బస్సు డోర్ లాక్ అయిపోయి రాలేదు…


Ruchita

Ruchita

(ఇది తులసి గారు తన వ్యాఖ్య ద్వారా ఇచ్చిన సమాచారం. -విశేఖర్)

బస్సు పట్టాలపైకి వచ్చి నాలుగు నిమిషాలు ఆగిపోయింది. ఆ నాలుగు నిమిషాల్లో పిల్లల్ని కాపాడేందుకు డ్రైవర్, క్లీనర్ ప్రయత్నం చేశారు. ఘటన జరిగింది ఉదయం కాబట్టి రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ లేరు. అందుకే కొత్తవాడైన డ్రైవర్ భిక్షపతి స్కూల్ కరస్పాండెంట్‌కి ఫోన్ చేశాడు.

ఫోన్ చెయ్యడమెందుకు త్వరగా పిల్లల్ని దించివేయవచ్చు కదా అను అనుమానం కలుగుతుంది. అయితే ఆ సమయంలో బస్ డోర్ లాక్ పడిపోయింది. క్లీనర్ రమేష్ ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదు. అందుకే అప్పుడే చిన్నారి రుచిత ఓ వైపు కిటికీ నుంచి ఇద్దర్ని కిందికి తోసింది. క్లీనర్ రమేష్ మరో వైపున ఉన్నకిటికీ నుంచి ఇద్దర్ని దించాడు. అప్పుడే రైలు రావడంతో క్లీనర్, ఆ పిల్లలు చనిపోయారు.

రుచిత కాపాడిన వారు, క్లీనర్ కిందికి దించిన చిన్నారులు వేర్వేరు. డోర్ లాక్ పడిపోయిన సంగతి కూడా రుచితే మీడియాకు చెప్పింది. ప్రతి సారీ చెప్తూనే ఉంది. కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి యశోదా ఆసుపత్రిలో మాట్లాడిన అధికారులు, వైద్యులు కూడా డ్రైవర్ పైకే నెపాన్ని నెట్టేస్తున్నారు. ఇప్పటిదాకా స్కూల్ పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఇదంతా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రెండ్రోజుల పాటు ప్రసారం చేసింది. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. డ్రైవర్, క్లీనర్ కుటుంబాలకు రైల్వే శాఖ లక్ష చొప్పున పరిహారం ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు సరికదా వాళ్లనే దోషులుగా చిత్రీకరిస్తోంది.

30 ఏళ్ల పాటు డ్రైవర్ గా పని చేసిన భిక్షపతికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మధ్యలో ఓ స్కూల్ బస్సు కండిషన్‌లో లేదని అక్కడ పని చెయ్యడం మానేశారు భిక్షపతి. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఎంత అర్జెంట్ ఫోన్ వచ్చినా మాట్లాడే వాడు కాదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

ఇదంతా చూశాక ఆ రోజు పిల్లలు చూసింది భిక్షపతి ఫోన్‌లో మాట్లాడటాన్ని కాదు. ఆగిపోయిన బస్సు గురించి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయడాన్నే చూశారు. ఇప్పుడు అదే నేరమైపోయింది.

తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ఇప్పుడు భిక్షపతి లేకపోవచ్చు. కానీ ఇలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేసేందుకు వేలాది ప్రైవేటు స్కూళ్లు, వాటిలో అన్నెంపున్నెం ఎరుగని లక్షలాది మంది చిన్నారులు మాత్రం ఉన్నారు.

8 thoughts on “బస్సు డోర్ లాక్ అయిపోయి రాలేదు…

 1. ప్రభుత్వాలకు పరిష్కారాలు అవసరం లేదు. కేవలం ఉపశమనాలతో సరిపెట్టుకునే జనాలు ఉన్నంతరవరకూ ఇలాంటి ఘటనలే జరుగుతాయి. పాపం పసివాళ్లు అంటూనే వాళ్లు చెప్పే నిజాల్ని మాత్రం చిన్నపిల్లల్లా చూడటం మానేయాలి. ఇకనైనా పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. గతంలోనూ బియాస్‌ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయినప్పుడు ఇలాగే వ్యవహరించి రామానాయుడు కళాశాల వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతిని కాపాడే ప్రయత్నం చేశారు.

 2. ఏమిటండి మరీ అన్యాయంగా మాట్లాడుతారు. బిక్ష పతి ఎంతటి వాడు? కేవలం ఒక డ్రైవర్‌! తప్పంతా అతంది కాక పోతే మరవరిదైనట్లు? మీరేమో యాజమాన్యం! యాజమాన్యం! అంటారూ? యాజమాన్యం ఎక్కడైనా తప్పు చేస్తుందాటండి? సెక్రటరీయేట్‌ లో పియూన్‌ తప్పుచేస్తాడు. దేశమంతా అన్యానికి పాల్పడే అలగా జనం తప్పు చేస్తరు. వాల్ల నుంచే ధరలు పెరిగి పోతున్నాయ్‌. అనేక నేరాలకు పాల్పడుతున్నరు. మీరు వాళ్ల్లని వెనకేసు కొస్తరు. మీరు దేశ పటాన్ని నిటారు గా నిలబెట్టాలను చూస్తారు. తలకిందులుగా కనిపించడం దాని స్వభావమైనపుడు. కుక్కతోక వంకర కాక చక్కగా ఉంటుద్దేమిటండి.

 3. @ఇదంతా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రెండ్రోజుల పాటు ప్రసారం చేసింది. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ లో ప్రసారం కావడం లేదు కదా. బహుశా అందుకే తెలంగాణ అధికారులు చూడకపోయి ఉండవచ్చు. చూడనప్పుడు స్పందించే అవకాశమే లేదు. ఒక వేళ చూసినా స్పందించే వారన్న నమ్మకమూ లేదు.

  అధికారులు, స్కూలు యాజమాన్యం, ప్రభుత్వం, తొందరపాటు మీడియా…, అంతా కలిసి తప్పు డ్రైవర్ దేనని నిర్థారించాయి. ఎందుకంటే డ్రైవర్ ఇప్పుడు లేడు కదా.
  తిరుపాలు చెప్పినట్లు అలగా జనమే తప్పులు చేస్తారు. అధికారులు తప్పు చేయరు. చేసినా బయటకు రాదు.

 4. తెలంగాణా శాసనసభ్యుల్ని పల్లెటూరివాళ్ళంటూ ఎ.బి.ఎన్., TV9 వాళ్ళు ఎగతాలి చేశారు. అందుకే ఆ రెండు చానెల్‌లనీ తెలంగాణలో నిషేధించారు.

 5. నచ్చకపోవడం కాదు. తెలంగాణలో తె.రా.స. గెలవడం సమైక్యవాదులకి ఇష్ఠం లేదు. పైగా ఉద్యమ బ్యాక్‌గ్రౌంద్ వల్ల పల్లెటూరివాళ్ళు కూడా శాసన సభ్యులు కావడం సమైక్యవాద చానెల్‌లు జీర్ణించుకోలేకపోయాయి. అందుకే వీళ్ళు తెలంగాణా శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ ప్రాంతంలో రెండు చానెల్‌ల నిషేధం దాక పోయారు.

 6. ఎన్ని తప్పులు జరిగిన అందుకు ప్రధాన కారణం పాలకులే.మనం ఎలాంటి పాలకులను ఎన్నుకుంటే అలాంటి ఫలితాలే వస్తుంటాయి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s