ఒడిషా: డెంగ్యూను పోషిస్తున్న టాటా స్టీల్


ఒడిషా రాష్ట్రంలో టాటా స్టీల్ నిర్మిస్తున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్మికులను అవస్ధలకు గురి చేస్తోంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో కార్మికులు ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరానికి గురై అవస్ధలు పడుతున్నారు. ఒడిషా ప్రభుత్వ శాఖలు టాటా యాజమాన్యం వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. టాటా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది ప్రతేడూ ఉండేదే అని చేతులు దులిపేసుకుంటున్నారు.

టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటయిన ‘టాటా స్టీల్’ కంపెనీ ఒకప్పుడు భారత దేశానికి ఒకే ఒక ‘ఉక్కు దిక్కు’గా పేరు చెలాయించింది. ప్రభుత్వ ఉక్కు కంపెనీలలో సైతం మైనర్ వాటాను కలిగి ఉంటూనే వాటిపై పెత్తనం చెలాయించింది. టాటా స్టీల్ ఇప్పుడు ఒడిషాలో 6 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసేందుకు భారీ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఎప్పటిలాగే తన కంపెనీ నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల సంక్షేమాన్ని గాలికి ఒదిలివేయడంతో వారు ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరం బారిన పడడం పరిపాటి అయింది.

జాజ్ పూర్ లో నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగారం 2015 చివరికల్లా నిర్మాణం పూర్తి చేసుకుంటుందని భావిస్తున్నారు. 1700 ఎకరాలలో నిర్మిస్తున్న కర్మాగారం లోపలి పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగానూ, అనారోగ్యకరంగానూ ఉన్నాయని జిల్లా ఆరోగ్య అధికారులు తెలిపారు. కర్మాగారం సైట్ నిండా నీరు నిలువ ఉన్న ప్రదేశాలు విస్తరించి ఉన్నాయని, నీటిని ఎప్పటికప్పుడు బైటికి పంపేందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని తెలిపారు. ఫలితంగా 280 మందికి పైగా డెంగ్యూ బారిన పడ్డారని, ఒకరు మరణించారని తెలిపారు.

“ఒకరి మరణం, 284 డెంగ్యూ కేసులు టాటా కార్మాగారం వల్లనే” అని ఆరోగ్య అధికారి దేవేంద్ర కుమార్ జెనా చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. జులై నుండి డెంగ్యూ ప్రభావం మొదలయిందని, కర్మాగారం యాజమాన్యం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదని స్ధానికులు ఆరోపిస్తున్నారు. దోమల వల్ల సంభవించే డెంగ్యూ జ్వరం వర్షా కాలంలో విస్తరిస్తుంది. అక్టోబర్ నాటికి ఉచ్చస్ధితికి చేరుతుంది. దోమల ఉత్పత్తి కూడా అక్టోబర్ నెలలోనే ఉచ్చస్ధితికి చేరుతుంది.

డెంగ్యూ జ్వరం కలుగ జేసే వైరస్ దోమల వల్ల వ్యాపిస్తుంది. భూ మధ్య రేఖకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఉచ్ఛ స్ధాయి జ్వరం, తీవ్రమైన తల నెప్పి, కీళ్ల నొప్పులు, నరాల నెప్పులు, వాంతులు, దద్దుర్లు… మొదలైనవన్నీ డెంగ్యూ లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి నడవలేక, కదలలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. తగిన వైద్య సౌకర్యం లేకపోతే మరణం తప్పదు. అయినప్పటికీ ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు టాటా యాజమాన్యం ఏ జాగ్రత్తలు తీసుకోవడం లేదని, పైగా వ్యాధి విస్తరించడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్న స్పృహ లేని టాటా స్టీల్ కంపెనీ విచిత్రంగా తమ ఉద్యోగుల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెబుతోంది. 19 బృందాలను నియమించామని, దోమల వల్ల సంభవించే డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులనుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నామని కంపెనీ చెప్పడం ఒక తమాషా.

“ప్రతి ఏడూ ఈ సమయానికి డెంగ్యూ ఒక సమస్య అవుతుంది. కళింగ నగర్ సైట్ లో 40,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో కొంతమందికి డెంగ్యూ సోకినందుకు విచారిస్తున్నాను. మేము చేయవలసిందల్లా చేస్తున్నాము” అని టాటా స్టీల్ ఎం.డి టి.వి.నరేంద్రన్ స్ధానిక టి.వి చానెల్ కి చెప్పారు. డెంగ్యూకి కారణం టాటా స్టీల్ కంపెనీ స్ధలంలోని అపరిశుభ్ర వాతావరణము, సానిటరీ వసతుల లోపమే అని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ చెబుతుంటే తదనుగుణంగా స్పందించడం మాని భారాన్ని కార్మికులపైకి నెట్టేయడానికి యాజమాన్యం ఆసక్తిగా ఉందని అర్ధం అవుతోంది.

ఒక్క టాటా స్టీల్ కంపెనీయే కాదు. దేశంలో పరిశ్రమాధిపతులందరూ ఇదే ధోరణి. కార్మికులపై ఎంత తక్కువ ఖర్చు పెడితే వారికి అన్ని ఎక్కువ లాభాలు మిగులుతాయి. ఎందుకంటే పెట్టుబడి పరికరాలు (యంత్రాలు మొ.వి) తమకు ఉన్న విలువ తప్ప ఎక్కువ తిరిగి ఇవ్వలేవు. కేవలం సజీవ శ్రమ మాత్రమే తనపై ఖర్చు పెట్టే మొత్తం కంటే అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని పెట్టుబడిదారుడికి ఇస్తుంది. దీనినే పెట్టుబడిదారుడు తన లాభంగా జమ చేసుకుంటాడు. తన లాభం కార్మికుడి శ్రమ ఫలితమే అన్న సంగతి పెట్టుబడిదారుడికి తెలిసినా దానిని అంగీకరించడు. అంగీకరిస్తే కార్మికుల సంక్షేమం బాధ్యత మోయవలసి ఉంటుంది.

 

3 thoughts on “ఒడిషా: డెంగ్యూను పోషిస్తున్న టాటా స్టీల్

 1. శ్రామికుల సంక్షేమానికి పెద్దపీట వేసిన పరిశ్రమాధిపతులు(ప్రైవేట్ వ్యక్తులు) ఎవరైనా ఉన్నారా?/ఉండేవారా?
  ఆధర్షవంతమైన సమాజం సిద్ధంతాలకే పరిమితమా? ఆచరణసాధ్యమేనా? శేఖర్ గారూ,మీరు ఎన్నోసార్లు శ్రామికులు,కర్షకులు సమసమాజ స్థాపనకు పూనుకొంటారని ఆశాభావం వ్యక్తం చేశారుగానీ,నాకు నమ్మకం కుదరడంలేదు!

  మీరు చెప్పినట్లే ఒకవేళ శ్రామికులు,కర్షకులు సమసమాజ స్థాపనకు పూనుకొంటారని ఆశించినా,తిరిగి ఆ వ్యవస్థలు కూడా కొంతమంది వ్యక్తుల చేతులలోనేకదా ఉండేది?(ఇదినాభావన మాత్రమే) అప్పుడుమాత్రం వ్యక్తుల స్వార్ధానికి వనరులు,శ్రామికులు బలికారని నమ్మకమేమిటి? నిరాశాజనకంగా ఆలోచిస్తున్నానని అనుకోవద్దు! అసలు అటువంటి(ఆధర్శ) సమాజమే ఏర్పడనప్పుడు వాటిపర్యవసానాలు గూర్చి ఆలోచించడం తొందరపాటే అవుతుంది!నా ఆలోచన తీవ్రత ఏమిటంటే అసమానతలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయేమో? రూపం మారవచ్చునుగాక!

 2. When London fixed with street cameras behalf of Traffic constables, City got all cost within first year of installation. after that all years only maintenance, no pays at all. take any computer vs man, or JCB vs manpower to dig something or Open costs vs tunnels. FYI: As your last paragraph contradicts with reality with machine vs manpower. I don’t support using machines to loose a single job in this world, where poverty is 99% , for 1% of greedy billoioniers.

 3. It seems you missed the point.

  First:

  Who made cameras? Did they come from space? Or, for instance, if a manager/owner/some orderer gives an order, like ‘come, camera, come!’ will it come from no where?

  Somebody has to work on it. Every component of the camera should be made by a labourer or group of labourers. Each component should be derived from nature’s material (there may be different stages.).

  Coming to your point of ‘returns’, your information itself reveals my point. There are maintanance expenses, which again should be born through labour. A labourer should be paid. It is payment.

  Any machine, whether it is JCB or a computer should be made by man’s labour.

  Second:

  Do you happen to hear about ‘cheap labour’? China and India are famous for it. The term itself says that the labourers offering cheap labour are under-paid and there are other labourers who are paid more than that. Such more-paid labourers are in developed countries and that’s why the companies are coming to India and China and other such countries.

  By utilising cheap labour, capitalists can produce competitive (in price) products, at the same time they also maximise their profits. The issue to be noted here is the so called ‘cheap labour’ is not actually cheap. Because the major part of the cost of cheap labour is transformed into competitveness (lower price of products) and maximisation of profits, it becomes cheap. That is to say that, the major part of labour’s exchange value is pocketed by the capitalist in two ways, who bought that labour.

  There is nothing such as lower prices or cheap labour or quick rieturns… anything like that. There is only under payment and more surplus value which is going in to the profit a/cs at the cost of bad living conditions of labourers around the world.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s