శివసేన పులి స్వారీ -కార్టూన్


Tiger safari

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఒక ముస్లిం ఉద్యోగి చేత శివసేన ఎం.పిలు బలవంతంగా చపాతీ తినిపించిన సంఘటన చుట్టూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు చర్చను నడుపుతున్నాయి. సదరు చర్చకు పత్రికలు యధా శక్తి సహకరిస్తున్నాయి.

ముంబై లోని మహా రాష్ట్ర సదన్ లో వడ్డిస్తున్న భోజనం క్వాలిటీ నాసిరకంగా ఉందని శివసేన ఎం.పి లు చెప్పదలిచారట. ప్రజా ప్రతినిధుల స్ధానంలో ఉన్నవారికి ఆ విషయాన్ని చెప్పడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. నాగరిక సమాజంలో నివసిస్తున్నామని నమ్మితే గనక వారు ఆ మార్గాల్లో ఒకదానిని ఎన్నుకుంటారు.

కానీ శివసేన గురించి తెలియనిది ఎవరికి? యధావిధిగా వాళ్ళు సదన్ పై దాడి చేసి అక్కడ ఉన్న సూపర్ వైజర్ పైన దాడి చేసి ఆయన చేత బలవంతంగా చపాతీ తినిపించారు. అయితే పత్రికల ప్రకారం అసలు సమస్య భోజనానికి సంబంచించినది కాదు. శివసేనకు చెందిన ప్రతినిధి ఒకరికి సదన్ లో అడిగిన వెంటనే సూట్ కేటాయించకపోవడంతో శివసేన ప్రతినిధులకు కోపం వచ్చింది.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన బి.జె.పి ఎం.పికి సూట్ కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం తమ ప్రతినిధికి ఇవ్వకపోవడం ఏమిటన్నది వారి కోపానికి కారణం. ఈ సంగతి చెప్పకుండా భోజనం క్వాలిటీ గురించి నిరసన వ్యక్తం చేసే పేరుతో దాడికి దిగారు.

మహా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పైన దృష్టి పెట్టిన వివిధ రాజకీయ పార్టీలు రకరకాల చర్యలకు పాల్పడుతూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఓటమి తప్పదని భావించిన ముఖ్యమైన నేతలు జంప్ జిలానీ లుగా అవతరిస్తుంటే బి.జె.పి, శివసేనల మధ్య కూడా మరిన్ని సీట్ల కోసం పోటీ సాగుతోంది. పాతదయిందని భావిస్తున్న హిందూత్వ ఎత్తుగడలకు ఇంకా కరెన్సీ తగ్గలేదని ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేయడంతో పార్టీలు మరొక్కసారి ప్రజల భావోద్వేగాలతో ఆటలాడడానికి సిద్ధమయ్యాయి.

ఈ నేపధ్యంలోనే శివసేన మరోసారి హార్డ్ లైన్ హిందూత్వను సొంతం చేసుకోవడానికి, రాజ్ ధాకరే మహారాష్ట్ర నవనిర్మాణసేన, బి.జె.పి ల కంటే ముందే మార్కులు కొట్టేయడానికి సరికొత్త వివాదాలను సృష్టిస్తోంది. శివసేన ఎత్తుగడలు పులి మీద స్వారీ చేయడం లాంటిది. కిందకు దిగితే పులి తినేస్తుంది. అలాగని ఎల్లకాలం స్వారీ కొనసాగించడం కుదరని పని.

3 thoughts on “శివసేన పులి స్వారీ -కార్టూన్

  1. శివసేన గురించి తెలియనిది ఎవరికి? అనే దానికన్నా మన రాజకీయ నాయకుల అహంకారం గురించి తెలియనిది ఎవరికి అంటే సరిగా ఉంట్టుంది. ప్రభుత్వోద్యోగుల మీద చేయి చేసుకోకపోతే రాజకీయ నాయకుడు కానేమో అనే భయం ఉంట్టుందేమో! తె.రా.స. హరీష్ రావు ఆంధ్రాభవన్ లో ఉద్యోగి మీద చేయి చేసుకోలేదా? చదువుకోనేరోజుల్లో పోలీసుల పై చేయి చేసుకొన్న రాజకీయనాయకుల గురించి చదివేవాడిని.

  2. విశేఖర్ గారు,ఈ రోజు ఈ వార్త చదివారా? సుప్రీమ్ కోర్త్ 214 బొగ్గు బ్లాక్‌ల లైసెన్స్‌లు రద్దు చేసిందని ఈ రోజు స్తాక్ మార్కెత్‌లు పడిపోయాయి. అవినీతి నిర్మూలన జరిగితే పెట్టుబడిదారులకి నష్టం అని చాలా మందికి తెలుసు. అయినా బి.జె.పి. అనే మతతత్వ పార్తీ మీద అభిమానంతో అవినీతి నిర్మూలన పేరు చెప్పి కాంగ్రెస్‌ని ఓడించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s