేయటమూ కూడా జరిగిందా? నమ్మశక్యంగా లేదు.
ఆమె చేసింది అసలు నేరమే కాదని మీ ఉద్ద్యేశ్యమై ఉండాలి
ఇతరుల ఉద్దేశాలు ప్రక్కన బెట్టండి. కోర్టువారు అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నారు.
1. అత్యంత అరుదైన నేరంగా భావించి ఉరిశిక్ష వేసారు.
……. రాష్ట్రపతి క్షమించి విడుదలచేసారా మరి?
2. సాధారణ హత్యానేరంగా భావించి యావజ్జీవకారాగార శిక్ష వేసారు.
…… పై కోర్టు ఏమన్నా చిన్న శిక్ష వేసిందా?
…… పై కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసిందా?
3. అతి చిన్న నేరంగా భావించి ఏ నాలుగైదు ఏళ్ళ ఖైదు శిక్షో వేసారు.
….. పై కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసిందా?
…. చిన్న శిక్షను అనుభవించి బయటపడిందా? లేదా సత్ర్పవర్తన సాకు కాపాడిందా?
4. నిర్దోషిగా భావించి విడుదల చేసారు.
…. అవునా? అలాగే జరిగిందా?
చెప్పండి. పై నిర్ణయాలలో దేనికి కోర్టువారు వచ్చారు? అమె ఐదేళ్ళలో ఎలా మంత్రి కాగలిగారూ? ఇంత వివరం చెప్పమని అడగటం దేనికంటే ఎక్కడో పొరపాటు జరిగింది అది చేసింది కోర్టులా? ప్రభుత్వాలా? లేక ఈ వ్యాసంలో మీరా?
IMPORTANT: నా తొలివ్యాఖ్యను ఉపసంహరిస్తున్నాను. ప్రచురించ నవసరం లేదు.
In December 2002, shortly after 2002 Gujarat riots, she won by a margin of 110,000 votes. In 2007, her margin increased 180,000 votes.[8] After winning the elections in 2007, she was named as Minister for Women and Child Development of Gujarat in Narendra Modi’s BJP government,[2] but resigned from the post in 2009 impending her arrest as accused for the Naroda Patiya massacre.[3]
……..
She was tried in the Naroda Patia massacre case and, on August 31, 2012, convicted of murder …..
……On 17 April 2013, the Gujarat government decided to seek death penalty……On May 14, 2013, the Gujarat government subsequently withdrew its decision…..n November 2013, she was granted an interim bail of 3 months for treatment of intestinal tuberculosis…..on July 30, 2014 Gujarat High Court has granted bail to her on grounds of ill health.
… Wikipedia.
పై సమాచారం ప్రకారం 2007 తరువాతనే ఆవిడపై విచారణ జరిగింది. ఆ పరిస్థితి కారణంగా అవిడ రాజీనామా చేసారు. అసలు అంత భయంంకరమైన హంతకురాలికి ఏ కారణమైతేనేమి బెయిల్ ఇవ్వటం అన్యాయం!
@తాడిగడప శ్యామలరావు
నిజాలు తెలుసుకుని మీ కామెంట్ ని మీరే సరిదిద్దుకున్నందుకు అభినందనలు.
ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో మోడీ వైఖరి సరైనదేనని మీరు భావిస్తున్నారా?
“అసలు అంత భయంంకరమైన హంతకురాలికి ఏ కారణమైతేనేమి బెయిల్ ఇవ్వటం అన్యాయం!”
ఇలాంటి భయంకరమైన నేరాలు మోడీ పాలనలోని గుజరాత్లో ఇంకా అనేకం జరిగాయి. మీకు కనీసం ఇప్పుడే ఒక్కదాని గురించైనా తెలిసింది. వీటి గురించి, THEHINDU, TEHELKA, కనీసం విశేఖర్ గారి బ్లాగు, రెగ్యులర్గా చదివేవారికి ఎవరికైనా తెలిసే ఉంటుంది. కానీ, కొంతమంది అంధభక్తులు ఈ నిజాల్ని కనీసం తెలుసు కోవడానికి కూడా ఇష్టపడకుండా, అస్తమానం ఎదురుదాడికి ప్రయత్నిస్తుంటారు. వారి బారినుండి దేశాన్ని ఆ దేవుడే రక్షించుగాక.