498A: దుష్ప్రచారం మాని పకడ్బందీగా అమలు చేయాలి


498A

Image: The Economic Times

-రచన: రమా సుందరి (ఉపాధ్యక్షురాలు, ప్రగతిశీల మహిళా సంఘం, ఆంధ్ర ప్రదేశ్)

భారతదేశ న్యాయం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల వైవునే నిల్చోని ఉంటుంది. అందులో కూడా పురుషుల పక్షమే వహిస్తుంది. బలహీన వర్గాలు అయిన దళితులు, స్త్రీల పట్ల శీతకన్ను వేసి ఉంచటమే కాదు, అవసరమైనపుడు వారి వ్యతిరేకవర్గంలో తన స్థానాన్ని నిరభ్యరంతంగా ఖాయం చేసుకొంటుంది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన వర్గ, కుల, లింగ సమానత్వాన్ని నామకా అయినా పాటించాలనే మొహమాటాన్ని కూడా నిస్సంకోచంగా వదిలేస్తుంది. అరా కొర చట్టాలు ఏమైనా ఉంటే ఆ చట్టాలు పదే పదే చర్చలోకి వస్తాయి. “పునస్సమీక్ష” చేయబడతాయి. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా “కుటుంబ పరిరక్షకుల” నోటిలో నానుతున్న చట్టం సెక్షను 498ఎ.

498ఎ చట్టం పూర్వాపరాలు

సరళీకృత ఆర్ధిన విధానాలు ప్రవేశించిన 1980 లలో, వివాహ వ్యవస్థలోకి డబ్బు ప్రవేశించి వస్తు వ్యామోహం పెరిగింది. వస్తు వినిమయం అపరిమితంగా జరిగిన దశ అది. దేశంలో వరకట్న హత్యలు చెదురుమదరు సంఘటనల రూపం నుండి ఒక మూకుమ్మడి ఉపద్రవం అయిన ప్రమాదం అప్పుడే ప్రారంభం అయ్యింది. వాటికి సమాంతరంగా స్త్రీలపై జరుగుతున్నా కుటుంబ హింసకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు ఊపందుకొన్నాయి. గడప దాటి వినబడని, కనబడని హింసకు సామాజిక, ఆర్ధిక కారణాలు వెదికి ప్రభుత్వం మీద వత్తిడి పెంచాయి. 1975-85 కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాభ్ధంగా ఘనంగా ప్రకటించిన ఆనాటి ఇందిరాగాంధి ప్రభుత్వానికి మహిళా ఉద్యమాల సెగ కూడా తోడవటంతో 1983లో 498ఏ చట్టాన్ని తీసుకొని వచ్చింది. 1961లో తెచ్చిన వరకట్న నిషేదచట్టం పూర్తిగా విఫలం అయిన సందర్భంలో ఈ చట్టాన్ని అత్యంత పకడ్భందీగా రూపకల్పన చేశారు. భర్త కానీ భర్త సంబంధీకులు కానీ స్త్రీ మీద క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే ఈ సెక్షను ప్రకారం వారికి మూడు సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు.

ఇక్కడ క్రూరత్వం అంటే నిర్వచనం కూడా ఇచ్చారు. అది వరకట్న వేధింపు ఒక్కటే కానవసరం లేదు. కట్నంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య స్త్రీలపై జరుగుతున్నశారీరిక మానసిక వేధింపులు మొదటి రకం హింసగా నిర్వచించి, కట్నం కోసం జరిగే హింసను రెండవరకం హింసగా పరిగణించారు. ఇంకా ఈ సెక్షన్ను నాన్ బైలబుల్ (కొంత కాలం వరకు జామీను తీసుకోవటానికి వీలు లేని), నాన్ కాంపౌండబుల్ (ఒక్క సారి కేసు పెట్టాక రాజీ పడటానికి వీలు లేని), కాగ్నిజబుల్ (వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు)గా బందోబస్తు చేశారు. ఒక వేళ వరకట్నపు వేధింపులలో ఆ స్త్రీ మరణిస్తే (పెళ్ళి అయిన ఏడు సంవత్సరాల లోపు) ఈ చట్టానికి అనుబంధంగా ఉన్న 304 బి (1986) క్రింద ఏడు సంవత్సరాల నుండి జీవితకాలం శిక్ష వరకు విధించవచ్చు. 2006 లో కుటుంబ హింస చట్టం వచ్చే వరకు 498ఏ మాత్రమే ఇంట్లో హింస పడుతూ.. విడాకులు తీసుకోవటానికి ఇష్టపడని స్త్రీలకు ఉపయోగపడేది. తరువాత కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు దానికి సవరణలు తెచ్చి కోర్టు అనుమతితో రాజీపడే ‘సదవకాశాన్ని’ కలగ చేసాయి.

ఉన్నత న్యాయస్థానాల వరస తీర్పులు

2003లో సావిత్రి దేవి కేసులో డిల్హీ హైకోర్టు జస్టిస్ జెడి కపూర్ 498ఏ సెక్షన్ మీద విరుకుపడ్డారు. కుటుంబాలను అతలాకుతలం చేసే చేటుగా ఈ చట్టాన్ని ఆయన వర్ణించారు. ఇంకా ఆయన ముందుకు పోయి.. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని స్త్రీలు వారి భర్తలను, అత్తమామలను హింస పెట్టే హక్కు లేదని వక్కాణించారు. కుటుంబ తగాదాలను పరిష్కరించటంలో వైఫల్యం చెందిన పోలీసులను ఆయన తులనాడారు. స్పష్టమైన స్త్రీ వ్యతిరేకత, పోలీసుల పట్ల కొంత ధర్మాగ్రహం తప్ప ఈ చట్టం దుర్వినియోగం అయిందని చెప్పటానికి ఆయన వద్ద సరి అయిన ఆధారాలు పెద్దగా లేవు.

అదే సంవత్సరం మలవత్ కమిటీ “సహనం లేని ఉద్రేకపడే మహిళ చిన్న కారణాలకే కేసులు పెట్టవచ్చు. దాని వలన ఆమె భర్త, అతని కుటుంబం జైలు పాలు అవ్వచ్చు. అతని ఉద్యోగం పోవచ్చు. వారి వైవాహిక జీవితంలో తుఫాను రావచ్చు.” అని చెప్పింది. ఇవన్నీ జరగకూడదు కానీ కుటుంబ హింస, క్రూరత్వం, ఒక్కోసారి ఆమె మరణం దాకా జరిగినా పర్వాలేదని ఆ కమిటీ ఉద్దేశ్యం.

2010లో ప్రీతి గుప్తా వర్సెస్ జార్ఖాలాండ్ రాష్ట్ర ప్రభుత్వ కేసు సంధర్భంగా భారత ప్రభుత్వం లాకమీషన్ ను 498ఏ ను సమీక్షంచమని అడిగింది. లా కమిషన్ 2012లో ఇచ్చిన రిపోర్ట్ లో ఈ చట్టాన్ని కాంపౌండబుల్ చేయాలని, బైలబుల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే తప్పుడు కేసులు పెట్టిన స్త్రీలను శిక్షించేవిధంగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయ పడింది. మానుషి మహిళల పత్రికను ప్రతిష్టాత్మకంగా నడిపి, వైవాహిక చావులను ప్రపంచానికి చూపిన మధూ కిష్వర్ నరేంద్ర మోడి భజన వర్గంలో చేరి గొంతు మార్చి 498 దుర్వినియోగమౌతుందనే పాట మొదలు పెట్టింది. ఆమ్ ఆద్మీ నాయకురాలు కిరణ్ బేడీ కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడింది.

ఈ చట్టం కోరలు తీయటానికి దారులు ముందు నుంచే వేసుకొంటూ వచ్చిన బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే .. ఈ సంవత్సరం జులై రెండున సుప్రీం కోర్టు 498 గురించి చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యపరచవు. ‘అసంతృప్తి భార్యలు భర్తలను, అత్తమామలను వేధించటానికి ఈ చట్టాన్ని వాడుకొంటున్నారని వ్యాఖ్యానించింది. ఈ సెక్షను క్రింద ఎవరినంటే వారిని అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచించింది. విచారణతో సహకరించని వారిని, సాక్ష్యాలను తారుమారు చేయ ప్రయత్నించేవారిని, పారిపోవాటానికి ప్రయత్నించే వారిని మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పింది.

498ఏ నిజంగా దుర్వినియోగం అవుతుందా?

నాలుగు గోడల మధ్య స్త్రీల మీద హింస అనేది ఒక కఠిన వాస్తవం. భారత దేశంలో వరకట్న వేధింపులు ఈ హింసకు ఒక ప్రధాన కారణం. దానిని నివారించటానికి రూపకల్పన చేసిన చట్టం 498 ఏ. వరకట్నపు ప్రసక్తి లేని గృహహింసకు కూడా ఈ సెక్షను వర్తిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా గృహహింస అనుభవిస్తున్న మహిళలు 498ఏలో మొదటి భాగాన్ని ఉపయోగించుకొని కేసు పెట్టుకోవచ్చు. కానీ 498ఏ ప్రస్థానం వరకట్న వ్యతిరేక ఉద్యమాలనుండి ప్రారంభం అవటం వలన కోర్టులు కానీ పోలీసులు కానీ వరకట్న ఆరోపణలు లేకుడా ఈ కేసులను ముట్టుకోవటం లేదని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు. గతి లేని పరిస్థితుల్లో వరకట్నానికి సంబంధించిన కొన్ని వాక్యాలైనా జత పరచాల్సి వస్తుంది. అయితే ఈ తప్పు కంప్లైంట్ చేసిన వారిదా? లేక తప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్న పోలీసులు, లాయర్లదా? లేదా చట్టం స్వభావంలోనే లోపం ఉందా? అనే విషయం తరచి చూడాలి. అవినీతి, తప్పుడు విచారణలు, కేసు పడిన భర్త మీద సానుభూతి .. ఇవన్నీ యాంత్రిక తీర్పులకు దారి తీస్తున్నాయి. ‘వరకట్న చట్టాలు దుర్వినియోగమవుతున్నాయి’ అనే వ్యంగ్య పూరిత ప్రచారం వెనుక ఈ చట్టాన్ని పటిష్ట పరిచి పకడ్బందీగా అమలు పరచాలనే కర్తవ్యం మరుగున పడుతుంది.

భర్త నుండి డబ్బు గుంజటానికే ఈ కేసులు పెడుతున్నారని ఈ సెక్షను మీద ఇంకో ఆరోపణ. ఎందుకంటే ఎక్కువ కేసులు డబ్బు తీసుకొని సెటిల్ అవుతున్నాయి కాబట్టి. మెజారిటీ 498 కేసులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని రాజీ పడుతున్నపుడు అది న్యాయమే అవుతుంది. ఆ డబ్బుతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కోర్టులు కూడా ఎప్పటి కప్పుడు ఈ విషయంలో నిర్దేశిక సూత్రాలు చెబుతూ ఆ సౌకర్యం కలిగిస్తున్నాయి. హింసాయుతమైన వైవాహిక జీవితంలో చిక్కుకొన్న యువతికి భర్తకు శిక్ష పడటం ఉపశమనం కలిగించదు. కొంత డబ్బు భద్రతతో గౌరవనీయమైన నిష్క్రమణ ఆమెకు అవసరం. ఈ రాజీల వలన వచ్చే డబ్బు ఆమె అప్పటికే దావా వేసిన మనోవర్తికి బదులుగా (ఇంకా చెప్పాలంటే చాలా తక్కువగా) ఇస్తున్నారని అర్ధం చేసుకోవాలి.

ఈ చట్టం చదువుకొన్న, ధనిక, మధ్య తరగతి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళలకు మాత్రమే ఉపయోగపడుతుందని, వారు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏక్తా గ్రూపు సర్వే ప్రకారం ఈ కేసుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారు భర్తల మీద ఆధారపడి పడిన నిర్భాగ్యులయిన స్త్రీలు. చదువుకొన్న,ధనిక స్త్రీలు పరిహారం కోసం నేరుగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఏటా ఐదు కోట్ల మహిళలు గృహహింస పాలు అవుతుంటే రెండు లక్షల కేసులు మాత్రమే ఈ సెక్షను క్రింద్ర నమోదు అవుతున్నాయి. యాభైవేల అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. పదిహేను శాతం కేసుల్లోనే శిక్షలు ఖరారు అవుతున్నాయి. తక్కువ శిక్షలు పడటానికి కారణం దొంగ కేసులు నమోదు అవటమేనని కోర్టులు అంటుంటే , స్త్రీలకు కోర్టుల్లో న్యాయం జరగటం లేదని మహిళాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

భర్త తరఫు బందువులను నిందితులలో చేర్చటం సరి అయినదేనా?

పితృసామ్య, పురుషాధిక్య సమాజంలో వివాహిత స్త్రీ మీద భర్తతో బాటు అతని కుటుంబ సభ్యులకు అధికారం ఉంటుంది. తల్లిగా కూతురి అత్తింటి కష్టాల గురించి ఆవేదన చెందే స్త్రీ కోడలి విషయంలో తన అధికారాన్ని వదులుకోదు. స్త్రీ పురుషులకు అసమాన హోదాలు లభించిన మన వివాహ వ్యవస్థలో అన్నీ అస్తవ్యస్థ సంబంధాలే. పురుషస్వామ్య భావజాలం పురుషులనే కాదు స్త్రీలను కూడా పాలిస్తుందిక్కడ. ఆ భావజాలం వలనే అత్త ఆడబడుచుల వేధింపులు కోడలికి తప్పని పీడ అవుతాయి. అయితే కేసులు విచారించే పోలీసులు, వాదించే లాయర్లు “అత్త మామలను, ఆడ పడుచులను లోపల వేస్తే దారికి వస్తారు.” అనే తప్పుడు సూచనలు ఇవ్వటం పరిపాటి. ఒక వేళ మహిళ అత్తామామలు, ఆడపడుచుల మీద అన్యాయంగా ఆరోపిస్తే .. కేసును కూలంకషంగా పరిశీలించే ఓపిక లేక కూడా యాంత్రికంగా అందరి పేర్లు నమోదు చేస్తున్నారు. తప్పకుండా ఈ విషయం పట్ల బాధితురాలు, ఆమె తరఫు బందువులు జాగ్రత్త వహించాలి. ఈ సెక్షను సారము దెబ్బతినకుండా అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ బాధిత స్త్రీల మీదనే ఉంది.

ఎవరికి, ఎందుకు ఈ చట్టం కంటకింపుగా ఉంది?

అంతర్జాల ప్రపంచంలో అనేక బ్లాగులు ఈ చట్టానికి వ్యతిరేకంగా వెలిశాయి. 498ఏ కు వ్యతిరేకంగా కోర్టులు చెబుతున్న తీర్పులకు హర్షం వ్యక్తం చేయటం, ఆ కేసులు వేసిన మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేయటం ఈ బ్లాగుల్లో కనబడుతుంది. 498ఏ చట్టం అమలు విషయంలో మహిళల్లో ‘ద్వేషం’, ‘పగ’ గురించి మాట్లాడటం, ఎలాంటి విశ్వసనీయమైన సమాచారం లేకుండా తీర్మానాలు చేయటం ఇప్పుడు కొత్త కాదు. మహిళల విలువైన ప్రాణాల కంటే ‘కుటుంబ విలువలు’, ‘కుటుంబ జీవితం’ లాంటి పదాలకు పవిత్రత ఆపాదించి ఈ చట్టాన్ని సంస్కరించాలనే అతి తెలివి సిఫార్సులే ఇప్పుడు కొత్తగా వింటున్నాము.

“గృహహింసను మిగతా హింసలతో సమానంగా చూడకూడదు. అందులో ‘కుటుంబాలు’ ఉన్నాయి.” అనే తర్కంలోనే “సర్ధుకుపోవాలి” అనే భావన కూడా వినిపిస్తుంది. ఇప్పటి అప్రజాస్వామిక కుటుంబాలలో సర్దుకుపోవటం స్త్రీలే చేయాలి అన్న విషయం సర్వవిదితమే. కాబట్టి మన కుటుంబ పరిరక్షకులు అందరూ కుటుంబాలను కాపాడే ప్రయత్నంలో స్త్రీల పై జరిగే హింస విషయం బేఖాతరుగా ఉన్నారు. రాజ్యం, దాని యంత్రాంగం, కోర్టులు, పోలీసులు పురుష స్వామ్యానికి కాపలా కాస్తున్నాయి. కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నంలో ఆమె మరణాన్ని కూడా మూల్యంగా చెల్లించమని అంటున్నాయి.

మళ్ళీ లేవాలి. పొలికేక వెయ్యాలి.

మహిళా రిజర్వేషను బిల్లును మానభంగం చేసిన ప్రజా పతినిధులు పార్లమెంటులో కుర్చీలు ఆక్రమించిన దౌర్భాగ్యం మనది. మహిళలను వేధించిన కేసుల్లో ఉన్నవాళ్ళు పార్లమెంటేర్లియన్లుగా రేపు చేసిన వారిని ఉరి తీయమని చట్టాలు చెయ్యమని మెలోడ్రామా ఆడిన ఘనత వహించిన దేశం మనది. ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణచటానికి సాక్షాత్తు ప్రభుత్వమే రేపిస్టుగా మారిన రాజ్యాంగ వ్యవస్థ మనది. ప్రజల్లో కుల మత తగాదాలను రెచ్చగొట్టి అందులో స్త్రీలను లైంగిక పరికరాలుగా వాడుకొన్న పచ్చి ఫ్యూడల్ యుగలక్షణం మనది.

రాజ్యాంగ పుస్తకంలో కనిపించే చాలా హక్కులు బయట అదృశ్యమవుతాయి. అనేక చట్టాలు సౌకర్యవంతంగా ప్రభుత్వం చేతనే అతిక్రమించబడతాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయంలోనే ఏజన్సీ చట్టం, అటవీ హక్కుల చట్టం, అటవీ సంరక్షణ చట్టం, పర్యావరణ రక్షణ చట్టం, జీవ వైవిధ్య చట్టం, పెసా చట్టాలను ఒక్క ఏటున తుంగలోకి తొక్కారు. భారత మహిళలు రాని చట్టాల గురించి పోరాడాలి. ఉన్న చట్టాలను కాపాడుకోవాలి. వరకట్న నిషేధ చట్టం నూరు శాతం ఫైల్ అయినా పట్టించుకొన్ననాధుడు లేడు. ఈ పురుషాధిక్య వ్యవస్థలో వివాహిత స్త్రీల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం 498ఏ. దానిలోని చిన్న చిన్న వైఫల్యాలకు పునాదులు ఎక్కడ ఉన్నాయో వెదికే ఆశక్తి చూపకుండా దాని మీద సర్వోన్నత న్యాయ స్థానాలు, ఢిల్లీ గద్దె నెక్కిన ప్రభువులు కళ్ళెర్ర చేసి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించటానికి నేలను గట్టి పరుచుకొంటున్నారు. ఇప్పుడిక జవసత్వాలు కూడా తీసుకొని మహిళలు లేచి నిలబడే సమయం ఆసన్నం అయ్యింది.

28 thoughts on “498A: దుష్ప్రచారం మాని పకడ్బందీగా అమలు చేయాలి

 1. విడాకుల చట్టం గురించి కూడా తెలియని పల్లెటూరి స్త్రీలు ఉన్న దేశంలో 498a గురించి తెలిసిన స్త్రీలు ఇంకా తక్కువే ఉంటారు కదా. చట్టం గురించి తెలియకుండానే దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు?

 2. i wonder why Madam Rama Sundari look the problem only from one angle, till today if there is any problem to any women, i dont think so that society will not keep quite, at least neighbors will react. but, i know there are so many families which are dominated by women and men cant even express it before anybody because he will not get any sympathy, their domination will be silent but violent. they will not mingle with husbands family members, demand for separation from them, i pity on men as they has to bare silently.. perhaps a section to brought with 996aa(double to 498a) to support men. as rightly said by gurus Hindu mythology ladies were worshiped as “AADI SHAKTHI” and kept above to men. un necessarily they are fighting for equality.

 3. మన దేశంలో…చట్టాలు అమలయ్యేదే అంతంత మాత్రం…చట్టం బాధితులకు కొండంతం న్యాయం చేయాలని సూచిస్తే…అది ఆచరణలో ఆవగింజంత కూడా అమలు కాదు. ఏదో తూతూ మంత్రంగా చట్టాలు అమలు చేసే మనదేశంలో……ఒక చట్టం దుర్వినియోగం గురించి చర్చ జరగడం విశేషమే..
  ఓ వైపు బాధితులకు చట్టం వినియోగం కాక…..మొత్తుకుంటుంటే……దుర్వినియోగం గురించి మాట్లాడడం పక్షపాత బుద్ది చూపడమే అవుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో498-A దుర్వినియోగం అయి ఉండవచ్చు. అంతమాత్రాన అసలు చట్టమే రద్దు చేయాలంటే ఎలా…?
  ఈ చట్టం రద్దు కోరుకుంటున్న వాళ్లు మొదట….. కుటుంబ హింసకు గురవుతున్న మహిళకు ఏ విధంగా రక్షణ కల్పించాలో సూచించాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా కేవలం దుర్వినియోగం గురించి మాట్లాడడం దురదృష్టకరం.
  అసలు చర్చ జరగాల్సింది 498-A ఉండాలా..ఊడాలా అని కాదు.
  మహిళలపై అఘాయిత్యాలు…అరాచకాలు అరికట్టడం ఎలా అని. అసలు మనది నిజమైన ప్రజాస్వామ్య సమాజమే ఐతే ఇటువంటి చర్చే అవసరం లేదు.

  మహిళను స్వేచ్ఛగా జీవించనిచ్చిన రోజు … ఆమెకు ఏ చట్టాల మద్దతు అవసరం లేదు.
  మహిళలు కూడా మనుషులే అని గుర్తిస్తే చాలు.

 4. కేవలం అమలు కాని ఇలాంటి మహిలా చట్టాలు ఉన్నందుకే పురుష ప్రంచం కత్తి కట్టి నట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఇందులో తామే భాధితులన్నట్లు తెగ పోజు పెడుతున్నారు. స్త్రీల చేతిలో తాము అణచి వేయ బడుతున్నామని తెగ వోపుతున్నారు. స్త్రీ సంఘాల లాంటిపురుష సంఘాలు కూడా వుండాలని మరీ రెచ్చి పోతున్నారు. ఈ మాత్రం చట్టాలుండి కూడా ఏ మాత్రం స్త్రీల అణచి వేత తగ్గలేదంటే అసలే లేకుంటే పరిస్తితి ఎలా వుంటుందో అర్ధం చేసు కోవచ్చు.

  ఈ దేశంలో ఆత్మ రక్షణ చేసుకోవటమే పెద్ద తప్పున్నట్లు మాట్లాడటం మరీ ధారుణం.

 5. గోపీనాథ్ గారు, ఆడది ఆది శక్తి అని కబుర్లు చెప్పక్కరలేదు. ఆడదాన్ని మనిషిగా చూస్తే చాలు. నరేంద్ర మోదీపై నేను చేసిన విమర్శలు ఇక్కడ చదవండి: http://praja.palleprapancham.in/2014/08/blog-post_71.html?m=1

 6. పింగ్‌బ్యాక్: ‘498ఏ దుర్వినియోగం’ అనే వెర్రి ప్రచారం – వాస్తవాలు | మోదుగు పూలు

 7. పింగ్‌బ్యాక్: ‘498ఏ దుర్వినియోగం’ అనే వెర్రి ప్రచారం – వాస్తవాలు | మోదుగు పూలు

 8. పురుషులందరూ దోషులు, స్త్రీలు అందరూ బాధితులు అనే భావ దారిద్ర్యం నుంచి ఈ సమాజం బయట పడాలి.

  ఎవరి బ్రతుకులు వారివే అయినప్పుడు, ఎవరి కష్టం వారిదే.. ఎదుటివాడి కష్టార్జితాన్ని తేరగా మోసం చేసి దోచుకోవాలనుకోవటం స్వార్ధం కాక మరేమిటి.

  ఆడవాళ్ళందరు మహా పతివ్రతలు, ఏపాపం చేయని అమాయక ప్రాణులా?

  మగవాడు తప్పు చేస్తే, పైసలిస్తే పాప పరిహారం ఐపోతుందా?

  కేవలం ఆర్థికంగా స్థిరపడిన డాక్టర్లు, ఫ్రొఫెసరులు,లాయర్లు, ఎనారైలు,వ్యాపారస్థులు,సాఫ్ట్-వేరు ఉద్యోగులే ఎక్కువగా ఇరికించబడుతున్నారు.

 9. ప్రవీణ్ వేజెండ్ల గారూ, ఆర్టికల్ ని మరోసారి చదవండి. మీరు తీసిన అర్ధాలు అందులో లేవు. భావ దారిద్ర్యం వల్ల వాస్తవాలను చూడడానికి నిరాకరించే గుణం కూడా వస్తుంది. మీరు చెప్పిన ఆర్ధిక స్ధిరపరులే ఎక్కువగా భార్యల్ని కట్నాల కోసం పీడిస్తున్నారు. సంతలో పశువుల్లా అమ్ముడయ్యే భావ దారిద్ర్యం తమ సొంతం అని ప్రకటిస్తున్నారు.

  నిన్ననే తెలుగు ఛానళ్ళు ఒక వార్త ప్రసారం చేశాయి. ఆడ పిల్లని కన్నదని భార్యని ఇంట్లోకి రానివ్వలేదు ఆమె భర్త. వాడు ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు మరి. అత్త మామలు ఆ దరిద్రుడికి సపోర్టు. ఇలాంటి నికృష్ట దరిద్రులవల్లే 498ఎ చట్టం వచ్చింది. భార్యని పీడించే దరిద్ర మహాశయులు తామే పీడితులుగా, ఇరికించబడ్డవారిగా కన్నీళ్లు కార్చుతుంటే మీ బోటి భావ సంపన్నులు నమ్మేయడం ఆందోళనకరమే.

 10. దేశంలో ఇన్ని చట్టాలుండగా 498a ఒక్కటే దుర్వినియోగం అవుతోందనే వాదన నమ్మశక్యంగా లేదు. డబ్బున్నవాళ్ళ ఇంటిలో దొంగతనం జరిగినప్పుడు పేదవాళ్ళని అనుమానించి ఇరికించిన సందర్భాలు ఉన్నాయని దొంగతనం కేసులు పెట్టకూడదంటున్నామా? మరి 498a విషయంలోనే అలాంటి వాదన ఎందుకు?

 11. ప్రవీణ్ వేజెండ్ల గారూ,

  ఏ చట్టాలైనా ఎవరికి ఉపయోగమో ఒక వాస్తవం తెలుసు కొని మాట్లాడండి. అప్పుడు మీ కళ్ళకు కట్టిన గంతలు గల్లంతవుతాయి. మీరు తెలుగు వారైతే, చరిత్ర తెలియక పోయినా, కనీసం కన్యాశుల్కం అనే నాటకాన్ని చదివి, కన్యాశుల్కమంటే ఏమిటో తెలుసుకోండి. ఆ కన్యాశుల్కం కాస్త వరకట్నంగా ఎందుకు మారిందో ఒక అవగాహన పెంచుకోండి. అపుడు కట్నం ఏమిటో తెలుస్తుంది. ఇన్ని పనులు మీరు చేస్తారా? చెయ్యరు. ఎందుకంటె మీకు అవసరం లేదు. మీకేకాదు చాలా మందికి అవసరం లేదు. ఇలా తెలుసుకోకుండా మాట్లాడితే ఏమర్ధ మవుతుంది?

  ఈ వరకట్న మహమ్మారి ఎందుకు విస్తరించిందో ఎన్ని వేల ప్రాణాలను బలిగొంటుందో అది ఒక అంటు వ్యాదిలా ఎందుకు ప్రబలిపోతుందో అర్దం మవుతుంది! బీద, మధ్యతరగతి వాళ్లకు డబ్బు ఎక్కువై వారు కట్నాలు ఇస్తున్నారా? లేక తీసుకుంటున్నారా? కాదు. ఆ మహమ్మారి కలవారి ఇంటనే పుట్టింది. ఇవాళ సాప్ట్ వేర్‌ ఇంజినీర్లు, ఇక్కడ వున్న పేదల, మధ్యతరగతి వారి కష్టం మీద చదువుకొని, అమెరికాకు తన మేధను అమ్ముకుంటున్నారు. డబ్బు మహమ్మారి పట్టినోళ్లు, తమ గొప్పతనాన్ని చాటింపు వేసుకొని మరీ కట్నదాహాన్ని తీర్చుకుంటున్న వారికి, ఈ అమెరికా అల్లుడు కావాలని దురాశతో కట్నం ఇచ్చినవారు తమ ఆడ పిల్లకి అసౌఖ్యంగా, హింసలు పడుతుంటే అడగరా? మితిమీరితే కేసులు పెట్టరా? మీరు న్యాయం మాట్లాదుతున్నారా ఇంకేదైనా మాట్లాడుతున్నారా? ఉన్నవారి న్యాయం ఇలాగె వుంటుంది. సమాన న్యాయం కావాలని అర్ధం చేసుకోండి! ఒబామా కొలువులో ఉండటమే మన జాతి గర్వంగా, సాప్ట్‌ వేర్‌ కంపెనీలలో ఉన్నవారే బూమి మీద చావకుండా బతుకుతారని చాటింపు వేసేవారు ఇలాగె చెబుతారు.

  మాకు డబ్బు విలువ తెలియదండి! మీలాంటి వారికే తెలుస్తుంది.

 12. Hi Venkat, That is what Praveen did in his comment. Of course, he attacked entire women community. In the sense that he certified each single woman in a wholesale manner, as if he has nothing to do with any woman. He put his own words in writers mouth and extracted the meaning of his like. He also took the entire discussion into his own hands and delivered cermons to the commentors here. I think Mr. Thirupalu has just responded to this dominating voice. You may have to see it.

 13. తెలుగు బ్లాగుల్లో 498a పై తీవ్ర విషప్రచారం జరుగుతోన్నప్పుడు 498aకి అనుకూలంగా వ్యాఖ్యలు వ్రాసింది నేను ఒక్కణ్ణే (నాకు గుర్తున్నంత వరకు). ప్రవీణ్ శర్మ వ్యాఖ్యలు అనగానే conservative వర్గానికి చెందిన బ్లాగర్లు కుళ్ళు జోకులు వేసి ఆనందిస్తారనే భయం లేకుండానే ఆ విష ప్రచారానికి సమాధానాలు చెప్పాను.

 14. meru rasina article chadivanu ikkada naku aradm akani vishyam okati vundi rendu chetulu kaliste tappatlu annaru .eddartu teliyani vyaktulu mudumulla bandam tho ekamite pelli annaru pelli ki mundu vaduvuki ki tandri ichhe katnalu vastuvulu emite vuntayo avi andari samksham lo ne jarugtai e vishayam bahrata desam lo andariki telisinade andulo pelli koduku pelli kuturu kuda vuntadi ikapotehe a katanam chaladsani abbayi ammayi meda jaripe dowrjanyam himsa vall ammayi kastalu padathadi kabatti a kastanni 498a ane section tho mayam cheyochhu annamata ikkada mere chepparu alugu godala madya jarige himsa ani mari nALUGU GODALA madya jarige himsani evaru matram chustaru evaridi nijam ani nammali ammayi vonti meda tivramaina gayalu kanabadite mataram adi sahincharni neram endukante maguvani devataha ga bavinche mana desam lo ame meda anyam jarigithe saslu vurukokudadu kani oko sari manaki kastam kaligi napudu a devathani kuda nindistamu ikkada nenu cheppadaluchukunnadi emi tante tappu anedi oka daggara modalai iddariki pakutundi kavuna courtlu kani peddalu kani nijanijalu nirdarinchi iddariki samana maina nyam jarigela chusinapudu matrame e sectionsajavuga etuvanti vimarsalu lekunada vuntadi ala kakunda one side justice cheste matram asthikulu nastikulu laga e section meda chivarivaraku vada prativadanalu jarugutune vunatai…

 15. sir, i saw modi speech and some comments, as per his words daughters are looking their parents better than sons, do you know why? because most of the in laws will treat their uncle and aunt equal to his parents. but most of daughter in laws ill treat uncle and aunt. poor men become sand witch between his parents and wife. as modi saab is having experience i too have some experience in this regard. more over character depends on individual to individual. it will not be gender based. we cant say all men are good and all women are good. my voice stress on issue based and not on gender based.

 16. In the last 20 years I might have come across not more than ten genuine caases under sectin 498A IPC.. 98 percent cases are false cases in the sense result of ill advice. Lawyers and police officers are responsible for the ill advice. Since most of the cases are false Courts are compelled to make such comments. I am lawyer practising on criminal side. practising since 30 years. there i sjustification in the concern expressed by the Courts. comrades like must realise the ground realities. I am .not against the POW. I am a staunch supporter of your organisation.

 17. The main culprits are lawyers. They get fees based on the alimony and maintenance. Hence they form all the impossible allegations and file cases. There is no accountability and perjury for abetting false cases. Added to that corrupt police set up. Your focus should be to curtail these two extortionists, then automatically the false propaganda comes to end.

 18. This is blind rule 498a
  I have one doubt
  I am in India i will fallow in rules is it write or wrong ?
  In same way who is fairly head ? Then who rules fallowed ?
  Indian marriage system still now respect to world why ?
  Please understand why vanish the my great indian marriage systems ?
  Pl save indian family system s

 19. 498a law ni addam pettukuni ami chesina mana maatane nammutharu ani intlo leni atthamaamala meeda kuda case peduthunaru bharyalu okavela atthamaamalu intlo lekapoyina vaallu intiki vachina timelo bharyane vaallatho godava pettukuni case peduthundi deeniki anti solution

 20. naaku naa bhayrku godavala valana naa bharya vaalla amma gari intiki vellipoyindi eppudu thanu naa daggaraki raanu antundi maaku 6 months baabu vunnadu eppudu baabu ni chudadam kudaradu thanu maatram baabu vaalla ammagariki echi job chesukuntundi marala 1 year taruvata vastanu appudu vere kaapuram pedithe vasta ledante ledu ani chebuthundi thana nenu naa job naa parents ni kuda vadulukunnanu thanu maatram thana job thana parents tho vuntu tirigi naa paina koduthunnanu thiduthunanu tourcher peduthunna ani pracharam chesthundi maaku marriage ina 3 years nundi elane chesthundi godava padadam vellipovadam job chesukuni aa amount vaalla parents ki echi summer holidays ki raavadam maali godava pettukuni nv maaraledu ani maali job lo join ipothundi eppudu nenem cheyali ple solution

 21. 498a law is gender biased. All females are not Sita’s and all males are not Rama’s. So, gender neutral laws should exist not gender biased laws. And in our education system should be taught how to respect and how to resolve family issues. fighting each other never brings solution. It should be debated elaborately and resolved. Arresting any body without proper proof is crime.

 22. నమస్కారం
  నా పేరు అశోక్ 9963xxxxxx, నా వయస్సు 29,
  వనపట్ల గ్రామం నాగర్ కర్నూలు మండలం& జిల్లా,తెలంగాణా స్టేట్,
  నా భార్య అనిత అలియాస్ శ్రావణి (ప్రవళిక),వయస్సు 23,
  కొత్తపల్లి గ్రామం బాల్ముర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా,తెలంగాణా స్టేట్,
  నా మీద ఏటు వంటి విచారణ జరగకుండా నన్ను,నా కుటుంబాన్ని 498A లో శిక్షకు అర్హుల్నీ చేశారు,మరి దీనికి సంబంధించిన వివరాలు కూడా మమ్మల్ని అడగలేదు,మరి నేను పెళ్ళి చేసుకోవడం నేరమా ?
  ఎందుకు ఈ చట్టం,ఇలాంటివి జరగకుండా కాపాడే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, మా జీవితాలు నాశనం చేసే చట్టం అవసరమా!
  ఇలాంటీ భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుచేటు గా ఉంది.
  ఇంకా ఇలాంటి తప్పులు జరుగుతునే ఉంటాయి.

 23. Dear sir/Madam who are supporting This worst section also think from your point of view if you are in mother father of groom and if your daughter in law files a case against you for what so ever the reason …for sending father & mother out or for demanding money you will know the pain ..this is the most misused section by women with fraud intended . Because we know the pain as i am the victim of this section .. i have married on 20th-jun-2019 a girl from Nellore in Ap . and we are staying in Kadapa district .after marriage she used to come for 2 days and used to quarral with me for money or for sending my mother out . like this stayed only 19 days during 6 months . when i enquired neighbors they disclosed that she is divorcee.they used to threaten me over phone for many things . and looted my money and ornaments . when she came after 6 months i asked that what were u doing and why didn’t u tell about divorce then 6 people beated me . and filed case under 498a then when i verified first marriage details i knew that she was filed same case for first marriage too and case was closed only just filing case on me..they collected money from them too. Now they are demanding money from mee too. See my position if i file cheating case u/s 420 i have to go to court for 3 years . at the end court is not punish this cheating girl . by the time company where i am working will not allow me to attend court frequently . If i leave the job where my parents will go and survive ..answer to my questions ..why the courts are not punishing this type of frauds .treating marriage as a game for earning money.

 24. నా మనవి ఎమనగా మా యొక్క తమ్ముడు వారి భార్యా ఇద్దరు ఇపుడు గొడవ చేసుకుంటారు నేను మా రోడో తమ్ముడు మా చెల్లె అందరం హైద్రాబాదు లో ఉంటాం
  మా చిన్న తమ్ముడు గొడవ పడి పోలిస్ స్టేషన్ కు వేలైనారు . తరువాత మా గ్రామా పెద్దలు రమంటే మేము స్టేషన్ కు వెలినాం జమానాథ్ ఇవ్వమన్నారు మేము హైదరాబాద్ లో ఉంటాం వారు గ్రామం లో ఉంటారు ఎలా సారు అన్నం అపుడు . అక్కడ ఉన్న ఐ ఏ స్ గారు . అందరి పైన వెద్దిపూల కేసు పెట్టామన్నారు మా తమ్ముని
  భార్య కేసుపెట్టినాది. మేము ఇపుడు ఏంచేయాలి ఆమెకి మేము ఇంత వరకు ఏమిఅనలేదు మేము హైదరాబాద్ లో 25 ఇయర్సునుడి ఉటున్నము .. తెలుపాగలరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s