యుద్ధంలో ప్రత్యర్ధుల బాణాలను ఎదుర్కోక ఎలాగూ తప్పదు. కానీ స్వపక్షంలోని వారే వెనుక నుండి బాణాలు వదిలితే?
భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పరిస్ధితి అలాగే ఉందని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి.
బి.జె.పి పార్టీని తన అస్త్ర, శస్త్రాలను నిలువ చేసుకునే అమ్ముల పొదగా హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ భావిస్తున్నారు. కానీ పార్టీలోనే అధికారం కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల ఫలితంగా స్వపక్షం వారే ఆయనపై అస్త్రాలను ప్రయోగించి దొంగ దెబ్బ తీస్తున్నారని వార్తలు తెలిపాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసమే రాజ్ నాధ్ సింగ్ తనయుడిపైన బి.జె.పి లోని ఇతరులు పుకార్ల రూపంలో ఆరోపణలు వ్యాపింపజేస్తున్నారని పత్రికలు చెప్పాయి.
హోమ్ మంత్రి తనయుడు ఏదో అసభ్య వర్తనకు పాల్పడ్డారని, ఇది నచ్చని ప్రధాని ఆయనను పిలిపించి మందలించారని పుకార్ల సారాంశం. ఈ పుకార్లు రెండు వారాలుగా తాను వింటున్నానని, ఆరోపణలు నిజం కావడం అటుంచి కనీసం ప్రాధమిక పరిశీలనలో వాస్తవమని తేలినా తాను రాజీనామా చేసి ఇంటివద్ద కూర్చుంటానని రాజ్ నాధ్ సింగ్ పత్రికా ముఖంగా గోడు వెళ్ళబుచ్చుకున్నారు.
తాను ఈ విషయమై బి.జె.పి అధ్యక్షుడు, ప్రధానిలను కలిసి మాట్లాడానని, వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారని రాజ్ నాధ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం, అమిత్ షా కార్యాలయం కూడా ఆరోపణలను కొట్టి పారేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.
అధికార కొట్లాటల వికట రూపం ఇలాగే తగలడుతుంది!
బతికిపోయాం…. ప్రధాని మోడీకి పిల్లలు లేరు(???) లేకపోతే ఎం జరిగేదో…