ఈ రోజు నుండి ఈనాడు పత్రికలో ‘పొలిటికల్ ఎకానమీ’ కోణంలో సమాజాన్ని అర్ధం చేసుకోవడం ఎలా అన్న అంశంపై వ్యాసావళి ప్రారంభించాను.
సమాజాన్ని, అందులో పరస్పర సంబంధంతో కలగలిసిపోయి ఉండే వివిధ అంశాలను వివిధ శాస్త్రాలుగా విడగొట్టుకుని చదువుకుంటున్నాం గానీ సామాజిక ఆచరణలో అవన్నీ ఒకటే. సామాజిక జీవనంలో రాజకీయార్ధిక కోణం అత్యంత ముఖ్యమైనది. సామాజిక జీవనానికి అదే పునాది కూడా. దీన్ని సరళంగా అర్ధం చేసుకోగలిగితే ఒక తాత్విక దృక్పధాన్ని అలవారుచుకోవడం తేలిక అవుతుంది. ఉన్నత స్ధాయి పరీక్షల్లో ఇలాంటి దృక్పధం తోడ్పడుతుంది.
వ్యాసాన్ని నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే ఈ కింది లంకెను క్లిక్ చేయండి.
వ్యాసాన్ని పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో చదవడం కోసం కింది బొమ్మను క్లిక్ చేయండి. బొమ్మపైన రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ వ్యాసం… చదవగానే ఈ వారం నుంచి ఇంకో కొత్త టాపిక్ మొదలవుతుందేమో అనిపించింది. అంటే ఇవాళ మీరు రాసింది……, తర్వాత మీరు రాయబోయే వాటికి ముందుమాటగా ఉందన్నమాట. అసలు వ్యాసం ప్రారంభమయ్యే ముందు ఉన్న హైలైట్ చేసి ఉన్న నాలుగు లైన్లతోనే మొత్తం అంతా అర్థమైపోతుంది.
ఐతే అర్థశాస్త్ర్రాన్ని ఎలా అధ్యయనం చేయాలో వివరించారు. కదా. కాబట్టి అర్థశాస్త్రమంటే భయపడే విద్యార్థులకు ఆ దిశగా ఆసక్తిని కలిగిస్తుంది. కచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది.
ఐతే మీరు గత నాలుగు వారాలుగా రాసినవి చదివిన వారికి కొంచెం నిరాశ కలగొచ్చు. గత వ్యాసాలు పర్టిక్యులర్ గా ఒక ప్రశ్నను ఏలా సమాధానం రాయాలో గైడ్ చేసేలా ఉన్నాయి. ఇవాళ్టి వ్యాసం మాత్రం…జనరల్ గా ఉంది. ఐతే
మీరు అర్థశాస్త్ర్రాన్ని ఎలా అధ్యయనం చేయాలో మార్గం సూచించారు కాబట్టి… రాబోయే వ్యాసాలకు ముందస్తు సూచికగా ఉంది
మీరు గతంలో సివిల్స్…..మెయిన్స్ ప్రశ్నపత్రంలోని అంతర్జాతీయ సంబంధాల అంశాలపై వచ్చిన ఒక ప్రశ్నను తీసుకుని…..దానికి ఎలా సమాధానం రాయాలో క్లియర్ గా వివరించారు కదా. అలా ఓ నాలుగైదు భిన్న రకాల ప్రశ్నలు ఎంపిక చేసి…..భిన్న కోణాల్లోంచి వివరిస్తే బాగుంటుందని సివిల్స్ అభ్యర్థులు అనుకుంటున్నారు. ఇప్పటికే మీరు కొశ్చన్ టాగ్ ల గురించి వివరించారు కదా. అలా.
-బహుశా అది మెయిన్స్ రాయబోయే విద్యార్థులకు ఉపయోగకరంగా…ప్రధానంగా తెలుగు మీడియం విద్యార్థులకు ఇంకా ప్రయోజనకలిగించేదిగా ఉంటుంది.
ఆంధ్రా యూనివర్సితీ సిలబస్‌లోని మైక్రో ఎకనామిక్స్ సులభంగానే అర్థమవుతుంది. నేను distance educationలో ఆ పరీక్షలు వ్రాసి పాసయ్యాను.
ఆర్థిక శాస్త్రంలో అర్థమవ్వకపోవడం లాంటిది ఉండదు. ఆర్థిక శాస్త్రం తమకి కొత్త కావడం లేదా లైబ్రరీలో రిఫరెన్స్ పుస్తకాలు చదవకపోవడం వల్ల అది అర్థం కాకపోవచ్చు కానీ అదేమీ బ్రహ్మ పదార్థం కాదు. బతకడానికి మార్కులు తెచ్చుకోవడం & ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గం అని నమ్మే తల్లితండ్రులు లేదా ఉపాధ్యాయుల వద్ద పెరిగితే, వ్యాపారం చేసి కూడా బతకొచ్చు అనే నిజం రుచించదు. మైక్రో ఎకనామిక్స్‌లో ఎక్కువగా వ్యాపారం గురించే వ్రాసి ఉంటుంది. చాలా మంది విద్యార్థులకి ఇది కొత్త కాన్సెప్త్ కావడం వల్ల వీళ్ళు దీన్ని అంత తొందరగా అవగాహన చేసుకోరు. నేను లైబ్రరీలో పౌల్ సేమ్యూల్సన్ వ్రాసిన పుస్తకం & బిర్న్-స్తోన్ ప్రచురించిన పుస్తకం చదివిన తరువాత నాకు మైక్రో ఎకనామిక్స్ బాగా అర్థమయ్యింది. నేను ఇప్పుడు మాక్రో ఎకనామిక్స్ చదువుతున్నాను.