(బి.జె.పి లో) తరాల మార్పులు -ది హిందు సంపాదకీయం


BJP trioka

బి.జె.పిలో అత్యంత శక్తివంతమైన పార్లమెంటరీ బోర్డు నుండి త్రిమూర్తులు అతల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల నిష్క్రమణ, నూతనంగా సృష్టించిన సలహా కమిటీ మార్గదర్శక మండలిలోకి వారి తరలింపు… ఒక శకం ముగిసిందని సంకేతం ఇచ్చాయి. తన సైద్ధాంతిక నిలయానికే పార్టీ లంగరు తాళ్ళు కట్టివేయబడడం కొనసాగినప్పటికీ దాని పని విధానం మాత్రం -బి.జె.పి పరివర్తన వరకు జరిగిన పరిణామాలను బట్టి- అనివార్యంగా ప్రస్తుతం ఆ పార్టీని నియంత్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోడి, ఆయన నమ్మకస్ధుడు మరియు బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ల రీతినే ప్రతిబింబిస్తుంది.

బి.జె.పి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో ప్రారంభమై, యూనియన్ మంత్రివర్గంలో 75 యేళ్ళు పైబడిన పెద్దలను మినహాయించడం ద్వారా స్ధిరపడిన ఈ మార్పులు సూచిస్తున్న తరాల బదిలీని మామూలు దృష్టితో అయితే ప్రశ్నించడానికి వీలు లేదు. ప్రతి రాజకీయ పార్టీ కాలానుగుణంగా, యువ నాయకులను పైకి తేవడం ద్వారా నూతన శక్తిని, భావాలను చొప్పించి తనను తాను పునరుద్ధరించుకోవలసిందే. వాజ్ పేయి విషయంలో 2004 నుండి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రజా జీవితం నుండి తప్పుకోవలసి వచ్చింది. కానీ అద్వానీ, జోషిలు ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా తమ లోక్ సభ స్ధానాలను గెలుచుకున్నారు. మోడి కేబినెట్ లోని కొందరు యువ సభ్యులు సైతం వారి గెలుపుతో సరితూగలేరు.

బి.జె.పి ఉద్ధానంలోనూ, ద్వితీయ స్ధాయి నాయకత్వాన్ని సృష్టించడంలోనూ -వారిలో మోడితో పాటు ఆయన మంత్రివర్గంలో సగం మంది ఉన్నారు- అద్వానీ పాత్ర రికార్డు పుటలకు ఎక్కవలసినది. ఇటీవల కాలంలో ఆయన చరిత్ర మార్పులకు గురై ఉండొచ్చు: ప్రధాన పోషకుడే (mentor) ప్రధాన తిరుగుబాటుదారుగా అవతరించడం, మోడిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం ఈ కోవలోనివి. కానీ ముదిమి వయస్సు ఇప్పటికీ గౌరవానికి నోచుకుంటున్న దేశంలో బి.జె.పి వ్యవస్ధాపకులను సాగనంపిన తీరులో నిర్దిష్ట వెలుగు లోపించిందని అనేకమంది భావించారు. అయితే, అది అంతవరకే పరిమితం కాలేదు: వాజ్ పేయి-అద్వానీ హయాంలో స్పష్టంగా అగుపించిన ఉమ్మడి నాయకత్వ స్ఫూర్తి, ప్రజాస్వామిక చర్చల ప్రక్రియలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.

హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ విషయంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవహారమే ఇందుకు ప్రబల సాక్ష్యం. కంటికి కనబడని మరిన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆయన కుమారుడి అసభ్యవర్తన అంటూ బి.జె.పిలో అంతర్గతంగా సాగిన గుసగుసల ప్రచారం కొన్ని వరుస ఘటనలకు దారితీసి యూనియన్ కేబినెట్ లో నెంబర్ 2 గా ఉన్న హోమ్ మంత్రి స్ధానాన్ని బలహీనపరిచాయి: మొదట ఆయన తన ప్రైవేటు కార్యదర్శిని నియమించుకోవడంలో కష్టాలు ఎదుర్కొన్నారు; ఆ తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్ అధికారుల నియామకం నిర్వహించే కమిటీలో ఆయనకు స్ధానం లేదని, ప్రధాని కార్యాలయం చేసిన నియామకాలకు ఆమోదం తెలపడం మాత్రమే చేయగలరని చెప్పారు. తన కుమారుడిపై ఆరోపణలకు స్పందిస్తూ ఆయన వాటిలో ప్రాధమిక ఆధారాలు ఉన్నా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ విధంగా అధికార ఆటలు బహిరంగం అయ్యాయి. మోడి, ఆ తర్వాత అమిత్ షా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తిరస్కరిస్తూ సింగ్ పై పూర్తి విశ్వాసం ప్రకటించారు. సందేశం: అధికారాన్ని పంచుకోవాలి.

2 thoughts on “(బి.జె.పి లో) తరాల మార్పులు -ది హిందు సంపాదకీయం

  1. with your blog i came to know about the facts in Gujarath, and Modi ruling. i lost hopes about the way he is going to rule. but i have some respect over him because of his character. from these incidents it is coming to know that even that is a drama. he used mother sentiment to come into power. a person who has respect on elders at least on the person who encouraged in politics will not do such activities. Modi has to change his behavior and the way he is treating the elders on party. Advaniji image is also one of the pillar of his chair. he should not forget it

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s