మోడిని ప్రసన్నం చేసుకోలేని కెర్రీ? -కార్టూన్


Kerry meets Modi

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి వెళ్లారు. మోడి రాక కోసం తమ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్న సందేశాన్ని మోసుకొచ్చిన కెర్రీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మోడీ ముందు వ్యవహరించారని కార్టూన్ సూచిస్తోంది.

దేవయాని ఖోబ్రగదేను అమెరికాలో అరెస్టు చేసినప్పటి నుండి ఇరు దేశాల సంబంధాలు క్షీణ దశలో ఉన్నాయని పత్రికలు చెప్పే మాట. మోడి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న కెర్రీ కాళ్ళు కిందికి చూస్తున్న గ్రాఫ్ గీతలుగా కార్టూనిస్టు సూచించారు. సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ ఆధిపత్య దర్పం వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదని కార్టూన్ చెబుతోంది.

భారత ప్రధాని మోడీకి కెర్రీ ధోరణి నచ్చలేదని ఆయన ముఖ కవళికల ద్వారా తెలుసుకోవచ్చు. మోడి ఆధ్వర్యంలోని ఇండియాకూ, పెద్దన్న అమెరికాకు మధ్య సంబంధాలపైన ఈ కార్టూన్ ఒక రాజకీయ వ్యాఖ్య చేస్తోంది.

భారత ప్రధాని అంత ప్రసన్నంగా లేరని, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వచ్చిన అమెరికా విదేశీ మంత్రి వచ్చిన పనిని సవ్యంగా నిర్వర్తించలేదని కార్టూనిస్టు సూచించారా అన్నది ఒక శేష ప్రశ్న!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s