ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….


Gaza genocide

పొన్నం శ్రీనివాస్:

పాలస్తీనా సమస్య ఉగ్రవాద సమస్యే తప్పా… జాతుల అంతం లాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావం ఎలా జరిగింది. అక్కడున్న వాళ్లంత ఎక్కడికి వలస వెళ్లారు. మళ్లి వాళ్ల స్వస్థలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా…

సమాధానం:

శ్రీనివాస్ గారూ, ఇదే తరహా ప్రశ్నను గతంలో మరో మిత్రుడు అడిగారు. సమాధానం ఇచ్చాను. సమాధానంతో పాటు పాలస్తీనా సమస్యపై రాసిన కొన్ని ఆర్టికల్స్ కు లింక్ లు కూడా ఆ సమాధానంలో ఇచ్చాను. కింది లింక్ ని క్లిక్ చేసి ఆ సమాధానాన్ని చూడగలరు.

ఇజ్రాయెల్, పాలస్తీనాల వైషమ్యాలకు కారణం?

మీ ప్రశ్నలో చివరి భాగం ‘మళ్ళీ వాళ్ళ స్వస్ధలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా’ అని. సాధ్యం కాకుండా ఎందుకు ఉంటుంది? పాలస్తీనా ప్రజల్ని వారి సొంత భూముల నుండి, ఊళ్ళ నుండి, ఇళ్ల నుండి తరిమి కొట్టి అంతకు ముందు లేని ఇజ్రాయెల్ రాజ్యాన్ని స్ధాపించడం సాధ్యం అయినప్పుడు వారి నుండి లాక్కున్నది తిరిగి ఇచ్చేయడం ఎందుకు సాధ్యం కాదు?

కాకపోతే సాధ్యాసాధ్యాలు భౌగోళిక రాజకీయాలకు బంధింప బడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాజకీయాల్లో ఆటవిక న్యాయమే చెలామణి అవుతోంది. అలా కాకుండా వివిధ జాతులు, దేశాలు, ప్రజలు సమాన స్ధాయిలో నివసించగల ప్రపంచ పరిస్ధితులు నెలకొన్నప్పుడు ఒక్క పాలస్తీనా ప్రజల సమస్యే కాదు, ఇంకా అనేక ప్రపంచ స్ధాయి సమస్యలు పరిష్కరించడానికి పెద్ద సమయం పట్టదు.

పాలస్తీనా సమస్యకు ప్రధాన కారణం పశ్చిమ దేశాల వ్యాపార, ఆధిపత్య  రాజకీయాలు. అటువంటి రాజకీయాలను అంతం చేసే సమానతా రాజకీయాలు నెలకొల్పవలసిన ఆవశ్యకత గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్నది. ఆ వైపుగా ప్రపంచం అడుగులు వేయక తప్పదు. ఒకప్పటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం సాపేక్షికంగా అంతం అయినట్లే ఇప్పటి ఆధిపత్య రాజకీయాలు కూడా అంతం కావలసిందే. ప్రపంచ గమనం లక్ష్యం అదే. మనం చూసినా, చూడకపోయినా ప్రపంచ గమనం అటువేపే సాగుతోంది.

4 thoughts on “ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….

  1. పాలస్తీనాకు సంబంధించిన మీ అన్ని ఐటమ్స్‌ చదివాను. చాల చక్కగా అర్థమైంది. కానీ ఇజ్రాయెల్‌ ఎలా ఏర్పడిందన్నది పూర్తిగా వివరించలేదు. నాజీల జాత్యంహకరం తర్వాత పశ్చిమదేశాలు ఏం చేసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసాయి. ప్రత్యేకంగా సంవత్సరాలు, సందర్భాలతో వివరిస్తారని ఆశిస్తున్నాను. మీ శ్రీనివాస్‌…..

  2. ప్రస్తుతం సంధి కి ఒప్పుకోనిది హమాస్ కదా! ఇప్పుడు పిల్లల మరియు అమాయకుల ప్రాణాలు పోవడానికి మొదటి నుంచి తప్పు చేస్తున్న ఇస్రేల్ కారణమా లేక ప్రస్తుతం సంధి కి ఒప్పుకోని హమాస్ కారణమా? (దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను ఇస్రేల్ ని సపోర్ట్ చెయ్యట్లేదు కానీ హమాస్ కదా ఇప్పుడు ఈ మారణహోమం ఆగకపోవడానికి కారణం) please explain.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s