తెలుగు వార్తలు బ్లాగ్ 1 మిలియన్ హిట్స్ దాటింది…


First Post

ఈ బ్లాగ్ లో మొదటి టపా ఇదే

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ బ్లాగ్ ఈ రోజుతో 1 మిలియన్ హిట్స్ దాటింది. ఫిబ్రవరి 4, 2011 తేదీన ప్రారంభం అయిన ఈ బ్లాగ్ ప్రారంభంలో ‘తెలుగులో జాతీయ, అంతర్జాతీయ వార్తలు’ శీర్షికతో ఉండేది. ప్రారంభం అయిన 43 నెలలకు 1 మిలియన్ హిట్స్ కు చేరుకోగలిగింది.

అప్పటికి ‘అరబ్ వసంతం’ పేరుతో ఈజిప్టులో జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మిలట్రీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపధ్యంలో ఈజిప్టు విప్లవ వార్త తోనే ఈ బ్లాగ్ ప్రారంభించాను.

బ్లాగ్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొందరు ఆటంకాలు సృష్టించడానికి శతధా ప్రయత్నించారు. వారి ధోరణి మొదట షాక్ కలిగించినప్పటికీ కొందరు బ్లాగ్ మిత్రుల సహాయంతో వారి స్వభావాన్ని గ్రహించగలిగాను. అనంతరం వారినిక పట్టించుకోలేదు. ఈ క్రమంలో నాకు అండదండలు అందించిన బ్లాగ్ మిత్రులందరికి నా ధన్యవాదాలు!

2012లో ఈనాడు పత్రిక నా బ్లాగ్ ని పరిచయం చేయడంతో బ్లాగ్ పాఠకుల సంఖ్య పెరిగింది. 2013లో ఈనాడు చదువు పేజీలో నా ఆర్టికల్స్ ను ప్రచురించుకున్నప్పటి నుండీ పాఠకులు ఇంకా పెరిగారు. ఆ విధంగా ఈ బ్లాగ్ ఈనాడు పత్రికకు చాలా ఋణ పడి ఉంది. నా బ్లాగ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఉన్నంతలో విపులంగా తెలుసుకుంటున్న పాఠకులు కూడా పరోక్షంగా ఈనాడు పత్రికకు ఋణ పడ్డారని చెప్పక తప్పదు.

ఒక దశలో ఆరోగ్యం సహకరించనందున ఇక బ్లాగ్ ని కొనసాగించలేనేమో అని భయపడ్డాను. కానీ ఎలాగో బైటపడడంతో ఒక గండం దాటినట్లయింది. ఆరోగ్యం సహకరించకపోవడం ఒక విషయం. కానీ దాని వల్ల వచ్చిన నెగిటివ్ ఆలోచనే అసలు విషయం. ఆ ఆలోచనను అధిగమించడానికి కూడా మిత్రులు తోడ్పడ్డారు.

ముఖ్యంగా వేణు, రాజశేఖర్ రాజు, రామమోహన్, చందుతులసి, తిరుపాలు, వెంకట్, వాసు/శ్రీనివాస్, ప్రవీణ్, గౌతమ్ మేకా, సుజాత మొదలైన మిత్రులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది. కృతజ్ఞతలు చెప్పి వారి సహకారాన్ని చిన్నది చేయడం భావ్యం కాదు.

బ్లాగ్ ప్రాచుర్యం పొందడానికి వివిధ రూపాల్లో సహకరిస్తున్న పాఠకులకు, మిత్రులకు, బ్లాగ్ మిత్రులకు, ఇంకా ఇతరులకు మళ్ళీ ధన్యవాదాలు ప్రకటిస్తున్నాను.

అప్ డేట్

మరో సంగతి మరిచాను. బ్లాగ్ కి పాఠకులు రావడం మొదలు కావడానికి దోహదం చేసింది, ‘కూడలి’ అగ్రిగేటర్. ఇప్పటికీ కూడలి నుండే ఎక్కువ పాఠకులు వస్తారు. కాబట్టి ఈ బ్లాగ్ కి ఏమన్నా క్రెడిట్ ఉంటే అందులో చాలా భాగం కూడలికి దక్కుతుంది. ఈ సందర్భంగా కూడలి వారికి ధన్యవాదాలు. 

-విశేఖర్

28 thoughts on “తెలుగు వార్తలు బ్లాగ్ 1 మిలియన్ హిట్స్ దాటింది…

 1. Hi sir, I’m visually challenged. with the help of screen reading software, i’m regularly reading your articles in this BLOG. May god bless you sir with very good health. . Allthe the very best sir. Many Many congratulations to you sir.
  With warm regards
  Vijay Kumar P.V.S.

 2. శుభాకాంక్షలు శేఖర్ గారు…మీ బ్లాగ్ కి నిజంగానే ఒక స్థాయిఉంది.. మీరు రాసే వార్తలు చౌకబారుగా కకుండా చాలా వివరణాత్మకంగా ఉంటాయి.. అందుకే ఇంత ఆదరణ సాధ్యం అయ్యింది……

 3. వి.శేఖర్ గారు. పోసుపోలు కబుర్లకు…, అర్థసత్యాలకు అడ్డాగా మారిన తెలుగు బ్లాగులోకంలో…..మీ బ్లాగు నిజంగా గంజాయి వనంలో తులసి మొక్కలాంటింది. జాతీయ అంతర్జాతీయ వార్తలను విశ్లేషణ కోసం ఆంగ్ల మీడియాపైనే ఆధారపడడం తప్ప మరో మార్గం లేని పరిస్థితుల్లో…..మీ బ్లాగు నిజంగా తెలుగు బ్లాగర్లకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాయడమే కాకుండా , వారిలో చైతన్యాన్ని నింపే దిశగా మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అప్పుడప్పుడు అనారోగ్యం బాధించినా….ఎప్పటికప్పుడు తాజావార్తలను అందిస్తూ మీరు
  అహరహం శ్రమిస్తున్నారు.

  ఇదంతా ఒక ఎత్తైతే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం…, వారికి ఉపయోగపడేలా మీ బ్లాగు ఉండడం మరో విశిష్టత. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యార్థులు చాాలామంది మీ బ్లాగును ఫాలో అవుతున్నారు. మిత్రులకు సూచిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ పరిణామాల విశ్లేషణ దృష్ట్యా తెలుగు మీడియం విద్యార్థులకు మీ బ్లాగు ఉపయోగం అంతా ఇంతా కాదు.

  ఈ మీ ప్రయత్నంలో మీకు సహకరిస్తున్న, మేడమ్ గారికి, కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు.

  ఈ మీ అసిధారావ్రతం అప్రతిహతంగా కొనసాగాలని మరిన్ని మైళ్లు అధిగమించాలని……జనానికి ఉపయోగపడాలని, చైతన్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.

 4. హృదయపూర్వక శుభాకాంక్షలు Sir 🙂 విలువ గల దానికి ఎప్పుడూ తత్‌ సమాన ఆదరణ లభిస్తుంది

  ‘ఈనాడు’కి యావత్‌ ఆంధ్రావనే పరోక్షంగా ఎప్పుడో రుణపడిపోయి వుంది,

  మీ బ్లాగుకు మటుకు మేం పాఠకులం సర్వదా అదే అభిమానం చూపిస్తూ రుణం తీర్చుకుంటామండీ…

  మీ ద్వారా మరింత విలువైన సమాచారం గ్రహించటం ద్వారా మా మస్తిష్క వృద్ధి ఇకపై ఇలా, ఇంతకంటే ఎక్కువగా జరగాలని ఆశిస్తూ…

  శివ
  ?!

 5. సర్, మీ బ్లాగ్ ఎంతో ఉపయోగకరం!ముఖ్యంగా,తెలుగు పత్రికలకన్నా విషయాలను సమగ్రంగా(శ్రామిక-కర్షకుల కోణంలో) అందిస్తున్న మీరు మాలాంటివాళ్ళకు సదాస్మరణీయులు!
  మీది రాశిలోకన్నా వాసిలో మేటి!

 6. sir it is not only use for blog readers. iam a lecturer for Management graduates. just because of your blogs iam able to explain in detailed about the international financial matters to our students. myself and my students are thankful to you in this regard.

 7. nvs ki congrats .ee blog dwara nevu chestunna krushi chala viluvainadi. revolution cadreki yenthagano thodpadutundi. marxist leninsit drukpadham tho ardham chesukodaniki thodpaduthundi. ne krushi enka mundukupovalani korukuntunnanu, chittipati

 8. congratulations sir.i am reading your blog since its inception.this blog helped me a lot in understanding various issues from the perspective of common man.i was preparing for civils and i wrote prelims on 24th august.before going to exam i had read your article on arctic council and there was a question on arctic council members in the exam paper..in this way it helped me many times…thank you sir..i pray almighty god for for your good health although u dont believe in god!

 9. కంగ్రాట్స్ శేఖర్ గారు,

  మీ ఓపిక ,సామర్ధ్యం, అందరికి క్లిస్టమైన విషయాలను కూడా సరళం గా చెప్పగల నైపుణ్యం మమ్మల్ని మీ బ్లాగ్ వైపు ఆకర్షిస్తాయి. విమర్సలకు మీ స్పందన కూడా గౌరవ ప్రదం గా ఉంటుంది. మీ బ్లాగ్ మరిన్ని విజయాలు సాధించాలని, ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మన వాదాలు సాగుతూ ఉండాలని, కోరుకుంటున్నాను.

 10. Dear Sir,
  I’m very happy to read your response to my comment. We have a Group Called “VISION THROUGH EARS.” Uma Maheswarrao garu is the founder of this group. Sir, this group is making monthly current affairs audio book and distributing the same to visually challenged people in two Telugu speaking states in the form of CDs and online free of cost. As a member of this group, I’m recording your articles and including these in the above audio book. Please click the link below link to listen the sample audio.

  http://vocaroo.com/i/s1wWW5r3uryr

  Sir, please respond to this comment in Telugu font and share your thoughts with our group so that, I will record your comment and will publish the same in the next audio monthly audio book.

  With warm regards
  VIJAY

  http://www.visionthroughears.wordpress.com

 11. విజయ్ కుమార్ గారూ,

  మీరు ఇచ్చిన లింక్ లోకి వెళ్ళి శాంపుల్ గా మీరు ఇచ్చిన ఆడియో విన్నాను. నా కళ్లను, చెవులను నేనే నమ్మలేకపోయాను అంటే మీరు నమ్మాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవ సమాజ జీవనాన్ని సుఖమయం చేయడం వరకూ నాకు తెలుసు. వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెంది కళ్ళు లేనివారికి నేత్రదానం చేసినవారి నుండి కళ్ళు తీసి అమర్చడమూ తెలుసు. కానీ ప్రపంచ సమాచారాన్ని అంతటినీ ఒక చోట కుప్ప పోసిన ఇంటర్నెట్ ను అంధ విద్యార్ధులకు ఇంత చక్కగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్ వేర్ ఉందని నాకు ఇదే తెలియడం. మీ వ్యాఖ్య ద్వారా నాకీ కొత్త విషయం తెలిసింది.

  స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ గురించి తెలుసు గానీ దానిని ఇతర సామర్ధ్యం గలవారికి (Differently Abled People) ఈ విధంగా ఉపయోగపెడుతున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. నా బ్లాగ్ లోని ఆర్టికల్ ఒకదానిని ఆడియోగా మార్చి తిరిగి నాకే వినిపించారు చూశారూ, అదే నాకు కొండంత భాగ్యంగా అనిపిస్తోంది. మిమ్మల్ని ఈ స్ధితిలో నిలిపిన మీ ‘VISION THROUGH EARS’ బృందం వారికి శత కోటి శుభాకాంక్షలు. మీ గ్రూపును స్ధాపించిన ఉమా మహేశ్వరరావు గారు బహు విధాలుగా అభినందనీయులు.

  మీరు ఇచ్చిన లింక్ ద్వారా మీ గ్రూప్ వెబ్ సైట్ చూశాను. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదంటే మీరు నమ్మాలి. మిమ్మల్ని ‘కళ్ళు లేని అంధులు’ అని చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తోంది. కళ్ళు ఉన్నవారితో ఏ మాత్రం తీసిపోకుండా ఇంటర్నెట్ మహా సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికినట్లు చిలికేస్తూ, పోటీ పరీక్షలకోసం ప్రిపేర్ అవడమే కాకుండా, వివిధ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు మీరు సాధిస్తున్నారని, మీ వెబ్ సైట్ ద్వారా తెలిసింది. ఇక మీరు అంధులు ఎలా అవుతారు? మీ జ్ఞానాన్ని చూడలేని నేను అంధుడిని అవుతాను గానీ.

  దృష్టికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్న విద్యార్ధులకోసం ఒక గ్రూపును స్ధాపించడమే కాకుండా, ఒక ఆడియో మ్యాగజైన్ ను కూడా మీరు తీసుకురావడం అభినందనీయం. మీ మ్యాగజైన్ ద్వారా పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్ధులు కృతార్ధులు అవుతున్నారని మీ వెబ్ సైట్ ద్వారా తెలిసింది. ఇంతకు మించిన గొప్ప కృషి ఇంకేం ఉంటుంది చెప్పండి. మెరిట్ విద్యార్ధులకు బహుమతులు ఇస్తున్నారని కూడా మీ వెబ్ సైట్ లో చదివాను. అన్ని రకాలుగా సమర్ధులై ఉండి కూడా స్వార్ధపూరిత దృష్టితో సాటి మనిషిని ఇబ్బంది పెడుతున్న గుడ్డి సమాజానికి మీ లాంటి వారి కృషి కళ్ళు తెరిపించాలి.

  నా స్నేహితుల్లో కొందరు అంధులు ఉన్నారు. వారు ఒక సంఘాన్ని స్ధాపించుకుని, దాని ఆధ్వర్యంలో అంధ విద్యార్ధుల హక్కుల కోసం పోరాడుతున్నారు. వారిలో కొందరు పాటలు పాడగలరు. కొందరు చూపు లేకపోయినా వివిధ సంగీత వాయిద్యాలను చక్కగా వాయిస్తారు. అలాంటి వారు ఒక బృందంగా ఏర్పడి మ్యూజికల్ ట్రూప్ గా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. బహుశా వారికి మీ గ్రూపు ద్వారా సహాయం చేయవచ్చని నాకు అనిపిస్తున్నది. ఏ సహాయం ఎలా చేయవచ్చో నాకు ప్రస్తుతానికి తెలియదు. మీ సంగతి వారికి చెబుతాను. మీ కృషిని తెలిపి వారికి ఏ విధంగానైనా సహాయపడుతుందేమో కనుక్కుంటాను.

  మీ ‘VISION THROUGH EARS’ గ్రూపు వారికి, ఉమా మహేశ్వరరావు గారికీ నా అభినందనలు తెలియజేయండి.

  శుభాకాంక్షలతో
  విశేఖర్

 12. గోపీనాధ్ గారు, అవునా! మీరు లెక్చరర్ అని నేను ఊహించలేదు. టీచింగ్ వృత్తిలో ఉన్నవారంటే నాకు కాస్త ఈర్ష్య. విద్యార్ధుల నాడిని సరిగ్గా పట్టుకుంటే, వారు అనేక మంది మదిలో గౌరవ స్ధానం సంపాదించుకుంటారు. బహుశా మీకా అదృష్టం దక్కి ఉండాలి.

 13. Hi Praveen, I’m happy to know that this blog helped you in prelims.

  ——

  aaa గారూ, ఔను. వివిధ వాదాలు ఆరోగ్యకరంగా సంఘర్శిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏక పక్షం ఎప్పుడూ మంచిది కాదు.

 14. @ ప్రవీణ్….సరిగ్గా టైమ్ కు గుర్తు చేశారు. మీకు థాంక్స్ చెప్పాలి. నేను పరీక్ష అయిపోయిన తర్వాత వి.శేఖర్ గారికి చెప్పాలనుకుంటూనే కటాఫ్ గొడవలో పడి అసలు సంగతి మరిచే పోయాను.

  ఈ సారి సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్లలో ఈ బ్లాగ్ ఫాలో అయిఉంటే కచ్చితంగా పండగ చేసుకుంటారు.
  ఎందుకంటే ప్రవీణ్ గారు చెప్పినట్లు ఒక్క ఆర్కిటిక్ కౌన్సిల్ ప్రశ్నే కాదు… చాలా ప్రశ్నలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయపడింది. ఈ మొత్తం ప్రశ్నల గురించి ఓ పోస్టు రాద్దామనుకున్నాను కానీ మరీ మన గురించి భజన చేసినట్లు ఉంటుందని రాయలేదు.
  ఎందుకంటే….
  1-ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి,
  2- టర్కీ సరిహద్దుల గురించి….( ఉక్రెయిన్ గొడవ ఫాలో అయిన సందర్భంలో మధ్యదరా ప్రాంతం మ్యాప్ పరిశీలించాను)
  3. స్వాత్ లోయ
  4. IMF ఆంక్షల గురించి. (అది వెలువరించే పత్రిక )
  5. షేల్ గ్యాస్…..

  ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రశ్నలకు హెల్ప్ అయింది. వేలకొద్ది పేజీల మెటిరియల్ చదివినా ఒక్క బిట్ వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితిలో……ఇలా దాదాపూ పదికి తక్కువ కాకుండా ప్రశ్నలకు సహకరించడం మామూలు విషయం కాదు. ఇక ఎలాగూ మెయిన్స్ పరీక్షకు మీ వ్యాసాలు మరింత సహాయ పడతాయనడంలో సందేహం లేదు. మొత్తానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు (ప్రధానంగా తెలుగు మీడియం వారికి) మీ మేలు అంతా ఇంతా కాదు.

 15. శేఖర్‌ గారు,
  బ్లాగుల గురించి అంత బాగా తెలియదు కాని, ఇంతమంది ఉపయోగ కరంగా ఉండే మీ బ్లాగ్‌ నిజంగా ఎంతో ఉన్నతమైనది. మీరు విజాయకుమార్‌ గారికి చెప్పినట్లు వాల్లకు కూడా ఉపయోగపడటమంటే నిజంగానే అద్బుతం! ప్రతికూల పరిస్తితుల్లో కూడా మీరు బ్లాగ్‌ నడపడం ప్రసంశనీయం! గాడి తప్పిపోయిన విధ్యా వ్యవస్థ, విధ్యార్దులను కేవలం రోభోలుగా పరిగనించి అటూ తల్లి తండ్రులు ఇటు పాలక వర్గాలు పని గట్టుకుని వారిని నమూనాలు గా మలచుకుంటున్నా తీరు చూస్తే మీ భ్లాగ్‌ వయాసిసులాగే కనిపిస్తుంది. విధ్య అంగట్లో కొనే వస్తువుగా తరైన ఈ పరిస్తితుల్లో కొంతైన ఉపశమనం కల్గిస్తూ వాస్తవీకరించగలగటం మీప్రయత్నం అభినందనీయం. ముఖ్యంగా అంతర్జాతీ సంబందాల్లో వివిధ కొత్త కోణాల్ని చూపిస్తూ అప్డేట్‌ ఇస్తున్నారు! ప్రజా సంస్కృతి కోణంనుండి చెప్పటమంటే మాటలు కాదు.

 16. మళ్లీ చెప్తున్నా అని అనుకోవద్దు. నేను చాలా బాధపడుతున్నా. మీ బ్లాగును ఆలస్యంగా తెలుకున్నందుకు. అయినా సంతోషిస్తున్నా. ఇకముందు తప్పనిసరిగా చూడాల్సిన వాటిలో మీది మొదటిస్థానంలో ఉంటుంది.

 17. అభినందనలు శేఖర్ గారూ ! ఒక బ్లాగు మిలియన్ హిట్స్ అందుకోవడం మాటలు కాదు !
  ఆమాటకొస్తే , మీ బ్లాగే తెలుగు బ్లాగుల్లో మిలియన్ హిట్స్ దాటిన మొదటి బ్లాగు అవుతుంది !
  ఒక మైలు రాయి దాటింది కనుక, మీ బ్లాగులో ఇతర విషయాలను ఆయా రంగాలలో పేరు పొందిన వారి చేత రాయించి ,తెలుగు వారికి , ఇంకా విలువైనది గా అందించగలరని ఆశిస్తున్నా !

 18. శేఖర్ గారికి
  నా పేరు ఉమా మహేశ్వర రావు. మీ బ్లాగ్ ల కు గొప్ప ఫాన్ ను. ఇటీవల వరకు మీ వార్తలు చదివి కొన్ని పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతాయని అనిపించినవి స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా మార్చి ప్రయోగాత్మకంగా మా బ్లాగ్ అయిన విజన్ త్రు ఇయర్స్ బ్లాగ్ లో పెట్టాను (రెండు సంవత్సరాల క్రితం). దృష్టి లోపం ఉన్న విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. తరువాత మీరు ఈనాడు లో వ్రాసిన అంతర్జాతీయ సంబందాల విశ్లేషణ అన్ని భాగాలు మా కరెంట్ అఫైర్స్ ఆడియో బుక్ లో మాటలు గా మార్చి ఇచ్చాను (క్షమించాలి మీ అనుమతి లేకుండానే). అది కూడా చాలా బాగుందని స్పందన వచ్చింది. కానీ నాకు తీరిక లేక ఈ మద్య మీ బ్లాగ్ చదవలేక పోయాను. నిన్న మా విజయ కుమార్ గారు తను ఈ భాద్యత తీసుకొంటానని అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. మీ వార్తలు మా విహంగమ్ మాట్లాడే పుస్తకాల శ్రోతలకు ఉపయోగపడి వారి ఉద్యోగాన్వేషణలో కించిత్తు ఉపయోగపడినా మన జన్మలు ధన్యమైనట్లే. ప్రపంచాగ్నికి మనము ఒక్క సమిధ నిచ్చామని సంతృప్తి పడదాం శేఖర్ గారు. మీ బ్లాగ్ చదువుతుంటే నేను నా ఆడియో బుక్ చేయడానికి ప్రేరకంగా ఉంటున్నది. మీ బ్లాగ్ అజరామరంగా సాగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

 19. ఉమా మహేశ్వరరావు గారికి,

  విజయ కుమార్ ద్వారా మీ గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది. మీరు మొదలు పెట్టిన కృషి మామూలుది కాదని నా అభిప్రాయం. సాఫ్ట్ వేర్ ని అభివృద్ధి చేయడం ఒక సంగతి. కానీ దాన్ని వాస్తవంగా అవసరమైన వారికి చేర్చడమే సవాలుతో కూడుకున్న పని. తగిన ఓపిక, నిబద్ధత ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అలాంటి పనిని మీరు సుసాధ్యం చేశారు. అందుకు మీకు అభినందనలు.

  నా అనుమతి మీకు అవసరం లేదు. నా బ్లాగ్ ను చూడడానికి అనుమతి అవసరం లేనట్లే దానిని దృష్టి లోపం ఉన్న వారి చెంతకు తీసుకెళ్లడానికి కూడా అనుమతి అవసరం లేదు. నిస్సందేహంగా నా బ్లాగ్ ని ఉపయోగపెట్టుకోండి.

  నిజానికి, నా బ్లాగ్ ని ప్రత్యేక మైన వ్యక్తులకు అందుబాటులోకి తెస్తున్నందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరన్నట్లు మీ, నా కృషి వారి అవసరాలు తీర్చగలిగితే చాలా సంతోషించాల్సిన విషయం. మరోసారి అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s