స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్


Swiss accounts

“ఆగండాగండి, ఇదిగో లేఖ జారవిడుస్తున్నా, ఇక తెరుచుకోవడమే తరువాయి.”

***

అధికారంలోకి వచ్చీ రావడంతోనే విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బును వెనక్కి తేవడానికి అని చెబుతూ మోడి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటయిన ఈ కమిటీ వాస్తవానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు ఏర్పాటు చేశారన్న వాస్తవాన్ని చెప్పిన పత్రికలు చాలా తక్కువ.

ఈ కమిటీ పని ఎంతవరకు వచ్చిందో తెలియదు గానీ కొద్ది రోజుల తేడాలోనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వడం ద్వారా జనాన్ని అయోమయంలోకి నెట్టడంలో తన వంతు పాత్ర తాను పోషించింది.

విదేశాల్లో డబ్బు దాచిన భారతీయుల జాబితాను అందజేయడానికి స్విస్ ప్రభుత్వం సంసిద్ధత తెలియ జేసిందనీ, ఫలితంగా తమ పని సులువు అవుతోందని జస్టిస్ ఎం.బి.షా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.

మళ్ళీ అంతలోనే ఏమయిందో స్విస్ ప్రభుత్వం జాబితా అందడం లేదనీ దానివల్ల తమ పని మరింత కష్టంగా మారుతోందని మరో రెండు రోజుల తర్వాత జస్టిస్ ఎం.బి షా ప్రకటించారు. దానితో స్విట్జర్లాండ్ నుండి దొంగ ఖాతాల భారతీయుల జాబితా అందుతోందో లేదో అంతుబట్టకుండా పోయింది.

ఏమాటకామాట చెప్పుకోవాలి. జస్టిస్ ఎం.బి.షా విరుద్ధ ప్రకటనల వెనుక స్విస్ ప్రభుత్వం నుండి కొద్ది రోజుల తేడాలో వచ్చిన పరస్పర విరుద్ధ సమాచారం కారణంగా కనిపిస్తోంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మొదటిసారి వచ్చిన సమాచారం తాము అధికారికంగా ఇచ్చినది కాదని స్విస్ ప్రభుత్వం రెండో సారి చెప్పడంతో ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయాల్సిన పరిస్ధితి జస్టిస్ ఎం.బి.షాకు వచ్చినట్లు కనిపిస్తోంది.

త్వరలోనే స్విస్ బ్యాంకులలో రహస్య ఖాతాలు నిర్వహిస్తున్న భారతీయుల జాబితాను భారత ప్రభుత్వానికి అందజేయనున్నట్లు స్విస్ వర్గాలను ఉటంకిస్తూ పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలకు స్పందిస్తూ జస్టిస్ షా ఈ సమాచారం తమ పనిని సులువు చేస్తోందని ప్రకటించి ఆశలు రేకెత్తించారు. అయితే ఈ సమాచారంలో నిజం లేదనీ, ఈ వార్తలతో తమకు సంబంధం లేదనీ స్విస్ ప్రభుత్వ వర్గాలు ఖండన జారీ చేయడంతో జస్టిస్ ఎం.బి.షా తన ప్రకటనను సవరించుకోవలసి వచ్చింది.

ఖాతాల వివరాలు ఇచ్చే ఉద్దేశ్యం తమకు ఏదీ లేదని కూడా స్విస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రహస్య సమాచార పరిరక్షణ ఒప్పందం ఉన్న దృష్ట్యా ఖాతాదారుల పేర్లను వెల్లడి చేసే ఉద్దేశ్యం తమకు లేదని అసలు సంగతిని స్విస్ అధికారులు చల్లగా చెప్పారు. దానితో నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చే బృహత్కర్తవ్యం ఆ విధంగా మోడి ప్రభుత్వం భుజస్కంధాల నుండి భద్రంగా దించబడింది.

వెరసి నల్లధనం వెనక్కి తెచ్చే కర్తవ్యం ఓ పెద్ద ప్రహసనంలా మారిపోయింది. అసలు మన దేశాన్ని పాలిస్తున్న వర్గాలే దేశ సంపదను విదేశీ ఖాతాలకు తరలించే యజ్ఞానికి కర్త, కర్మ, క్రియలై వ్యవహరిస్తుండడం దాచేస్తే దాగని సత్యం. ఈ నేపధ్యంలో వారు తమ అవినీతిని తామే వెల్లడి చేసుకుంటారా అన్నది తెలియడానికి గొప్ప పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు.

కాబట్టి నల్లధనం వెనక్కి రప్పించే ప్రక్రియ ఒక బృహత్ యజ్ఞంగా, ఎల్లకాలం ఎడతెగకుండా నిరంతరాయంగా కొనసాగుతూ పోయే సమస్యగా ప్రజల ముందు నిలపడమే పాలకమ్మన్యులు అనుసరించే ఎత్తుగడ. లేఖ రాశామని ఒకసారి, సమాధానం వచ్చిందని ఒకసారి, ఇంకా పూర్తి సమాధానం రాలేదని ఇంకొకసారి, వచ్చిన లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నామని మరొకసారి, లేఖలో అసలు వివరాలేమీ లేవని మలిసారీ చెప్పుకుంటూ ఉన్న కాలాన్ని గడుపుతూ పోయే జిత్తులమారి టక్కరితనం ప్రదర్శన నూతన పాలకులకు కొత్త కావచ్చు గానీ జనానికి మాత్రం కొత్త కాదు. ఎటొచ్చీ ఏదో సాధించబోతున్నారని నమ్ముతూ కొత్త ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని వాదించే కొత్త బిచ్చగాళ్లకే అసలు మర్మం తెలియాల్సి ఉంది.

12 thoughts on “స్విస్ నల్ల ధనం అను ఒక ప్రహసనం -కార్టూన్

 1. నల్లధనం పేరుతో జనాలను వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు. దాచినవారు నిర్భయంగానే వున్నారు. ఎటొచ్చి ప్రభుత్వం జనాలకు కాలక్షేప బఠానీలు తినిపిస్తూ తమాషా చూస్తోంది.

 2. Inkaa innalluu aa “nalladhanam” akkada , akkade koorchundaa…….adi eppudo thellagaa maaripoyi vuntuntundi lekapothe aa swissu ninchi vellipoyi maro chotininchi bussu koduthuu vuntundi…

  ఈంకా ఇన్నాళ్లూ ఆ “నల్లధనం” అక్కడ, అక్కడే కూర్చుందా… అది ఎప్పుడొ తెల్లగా మారిపోయి వుంటుంది. లెకపొతే ఆ స్విస్సు నించి వెళ్లిపోయి మరో చోటినించి బుస్సు కొడుతూ వుంటుంది…

 3. రావు గారూ, మర్మం తెలిసి మాట్లాడినట్లుంది మీ వ్యాఖ్య. లేఖినిలో తెలుగు కింద మార్చి రాశాను నేనే.

  విషయం ఏమిటంటే నల్లధనానికి స్విస్సు నుండి వెళ్లిపోవలసిన అగత్యమే ఉండదు. ఆ పరిస్ధితే వస్తే స్విస్ బ్యాంకింగ్ వ్యవస్ధకే కాదు, మొత్తం సామ్రాజ్యవాద బహుళజాతి బ్యాంకింగ్ వ్యవస్ధకు కూడా ప్రమాదమే. అటువంటి ప్రమాదాన్ని వాళ్ళూ రానివ్వరు, మానవాళ్లూ రానివ్వరు.

  నల్లడబ్బు వెనక్కి తెస్తున్నాం అంటూ మనవాళ్లు చేసేవన్నీ తాటాకు చప్పుళ్లే.

 4. స్విస్ బ్యాంక్‌లలో దాచిన డబ్బుని ఆ బ్యాంక్‌లవాళ్ళు FIIల పేరుతో ఇందియా లాంటి దేశాల్లోనే పెట్టుబడులు పెడతారు. ఇందియావాడు స్విస్ బ్యాంక్‌లో డబ్బు జమా చేసినా అది FII రూపంలో తిరిగి ఇందియాకే వస్తుంది. స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బుని ఇందియాకి తిరిగి తెస్తే ఇందియాలో stock markets కుప్పకూలిపోతాయి. భాజపా నాయకులకి ఈ విషయం తెలుసు కానీ భాజపా అభిమానులకే ఈ విషయం తెలియదు. అందుకే స్విస్ బ్యాంక్‌ల నుంచి డబ్బు తిరిగి తెచ్చి దాన్ని ప్రజలకి పంచడం సాధ్యమని తాము నమ్మడమే కాకుండా జనాన్ని కూడా నమ్మిస్తారు భాజపా వందిమాగధులు.

 5. “స్విస్ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బుని ఇందియాకి తిరిగి తెస్తే ఇందియాలో stock markets కుప్పకూలిపోతాయి.”

  I think this is not a correct observation. Actually when money comes in, whatever the root and/or rout may be, stock prices will rise accomodating such money. How will it fall?

 6. స్విస్ బ్యాంక్‌లు కాకుండా ఫ్రాన్స్‌లోని ఒక HSBC శాఖలోని భారతీయ ఖాతాదార్ల పేర్లు ప్రకటించినందుకే stock markets నష్టపోయాయి. ఆ సమయంలో షేర్లు అమ్ముకుని డబ్బులు వెనక్కి తీసుకున్నవాళ్ళు FIIలే అని నా అనుమానం. స్విస్ బ్యాంక్‌లు లేకపోయినా FIIలు తాము mutual funds లేదా insurance కంపెనీలు పెట్టి సేకరించిన డబ్బులతో stock marketsలో పెట్టుబడులు పెడతారు.

  Stock markets అనేవి పెట్టుబడిదారీ వ్యవస్థకి మాత్రమే అవసరం కానీ సోషలిజంకి కాదు. రష్యాలో సోషలిస్త్ విప్లవం వచ్చిన తరువాత stock exchangesని మూసివెయ్యడమే జరిగింది. కరెన్సీ ముద్రణ పెంచితే కొత్త పెట్టుబడులు వస్తాయనుకోవడం ఎలాంటిదో stock markets వల్ల వ్యాపారం పెరుగుతుందనుకోవడం అలాంటిది.

 7. మీ మొదటి పేరాలో నా ప్రశ్నకు సమాధానం లేదు. ఎఫ్.ఐ.ఐలు స్టాక్ మార్కెట్ నుండి డబ్బు తీసుకున్నారు సరే. దానికీ నల్ల డబ్బు వెనక్కి తేవడానికి ఏమిటి సంబంధం?

  రెండో పేరా అసందర్భం. స్టాక్ మార్కెట్ ల అవసరం ప్రసక్తి ఎందుకు? ఇలా అడిగానని సంబంధం లేని మరో అంశంలోకి దూకొద్దు, దయచేసి.

 8. తమ డబ్బు బయటపడుతుందనే భయంతో ఖాతాదార్లే తమ స్విస్ బ్యాంక్ ఖాతాలు మూసేసి ఉంటారు కదా. అందువల్ల స్విస్ బ్యాంక్‌లు stock markets నుంచి తమ డబ్బుని తిరిగి తీసుకుని ఉంటాయి. భాజపా ప్రకటించిన ఖాతాలలోనే కొన్నిటిలో సున్నా బాలెన్స్‌లు ఉన్నాయి.

 9. శేఖర్ గారు ఈ మధ్య ‘ ద్రవ్య ఆధదునిక వాదం’ అని ఒకటి ముందుకు తెచ్చారు ఆదినికామ్తర వాదం లాగా. ఇది కూడా మార్క్స్ ష్ట్ వ్యతి రేక వాదమా. మనిషి లో స్థిరమైన జీవితం లేక పోవటం వాళ్ళ వచ్చిన అస్తిర తే ద్రవ్య(LIQUID) ఆధునిక వాదoగ చెపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటి వివరిమ్కా గలరా? మొదట మార్క్స్ ష్ట్ లుగా చెలామణి అయినా వారు ఈ వాదాల్ని ముందుకు తెస్తున్నారు.

 10. Hi Thirupalu garu, I was transferred to another place on promotion. Now I’m more nearer to you. I have yet to take internet connection. It took time to look for a suitable house (for rent) and settle. Still I’m in the process of settling. As soon as I get internet connection, blog will be updated. I’m writing this reply through android phone.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s