ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్


LoP

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను ఎవరికీ ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా అనేక రాజ్యాంగ పదవులను ఏకపక్షంగా నియమించుకునే అవకాశాన్ని బి.జె.పి/ఎన్.డి.ఏ సొంతం చేసుకుంది.

ప్రజాస్వామ్యం సారమే భిన్నాభిప్రాయానికి విలువ ఇచ్చి గౌరవించడం. ఈ సూత్రం ప్రకారమే అత్యున్నత రాజ్యాంగ పదవులైన లోక్ పాల్, సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్ ల నియామకంలో లోక్ సభ ప్రతిపక్ష నేత అభిప్రాయానికి స్ధానం ఇచ్చారు. తద్వారా పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాన్ని కాస్త నిరోధించారు.

ప్రతిపక్ష నాయకుని అభిప్రాయానికి స్ధానం కల్పించిన పదవులు ప్రభుత్వ పాలనలోని అవినీతిని ఎంచి విచారణ చేసేందుకు ఉద్దేశించినవే. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుని పదవిని భర్తీ చేయకపోవడం ద్వారా అవినీతిని అంతం చేస్తామన్న తమ వాగ్దానం పట్ల చిత్త శుద్ధి లేదని పాలక పక్షం చెప్పుకుందని కాంగ్రెస్ ఆరోపించింది.

మాటల్లో అందరినీ కలుపుకు పోతామని చెబుతూనే ఆచరణలో ఏకపక్షంగా, నియంతృత్వం తరహాలో వ్యవహరించే విధానాన్ని మోడి అనుసరిస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణను కొట్టిపారేసేందుకు వీలు లేదు. పొరుగుతో స్నేహం అంటూనే చర్చలను రద్దు చేశారు. అందరం కలిసి పాలిద్దాం అంటూనే LoP పదవిని ఖాళీ పెట్టారు. అవినీతి భరతం పడతామ్ అంటూనే ఇంతవరకు లోక్ పాల్ నియామకం చేపట్టలేదు. సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్, లోక్ పాల్ లను తామే నియమించేస్తాం అని పత్రికలకు ఉప్పు అందిస్తున్నారు.

పాలక పక్షం ధోరణిని కార్టూన్ ఎత్తి చూపుతోంది. 

One thought on “ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్

 1. may be MODIJI is doing wrong. but, congress deserves for the treatment. Entire India given such position to congress. they are vexed with congress rule, and its supremo Sonia. Just for the sake of votes it divided Andhra Pradesh into two. Though i belongs to telangana, i pity on andhra region people for their snag. They do not have capital, deficit budget, issues on power, water, over and above all rivalry among telugu people.

  scams, character less people like digvijay (his affair with married women), puppet PM Manmohan, centralized decisions. allowing an Italian lady which do not know the sentiments of Indian people, especially Telugu people to such position itself is great job. at the time of elections sonia said in telangana that we given telangana, and after going to andhra she said that all the parties cornered them to take such decision.

  middle men suffered a lot with hike in prices. linkage of aadhar to gas is senseless decision.
  Now diggi raja and Ponnala want to postmortem, the reasons for defeat. perhaps these comments will be an eye openers to them.

  iam happy for what is happening to congress. it deserve for such humiliation

  iam also happy that two chief ministers competing among themselves to develop two regions. but it should be a health competition. not like India and Pak

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s