రైలు ఛార్జీలు కాదు విమాన ఛార్జీలు -కార్టూన్


Rail fare hike

“… చెన్నై, బెంగుళూరు, భోపాల్, లక్నో, పాట్నా మరియు చండీఘర్ ల మీదుగా ఢిల్లీ పోవు తదుపరి విమానం 11వ నంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరును…”

***

రైల్వే ఛార్జీల పెంపుదలను కార్టూనిస్టు ఇలా వ్యంగ్యీకరించారు.

గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రైల్వే సరుకు రవాణా చార్జీలను పెంచడాన్ని తప్పు పట్టిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను ప్రధాని అయ్యాక అదే తరహాలో ఛార్జీలు పెంచడానికి ఏ మాత్రం వెనకాడలేదు.

తాజా పెంపుదలతో రైలు ఛార్జీలు సైతం విమాన ఛార్జీలతో పోటీ పడుతున్నాయని కార్టూనిస్టు సూచించారు.

విమానం టికెట్ ను రెండు, మూడు వారాలు ముందుగానే బుక్ చేసుకోగలిగితే రైలు ఛార్జీలు నిజంగానే విమాన ఛార్జీలతో సమానంగా పోటీకి వస్తాయి. (కావాలంటే ఎవరైనా ప్రయత్నించవచ్చు.)

రైల్వే ఛార్జీల పెంపుదలను “కష్టమే అయినా సరైన నిర్ణయం” అని ఆర్ధిక మంత్రి సమర్ధించగా ప్రధాని నరేంద్ర మోడి మాత్రం ఇంకా నోరు మెదపలేదు.

నిజానికి ఆయన పెంపుదలకు ముందే నోరు మెదిపనట్లు భావించాలేమో! ‘కఠిన నిర్ణయాలు తప్పవు’ అని ఆయన ప్రకటించాకనే కదా రైల్వే ఛార్జీల పెంచుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది!

8 thoughts on “రైలు ఛార్జీలు కాదు విమాన ఛార్జీలు -కార్టూన్

 1. విమానం ఛార్జీల ధరలు రైలు ఛార్జీల ధరలకు దిగివచ్చినట్లా….లేక రైలు ప్రయాణం కూడా విమాన ప్రయాణం మాదిరిగా పైకి ఎదిగిందా…?
  ఏమిటో ఏమీ అర్థం కాకుండా ఉంది. పాలకుల పాలన రహస్యాలు, ముఖ్యంగా ఛార్జీల పెంపు ఒహ పట్టాన అర్థమై చావదు.

 2. People are ready to pay 200-500+ per ticket if railways can give assured bearth. railways should have a policy like “if you can pay he can get ticket”. People are ready to pay for 2nd AC /3rd AC and there is no availability not even in tatkal. So they are paying 2ndAC fare in volvo buses without toilets and going to their destination.

  In Bangalore here, we pay 400 up/down for taxi/auto for railway station. Still we dont get tickets confirmed. We want better quality, number of trains and more A/C coaches.

  Previously middleclass used to travel in sleeper. now middleclass can pay for 3rd AC and higher middleclass can pay for 2nd AC. Rich anyway can afford for flight.

 3. “సాధనమున పనులు సమకూరు ధరలోన”నే సూక్తికి లోబడి ప్రస్థుత ప్రభుత్వ విధానాలు భవిష్యత్తులో ప్రజాలక్ష్య సాధనలకు కొత్త మార్గాలకు దారితీసినా రైల్వే శాఖ మార్గదర్శకతలో మాత్రం ఏ పార్టీ అయినా ప్రభుత్వ పాలనా సిగ్నెల్ పడేసరికి కూ…. ఛుక్ ఛుక్ అమాత్యులు మంత్రివర్గ స్టేషన్లో కూర్చుని ప్లాట్ఫామ్ టికెట్ కొనకుండా రైల్వే కష్టనష్టాలు గురించి కొత్తగా చెప్తారు. నిన్నటి దాకా తన హోదాకు తగ్గ ప్రయాణం చేసినప్పుడు ప్రయాణికులలో తాను ఒకడుగా కష్టనిష్టూరాలను అనుభవించినా, మంత్రి హోదాలో అంతా ఉచితంగా పొందేసరికి ఉక్కిరిబిక్కిరితో గత పాలకులు ప్రయాణికుల బాగోగులకంటే చార్జీల మోత మీద దృష్టిపెట్టారని తామిప్పుడు వారిని అన్యధా భావించకుండా ఉండాలంటే సర్వదా చార్జీలు తప్పనిసరనే స్టేట్మెంట్ని రిజర్వ్ చెసి తత్కాల్ రీతిలో సమర్ధించుకుంటారు. రైళ్ళు విద్యుత్ ఇంజన్లతో పరుగులు తీసినా, ప్రయాణికులు సూటుకేసులు మార్చి మార్చి కొత్తవి కొన్నా, వివిధ ప్రభుత్వాలలో రైల్వే మంత్రులు మారినా వారి బడ్జెట్ బ్రీఫ్కేసులు మాత్రం చార్జీల మోతను పెంచినా వాటి పరిమాణం మాత్రం సూటుకేసుకు సమంగా పెరగటం లేదు. మరి టికెట్ పరిమాణం చార్జీల పెరుగుదల పరిణామాలతో సమంగా ఎదగటం లేదు, చివరకు ఏభై పైసలున్నపుడున్న ప్లాట్ఫామ్ టికెట్ నేడు ఐదుకు పెరిగి జీవిత ఖైది అనుభవిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వేగానికి మించిన వేగంతో పెరిగే చార్జీలు పోటీ పడినా పట్టాల మీద రైలు మాత్రం ఆలశ్యపు పోకడలతో ప్రయాణీకులను ఆటలు పట్టిస్తోంది. కొత్త రైలుమార్గాలు ప్రణాళి”కల”వరం. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లు రైళ్ళ పెంపు, ప్రాంతీయ బేధాలతో మదింపు. మంత్రిగారి సొంత రాష్ట్రాలకు మాత్రం అవసరానికి మించి కుదింపులతో ప్రతి ఏట పెద్ద పీట. చార్జీల పెరుగుదలతో ప్రయాణికుల మొహాలకు చాట. ప్రయాణీకుల సదుపాయాలలో కనబడని లక్ష్యం, ప్రాణాపాయ నీడలో మాత్రం అధికార సిబ్బంది బాధ్యతారహిత నిర్లక్ష్యం. ప్రభుత్వం ప్రయాణ రుసుమును ఆర్ధికపుష్టి కోసం పెంపు చెయ్యడం ఎంత సహజమో, వారి బాగోగులకు ప్రాధాన్యతనివ్వడం అంతే సమంజసం.

 4. మోదీ రెండు నాలుకల మనిషే. ఇందులో సందేహం లేదు. కానీ రైలు చార్జిలు తగ్గించడం కంటే ప్రయాణికునికి బెర్త్ తప్పకుండా దొరికేలా చెయ్యడం ముఖ్యం. 500 రూపాయలు పెట్టి ఎ.సి. తికెత్ కొన్నా అది కంఫర్మ్ అవ్వకపోతే TTE ఎక్కనివ్వడు. అలాంటప్పుడు తక్కువ చార్జిలు వసూలు చేసి ఏమి లాభం?

 5. 2002 నుంచి 2012 వరకు రైలు చార్జిలు పెంచకుండా waitlisted tickets ఎక్కువ అమ్మి ప్రయాణికులని మోసం చేసి రైల్వేవాళ్ళు లాభాలు సంపాదించారు. అలా మోసాలు చేస్తే short runలో లాభాలు వస్తాయి కానీ long runలో మాత్రం నష్టమే. ఓ సారి నేను waitlisted ticketతో ప్రయాణం చేస్తోంటే TTE నన్ను మధ్యలో దింపేశాడు. వెయ్యి రూపాయలు penalty ఏమి కడతావ్, దిగూ అంటూ నన్ను బలవంతంగా దింపేశాడు.

 6. ధరలు పెరిగిన ప్రతి సారి రైల్వే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. రైల్వే ఉద్యోగుల జీతాలకి అవసరమైన డబ్బులు ప్రభుత్వం రైల్వేలకి ఇవ్వదు. 15 ఏళ్ళ క్రితం uneconomic branch lines నుంచి రైల్వేలకి 300 కోట్లకి పైగా నష్టం వస్తే, అందులో 140 కోట్ల నష్టం గోందియా, జబల్‌పుర్, చింద్‌వాడా ప్రాంతాలలోని నేరేగేజ్ లైన్ల నుంచే వచ్చింది. రైల్వే ఉద్యోగుల జీతాల పెరుగుదల కూడా ఆ నష్టాలకి కారణమే. గోందియా-చాందా ఫోర్త్, గోందియా-బాలాఘాట్, బాలాఘాట్-కటంగి, చింద్‌వాడా-ఆమ్లా మార్గాలని బ్రాద్‌గేజ్‌గా మార్చారు. సావంగి-రామ్‌రమ మార్గాన్ని తొలిగించారు. సాత్‌పురా ప్రాంతంలోని ఇతర నేరోగేజ్ లైన్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని బ్రాద్‌గేజ్‌గా మార్చడానికి రైల్వేవాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ విషయాలన్నీ తెలిసే నేను రైలు చార్జిల పెంపుని సమర్థించాను.

 7. “నువ్వు మావోయిస్త్‌వని చెప్పుకుంటూ రైలు చార్జిల పెంపుని ఎలా సమర్థిస్తున్నావు” అని నన్ను అడిగేవాళ్ళు ఉన్నారు. దాని వెనుక ఓ కథేఉంది.

  విజయనగరం జిల్లాలో బొబ్బిలి-సాలూరు పట్టణాల మధ్య ఒక రైలు మార్గం ఉంది. అది 1913లో వేసిన రైలు మార్గం. అప్పట్లో ఇనుము & ఉక్కు ధరలు ఎంతో నాకు తెలియది కానీ కేవలం 18 కి.మి. దూరం కోసం రైలు మార్గం వేసారు. అప్పట్లో బొబ్బిలి-సాలూరుల మధ్య ఆవిరి ఇంజిన్‌తో నడిచే బండి ఉండేది. 1993లో ఆవిరి ఇంజిన్‌ని తొలిగించి దీజిల్ ఇంజిన్ పెట్టారు కానీ దీజిల్ ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల 1998లో రైల్ బస్ పెట్టారు. 1998లో బొబ్బిలి నుంచి సాలూరు తికెత్ ధర 5 రూపాయలు ఉండేది కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కాలంలో అది 3 రూపాయలకి తగ్గింది. రెండున్నర ఏళ్ళ క్రితం నేను బొబ్బిలి నుంచి సాలూరు వరకు రైల్ బస్సులో ప్రయాణించాను. అప్పట్లో బొబ్బిలి నుంచి సాలూరు రైల్ బస్ తికెత్ మూడు రూపాయలే. అది ఇప్పుడు పది రూపాయలు. ఆ రోజు రైల్ బస్ TTE నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ తికెత్ ఇవ్వలేదు. అక్కడ ticketing system ఉందా, లేదా అని అనుమానం వచ్చి నేను రైల్వే అధికారులకి కంప్లెయింత్ ఇచ్చాను. అధికారులు తికెత్‌ల సేల్స్ చెక్ చెయ్యగా ఆ రోజు TTE దగ్గర ఉండే సర్వీస్ బాక్స్‌లో సాలూరు-బొబ్బిలి తికెత్‌లు ఉండేవి కానీ బొబ్బిలి-సాలూరు తికెత్‌లు లేవని తెలిసింది. నారాయణప్పవలస నుంచి సాలూరుకి కూడా తికెత్ ధర మూడు రూపాయలే. బొబ్బిలి-సాలూరు తికెత్‌లు లేకపోతే నారాయణప్పవలస-సాలూరు తికెత్‌లు ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడంతో అధికారులు నన్ను ఎంక్వైరీకి పిలిచారు. రైల్ బస్ TTE నా ఫోన్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్‌లు చేసాడు. మూడు రూపాయల తికెత్‌ల విషయంలో అవినీతి చేస్తే తనకి ఏమీ రాదనీ, తన మీద ఇచ్చిన కంప్లెయింత్ ఉపసమ్హరించికోవాలనీ నన్ను ప్రాధేయపడ్డాడు. Confronted enquiryకి అధికారులు నన్ను విశాఖపట్నం DRM ఆఫీస్‌కి పిలిస్తే వెళ్ళాను. DRM ఆఫీస్ ఆవరణలో కూడా ఆ TTE నన్ను అలాగే ప్రాధేయపడ్డాడు. తనకి ఆస్తులు ఏమీ లేవనీ, తండ్రి చనిపోతే అతని ఉద్యోగంలో తాను చేరానని కూడా ఆ TTE చెప్పుకున్నాడు. Chief Commercial Inspector చేత confronted enquiry చెయ్యించారు. “ఆ రోజు రైల్ బస్‌లో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు, బండి ఇరుకుగా ఉంది. ఆ ఇరుకులో అతను నాకు తికెత్ ఇవ్వడం మర్చిపోయి ఉంటాడు. ఇది అతని మీద వచ్చిన మొదటి కంప్లెయింత్ కనుక అతన్ని వదిలెయ్యండి” అని నేను అన్నాను. అదే సమయంలో నేను సాలూరు రైల్వే స్తేషన్ ఊరికి అర కిలో మీతర్ దూరంగా ఉందేమిటి అని అడిగాను. సాలూరు రైల్వే స్తేషన్ గురించి తమకి చాలా కంప్లెయింత్‌లు వచ్చాతని కమర్షియల్ ఇన్స్పెక్తర్ అన్నాడు. “కిలో మీతర్ రైలు మార్గం వెయ్యడానికి కోటి రూపాయలు ఖర్చవుతుంది. యాభై లక్షలు ఖర్చుబెట్టి అర కిలో మీతర్ రైలు మార్గం వేసినా మూడు రూపాయల తికెత్‌ల వల్ల అంత డబ్బు తిరిగి రాదు” అని కమర్షియల్ ఇన్స్పెక్తర్ చెప్పాడు. రైలు చార్జిలు ఇంత తక్కువగా ఉండడం వల్లే పెందింగ్ రైల్వే ప్రోజెక్త్‌లు పూర్తవ్వడం లేదని నాకు అర్థమయ్యింది. అందుకే నేను రైలుచార్జిల పెంపుని సమర్థించాను.

  సాధారణ జనం ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం కరెన్సీ కట్టల ముద్రణ అనుకుంటారు. General Equilibrium, Partial Equilibrium, Elasticity of Demand, The Law of Diminishing Returns లాంటివి వీళ్ళకి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ కట్టలు ముద్రించి ఆ డబ్బుతో రైలు మార్గాలు వేస్తుందని వీళ్ళు అనుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s