ఎనలైజ్: వ్యవసాయ సబ్సిడీలు ఎందుకివ్వాలి? -ఈనాడు


‘అధ్యయనం’ ధారావాహికలో ఆరవ భాగం నేటి ఈనాడు పత్రికలో ప్రచురితమయింది. గత వారం ‘ఎనలైజ్’ అనే డైరెక్టివ్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఓ ఉదాహరణ తీసుకుని ఈ వారం వివరించాను. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి గత సంవత్సరం జనరల్ స్టడీస్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నను ఉదాహరణగా తీసుకున్నాను.

ఆర్టికల్ ను నేరుగా ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేసి చూడగలరు. ఈ లంకే వారం రోజులు మాత్రమే పని చేస్తుంది.

సమగ్రంగా… స్పష్టంగా…

పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ కోసం కింది బొమ్మ పైన క్లిక్ చేయండి. డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Eenadu chaduvu 06 -11.08.2014

 

6 thoughts on “ఎనలైజ్: వ్యవసాయ సబ్సిడీలు ఎందుకివ్వాలి? -ఈనాడు

 1. Visekhar, it is difficult to copy and paste Telugu on phone using Lekhini. Therefore I pasted the same text somewhere else.

  మీరు మైక్రో & మాక్రో ఎకనామిక్ ఎనాలిసెస్‌కి విరుద్ధంగా ఈ వ్యాసం వ్రాసారు. మన దేశంలో జనాభా ఎక్కువ, భూమి విస్తీర్ణం తక్కువ. రైతుల్లో ఎక్కువ మంది నాలుగైదు ఎకరాలు భూమి ఉన్నవాళ్ళే. నాలుగైదు ఎకరాలు విస్తీర్ణం గల వ్యవసాయ భూమి భారీ యంత్రాల వాడకానికి సహకరించదు. రైతుకి వ్యవసాయ ఋణం ఇచ్చినా అతను ఆ డబ్బుతో అధునాతన యంత్రాలు కొనుక్కోవడం జరగదు, agricultural output పెరగదు. పెరగలేని output కోసం ఋణం ఇవ్వడమే అనవసరం, ఇక ఋణమాఫీ మాత్రం ఎలా అవసరమవుతుంది?

  మన రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టకుండా, ఆ భూముల్ని తనఖా పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. అది చట్ట ప్రకారం నేరం అని తెలిసే అలా చేసారు. పరిశ్రమ పెట్టడానికి భూమి ఒక్కటే సరిపోదు కదా, మరి భూమి ఫ్రీగా ఇచ్చినంతమాత్రాన పరిశ్రమలు ఎలా పెడతారు? ఆ భూమి విలువని ఎక్కువగా చూపే దొంగ పత్రాలు సృష్టించి, దాంతో బ్యాంక్ లోన్‌లు తీసుకుని ఆ డబ్బుతోనే బతికేస్తారు ఈ పారిశ్రామికవేత్తలు. అందుకే మన దేశంలోని బ్యాంక్‌లకి NPAలు ఎక్కువగా ఉన్నాయి.

  దొంగ పత్రాలకి లోన్‌లు ఇచ్చే బ్యాంక్ అధికారులని అరెస్త్ చెయ్యాలని కోరకుండా “మీరు పారిశ్రామికవేత్తలకి లోన్‌లు ఇచ్చారు కనుక రైతులకి కూడా లోన్‌లు ఇవ్వండి” అని అంటే బ్యాంక్‌లు రైతులకి ఋణాలు ఎలా ఇస్తాయి?

  పైగా ఋణాల మాఫీ కూడానూ! మనది ప్రపంచ బ్యాంక్ అప్పులతో బతికే దేశం. ఉచిత విద్యుత్‌కి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు అని గతంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఋణమాఫీకి మాత్రం ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుందని ఎలా అనుకున్నాడు? 1950లోనే జవహార్ లాల్ నెహ్రూ విదేశీ అప్పులు తీసుకునే విధానాన్ని మొదలుపెట్టకుండా ఉండి ఉంటే మన దేశం ఈ స్థితికి దిగేది కాదు.

 2. My own Uncle had taken agriculture loan from a bank though he is a government employee. As bank employees are aware that loan waiver is not possible, a notice has been sent to my Uncle for the paymemt of debts. He too was fooled by the government’s promise that loans would be waived.

 3. విశేఖర్ గారు, నాకు దాగుడు మూతలేమీ లేవు. మా అమ్మగారు బ్యాంక్ ఉద్యోగి. ఋణ మాఫీ వల్ల బ్యాంక్‌కి నష్టాలు వస్తే మా అమ్మగారికి జీతంలో కోత పడుతుంది కనుక నేను ఋణమాఫీని వ్యతిరేకిస్తాను. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుకోండి. మీ దిపార్త్‌మెంత్‌వాళ్ళ జీతాలు తగ్గ్గించి ఋణ మాఫీ చేస్తారంటే మీరు ఒప్పుకుంటారా? తెలుగు దేశం నాయకుల ఆస్తుల్ని అమ్మి ఋణ మాఫీ చేస్తే నాకు అభ్యంతరం లేదు. పాలకవర్గం పెట్టే ఫ్రీ స్కీములకి మేము బలిపశువులవ్వాలా?

 4. వ్యాసాన్ని పొగిడే ముందు సంభావ్యత గురించి ఆలోచించండి. India is an economy of bullock cart with rubber tyres. Without changing the mode of production, the economy can’t move forward. ఋణాలు మాఫీ చేసినంతమాత్రాన నీరు లేని భూముల్లో నీటి పారుదల సౌకర్యం పెరుగుతుందా, కరెన్సీ విలువ తగ్గుదల వల్ల పెరిగిన ఎరువుల ధరలు తగ్గిపోతాయా, పంటలకి గిట్టుబాటు ధర వచ్చేస్తుందా?

  బ్యాంక్‌లు పారిశ్రామికవేత్తలకి లోన్‌లు ఇచ్చాయి కనుక రైతులకి కూడా లోన్‌లు ఇవ్వాలని మీరు వాదిస్తున్నారు. బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్ జోనల్ ఆఫీస్ అనుమతి లేకుండా పది లక్షల రూపాయలు వరకే లోన్ ఇవ్వగలడు. పెద్ద పెట్టుబడిదారులకి లోన్‌లు ఇప్పించేది జోనల్ ఆఫీస్‌వాళ్ళే. ఒక కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఆ డబ్బుని ఇంకో కంపెనీకి మళ్ళించే పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ రకం అవినీతి బ్యాంక్ జోనల్ ఆఫీస్‌వాళ్ళ సహాయంతో జరుగుతుంది కానీ బ్రాంచ్ మేనేజర్ సహాయంతో కాదు. బ్యాంక్‌లు వరి పండే భూమికి ఎకరానికి పదిహేను వేలు లోన్ ఇస్తాయి. రైతుకి ముప్పై వేలు అవసరమవుతుంది. అందుకే రైతు వడ్డీ వ్యాపారి దగ్గరకి వెళ్ళి అప్పు తీసుకుంటాడు. వడ్డీ వ్యాపారి తన ముప్పై వేలు రాబట్టుకోవడానికి గూండాగిరీ చేస్తాడు. బ్యాంక్ ఉద్యోగులు గుండాగిరీ చెయ్యరు కనుక అప్పు ఇచ్చే ముందే ఆలోచించి ఇస్తారు. బ్యాంక్‌లు గూండాగిరీ చెయ్యనందుకు సంతోషించకుండా ఋణాలు మాఫీ చెయ్యాలని బ్యాంక్‌లని కోరుతున్నాం.

  గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఎరువుల సబ్సిదీ రద్దు చేసి వ్యవసాయం దండగా అని ప్రచారం చేసింది. ఎరువుల సబ్సిదీ రద్దు చెయ్యడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగితే బ్యాంక్ ఋణాలు మాఫీ చేసి ఆత్మహత్యల్ని తగ్గిస్తాడట చంద్రబాబు నాయుడు! చంద్రబాబు లాంటి కసాయివాళ్ళ ఉచ్చులో చదువుకున్నవాళ్ళు కూడా చిక్కుకుంటున్నారు!

 5. ఇప్పుడే ఫేస్‌బుక్‌లో చదివాను. ప్రభుత్వం సెస్ వసూలు చేసి ఆ డబ్బుతో ఋణ మాఫీ చేస్తుందట! There is nothing such as free lunch అని నేను మొదట చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు. పైగా నేనే పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థిస్తున్నానంటూ నన్ను విమర్శించారు. నేనేమీ పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థించడం లేదు కానీ గ్లోబలైజేషన్‌ని బహిరంగంగా సమర్థించే చంద్రబాబు నాయుడు ఋణ మాఫీ లాంటివి జరగనిస్తాడని మీరెలా అనుకున్నారు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s