ప్రధాని సభల్లో కాంగ్రెస్ సి.ఎంలకు అవమానం -కార్టూన్


CMs skip PM meetings

‘మొహం చాటేశాడు’ అంటారు. అది ఇదేనేమో!

మోడి భక్తాగ్రేసరుల ఎగతాళి, వెక్కిరింపులు, కూతలు ఇతర పార్టీల నేతలకు సమస్యగా మారింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించని నాయకుల పట్ల ఆగ్రహంతో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఎరుగుదుము. సభల్లో తమ సమస్యలపై నాయకులను జనం నిలదీయడం ఎరుగుదుము.

కానీ ప్రధాని అంతటి రాజ్యాంగ, మరియు దేశాధినేత పాల్గొన్న సభల్లో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీల రాజ్యాంగ, రాష్ట్రాధినేతలను ఎగతాళి చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఒక నేతపై ఉండే అభిమానం ఇతర నేతలపై దురభిమానంగా మారడం, పైగా దేశ సంస్కృతీ పరిరక్షకులుగా చెప్పుకునే శక్తులే ఇలా సంస్కృతీ వినాశనాపరులుగా వ్యవహరించడం బొత్తిగా అర్ధం కాని విషయం.

మహా రాష్ట్ర, హర్యానా, జార్ఘండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి వివిధ అధికారిక కార్యకమాల్లో ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్న సభల్లో ఇటువంటి విపరీత సంస్కృతీ ప్రదర్శన చోటు చేసుకుంది. మోడి లేచినప్పుడు చప్పట్లు, ఈలలు మోగించడం, ముఖ్యమంత్రి లేవగానే కూర్చోవాలనీ, దిగిపోవాలని కేకలు వేస్తూ ఎకసక్కెం చెయ్యడం మోడి అభిమానులుగా చెప్పుకునే కోతమంది ప్రబుద్ధులకు అలవాటుగా మారింది. వరుసగా 3 సభల్లో ఇలాంటి అసభ్య వర్తన చోటు చేసుకుంది.

ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని పాల్గొనే సభల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాలి. కాని మోడి భక్త గణం సాగిస్తున్న సంస్కృతీ విధ్వంసం పుణ్యమాని ప్రోటోకాల్ ని పక్కనబెట్టి ప్రధాని సభల్లో పాల్గొనేది లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మద్దతుతో పాలిస్తున్న జె.ఎం.ఎం ముఖ్యమంత్రి శపధం చేయాల్సి వచ్చింది.

మోడి ధరించిన తలపాగాను ఆయనకు ఆయన అభిమాణ గణంలో ఉన్న పాపులారిటీకి సంకేతంగా కార్టూనిస్టు చూపారు. ఆయన పాపులారిటీ ఎ స్ధాయిలో ఉందంటే, ఇలా ఇతర పార్టీల మొఖాలను కనపడకుండా చేసేంతగా అని కార్టూన్ సూచిస్తోంది.

లేదా, మోడి సభలకు రాబోమని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్పష్టం చేసినందున ఎవరో ఒకరిని ఇలా సి.ఎం కు బదులుగా కూర్చోబెట్టి ఆయన ముఖాన్ని చాటేసి, ఆయనే సి.ఎం అని పని కానిచ్చేసే పరిస్ధితి ఏర్పడిందని కూడా కార్టూన్ భావం కావచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s