ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు


EVM

పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రదర్శనకు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు విరుద్ధంగా వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ప్రజలు తేడా చూడడం ప్రారంభించారా అన్న అనుమానం కూడా ఉప ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భారత ప్రజలు సాపేక్షికంగా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే లెక్క. ఎలా చెప్పుకున్నా బి.జె.పి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్ సభ ఎన్నికల్లో పొందిన పునాదిని ఉప ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోవడం అనూహ్య పరిణామం.

ఉప ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా వెలువడం పరిపాటి. ఈ పరిశీలన తాజా ఉప ఎన్నికల్లోనూ రుజువయింది. అయితే ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభ సీట్లకు గాను 73 సీట్లు సొంతం చేసుకున్న బి.జె.పి కూటమి ఉప ఎన్నికల్లో 11 అసెంబ్లీ సీట్లకు గాను 4 మాత్రమే సొంతం చేసుకోవడం ఆశ్చర్యకర పరిణామమే.

తొలి ఫలితాలలో బి.జె.పి 2 సీట్లలో మాత్రమే ఆధిక్యం కనబరిచింది. చివరికి ఎలాగైతేనేం 4 సీట్లు సొంతం చేసుకుంది. పాలక సమాజ్ వాదీ పార్టీ మిగిలిన 7 సీట్లనూ గెలుచుకుంది. బి.జె.పి ఎం.పిలు మతతత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టినప్పటికీ ఫలితం లేకపోవడం ఒక విశేషం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. బి.ఎస్.పి ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. బి.జె.పి 10 స్ధానాల్లోనూ, దాని మిత్ర పార్టీ అప్నా దళ్ 1 స్ధానంలోనూ పోటీ చేశాయి.

ఉత్తర ప్రదేశ్ ఫలితాలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సహజంగానే సంతోషం కలిగించాయి. యు.పి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. ఆయన తగిన చర్యల ద్వారా ప్రజలకు మేలు చేస్తే అది నిజమైన కృతజ్ఞత అవుతుంది గానీ ఉత్తుత్తి ప్రకటనలు ఎందుకు?

పశ్చిమ బెంగాల్ లో అనూహ్యంగా బి.జె.పి ఒక సీటు గెలుచుకుంది. దశాబ్ద కాలంలో బి.జె.పి పశ్చిమ బెంగాల్ లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ప్రతిష్టాత్మక సీటు అంటూ పత్రికలు చెప్పిన చౌరంఘీ సీటును తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టుకుంది. గతంలో టి.ఎం.సి తో పొత్తు ద్వారా బెంగాల్ లో అసెంబ్లీ స్ధానాలు గెలిచిన బి.జె.పి ఈసారి సొంతగానే అసెంబ్లీ సీటు గెలిచింది. ఉప ఎన్నికలు జరిగిన రెండు స్ధానాలలోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి ఓటమి చవిచూసింది.

రాజస్ధాన్ లో సైతం బి.జె.పి కుదుళ్లు కదులుతున్నట్లు సూచించే విధంగా ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4 స్ధానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కేవలం 1 సీటు మాత్రమే బి.జె.పి నిలబెట్టుకుంది. మిగిలిన మూడు స్ధానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేసినందునే కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్ ఫలితాలు ముఖ్యమంత్రి వసుంధర రాజేకు ఊహించని దెబ్బ అని పరిశీలకులు చెబుతున్నారు. కోట సీటు మాత్రమే బి.జె.పి నిలబెట్టుకోగా వీర్, నసీరాబాద్, సూరజ్ ఘర్ లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్ధానాలనూ బి.జె.పి గెలుచుకుంది.

గుజరాత్ లోనూ బి.జె.పి కుదుళ్లు బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ 9 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 3 స్ధానాల్లో విజయం సాధించింది. ఈ మూడూ బి.జె.పి నుండి కైవసం చేసుకున్నవే. మిగిలిన 6 స్ధానాలను బి.జె.పి నిలబెట్టుకుంది. నూతన ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ కు పరీక్షగా భావించిన తాజా ఫలితాలు ఆమెకు కాసింత ఖేదాన్ని మిగల్చగా కాంగ్రెస్ కు నమ్మకాన్ని పెంచాయి.

మోడి నేతృత్వంలోని బి.జె.పి ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన నాలుగు నెలల అనంతరం జరిగిన ఎన్నికలు మోడి పాలనకు గీటు రాయి కాగలవని విశ్లేషకులు భావించిన నేపధ్యంలో తాజా ఎన్నికల ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నది. వివిధ మంత్రిత్వ శాఖలకు 100 రోజులకు గాను లక్ష్యాలు నిర్దేశించినట్లు చెప్పుకున్న బి.జె.పి వాటన్నింటినీ సాధించామని కూడా ప్రకటించింది.

మొదటి త్రైమాసికంలో నమోదయిన రెండున్నరేళ్ల అత్యధిక జి.డి.పి వృద్ధి కూడా తమ పాలన పుణ్యమే అని ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వచ్చాక సభలు పని చేశాయని, అనేక బిల్లులు ఆమోదించామని చెప్పింది. ఈ బిల్లులు ప్రజా వ్యతిరేకం అన్న సంగతి పక్కనబెట్టి అసలు బిల్లులు ఆమోదం పొందడమే ఒక గొప్పగా బి.జె.పి చెప్పింది. ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ 2004 ఎన్నికల్లో ప్రచారం చేసినట్లుగా ఈ సారీ చేసింది. చివరికి 2004 తరహాలోనే ఉప ఎన్నికల ఫలితాలు రావడం బి.జె.పికి ఆందోళన కారకమే.

త్వరలో హర్యానా, మహా రాష్ట్ర రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బి.జె.పి తనదైన కొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టవచ్చు.

కింది పట్టికలు ది హిందూ పత్రిక నుండి సంగ్రహించినవి.

Tables: The Hindu

List of winners (Assembly bypolls)

State Constituencies Winner Party
Uttar Pradesh Lucknow (East) Ashutosh Tondon BJP
Charkhari Kaptan Singh SP
Sirathu Vachaspati SP
Balha Banshidhar Bauddh SP
Rohaniya Mahendra Singh Patel SP
Nighasan Krishana Gopal Patel SP
Saharanpur Nagar Rajeev Gumber BJP
Bijnore Ruchiveera SP
Thakurwara Navab Jan SP
Noida Vimla Batham BJP
Hamirpur Shivcharan Prajapati SP
West Bengal Basirhat Dakshin Samik Bhattacharya BJP
Chowringhee Nayna Bandyopadhyay TMC
Andhra Pradesh Nandigama Tangirala Sowmya TDP
Rajasthan Nasirabad Ramnarayan Congress
Weir Bhajanlal Congress
Surajgarh Sharwan Kumar Congress
Kota (South) Sandeep Sharma BJP
Assam Silchar Dilip Kumar Paul BJP
Lakhipur Rajdeep Goala Congress
Jamunamukh Abdur Rahim Ajmal AIUDF
Tripura Manu Pravat Chowdhury CPI(M)
Sikkim Rangang-Yangang Rup Narayan Chamling IND
Gujarat Deesa Rabari Govabhai Congress
Maninagar Patel Sureshbhai Dhanjibhai BJP
Tankara Metaliya Bavanjibhai Hansrajbhai BJP
Khambhalia Ahir Meraman Congress
Mangrol Vaja Babubhai Congress
Talaja Gohil Shivabhai Jerambhai BJP
Anand Patel Rohitbhai Jashubhai BJP
Matar Kesrisinh Jesangbhai Solanki BJP
Limkheda Bhuriya Vichhiyabhai Jokhnabhai BJP

List of winners (Lok Sabha bypolls)

State Constituency Winner Party
Uttar Pradesh Mainpuri Tej Pratap Singh Yadav SP
Telangana Medak Kotha Prabhakar Reddy TRS
Gujarat Vadodara Ranjanaben Dhananjay Bhatt BJP

5 thoughts on “ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు

  1. నరేంద్ర మోదీ వచ్చిన నెల రోజులకే ధరలు పెంచాడు. బెలూన్‌కి గాలి ఊదినట్టు నరేంద్ర మోదీకి ఎంత గాలి ఊదినా దాని వల్ల అద్భుతాలేమీ జరగవు కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s