ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం -ఈనాడు


అధ్యయనం సిరీస్ లో 8వ భాగం ఈ వారం ఈనాడులో ప్రచురితం అయింది. నిత్య జీవితాలకు అన్వయించుకుంటూ అర్ధ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే తేలికగా మెదడులోకి ఇంకుతుంది. ఈ అంశాన్ని ఈ వారం చర్చించాను.

అర్ధశాస్త్రం ఆర్ధిక పండితులకు మాత్రమే కాకుండా జనానికీ అవసరమే అని అవగాహన కలగడానికి గత వారం, ఈ వారం భాగాలు ఉపయోగపడతాయి.

ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేయండి. ఈ లంకె ఈ వారం రోజుల వరకు మాత్రమే పని చేస్తుంది.

ఆసక్తికరంగా అర్ధశాస్త్రం

దీనిని పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో చూడడానికి కింది బొమ్మను క్లిక్ చేయండి. పి.డి.ఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలని భావిస్తే రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

EEnadu chaduvu 08 -25.08.2014

 

11 thoughts on “ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం -ఈనాడు

 1. అర్థశాస్త్రం పట్ల ఎలా ఆసక్తి పెంచుకోవాలో చాలా చక్కగా వివరించారు. ఒక శాస్త్రాన్ని క్రమానుగతంగా అన్ని విషయాల మధ్య సంబంధాలను సమన్వయం చేసుకుంటూ….చదవితే అర్థశాస్త్రం పెద్ద ఇబ్బంది కర విషయం కాదు. కానీ మన దగ్గర పరీక్షల దగ్గరకి వచ్చేసరికి….విద్యార్థులు అర్థశాస్త్ర పరీక్ష అనగానే భయపడేది ఎందుకంటే మన పరీక్షావిధానం కారణంగా.
  అర్థశాస్త్రం విద్యార్థికి ఎంత అర్థమయింది అనేది పరీక్షించకుండా ఎంతమేరకు కంఠోపాఠం చేశాడు….ఎంతమేరకు బట్టీ పట్టాడో తెలుసుకోవడం…అంటే కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించేవిగా మాత్రమే ప్రశ్నలు ఉంటున్నాయి.

  1. మన రాష్ట్రంలో చెరువుల విస్తీర్ణం ఎంత…?
  1.14576 చ.కిమీ. 2. 15467 3. 16547 4.14957

  2. ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్ ప్రకారం 2014 లో మన అభివృద్ధి శాతం.
  1.4.7 2.4.6 3. 4.8 4.4.9

  ఇలా విద్యార్థుల అవగాహన సామర్థ్యాన్నో, సృజనాత్మక నైపుణ్యాల్నో ప్రశ్నించకుండా కేవలం….జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షించేలా ఉంటాయి.
  ఇలా కొన్ని వేల ప్రశ్నలు బట్టిపట్టలేక….విద్యార్థులు ఆర్థికశాస్త్రం అంటే భయపడుతుంటారు.

  ప్రశ్నల సరళి మారి….విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా ఉంటే….విద్యార్థులకు, సమాజానికి ఉపయోగం.

 2. గతంలొ 8వ తరగతి పాట్యపుస్తకంలొ అనుకుంటా ఆది మానవులు బట్టలు లేకుండా వున్నారని ఒకానొక సమయంలొ స్త్రీ పురుషులకు తమపట్ల సిగ్గు ముంచుకొచ్చిందని అందువల్లనే మానవులు బట్టలు వేసుకుంటున్నారని చదివాను. ప్రభుత్వ పాట్యపుస్తకాలు సామాజికవిషయాలలొ యేస్తాయిలొ వుంటాయొ ఇదొక ఉదాహరణ. ఇప్పటికీ ఏమీ మారలేదు.

  పొతే మీ విష్లేషణ ఒక విషయాన్ని తీసుకుని వివరంగా చెప్పిన తర్వాత ఈ విధంగా చదవాలి ఈ విధంగా అర్దం చేసుకుంటూ చదవాలిలని ఒక సుచన ఇస్తున్నారు అయితే అది అందరికీ సాద్యమేనా? మార్కిజం తెలియకుండా వాళ్ళసొంతంగా సమాజాన్ని అందులొని సంభందాలను అర్దం చేసుకొగలరా.ఆ విషయాన్ని (మార్కిజాన్ని) మీరు సుచనప్రాయంగా తెలియచేయవచ్చు కదా. లేదా ఈనాడు ఎడిటర్ మార్కిజం ప్రస్తావన ఆమొదించడని మీరనుకుంటున్నారా. కనీసం సమాజం అందులొని దశలు గురించి ప్రస్తావించేటప్పుడు మొర్గాన్ రాసిన “పురాతన సమాజం” గురించైనా ప్రస్తావించవచ్చు. ఇవి చదవకుందా వేరే పుస్తకాల ద్వారా తెలుసుకొవడం. చాలావరకు అది తలకిందులుగా వుంటుందని నేననుకుంటున్నాను. ఎమంటారు శేఖర్ గారూ.

 3. తులసి గారు, మీరు చెప్పిన పుస్తకంలో వ్రాసినదాన్ని ఆర్థికశాస్త్రం అనరు. మా యూనివర్సితీలోని ఆర్థిక శాస్త్రంలో ఆదం స్మిత్, అల్ఫ్రెద్ మార్షల్, లయోనెల్ రాబిన్స్ తదితరుల సూత్రీకరణలు, మార్కెత్ వ్యవస్థ పని చేసే విధానం తదితర విషయాలు చెప్పారు. అవన్నీ ఇక్కడ వ్రాసే సమయం నాకు లేదు కానీ ఒక విషయన్ ఇక్కడ వ్రాస్తాను. చేతిలో మంత్ర దండం ఉండి కావలసినవన్నీ వెంటనే దొరికితే ఆర్థికశాస్త్రం అవసరం ఉండదు. వనరులు పరిమితమైనవి, మానవుని కోరికలు అపరిమితమైనవి కనుక వనరుల నిర్వహణకు ఆర్థిక శాస్త్రం అవసరం. వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పే ఆర్థికశాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఎక్కువ మంది ఆర్థికశాస్త్రవేత్తలు లయోనెల్ రాబిన్స్ ప్రతిపాదించిన పరిమిత వనరుల నిర్వహణ సూత్రాన్ని ఆర్థికశాస్త్రం యొక్క salient featureగా భావిస్తారు.

 4. నిజమే ప్రవీణ్ గారు. నేను ఉదాహరణగా ఇచ్చిన ప్రశ్నలు…..అర్థ శాస్త్రం పేరుతో…పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో ఓ ఉదాహరణగా చెప్పానంతే. కావాలంటే గతంలో గ్రూప్- 2 లో అడిగిన ప్రశ్నలు ఓ సారి చూడండి. అన్నీ మెమరీ బేస్ డ్ ప్రశ్నలే. కేవలం యూపీఎస్సీ ప్రశ్నలే కొంచెం లాజికల్ గా ఉంటాయి తప్ప మనరాష్ట్రంలోని ఏ పరీక్ష లో అయినా ఆర్థిక శాస్త్రం విభాగం ప్రశ్నలు అభ్యర్థులకు కొరకరాని కొయ్యలుగా ఉంటాయి. ఇక్కడ నా అభిప్రాయం విద్యార్థులు ఎందుకు అర్థశాస్త్రం అంటే భయపడతారు అనే దానికి మాత్రమే పరిమితం. అంటే కేవలం అంకెలను మాత్రమే ప్రశ్నించడం వల్ల…విద్యార్థులు వాటిని బట్టీపట్టలేక భయపడుతున్నారు.

 5. “వనరులు పరిమితమైనవి, మానవుని కోరికలు అపరిమితమైనవి కనుక వనరుల నిర్వహణకు ఆర్థిక శాస్త్రం అవసరం.”

  ఇది పెట్టుబడిదారులకు ఉపయోగపడే సూత్రం. వారి ఆర్ధిక వేత్తలే ఇలాంటివి చెబుతారు. ఈ వాక్యంలోని ‘మానవుని కోరికలు’ అన్నది దోపిడీ మానవులకు వర్తించేది తప్ప సామాన్య మానవులకు కాదు. తామే వినియోగ సరుకులు తయారు చేసి మనుషుల మధ్య కుమ్మరించి వాటిని అందరూ కొనేయ్యాలని కోరుకుంటూ, అలా కోరుకోవడాన్ని కూడా ‘మనిషి కోరికలు అపరిమితం’ అంటూ టింగరి వాదనలు చేసేదీ వాళ్ళే. వాటిని ఇష్టపడి నెత్తిన మోస్తే అభ్యంతరం లేదు గానీ, ‘నేను మార్క్సిస్టుని’ అని చెప్పుకుంటూ మోయడమే అభ్యంతరం.

 6. భూస్వామ్య వ్యవస్థపోయి పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తరువాతే భూమి మీద వనరులు సఘం వరకు అంతరించిపోయాయి. మనిషి కోరికలు అపరిమితమైనవి కాబట్టే కదా ఇలా జరిగింది. Malthus who is an economist found that human population grows rapidly where natural resources are abundant.

 7. పూర్వం తుపాకులు తయారు చెయ్యడానికి రాగి, తగరం & తుత్తునాగం వాడేవాళ్ళు. వలస పాలకులు దక్షిణ అమెరికాని ఆక్రమించుకుని తగరపు గనులు తవ్వడం వల్ల అక్కడ తగరపు నిల్వలు దాదాపుగా అంతరించిపోయాయి.

  అలుమినియమ్‌ని విమానాలు & విద్యుత్ తీగల తయారీకి వాడొచ్చు. కానీ అమెరికా సమ్యుక్త రాష్ట్రాల్లో లో పిల్లలు తినే చాక్‌లెత్‌ల డబ్బాల తయారీకి అలుమినియం వాడుతున్నారు. దీన్ని extravagance (వృధా ఖర్చు) అనరా? అమెరికాలో శాకాహారులు కూడా తమ పెంపుడు కుక్కలకి ఖరీదైన మాంసాహారం పెడతారని నాకు ఆన్లైన్‌లో పరిచయమైన కొంత మంది నల్లజాతివాళ్ళు చెప్పారు. వనరుల్ని అదుపు లేకుండా వాడితే మానవజాతి భవిష్యతే అంధకారం అవుతుంది.

 8. విశాఖపట్నం జిల్లాలో బాక్సైత్ తవ్వబోతున్నది అమెరికా కోసమే. ఆ బాక్సైత్‌ని జపాన్‌కి ఎగుమతి చేస్తారు. అక్కడ బాక్సైత్‌ని శుద్ధి చేసి, అల్యుమినియమ్ తయారు చేసి, ఆ అల్యుమినియమ్‌తో చాక్లెత్ పేకింగ్ డబ్బాలు తయారు చేస్తారు. అమెరికాలో ఆ డబ్బాలలోనే చాక్లెత్‌లు పేక్ చేసి అమ్ముతారు. వీక్షణం వేణుగోపాల్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు.

  ఈజిప్షియన్ మార్క్సిస్త్ ఆర్థికవేత్త Samir Amin సామ్రాజ్యవాదులని gluttons (తిండిపోతులు) అని ఎందుకు అంటాడో తెలుసా? సహజ వనరులు అంతరించిపోయేలా చెయ్యడానికి కొన్ని సామ్రాజ్యవాద దేశాలు చాలు కాబట్టి.

 9. లైబ్రరీలో ఆర్థిక శాస్త్రం గురించి ఓ పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అమెరికన్‌లు దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌లు చెయ్యించుకుంటారు, దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఇద్దరు నుంచి నలుగురు వరకు పిల్లల్ని కంటారు. అందుకే అమెరికా జనాభా వందేళ్ళ కాలంలోనే ఏడున్నర కోట్ల నుంచి ముప్పై కోట్లకి పెరిగింది.

  అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. ఆ దేశంలోని కంపెనీలు ఇతర దేశాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకుని, వాటి మీద తమ కంపెనీ లేబెల్ వేసి, వాటిని తిరిగి విదేశాలకి అమ్ముతాయి. గత వందేళ్ళుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలాగే నడుస్తోంది. అమెరికాలోని మధ్యతరగతివాళ్ళు మన దేశంలోని మధ్యతరగతివాళ్ళ కంటే చాలా ధనవంతులు. మన దేశంలోని మధ్యతరగతివాళ్ళు చూడలేనంత సుఖవంతమైన జీవితం అక్కడి మధ్యతరగతివాళ్ళకి ఉంటుంది. అమెరికాలో కూడా కొంత మంది పేదవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళలో ఎక్కువ మంది నల్లజాతివాళ్ళు & మెక్సికన్‌లు. అక్కడి ధనిక, మధ్యతరగతులవాళ్ళు మాత్రం వనరుల్ని విచ్చలవిడిగా వాడుతుంటారు.

  ఇందియాతో పోలిస్తే అమెరికాలో వాహనాల సంఖ్య వందల రెట్లు ఎక్కువ. మనం ఎక్కువగా బస్సులూ, రైళ్ళలో తిరిగితే వాళ్ళు ఎక్కువగా కార్‌లలో తిరుగుతారు. అమెరికా సామ్రాజ్యం కుప్పకూలిపోతే పెత్రోల్ వినియోగం బాగా తగ్గి, అంతర్జాతీయ మార్కెత్‌లో చమురు పుష్కలంగా & చవకగా దొరుకుతుంది. అందుకే ఐదేళ్ళ క్రితం అమెరికాకి వ్యతిరేకంగా ఒసామా బిన్ లాదెన్, హమాస్‌లని సమర్థిస్తూ నా బ్లాగ్‌లో టపాలు వ్రాసేవాణ్ణి, నన్ను చాలా మంది పిచ్చివాడనుకున్నా సరే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s