దళారులకు, మిల్లర్లకు లాభం చేకూర్చుతూ కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గిట్టుబాటు ధరలకోసం ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను ఆలకించడం మాని వారి డిమాండ్ కు సరిగ్గా వ్యతిరేక నిర్ణయాన్ని చేసి రాష్ట్రాలకు సమాచారం పంపింది. గిట్టుబాటు ధరకు బదులుగా బోనస్ చెల్లిస్తున్న రాష్ట్రాలు అలా చెల్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే పేరుతో ఈ నిర్ణయాన్ని చేసింది. “మతిమాలిన పాపులిస్టు విధానాలను ఒప్పుకోము” అని బడ్జెట్ కు ముందు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటో శాంపుల్ గా తాజా ఆదేశాలను అర్ధం చేసుకోవచ్చు. ఈ అంశంపై ఆంధ్ర జ్యోతి పత్రిక అందించిన సమాచారాన్ని పూర్తిగా కింద చూడవచ్చు.
బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడవచ్చు.
రాష్త్ర ప్రభుత్వాలు తమ ఇష్తానుసారం బోనస్ ఇస్తే ధాన్యం సేకరించేటప్పుడు యఫ్.సి.ఐ పై అదనపు భారం పడుతోందని, ఈ సబ్సిడీ మొత్తన్ని కేంద్రం మోయడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది.
యఫ్.సి.ఐ లలో ఉన్న అదనపునిల్వలను పైలట్ ప్రొజెక్ట్ కింద దేశంలోని అర్హులందరకీ,ఉపాదిహామీ పనులలో ఉన్నవారికీ వీలైతే కేజియో,రెండుకేజిలో అదనంగా పపిణీ చేయడం ద్వారా వారి ఆకలిని తీర్చినవారవుతారు! యఫ్.సి.ఐ లలో ఉన్న నిల్వలను తగ్గించుకోవచ్చును,తద్వారా ఈ కరీఫ్ కాలంలో గరిస్ట నిల్వలు నింపుకోవచ్చును!
రాస్త్రప్రభుత్వాలు ఇచ్చే బోనస్ లవల్ల ధాన్యం సేకరణ ఎక్కువగుతున్నట్లయిన ఆమేరకు సబ్సిడీ భారంలో కొంతబాగాన్ని రాష్త్రాలపై మోపవచ్చును!
ఎలాగూ ఈ యేడు వర్షాబావ పరిస్తుతులు నెలకొనేసూచనలు కనిపిస్తునాయే,ఆ మేరకు లక్ష్యత ధాన్య సేకరణ కూడా తగ్గిపోయే అవకాశం ఉందికదా!
కనీసం ప్రత్యమ్న్యాయ పంటలను(ముఖ్యంగా తృణధాన్యాలను) పండించేదిశగా ప్రొత్సాహకాలను అందించవచ్చుగా!!!!!!