లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోసం పోరాడవలసిన పరిస్ధితి కాంగ్రెస్ ది. మొత్తం సీట్లలో 10 శాతం వస్తే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదని నిబంధనలు ఉన్నాయిట. తమకు 44 సీట్లే వచ్చినా యు.పి.ఏ కి 60 సీట్లు వచ్చాయి గనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికలకు ముందు యు.పి.ఏ పక్ష్యాలన్నీ ఒకే మేనిఫెస్టో, కార్యక్రమం ఇవ్వలేదు గనక ఆ లాజిక్ పని చేయదని బి.జె.పి తిప్పి కొడుతోంది.
ఫలితంగా బి.జె.పి షడ్రసోపేతమైన అధికార విందు ఆరగిస్తుంటే, కనీసం ప్రతిపక్ష హోదా కుర్చీ కూడా అందుకోలేని కాంగ్రెస్ భోజనం కుర్చీ కూడా ఎక్కలేని నిస్సహాయ స్ధితిలో ఉండిపోయింది. పూర్తి మెజార్టీ ఇవ్వడం ద్వారా జనం బి.జె.పి/మోడి కి విందు భోజనం వడ్డించారని, 10 శాతం సీట్లు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ కు కనీస భోజనం కూడా ఇవ్వలేదని కార్టూనిస్టు సూచిస్తున్నారు. పోలిక బాగుంది కదా!