పంట రుణాల రద్దు కాదు, రీ షెడ్యూల్ మాత్రమే!


RBI

వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుకు హామీ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆర్.బి.ఐ నుండి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం రైతు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేసేందుకు ఆర్.బి.ఐ సుముఖంగా లేదు. కేవలం రీషెడ్యూల్ మాత్రమే చేయడానికి అంగీకరించింది. అది కూడా షరతులతో. విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీ షెడ్యూల్ మాత్రమే కోరినట్లు ఆర్.బి.ఐ సమాచారం బట్టి అర్ధం అవుతోంది.

పంట రుణాల రీ షెడ్యూల్ ప్రతిపాదనలకు సూత్రబద్ధంగా ఆమోదం తెలుపుతూ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్.బి.ఐ నుండి లేఖలు అందాయని ది హిందు తెలిపింది. అయితే దానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని కోరింది. ఎంత మేరకు రీ షెడ్యూల్ చేయాలో, ఎంతమంది లబ్దిదారులకు వర్తింపజేయాలో వివరాలు ఇవ్వాలని కోరింది.

ఆర్.బి.ఐ నుండి ఈ మేరకు సమాచారం అందినట్లుగా ప్రభుత్వ వర్గాలు నిర్ధారించినట్లు పత్రిక తెలిపింది. అదనపు సమాచారాన్ని ఆర్.బి.ఐ కోరిందని వారు తెలిపారు. ఆర్.బి.ఐ కోరిన వివరాలను బుధవారం రాత్రికే పంపాలని ఎ.పి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆర్.బి.ఐ నుండి లేఖలు అందుకున్నారని తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంట రుణాల రద్దుకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత కూడా తన హామీని ఎట్టి పరిస్ధుతుల్లోనూ నిలబెట్టుకుంటామని ఆయన పదే పదే హామీ ఇచ్చారు. అయితే ఆర్.బి.ఐ కి సమర్పించిన వినతిలో ఋణ చెల్లింపులపై 7 సంవత్సరాలు మారిటోరియమ్ మాత్రమే విధించాలని ఎ.పి ప్రభుత్వం కోరింది. అనగా నిర్దిష్ట మొత్తం మేరకు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం కోరలేదు.

ఎ.పి ప్రభుత్వం కోరినట్లుగా 7 సంవత్సరాల మారిటోరియంకు బదులుగా 3 సంవత్సరాలు మాత్రమే మారిటోరియం విధించడానికి ఆర్.బి.ఐ సూత్రబద్ధ అంగీకారం తెలిపింది. ఇందుకోసం గ్రామాల వారీగా, మండలాల వారీగా పంట రుణాల వివరాలు ఇవ్వాలని ఎన్ని ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తింప జేయాలో తెలియజేయాలని కోరింది. ఒక్కొక్కరు రెండు, మూడు రుణాలు తీసుకున్న పరిస్ధితి ఉన్నందున ఈ సమాచారంపై ఆర్.బి.ఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒకటి లేదా రెండు  రుణాల వరకు మాత్రమే రీ షెడ్యూలింగ్ పరిమితం చేయాలనీ, అది కూడా నిర్దిష్ట మొత్తం మేరకే పరిమితం చేయాలని ఆర్.బి.ఐ షరతు విధించిందినట్లు తెలుస్తోంది.

ఆర్.బి.ఐ నుండి లేఖ అందుకున్న వెంటనే ఆర్ధిక శాఖ సీనియర్ అధికారులతో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమై చర్చలు జరిపారు. రిజర్వ్ బ్యాంకు కోరిన వివరాలను వెంటనే క్రోడీకరించి పంపాలని ఆయన ఆదేశించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో పంట రుణాలు 30,000 కోట్ల రూపాయల వరకు ఉండగా డ్వాక్రా, చేనేత తదితర రుణాలు 20,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాగా తెలంగాణలో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరకు రద్దు/రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇవ్వగా, దీనివల్ల ఖజానాపై 19,000 కోట్ల భారం పడుతుందని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ బుధవారం అసెంబ్లీలో చెప్పారు. మొత్తం మీద రెండు రాష్ట్రాలకు కలుపుకుని 69,000 కోట్ల రూపాయల మేరకు రుణాల రీ షెడ్యూల్ (రద్దు కాదు)జరుగుతుంది.

రద్దుపై ఆశలు పెట్టుకున్న ఆంధ్ర, తెలంగాణ రైతులకు మరోసారి ప్రభుత్వ వ్యవస్ధలు ఆశాభంగాన్ని మిగల్చనున్నాయి.

27 thoughts on “పంట రుణాల రద్దు కాదు, రీ షెడ్యూల్ మాత్రమే!

 1. https://m.facebook.com/photo.php?fbid=779728162049446&set=a.397057330316533.98626.206870882668513&type=1
  విశేఖర్ గారు, దయచేసి ఈ లింక్ చదవండి. ఋణ మాఫీ సాధ్యం కాదని సీమాంధ్రలో, సాధ్యమేనని తెలంగాణాలో ఒకే సారి ప్రచారం చేస్తూ తెలుగు దేశం పార్తీని తెలంగాణాలో కూడా అధికారంలోకి తేవడానికి పచ్చ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి.

 2. అసలు పంట రుణాలు రద్దు చేయడం అనేది ఇవాళ కొత్త విషయమేమీ కాదు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రద్దు చేసింది. మన రాష్ట్రంలోనూ చాాలా సార్లు జరిగింది. పారిశ్రామిక వేత్తల రుణాలు వేల కోట్లు రద్దు చేసినపుడు ఆర్ బీఐకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కింగ్ ఫిషర్ మాల్యా వేలకోట్లు అప్పులు ఎగవేస్తూ…మోడల్స్ తో ఆడుకుంటూ తాగి తందనాలు ఆడుతున్నా అప్పు అడిగే నాథుడు ఉండడు. పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీల పేరుతో లక్షల కోట్లు సహాయం చేస్తున్నా దానిపై చర్చ జరగదు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతు…అదీ క్లిష్టపరిస్థితుల్లో ఓ లక్ష రూపాయల రుణం రద్దుకు ఎడతెగని చర్చ.
  మరి ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు అప్పులు రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చినపుడు …ఆ పేరుతో ఓట్లు దండుకుంటున్నపుడు ఈ ఆర్,బీఐ ఏ గాడిద పళ్లు తోముతోంది. అప్పుడే రుణాల రద్దు కుదరదని ఓ ప్రకటన చేసి ఉంటే సరిపోయేది కదా…

 3. ఋణమాఫీ గురించి నేను ఇది వరకే ఒక వ్యాసం వ్రాశాను: http://content.janavijayam.in/2014/07/blog-post.html
  ఫ్రీ స్కీములకి నేను వ్యతిరేకం. ఋణ మాఫీ కొత్త సమస్యలకి దారితీస్తుంది. ఇప్పుడు ఋణ మాఫీ చేసిన తరువాత రైతులు మళ్ళీ ఋణాలు తీసుకుంటారు. తెలుగు దేశం కార్యకర్తలు మళ్ళీ గ్రామాలలోకి వెళ్ళి, “మీరు బాకీలు కట్టొద్దు, మన చంద్రన్న ఋణాలు మళ్ళీ మాఫీ చేస్తాడు” అని చెప్పి , రైతులు కావాలని ఋణాలు ఎగ్గొట్టేలా చేస్తారు. ఇదేమీ ఆరోగ్యకర పరిణామం కాదు.

 4. పెట్టుబడిదారులకి డబ్బులు ఫ్రీగా ఇచ్చినా ఇలాగే జరుగుతుంది. ప్రభుత్వం తనకి బెయిలౌత్ ఇస్తుందనే నమ్మకంతోనే కింగ్‌ఫిషర్ యజమాని రిస్కీ వ్యాపారమైన విమానయాన రంగంలోకి దిగాడు.

 5. ఋణ మాఫీకి అవసరమైన డబ్బుల కోసమే TRS ప్రభుత్వం అక్రమ కట్టడాలని కూల్చి, ప్రభుత్వ స్థలాలని తిరిగి తీసుకుని, వాటిని వేలం వెయ్యాలనుకుంటోంది. చంద్రబాబు నాయుడు అది కూడా చెయ్యాలనుకోవడం లేదు. ఎర్ర చందనం దుంగలు అమ్మి ఋణ మాఫీ కోసం ఖర్చుపెడతానని చంద్రబాబు అంటోంటే అతనికి వంతపాడే పత్రికలు మాత్రం ఋణ మాఫీ సాధ్యం కాదని సీమాంధ్రలో, సాధ్యమేనని తెలంగాణలో ఒకేసారి ప్రచారం చేస్తున్నాయి.

 6. చందు తులసి గారు, నేను మార్క్సిస్త్‌ని. ఉచిత పథకాలలోని మోసాలు బయటపడాలనే నేను కోరుకుంటాను కానీ ప్రజలు “తమకి అన్నీ ఫ్రీగా కావాలి” అనుకునే స్థాయికి దిగజారాలని మాత్రం కోరుకోను. పెట్టుబడిదారులకి బెయిలౌత్‌లు ఇవ్వడం తప్పే కానీ అంతమాత్రాన రైతులకి ఋణ మాఫీని సమర్థించలేము. ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం కరెన్సీ కట్టల ముద్రణ అనుకునే పల్లెటూరివాళ్ళకి కరెన్సీ కట్టల సంఖ్య పెరిగితే వచ్చే ద్రవ్యోల్బనం లాంటి పరిణామాలు తెలియవు.

 7. ప్రవీణ్ గారు. నేను రుణాల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని అంగీకరిస్తాను. కానీ కేవలం రైతుల రుణాలు రద్దు చేసినప్పుడే వ్యాపార వర్గాల గగ్గోలు పెట్టడాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నాను. వాస్తవానికి నాణ్యమైన విత్తనాలు, కనీసం పది గంటలు నిరంతరాయంగా కరెంటు, సరైన మార్కెటింగ్, లాంటి చిన్న చిన్న సౌకర్యాలు కల్పిస్తే….రైతులకు రుణా మాఫీ చేయాల్సిన అవసరం కూడా లేదు.
  @ పల్లెటూరి వాళ్లకు ద్రవ్యోల్బణం గురించి తెలియదు…అంటున్నారు. తెలియకపోయినా ఫర్వాలేదు.
  కానీ వారు ఏదీ ఉత్త పుణ్యానికే దోచుకోవాలని అనుకోరు. తమ కష్టం తాము పడుతూ దేశానికి ఇంత తిండి పెడుతున్నారు. కానీ ఆర్థిక వ్యవస్థ గురించి అన్నీ తెలిసిన మాల్యాలు, రామలింగరాజులు జనాల సొమ్ము కొల్లగొడుతున్నారు.

 8. ప్రజలు “తమకి అన్నీ ఫ్రీగా కావాలి” అనుకునే స్థాయికి దిగజారాలని మాత్రం కోరుకోను.

  ఇది అవాస్తవిక పరిశీలన. ముఖ్యంగా వర్గ దృక్పధానికి సంబంధించిన ప్రాధమిక అవగాహనకు విరుద్ధం. “నేను మార్క్సిస్త్‌ని” అని చెప్పుకుంటూ ఈ మాట చెప్పడం అర్ధరహితం.

  శ్రమ చేస్తే గానీ సంపదలు ఉత్పత్తి కావు. కాబట్టి దేశంలో ఉన్న సంపదలన్నీ శ్రామికులు తమ శ్రమతో ఉత్పత్తి చేసినవి తప్ప భూస్వాములు, పెట్టుబడిదారులు, బ్యూరోక్రాట్లు, ఎమ్మేల్యేలు, ఎం.పిలు, ఇంకా అనేకానేక విధాన కర్తలు ఉత్పత్తి చేసినవి కావు. శ్రామికులు సృష్టించిన సంపదలో అదనపు విలువను దోచుకుని దానినే సబ్సిడీల పేరుతో చాలా చిన్న మొత్తాన్ని రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు (సో కాల్డ్ వైట్ కాలర్ కార్మికులు) తదితర సెక్షన్లకు ఇస్తున్నారు. మిగిలినదంతా అదనపు విలువగా దోపిడి వర్గాల బొక్కసాలకు, దోపిడి ప్రభుత్వ ఖజానాకు తరలి వెళ్తూ కోటాను కోట్లుగా బడ్జెట్ రూపంలోనూ, నల్ల డబ్బు రూపంలోనూ పోగు పడుతోంది.

  ఇలాంటి డబ్బు సబ్సిడీ పేరుతో వచ్చినా, ఇంకో పేరుతో వచ్చినా అది ఫ్రీగా వచ్చినట్లా? కాదు. వారికి న్యాయంగా రావలసిన మొత్తంలో నుండి అతి కొద్ది భాగాన్ని ఇవ్వడం. దానినే ధర్మంగా ఇస్తున్నట్లు దోపిడి వర్గాల ప్రతినిధులయిన మంత్రులు, బ్యూరోక్రాట్లు ఫోజులు పెడితే దానిని మార్క్సిస్టులు నమ్మేయడం ఏమిటి? రైల్వే ఛార్జీలు పెంచినా న్యాయమే అనడం, సబ్సిడీలు ఇస్తే ఉచితం అనడం మార్క్సిస్టు వైఖరి కాదు. దోపిడీ వర్గ వైఖరి. లేదా తెలిసీ తెలియనితనం. మిత్రులు ఈ సంగతి గ్రహించాలి.

 9. శ్రమ విలువ కోసమైతే రైతు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర అడగాలి కానీ ఋణాలు, మాఫీలు కాదు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే పోలీస్ కాల్పులు జరిపించే పాలకులు ఋణ మాఫీ చేస్తారంటే నమ్మలేము.

  సబ్సిదీలు ధనవంతులకి ఇచ్చినా, పేదవాళ్ళకి ఇచ్చినా అది జనం నుంచి వసూలు చేసిన పన్నులతోనే ఇస్తారు కానీ కరెన్సీ కట్టలు మరిన్ని ముద్రించి కాదు. సబ్సిదీలు ఎవరికి ఇచ్చినా పెరిగేది పన్ను భారమే కనుక సబ్సిదీలకి నేను వ్యతిరేకం. సోవియత్ సమాఖ్యలో వ్యవసాయ భూముల్ని కూడా జాతీయం చేసి, 1927లోనే ప్రైవేత్ ఆస్తిని పూర్తిగా రద్దు చేసి, 1940 నాటికి 100% జనాభాకి ఉద్యోగాలు కల్పించారు. అంతే కానీ అక్కడి వ్యవస్థ “అన్నీ ఉచితంగా ఇస్తాం” అని జనాన్ని నమ్మించలేదు.

 10. ఒకప్పుడు నేను కూడా “ఆర్థిక వ్యవస్థ అంటే కరెన్సీ కట్టలు ముద్రించడమే” అనుకునేవాణ్ణి. “నాసిక్ సెక్యూరితీ ప్రెస్‌లో ముద్రించే కట్టల్నే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి జీతంగా ఇస్తుంది” అనుకునేవాణ్ణి. పన్నుల పేరుతో జరిగే దోపిడీ గురించి ఆర్థిక శాస్త్రం చదివిన తరువాతే నాకు తెలిసింది. జనానికి ఈ నిజాలు తెలియకూడదనే “సామాజిక శాస్త్రాలు పనికిరావు” అని చంద్రబాబు అనేవాడు.

 11. రైలు చార్జిల పెంపుని నేను సమర్థించిన మాట నిజమే. వెయితింగ్ లిస్త్ తికెత్‌లు అమ్మి ప్రయాణికుల్ని మోసం చెయ్యడం కంటే నేరుగా రైలు చార్జిలు పెంచడమే మేలు కదా. వెయితింగ్ లిస్త్ తికెత్‌తో ఎక్కినందుకు ఒక TTE నన్ను దారిలో దింపేస్తే మూడు బస్సులు మారి గమ్యానికి చేరుకున్నాను. డబ్బులు ఎక్కువ కట్టినవానికే తికెత్ ఇస్తాము అని చెప్పినా ఫర్వాలేదు కానీ తక్కువ చార్జిల పేరుతో ఇలా వెయితింగ్ లిస్త్ తికెత్‌లు అంటగట్టి మోసం చెయ్యడం ఏమి న్యాయం?

 12. శ్రమ విలువ కోసమైతే రైతు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర అడగాలి కానీ ఋణాలు, మాఫీలు కాదు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే పోలీస్ కాల్పులు జరిపించే పాలకులు ఋణ మాఫీ చేస్తారంటే నమ్మలేము.

  Good point.. ఈ సబ్సిడిలు, రుణ మాఫిలు ప్రత్యక్షంగానో పరోక్షం గానో పెద్ద కర్పోరేట్ కంపెనీలకు (విత్తనాలు,ఎరువుల కంపెనీలకు) ఉపయోగపడతాయి. అంతేకాదు వీటి వలన బాంకులకు కూడా లాభం.

  Banks smile as Telangana, AP plan ₹1-lakh-crore loan waiver
  Hyderabad, May 28:
  The Andhra Pradesh and Telangana Governments are planning to waive loans worth ₹1 lakh crore. This is perhaps the biggest loan waiver ever, say bankers

  Apart from farmers and members of self-help groups, banks too are happy with the measure. With increasing bad loans, the loan waiver comes as a relief to banks, as they will be reimbursed.

  As of January 1, 2014, the percentage of NPAs to total loans outstanding under agriculture, MSE and SHG lending were 5.08 per cent, 5.36 per cent and 3.44 per cent, respectively.

  “In a way it is good for banks because they can recover complete dues,” CVR Rajendran, CMD of Andhra Bank and President of the State Level Bankers’ Committee, told Business Line.

  http://www.thehindubusinessline.com/news/states/banks-smile-as-telangana-ap-plan-1lakhcrore-loan-waiver/article6058197.ece

 13. అక్కడికి రైతులు అడగంగానే గిట్టుబాటుధరలు ఇచ్చేస్తున్నట్లు!?

  బిజినెస్ లైన్ వార్త అసలు విషయం చెబుతోంది. రైతుల రుణాలు వాస్తవంగా మాఫీ కావడం లేదు. వాటిని రైతులకు బదులు ప్రభుత్వం చెల్లిస్తుందంతే. ప్రభుత్వానికి వచ్చేదంతా జనం సొమ్ము. కానీ పైసా కష్టపడని పారిశ్రామికవేత్తలు ఎగవేసే రుణాలను బ్యాంకులకు ఎవరూ ఇవ్వరు. వాటిని మొండి బాకీల కింద బ్యాంకులు రద్దు చేసేస్తాయి. అనగా ఉచిత పంపకాలు రైతులకి కాదు ధనిక వర్గాలకే ఇస్తున్నారు. ఈ మొండి బకాయిదారుల పేర్లు చెప్పమంటే యు.పి.ఏ, ఎన్.డి.ఏ లు రెండూ పార్లమెంటులో చెప్పలేదు. దేశ భద్రత సాకు చెప్పి తప్పించుకున్నాయి.

  కనుక గుడ్ ఎకనమిక్స్ పేరుతో రైతుల రుణాల మాఫీని వ్యతిరేకించే మిత్రులు రైతు ఋణ మాఫీయే గుడ్ ఎకనమిక్స్ అనీ, ధనిక వర్గాల ఋణ మాఫీ/రద్దు పరమ బ్యాడ్ ఎకనమిక్స్ అనీ గుర్తించాలి.

  నేను పైన వ్యాఖ్యలో చెప్పిన ప్రధాన విషయం: బడ్జెట్ సొమ్ము, నల్ల డబ్బు అంతా శ్రమ చేసేవారిదే అనీ, కాబట్టి శ్రామిక ప్రజలకి ఎంత సబ్సిడీ ఇచ్చినా అది ఉచితం కాదని, వారి సొమ్ము వారికి ఇచ్చినట్లే అని. మార్క్సిస్టు దృక్పధం కూడా ఇదే అని. దాన్ని వదిలి సోషలిస్టు రష్యా విధానాలని తెచ్చి అటు భూస్వామ్య వ్యవస్ధా, ఇటు పెట్టుబడిదారీ వ్యవస్ధా కాని సామ్రాజ్యవాద దాస్య ప్రభుత్వ విధానాలతో పోల్చడం ఏమిటి? ఈ పోలిక సరి కాదు.

  స్వీడన్ లో దాదాపు ప్రతి సేవ (విద్య, వైద్యం, రైలు, బస్సు మొ.వి) ప్రభుత్వమే సమకూర్చుతుంది. అమెరికాలో విద్యారంగం ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఐరోపా దేశాల్లో కూడా. పొదుపు విధానాల పేరుతో వాటిలో కొంత భాగం ఉపసంహరించారు గానీ అంతకుముందు భారీ సౌకర్యాలు ప్రభుత్వాలు ఇచ్చేవి. ఇవేవీ సోషలిస్టు ప్రభుత్వాలు కావు. కమ్యూనిస్టు రష్యా, చైనాల తాకిడికి తట్టుకోలేక తమ రాజ్యాలను ‘సంక్షేమ రాజ్యాలు’గా ప్రకటించుకుని అమెరికా, ఐరోపాలు అమలు చేసినవి. గత ప్రపంచ ఆర్ధిక సంక్షోభం (2008) లో అమెరికా, ఐరోపాలు ప్రైవేటు కంపెనీలకు దోచి పెట్టిన ట్రిలియన్ల డాలర్లు ఎలా ఇచ్చినట్లు? అప్పు తెచ్చి ఇచ్చి ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు విధానాల కింద జనం నుండి వసూలు చేస్తున్నారు.

  ఇలాంటి విధానాలు తమ దేశాల్లో అమలు చేస్తూ మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం ‘బ్యాడ్ ఎకనమిక్స్’ పేరుతో వద్దని చెబుతారు. ఎందుకని? ఎందుకంటే ఉదాహరణకి మన దేశమే తీసుకుంటే మన ఆర్ధిక వ్యవస్ధ పశ్చిమ సామ్రాజ్యవాదులకి అనుబంధంగా ఉండేది తప్ప స్వతంత్రంగా నడిచేది కాదు. ఇక్కడి విధానాలు బహుళజాతి కంపెనీల అవసరాలకు తగినట్లుగా రూపొందిస్తారు. రైతులకో, ఇంకొకరికో రుణాలు మాఫీ చేస్తే ఆ మేరకు ప్రభుత్వం జనం కోసం ఉన్నట్లు అర్ధం. కానీ జనానికి ప్రభుత్వం తమదే అన్న అవగాహన ఇచ్చేస్తే ఆ మేరకు కంపెనీల మార్కెట్ తగ్గిపోతుంది. ఆర్ధిక వ్యవస్ధలో ప్రతి వస్తువుని (వీలయితే గాలితో సహా) సరుకుగా మార్చేసి (commodify) వాటిపైన వ్యాపారం చేస్తూ లాభాలు గడించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని బహుళజాతి కంపెనీలు కోరుకుంటాయి. సబ్సిడీలు, ఋణ మాఫీ లు మొదలైనవి బహుళజాతి కంపెనీల ద్రవ్య మార్కెట్ ను బలహీనపరుస్తాయి. ప్రభుత్వం పాత్రను పెంచి ప్రైవేటు పాత్రను తగ్గిస్తాయి. ఈ కారణం వల్లనే శ్రామికులకి ఇచ్చే సబ్సిడీలు, మాఫీలను పశ్చిమ కంపెనీలు, వారికి సేవ చేసే దళారీ వర్గాలు వ్యతిరేకిస్తారు.

  ఇలాంటి మోసపూరిత ప్రచారంలో మనమూ పడిపోవడానికి బదులు ‘నేను మార్క్సిస్టుని’ అని చెప్పడం అన్నా మానుకోవాలి, లేదా విషయాలను వర్గదృక్పధంతో అర్ధం చేసుకోవడానికన్నా కృషి చేయాలి.

 14. Not related to thisp ost

  Smaller European countries, whose quota shares would be reduced by the changes, opposed quota reform on the grounds that their contributions to total official development assistance would be undermined if their voting strength were diminished at the IMF.

  What are the implications of the BRICS institutions for international development finance? Developing nations hope that BRICS bank/CRA may eventually challenge World Bank-IMF hegemony over matters such as: funding for basic services, emergency assistance, policy lending, and funding to conflict-affected states. The World Bank’s own estimates point to a $1 trillion infrastructure investment “gap” in developing countries. Existing multilateral development banks are able to fill approximately 40 percent of that gap. So, the fact that a BRICS bank aims to make electricity, transport, telecommunications, and water/sewage a priority is important; the demand for infrastructure is expected to grow sharply as more countries transition out of low-income status. In terms of scale, it has been suggested that—after a couple of decades, should membership be expanded, and should co-financing by governments and private investors be mobilized—that BRICS Bank loans could dwarf World Bank loans. This type of success has been seen with the CAF, which now funds more infrastructure in Latin America than the World Bank and the Inter-American Development Bank combined.

  http://m.washingtonpost.com/blogs/monkey-cage/wp/2014/07/17/what-the-new-bank-of-brics-is-all-about/
  _______________
  Income Inequality Is Not Rising Globally. It’s Falling
  http://mobile.nytimes.com/2014/07/20/upshot/income-inequality-is-not-rising-globally-its-falling-.html?_r=2

 15. “ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువ ఇచ్చి ఆ ఉద్యోగుల దగ్గర టాక్స్ ఎక్కువ వసూలు చేసే బదులు ప్రభుత్వం ఆ ఉద్యోగులకి జీతాలు తగ్గించి ఆ ఉద్యోగుల మీద టాక్స్ కూడా తగ్గించొచ్చు. ప్రజల మీద టాక్స్ పెంచి అలా వసూలు చేసిన డబ్బులతో ఉచిత విద్యుత్ లాంటివి ఇచ్చే బదులు ప్రజల మీద టాక్స్ తగ్గించి ఉచిత విద్యుత్ లాంటి స్కీమ్‌లని రద్దు చెయ్యొచ్చు.”
  http://content.janavijayam.in/2013/11/blog-post_27.html

  మన దగ్గరే పన్నులు వసూలు చేసి ఆ డబ్బులతోనే మనకి సబ్సిదీ ఇవ్వడం ఎంత హాస్యాస్పదమో గతంలో నేను వ్రాశాను.

 16. Communist Party of Australiaలో పని చేసే నా స్నేహితుడు తిమోతీ నాకు ఓ విషయం చెప్పాడు “Anticommunism is like pregnancy. It doesn’t have degree” అని. పాలకులు ప్రైవేత్ ఆస్తి తమ చేతిలో ఉంచుకుంటూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారని అనుకోలేము. ఈ బద్జెత్‌ల నుంచి ఏదో ఆశించడం అనవసరం. రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తూ, గృహస్తుల నుంచి అతిరిక్త విద్యుత్ చార్జిలు వసూలు చెయ్యడం వల్ల విద్యుత్ బిల్లులు కట్టడానికి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో నాకు తెలుసు. కొత్తగా ఇరిగేషన్ కాలువలు తవ్వకుండా, రైతులు మోతార్‌ల ద్వారా భూగర్భ జలాలని తోడుకునేలా చెయ్యడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి కొత్త థర్మల్ ప్లాంత్‌లు అవసరమయ్యాయి. అందుకే సోంపేట, కాకరాపల్లి లాంటి థర్మల్ వ్యతిరేక ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఈ అభినవ ఔరంగజేబులు ప్రజా బద్జెత్‌లు రూపొందిస్తారనే భ్రమలు అవసరం లేదు.

 17. ఒక నిరుద్యోగికి 100 రూ… ఫ్రీగా ఇస్తే తీసుకోడు కానీ ఉద్యోగం ఇస్తే నిరభ్యంతరంగా తీసుకుంటాడు. మన ప్రభుత్వాలు పెట్టే ఫ్రీ స్కీమ్‌లు “నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వకుండా డబ్బులు దానం చేసినట్టు” ఉన్నాయి. భూమికి నీటి పారుదల సౌకర్యం లేకపోవడం వల్ల నష్టం వచ్చి పంట ఋణం తీసుకున్నవాళ్ళు కూడా ఉంటారు. ఆ భూమిలో నీటి పారుదల పెరగనంత కాలం ఎన్ని సార్లు ఋణం తీసుకున్నా అక్కడ వ్యవసాయంలో లాభం రాదు. అటువంటి భూములు ఉన్న రైతులకి ఎన్ని సార్లు ఋణ మాఫీ చేసినా మళ్ళీ ఋణాలు అవసరమవుతాయి. ఆ రైతులకి కూడా ఋణాలు మాఫీ చేస్తారా? ఎరువుల ధరలు పెరగడం వల్ల ఋణాలు తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఋణాలు మాఫీ చేసినా వాళ్ళకి మళ్ళీ ఋణాలు అవసరమవుతాయి. ఎరువులపై పన్ను తగ్గించి వాళ్ళకి ఎరువులు తక్కువ ధరకి అందుబాటులోకి వచ్చేలా చెయ్యొచ్చు. అది చెయ్యకుండా ఎరువులు కొనడానికి తీసుకున్న పంట ఋణాలని ప్రతి సారి మాఫీ చేస్తారా? పంటకి గిట్టుబాటు ధర రాక కొత్త పంట వెయ్యడానికి కూడా ఋణాలు తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఆ కొత్త పంట పండిన తరువాత కూడా గిట్టుబాటు ధర రాదు, మళ్ళీ ఇంకో పంటకి ఋణం అవసరమవుతుంది. ఆ ఋణాలని కూడా మాఫీ చేస్తారా? ఇన్ని ఋణాలని మాఫీ చెయ్యడానికి ఎన్ని కరెన్సీ కట్టలు ముద్రించాలి?

  కేవలం కరెన్సీ కట్టలు ముద్రించడానికైతే ప్రభుత్వం అవసరం లేదు, ఒక లేజర్ కలర్ ప్రింతర్ కొనుక్కుని, దాని స్కానర్‌లో 500 రూ… కాగితం పెట్టి దాన్ని ఎన్నిసార్లైనా దూప్లికేత్ చెయ్యొచ్చు.

 18. విశేఖర్ గారు, సబ్సిదీల విషయంలో నేను పెట్టుబడిదారీ పత్రికలు చేసే ప్రచారాన్ని నమ్మడం లేదు. మన దగ్గర పన్నులు వసూలు చేసి, తిరిగి ఆ డబ్బులతోనే మనకి సబ్సిదీలు ఇవ్వడం హాస్యాస్పదం అని మాత్రం నేను నమ్ముతాను. సబ్బు మీద పది రూ… పన్ను వేస్తే పెట్టుబడిదారుడు సబ్బు ధర పది రూ… పెంచి అమ్ముతాడు. పన్నుల వల్ల పెట్టుబడిదారులకి ఏమీ నష్టం లేదు కానీ సాధారణ ప్రజలకి మాత్రం నష్టమే జరుగుతుంది. “There is nothing such as free lunch” అనే సూత్రాన్ని నేను లైబ్రరీలోని ఎకనామిక్స్ పుస్తకాలలో చదివాను. కమ్యూనిస్త్ సమాజంలోనైనా ఉమ్మడి శ్రమ చేసి ఉత్పత్తి చేస్తారు కానీ ఫ్రీగా తినడం అనేది ఉండదు. మన పాలక వర్గాలు పెట్టే ఫ్రీ స్కీములు మాత్రం all free అనే సందేశాన్ని జనం మెదళ్ళలోకి ఎక్కిస్తాయి.

 19. ప్రవీణ్ గారూ, పన్నులు, వడ్డీలు మొదలైనవన్నీ సరుకు ధర పైన అదనంగా వేసేవి కావు. అవి సరుకు వాస్తవ ధరలో భాగం. సరుకు తయారీకి శ్రామికుడు అమ్ముకునే శ్రమ విలువలో భాగం. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే అదే అదనపు విలువ. అంతిమ వినియోగదారుడు చెల్లించేది సరుకు అసలు ధర. అందులో కొద్ది భాగాన్ని శ్రామికుడికి చెల్లించి మిగిలిన భాగాన్ని పన్నులు, లాభాలు, అద్దెలు ఇత్యాది భాగాలుగా దోపిడీ వర్గాలు జమ చేసుకుంటాయి.

  రంగనాయకమ్మ గారి పెట్టుబడి పరిచయంలో ‘ఏడు జేబుల పెట్టుబడిదారుడు’ అని ఒక అంశం ఉంటుంది. అక్కడి దాకా వెళ్లకుండానే శ్రమ దోపిడీ అంటే ఏమిటో పరిచయంలో తెలుస్తుంది. వీలయితే అది చదవండి. ఈ అంశంపై అవగాహన లేకపోవడం వల్లనే మీరు సబ్సిడీలను వ్యతిరేకిస్తున్నారు. సబ్సిడీ అంటే ఉచితం కాదు. రైతు, కార్మికుడు, కూలీ, ఉద్యోగి ఇత్యాదిగా గల శ్రామికుల నుండి దోచిన అదనపు విలువలో కొద్ది భాగాన్ని వారికి తిరిగి చెల్లించడం. అది అత్యంత నామమాత్రం. వాస్తవంగా అయితే బడ్జెట్, నల్ల డబ్బు, అవినీతి సొమ్ము అన్నీ శ్రామికులకు చెందవలసిన భాగాలు.

  ఈ భాగం మొత్తం శ్రామికుడికి ఇవ్వాలని కాదు మనం చెప్పేది. అదనపు విలువ దోపిడీ వ్యవస్ధలో అయితే దోపిడీదారుల వ్యక్తిగత ఆస్తిగా జమ అవుతుంది. సోషలిస్టు వ్యవస్ధలో అయితే ప్రభుత్వ ఆస్తిగా జమ అయ్యి అది తిరిగి వివిధ ప్రజా వ్యవస్ధల నిర్మాణంలోకి వెళ్తుంది. ఆ విధంగా తిరిగి ప్రజలకు ఉపయోగపడుతుంది. అత్యంత ఆధునిక సౌకర్యాలన్నీ ప్రజల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి.

  వీలయితే పెట్టుబడి పరిచయంను ఒకసారి చూడండి.

 20. నాకు ఒకప్పుడు HDFC బ్యాంక్‌లో అకౌంత్ ఉండేది. బేలెన్స్ మెయింతెయిన్ చెయ్యకపోతే, బాలెన్స్ చార్జ్‌తో పాటు విడిగా సర్వీస్ తాక్స్‌ని కూడా నా అకౌంత్ నుంచి దెబిత్ చేసేవాడు. ING వైశ్యా బ్యాంక్ కూడా ఇలాగే 750 రూపాయలకి బదులు 840కి పైగా వసూలు చేస్తుంది. వాళ్ళు కట్టే సర్వీస్ తాక్స్ డబ్బులని ధరలో కాకుండా విడిగా వసూలు చేస్తున్నారు.

  పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులని మౌలిక సౌకర్యాల కల్పనలకి ఖర్చు చెయ్యకుండా ఉచిత విద్యుత్ లాంటి పథకాలకి ఖర్చు చెయ్యడం వల్లే నా అభ్యంతరం. ఆంగ్లేయులు మన దేశంలో 55,000 కిమి రైలు మార్గాలు వేస్తే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 10,000 కిమి మాత్రమే రైలు మార్గాలు వేశారు. ఇన్ని పన్నులు వసూలు చేసి ఏమి సాధించినట్టు?

 21. ఋణ మాఫీ కోసం చంద్రబాబు 40 వేల కోట్లు అప్పు చేస్తాడట! ప్రపంచ బ్యాంక్ నుంచి తెస్తాడో, ఇంకో విదేశీ సంస్థ నుంచి తెస్తాడో? 5 కోట్ల జనాభాకి 40 వేల కోట్ల అప్పంటే దాని అర్థం ఒక్కో తలకి 8 వేలు అప్పు అని. అప్పు చేసి పప్పు కూడు విధానం వల్ల ఆర్థికంగా ఎలాగైనా నష్టమే.


 22. విశేఖర్ గారు, ఈ స్క్రీన్‌షాత్ చూడండి. పన్నుని వాస్తవ ధరలో కాకుండా విడిగా వసూలు చెయ్యడం పెట్టుబడిదారునికి సాధ్యమే. ING వైస్యా బ్యాంక్ వెబ్‌సైత్‌లో AQB నాన్-మెయింతెనెన్స్ చార్జ్ 750 రూ… అని వ్రాసి ఉంటుంది కానీ వాళ్ళు మన దగ్గర 842.70 వసూలు చేసి, అవతల 750 రూ…కి మాత్రమే పన్ను కడతారు.

 23. పన్ను వసూలు చెయ్యడం అనేది ఒక సాంకేతిక విషయం అనే నిజాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు. మౌర్యుల కాలంలో ప్రజల నుంచి భూమి పన్ను వసూలు చేసేవాళ్ళు. రైతు తన భూమిలో పండిన పంటలో ఐదో భాగం పన్నుగా కట్టేవాడు. Goods Sales Tax అనేది అప్పట్లో లేదు. సంతలో మార్చుకున్న వస్తువులకి పన్ను వర్తించదు. పెట్టుబడిదారీ ప్రభుత్వం రోద్‌లూ, రైలు మార్గాలూ వెయ్యాలన్నా, పోలీస్ స్తేషన్‌లూ, కోర్త్‌లూ నడపాలన్నా, అందుకు ఆదాయం అవసరం కాబట్టి పెట్టుబడిదారీ ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేస్తుంది.

  సబ్సిదీలు ఇచ్చి, అందుకు ఖర్చయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి ప్రజల నుంచి అతిరిక్త పన్నులు వసూలు చెయ్యడం అనేది పాలక వర్గం యొక్క అంతర్గత విధానం మాత్రమే. పాలక వర్గం అస్తిత్వంలో ఉండడానికి ఇది తప్పనిసరి కాదు.

  మనిషి అస్తిత్వానికీ, పన్నుల విధానానికీ సంబంధం లేదు. పన్నులు ఎక్కువ కట్టే ధనవంతునికీ, పన్నులు తక్కువ కట్టే సాధారణ వ్యక్తికీ వేరువేరు హక్కులు అమలు చెయ్యలేము.

 24. విశేఖర్ గారు, ఇప్పుడో కొత్త నాటకం మొదలైంది. రెండు రాష్ట్రాలలోనూ ఋణమాఫీకి తాను ఒప్పుకోను అని రఘురాం రాజన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకపోయినా ఋణమాఫీ చేస్తాం అని ఆంధ్రా ప్రభుత్వం ప్రకటించింది. కానీ డబ్బున్న రైతులు ఋణాలు తిరిగి కడితే వాళ్ళు కట్టిన తరువాత ఋణాలు మాఫీ చేస్తారట!

  ఋణమాఫీ చేస్తే రైతులు మళ్ళీ ఋణాలు తీసుకుని అవి కూడా మాఫీ చెయ్యమంటారని రఘురాం రాజన్ అన్నాడు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమానికి ఋణాలు మాఫీ చేసినా అతను కూడా మళ్ళీ ఋణాలు తీసుకుని మాఫీ చెయ్యమంటాడు. నీతి అనేది డబ్బున్నవానికైనా, పేదవానికైనా ఒకేలా ఉంటుంది.

  ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకుని బతికే ఇందియా లాంటి దేశంలో ఋణమాఫీ లాంటి ఖరీదైన పథకాలు అమలు చెయ్యడం సాధ్యం కాదు. ఇలాంటి స్కీములని నమ్మొద్దని ప్రజలకి తెలియజెయ్యడం ఒక్కటే ఇప్పుడున్న మార్గం.

 25. విశాఖపట్నం ఆంధ్రాబ్యాంక్ ఎల్.బి. కాలేజ్ బ్రాంచ్‌లో ఓ బోర్ద్ మీద బంగారు బాతు బొమ్మ ఉన్న పోస్తర్ అంటించారు. అందులో ఇలా వ్రాసుంది “బ్యాంక్ అనేది బంగారు బాతులాంటిది, ఋణాలు తీసుకున్నవాళ్ళు బకాయీలు చెల్లిస్తేనే బ్యాంక్ కలకాలం ఉంటుంది” అని.

  బ్యాంక్‌లు వ్యవసాయ ఋణాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించలేదు. బ్యాంక్‌లు ఎకరానికి పదిహేను వేలే ఋణం ఇస్తాయి. అందుకే రైతులు బ్యాంక్‌కి వెళ్ళకుండా వడ్డీ వ్యాపారుల దగ్గర ఋణాలు తీసుకుని అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. బ్యాంక్‌వాళ్ళు వడ్డీ వ్యాపారుల్లాగ గూండాగిరి చెయ్యరు. పట్టాదార్ పాస్‌బుక్ ఉండి, వేసిన పంట చూపిస్తే బ్యాంక్‌వాళ్ళు తప్పకుండా లోన్ ఇస్తారు. వడ్డీ వ్యాపారి అవేమీ చూడకుండా అడిగినంత ఋణం ఇస్తాడని రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకి వెళ్తే దానికి ఎవరేమి చెయ్యగలరు?

  వడ్డీ వ్యాపారం అంటే ఏమిటో తెలియని గిరిజనుల దగ్గరకి కొంత మంది కోమటివాళ్ళు వచ్చి, మీకు సహాయం చేస్తామని చెప్పి అప్పులు ఇచ్చి, వాళ్ళ నుంచి వడ్డీలు ఎలా వసూలు చేసేవాళ్ళో సుబ్బారావు పాణిగ్రాహి ఒక కవితలో వర్ణించాడు. పేదరికం కఠినమైనది, అప్పు భయంకరమైనది.

 26. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బ్యాంక్ ఋణాలు తీసుకున్నవాళ్ళ కంటే వడ్డీ వ్యాపారుల దగ్గర ఋణాలు తీసుకున్నవాళ్ళే ఎక్కువగా ఉంటారు. బ్యాంక్‌వాళ్ళు గూండాగిరీ చెయ్యరు, కోర్త్‌కి వెళ్ళి, కోర్త్ ఆదేశిస్తే భూమి స్వాధీనం చేసుకుంటారు. వడ్డీ వ్యాపారులైతే గూండాగిరీ చేసి బలవంతంగా డబ్బులు లాగుతారు. వడ్డీ వ్యాపారుల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటే బ్యాంక్ ఋణాలు మాఫీ చెయ్యడం తుగ్లక్ పనే అవుతుంది.

 27. ప్రపంచ బ్యాంక్ అప్పులతో బతికే ఇందియా లాంటి దేశంలో ఋణ మాఫీ సాధ్యం కాదు. అన్ని వాగ్దానాలలాగే ఋణ మాఫీ వాగ్దానాన్ని కూడా దాటవెయ్యొచ్చని చంద్రబాబు అనుకున్నాడు. కమ్మ పత్రికలు చంద్రబాబుని రక్షించడానికి ఆంధ్రాలో ఋణ మాఫీ సాధ్యం కాదని ప్రచారం చేస్తూనే కె.సి.ఆర్.ని ఇరకాటంలో పెట్టడానికి ఋణ మాఫీ సాధ్యమేనని తెలంగాణాలో ప్రచారం చేసాయి. కానీ ఈ రెండు నాలుకల ప్రచారం చంద్రబాబుని బతికించలేకపోయింది. జగన్ అనే చేతకాని ప్రతిపక్ష నాయకుడు ఋణ మాఫీ గురించి ఏమీ మాట్లాడకపోయినా కాంగ్రెస్ దాని గురించి మాట్లాడుతోంది. కాంగ్రెస్ తిరిగి వస్తే సమైక్యాంధ్ర సెంతిమెంత్ అంత బలమైనది కాదని అర్థమవుతుంది. ఋణ మాఫీ లాంటివి చెయ్యకపోతే కాంగ్రెస్ తిరిగి వస్తుందని నందిగామ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కి పడిన వోత్‌ల సంఖ్య చెపుతోంది. ఇప్పుడు చంద్రబాబు మెడ మీద కత్తి పడినట్టు అయ్యింది.

  ఇప్పుడు చంద్రబాబు సెస్ వసూలు చేసి ఆ డబ్బులతో ఋణ మాఫీ చేస్తాడట! ఋణ మాఫీ నిజంగా జరుగుతుందనుకుని డబ్బున్న రైతులు కూడా ఫెబ్రవరీ, మార్చ్ నెలల్లో లోన్‌లు తీసుకున్నారు. పేద రైతులలో ఎక్కువ మందికి పట్టాలు ఉండవు. పట్టాలు లేనివాళ్ళకి బ్యాంక్‌లు లోన్‌లు ఇవ్వవు. చంద్రబాబు నిజంగా సెస్ వసూలు చేసి ఋణ మాఫీ చేసినా డబ్బున్న రైతులకే ఎక్కువ లాభం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s