తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ఈ పద్యం ఎవరు రాశారో నాకు గుర్తు లేదు గానీ ఇప్పటికీ ఆచరణీయం అని మూర్ఖ, తిక్క శిఖామణులు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. అంతర్జాలం చాటు చూసుకుని తిక్క వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్న తల తిక్క వెధవల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఫేస్ బుక్ లో యాదృచ్ఛికంగా ఈ వీడియో చూశాను. అంతే, తిక్క వెధవలు అసలు రాలేదు అనుకుంటే సరిపోతుందని జ్ఞానోదయం అయింది. దానితో పాటు కింది తరగతుల్లో చదువుకున్న పై పద్యం కూడా గుర్తుకు వచ్చింది.
‘Don’t argue with idiots’ శీర్షికతో ఉన్న ఈ వీడియో నిడివి కొద్ది క్షణాలే. కానీ కొండంత రిఫ్రెష్ మెంట్ మన అనుభవంలోకి వస్తుంది. మీరూ చూడండి.
https://www.facebook.com/photo.php?v=317766308345786
షరా: ఈ వీడియో తల తిక్క వెధవలకు మాత్రం కాదు.
Sekhar gaaru..
Agreed with what you said..
In fact “Vaadhinchani vaade (those who don’t argue) Vaadhana lo Gelusthaadu” ane naanudi
eee idiots kosame putti vuntundhemo sekhar gaaru.. haha
(e video na eyes inkonchem teruchukunela chesindi) thanks andi..
bye take care
తలతిక్క వాదులు ఇందులో ఏమి నేర్చుకుంటారు ? :)) కాక పోతే ఉడుక్కుంటారు.వీడియో చాలా బాగుంది.
తలతిక్క వాదులతో వాదులతో వాదన పెట్టుకంటే ఆఖరికి మనమే బలి కావాల్సి వస్తుందన్నమాట. వీడియో బాగుంది.
@Thirupalu, అందుకేగా వాళ్ళని చూడొద్దని చెప్పింది!