ఉత్పాదక, అనుత్పాదక వ్యయాలు -ఈనాడు


అధ్యయనం శీర్షికన వెలువడిన వ్యాస పరంపర పోయిన వారం కాక అంతకు ముందు వారంతో ముగిసింది. ఓ వారం విరామం తర్వాత స్ధూల ఆర్ధిక శాస్త్ర పదజాలాన్ని వివరించే ప్రయత్నం మొదలు పెట్టాను.

డ్రై సబ్జెక్ట్ గా పేరుంది కనుక వీలనయింత తడిని అద్ది పాఠకులకు ఇవ్వాలనేది నా ప్రయత్నం. అందుకోసం సంభాషణల ద్వారా ఆర్ధిక పదజాలాన్ని వివరించగలిగితే పాఠకులకు మరింత తేలికగా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను ఈ వారం అమలు చేశాను.

పాఠకులు కొత్త వివరణ పద్ధతిపై స్పందించగలిగితే ఉపయోగం.

యధావిధిగా ఈనాడు వెబ్ సైట్ లో ఈ వారం భాగాన్ని చదవాలనుకుంటే కింది లింక్ క్లిక్ చేయగలరు.

అనుత్పాదక వ్యయం అంతా వ్యర్ధమేనా?

ఈ లంకె ఒక వారం మాత్రమే పని చేస్తుంది.

పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో ఆర్టికల్ చదవాలనుకుంటే కింది బొమ్మను క్లిక్ చేయగలరు. అవసరం అనుకుంటే రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 Eenadu -15.09.2014

14 thoughts on “ఉత్పాదక, అనుత్పాదక వ్యయాలు -ఈనాడు

 1. వడ్డీలు అంటే గుర్తొస్తోంది. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులన్నిటినీ ఫ్రీ స్కీములకే ఖర్చు పెట్టేవాడు. ఒక ఫ్రీ స్కీమ్‌పై ప్రపంచ బ్యాంక్ అభ్యంతరం చెపితే చంద్రబాబు దాన్ని రద్దు చేసి ఇంకో ఫ్రీ స్కీమ్ పెట్టేవాడు. ఫ్రీ స్కీముల కోసం చేసిన అప్పులు తీర్చడానికి నిజాం కాలం నాటి ప్రభుత్వ రంగ పరిశ్రమలని కూడా అమ్మేసేవాడు. ఆజం జాహీ మిల్లు భూముల్ని చవకగా రియల్ ఎస్తేత్స్‌కి అమ్మేసారు. హైదరాబాద్‌లో జరిగిన IT అభివృద్ధిని చూపించి మిగితా ప్రాంతాల్లో జరిగిన దివాలా కనిపించకుండా చేసారు. రాష్ట్రం ఎంత అప్పుల్లో మునిగినా హైదరాబాద్‌లో జరిగిన మేడి పండు అభివృద్ధిని చూపించి లేదా దీపం, ఉచిత విద్యుత్, ఋణ మాఫీ లాంటి పథకాల పేర్లు చెప్పో పాలక వర్గ పార్తీలు ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నాయి. ఇలా ప్రజలని గొర్రెల్లాగ తమ వైపు తిప్పుకోవడంలో ఇక్కడి పాలకవర్గాలు సఫలమయ్యాయి.

  ఇరిగేషన్ కాలువల వల్ల రెండు పంటలకీ నీరు అందితే రైతులు బోర్‌లు వెయ్యించుకోరు. ఆ రకంగా విద్యుత్ ఆదా అవుతుంది. పెందింగ్ ఇరిగేషన్ ప్రోజెక్త్‌లు పూర్తైతే ఉచిత విద్యుత్ అవసరం ఉండదు. పాలకులు పెందింగ్ ప్రోజెక్త్‌లు పూర్తి చెయ్యకుండా ఉచిత విద్యుత్ (అది కూడా రోజుకి కొన్ని గంటలు మాత్రమే) ఇచ్చి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

 2. శేఖర్ గారు. చాలా సరళమైన భాషలో….సులభ రీతిలో అరటిపండు ఒలిచినట్లుగా……వివరించారు. ఆసక్తి కలిగించేలా ఓ కథ చెప్పినట్లు రాశారు. అర్థశాస్త్రాన్ని ఆసక్తికరంగా చేయడంలో మీరు నూటికి నూరుపాళ్లు విజయవంతమైనట్లే.
  అలాగే ఎఫ్.డి.ఐ ఎఫ్.ఐ.ఐ, ఫోర్ట్ పోలియో పెట్టుబడులు, రెమిటెన్స్…..ఇలాంటి వాటి గురించి కూడా ఓ సులభమైన కథనం అందించరా. చాలా ఉపయోగంగా ఉంటుంది. విదేశీ వ్యాపారంలోని…..చెల్లింపుల శేషం, ద్రవ్యలోటు…. లాంటి సాంకేతిక పదాల గురించి కూడా….

 3. “1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పులన్నిటినీ ఫ్రీ స్కీములకే ఖర్చు పెట్టేవాడు.”

  ఇది స్టేట్ మెంట్ లో అస్సలు నిజం లేదు. ఉన్న డబ్బంతా ఫ్రీ స్కీమ్ లకే ఖర్చయిపోతోందని అప్పట్లో బాబు తెగ బాధవడేవారు. ఆయన బాధను మీరు చాలా సానుభూతితో అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. బాబు బుట్టలో పడిపోవడమే కాకుండా మీరు పాఠకుల్ని కూడా ఆ బుట్టలోకి లాగేందుకు ప్రయత్నించడం శోచనీయం.

  మీరు రాసింది బాబుకు అనుకూలమే కాకుండా ప్రజలను wrong shade లో చూపిస్తోంది. పైగా నిజాలు కావు. ఇలాంటివి రాసేప్పుడు కాస్త వెనకా ముందూ చూసుకుని రాయడం మంచిది. లేకపోతే అసలు రాయకపోవడమే ఉత్తమం.

 4. సర్,మీరు ఆర్ధికశాస్థ్రపదాలను వివరించడానికి ఉపయోగించిన పద్ధతిని కథ-కదనాల పద్దతి అంటారు.విధ్యార్ధులకు పాఠ్యంశాలను భోధించేటప్పుడు ఈ కథ-కదనాలపద్దతిని కూడా ఉపయోగించడము పరిపాటే!

  ముఖ్యంగా,మీరు వ్యయాలకుసంభందించి వివరించిన పద్ధతి(సోపానాలు) చాలాబాగుంది!వీటికి అధిక సమయం(వివరణలు) పట్టినప్పటికీ ఇకముందుకూడా ఈ పద్ధతిని ఉపయోగించినట్లయితే పాఠకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది!

  మరోవిషయం,మీరు వివరించిన విధానం చూస్తుంటే ప్రవీణ్ గారు జనవిజయంలో అంధించే టపాలు(ఆర్ధికపరమైన అంశాలకు చేందినవి) గుర్తుకువస్తున్నాయి!

 5. చంద్రబాబు ఆడే నాటకాల సంగతి మీకు తెలియదు. ఒక పథకంలో అవినీతి జరుగుతోందని ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు పట్టించుకునేవాడు కాదు కానీ ఒక పథకంపై ప్రపంచ బ్యాంక్ అభ్యంతరం చెపితే దాన్ని వెంటనే మార్చేసేవాడు. రాష్ట్రాన్ని చంద్రబాబు పాలిస్తున్నాడా లేదా ప్రపంచ బ్యాంక్ పాలిస్తోందా అనే అనుమానం వచ్చేది.

  రాజశేఖరరెడ్డి బంధువులకి చెందిన ప్రైవేత్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనడానికి చంద్రబాబు విద్యుత్ చార్జిలు పెంచాడు. అతను వేసిన విద్యుత్ బాదుడుకి రాష్ట్రంలోని అనేక జనుప నార మిల్లులూ, నూలు మిల్లులూ మూతపడ్డాయి. అతను వేసిన పన్నుల బాదుడుకి పలాస, వేటపాలెం జీడి ఫాక్తరీలు కూడా మూతపడ్డాయి. జనం మీద ఈ పన్ను పోట్లు వేసింది ప్రపంచ బ్యాంక్ అప్పులు తీర్చడానికే.

  మా శ్రీకాకుళం పట్టణానికి 10 కిమి దూరానే ఆముదాలవలసలో ఒకప్పుడు సిమెంత్ గొట్టాల పరిశ్రమలు ఉండేవి. చంద్రబాబు కాలంలో అక్కడి సిమెంత్ గొట్టాల పరిశ్రమలు మూతపడగా రైల్వే గేత్ దగ్గర ఉన్న జనుప మిల్లుని గోదాముగా మార్చేసారు. గంధపు చెక్కలు కాల్చి బొగ్గులు ఏరినట్టు చంద్రబాబు రాష్ట్రాన్ని స్మశానంగా మార్చి హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు కట్టాడు.

 6. మూల గారూ, చదువు పేజీలోనే ఆంగ్ల పాఠాలు ఇస్తున్నారు కదా, దాన్ని చూశాక నాకీ ఐడియా వచ్చింది. ఈనాడు వాళ్ళు కూడా ఓ.కె చెప్పారు. ఇక నుండి సాధ్యమైన మేరకు ఇలాగే రాస్తాను.

 7. చంద్రబాబు ఎంత మాయగాడో నాకు తెలుసు. మావోయిస్త్‌లని అణచివెయ్యడానికి మార్క్సిజం ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసేవాడు కానీ రాష్ట్రాన్ని సింగపూర్‌లా (అది పెత్రోలియం శుద్ధి చేసి ఎగుమతుల మీదే బతికే సామ్రాజ్యవాద దేశం అని అతనికి తెలుసో, లేదో?) మార్చడం సాధ్యమని నమ్మాలనేవాడు.

 8. ప్రావీణ్ గారు,కారణాలు ఏమైనప్పటికీ పలసలో జీడిపరిశ్రమ మూత పడడం మాత్రం చాలామంచిదైంది. రోజూ ఆ పొగ పూల్చుకొంటూ బ్రతుకు నరకప్రాయమయ్యేది! చిన్న వయసులోనే నాకు ఇలాతోచిందంటే మిగతా వారి బాధలు ఏలాఉండేవో!
  అయినా జీడి పరిశ్రమ మూతపడిందని ఇక్కడీవారు ఎవరూ(వ్యాపారులు మినహా) బాధపడలేదుకదా,సంతోసించారు!
  జీడి పరిశ్రమ రూపం మార్చుకొంది(కాల్చడానికి బదులు బాయిలింగ్ చేస్తున్నారు)
  కనుక,పలసలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాది పరంగా పెద్దగా నష్టం జరగలేదు,వారి ఆరోగ్యం కుదుటపదింది కూడా!
  శేఖర్ గారు,ఈ విషయం అప్రస్తుతం అనుకొంటే తొలగించగలరు!

 9. పలాసలో కాలుష్యానికి కారణం పాత పద్దతిలో జీడి ప్రోసెసింగ్ చెయ్యడం. వాళ్ళు కొలిమిలో మంట పెట్టి కాల్చేవాళ్ళు కానీ విద్యుత్ యంత్రాలు ఉపయోగించేవాళ్ళు కాదు. అప్పట్లో పలాస పట్టణంలో 60% మాత్రమే అక్షరాస్యత ఉండేది. ఇప్పుడు కూడా పలాస జీడి కార్మికులు సంపాదించేది రోజుకి 100 రూ…. మాత్రమే. వ్యవసాయ కార్మికులకి రోజూ పనులు ఉండవు కాబట్టి వీళ్ళు ఫాక్తరీలలో పనులకి వెళ్తుంటారు. ఒరిస్సాలో విద్యుత్ చార్జిలు, పన్నులూ తక్కువ కావడం వల్ల కొన్ని జీడి ఫాక్తరీలు ఒరిస్సాకి తరలిపోయాయి.

  ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పుల్నే ఖర్చు పెడుతుంది. విదేశీ అప్పుల వల్ల కరెన్సీ విలువ తగ్గుతుంది, ఆ అప్పులు తీర్చడానికి పన్నులు అతిరిక్తంగా వసూలు చెయ్యాల్సి ఉంటుంది. విద్యుత్ చార్జిల పెరుగుదల, పన్నుల భారం వల్ల 1995 – 2004 మధ్యలో రాష్ట్రంలోని వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిలో భారీ ఫార్మా పరిశ్రమలు కూడా ఉన్నాయి. అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కీ, అది కూడా ధనవంతులు ఉండే మాదాపూర్ లాంటి ప్రాంతాలకి పరిమితమైంది. అందుకే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పేరు చెప్పి తెలంగాణకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపించాడు. కమ్మ పత్రికలూ, TV చానెల్‌లూ చంద్రబాబుకే అనుకూలంగా వార్తలు ప్రచురించడం వల్ల 1995-2004 మధ్య జరిగిన దివాలా గురించి జనం మర్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు కడతాను అంటూ చెపుతున్న కాకమ్మ కథలకి కూడా కమ్మ పత్రికలు పబ్లిసితీ ఇస్తున్నాయి. నిజాం కాలం నాటి పరిశ్రమల్నే కూల్చి, వాటి స్థలాలని రియల్ ఎస్తేత్స్‌కి అమ్మినవాడు కొత్తగా విమానాశ్రయాలు కడతాడట! హైదరాబాద్ అభివృద్ధి తప్ప ఏదీ అవసరం లేదని నమ్మినవాడు జిల్లాలలో విమానాశ్రయాలు కడతాడట!

 10. మూల గారు, చంద్రబాబు ఏమీ కాలుష్యాన్ని తగ్గించడానికి జీడి పరిశ్రమ మీద పన్నులు వెయ్యలేదు. ప్రపంచ బ్యాంక్ అప్పులు తీర్చడానికి అన్నిటి మీదా పన్నులు వేసాడు. జనుప మిల్లులు పూర్తిగా విద్యుత్‌తో నడుస్తాయి. వాటి వల్ల కాలుష్యం ఉండదు. చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జిల వల్ల జనుప మిల్లులు కూడా మూత పడ్డాయి.

  నిజాం కాలం నాటి ప్రభుత్వ రంగ పరిశ్రమలలో తుప్పు (చిలుము) పట్టిన యంత్రాలని కావాలని మార్చకుండా వాటిని నష్టాలతో నడిపి, నష్టాలు వచ్చాయని చెప్పి చంద్రబాబు వాటిని ప్రైవేత్ వాళ్ళకి అమ్మేసేవాడు. వాడు పోలీస్ స్తేషన్‌లు, కోర్త్‌లు తప్ప అన్నిటినీ ప్రైవేత్‌వాళ్ళకి అమ్మెయ్యగల చావు తెలివి ఉన్నవాడు.

 11. రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా ఎలా మార్చారో CPIM అనుబంధ ప్రజాశక్తి బుక్ హౌస్‌వాళ్ళు తమ పుస్తకాల్లో వివరంగా వ్రాసారు. కానీ అదే CPIM నాయకులు తాము కమ్మ కులానికి చెందినవారు కావడం వల్ల చంద్రబాబుకి తిరిగి దగ్గర అయ్యారు.

 12. ప్రవీణ్ గారు, నా స్వగ్రామం పలాస. మా తాత,ముత్తాతల కాలం నుండి మేము ఇక్కడే ఉంటున్నాం!
  చంద్రబాబు వేసిన పన్నుల బాదుడుకి పలాస, వేటపాలెం జీడి ఫాక్తరీలు కూడా మూతపడ్డాయి!
  ఆ పన్నుల గురించి నాకు అప్పటికీ నిజంగా తెలియదు! పలాస పేరుచెప్పొ,జీడి పప్పు పేరుచెప్పొ నేను మా ఊరిమీద అభిమానం ఎప్పుడూ చూపించలేదు!పైపెచ్చు,ఆ జీడి పరిశ్రమల వలన(కాలుష్యం) మా ఊరిమీద ద్వేషం కలిగేది!
  కాలుష్యనియంత్రణ బోర్డువారిని ఎన్నోసార్లు ఆ జీడిపరిశ్రమల యజమానులు సిండికేటు గా మారి ఆ నివేదికలను తొక్కిపెట్టేవారు!
  కానీ,సరైనకారణాలు నాకుతెలియదు,అప్పటికి నేను 10వ తరగతి చదువుతున్నాను.2002 సం,,లో మా పలస-కాశీబుగ్గ మున్సిపాలిటీగా మారింది.ఆ సమీపకాలంలోనే మా ఊరిలో జీడిపప్పు కాల్చే పరిశ్రమలు మూతబడ్డాయి.వాటిస్థానంలో,బాయిలింగ్ పరిశ్రమలు వెలిశాయి.
  కానీ, మా ఊరికి ఆనించి ఉన్న గ్రామాలలో, ఒరిస్సాకు సమీపంలో ఉన్న గ్రామాలలో గ్రామాలలో ఇప్పటికీ జీడిపరిశ్రమలు(కాల్పులద్వారా నడిచేవి) నడుస్తూనే ఉన్నాయి.
  అందుకే,చంద్రబాబు వేసిన పన్నుల బాదుడుకి పలాస, వేటపాలెం జీడి ఫాక్తరీలు కూడా మూతపడ్డాయి-అనిమీరు అన్నప్పుడు కారణాలు ఏమైనప్పటీకీ జీడిపరిశ్రమ(కాల్పులుద్వారా నడిచేవి) మూతపడాన్ని అందరూ(జీడి వ్యాపారస్తులు తప్ప) ఆహ్వానించారు! అని తెలిపాను.

 13. మా ఊరు శ్రీకాకుళమే. ఆ జిల్లాలో ఏమి జరిగేదో నాకు తెలుసు. 1950లో తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామానికి చెందిన ఒక కుటుంబం పలాస వచ్చి అక్కడ జీడి కాల్పులు మొదలు పెట్టింది. వీళ్ళ వ్యాపారం లాభసాటిగా ఉండడం చూసి ఆ ప్రాంతంలో చాలా మంది కోమట్లు ఇందులోకి దిగారు. వీళ్ళు కాల్పుల ద్వారా తీసిన జీడిపప్పుని కేరళకి చెందిన వ్యాపారులకి అమ్మేవాళ్ళు, ఆ కేరళ వ్యాపారులు ఆ పప్పుని అమెరికాకి ఎగుమతి చేసేవాళ్ళు. అలా పలాస చుట్టుపక్కలే 150 జీడి ఫాక్తరీలు నడిచాయి. చంద్రబాబు వేసిన పన్నుల బాదుడుకి కొన్ని ఫాక్తరీలు మూతపడ్డాయి. పలాస జీడిపప్పుకి పోటీగా వియత్నాం జీడిపప్పు అమెరికాకి ఎగుమతి అవ్వడం వల్ల మరికొన్ని జీడి ఫాక్తరీలు మూతపడ్డాయి. పలాస నుంచి గొప్పిలి మీదుగా పాతపట్నం వెళ్ళే రోద్ పక్కన కొన్ని గ్రామాలు ఆంధ్రాకీ, కొన్ని గ్రామాలు ఒరిస్సాకి చెందుతాయి. ఒరిస్సాలో పన్నులు తక్కువ అని కొంత మంది వ్యాపారులు తమ ఫాక్తరీలని ఒరిస్సాకి తరలించేసారు.

  చంద్రబాబు గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమలు ముయ్యించి హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధి చేసాడు. బహుళజాతి కంపెనీలు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలోనే కార్యాలయాలు పెడతాయి కానీ పలాసలోనో, ఆముదాలవలసలోనో పెట్టవు. అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసాడు. హైదరాబాద్ తెలంగాణాకి వెళ్ళిపోతుందనేసరికి రాత్రికిరాత్రే అన్ని పార్తీలకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టించాడు. అందుకే లోక్ సభలో తెలంగాణా బిల్ పాసైన తరువాత కాంగ్రెస్‌కి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు చాలా మంది తెలుగు దేశంలో చేరిపోయారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s