ఇండియాయే అందరికీ నేర్పింది -రష్యా టుడేలో ఓ వ్యాఖ్య


Moon

రష్యా టుడే పత్రిక ఈ రోజు (జూన్ 11, 2014) ఒక వార్త ప్రచురించింది. దాని ప్రకారం భూమి, చంద్రుల వయస్సు గతంలో ఊహించినదాని కంటే 6 కోట్ల సంవత్సరాలు ఎక్కువని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సూర్య కుటుంబం ఏర్పడిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, చంద్రుడు గ్రహాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సేకరించిన Xenon ఐసోటోప్ లను పరిశోధించాక ఇది తప్పనీ సూర్య కుటుంబం ఏర్పడిన 4 కోట్ల సంవత్సరాలకే భూ, చంద్ర గ్రహాలు ఏర్పడ్డాయనీ వారు నిర్ధారణకు వచ్చారు.

మార్స్ (అంగారకుడు) అంత పరిణామం ఉన్న మరో పెద్ద గ్రహం ఒకటి భూ గ్రహాన్ని ఢీ కొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడని శాస్త్రవేత్తల అంచనా.

ఈ వార్త కింద ష్నీడర్ అనే వ్యాఖ్యాత ఇలా వ్యాఖ్యానించారు.

ఈ సో కాల్డ్ సైంటిస్టులందరూ ఒకటో రకం వెధవలు (ఈడియట్లు).

వారికి చంద్రుడు దేవుడనీ, భూమి దేవత అనీ, దైవాంశ సంభూతులనీ తెలియదు.

హిమాలయాల్లో రహస్యంగా నివసించే గురువులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు.

నికోలా టెస్లా (సెర్బియన్ అమెరికన్ శాస్త్రవేత్త. ఆల్టర్నేట్ కరెంట్ విద్యుత్తును కనుగొన్నాడు. వైర్ లెస్ కమ్యూనికేషన్స్ కు ఆద్యుడు) తన  విజ్ఞానాన్నీ, తన రహస్య యంత్రాల ఐడియాలనీ తాంత్రిక గురువు వివేకానంద నుండి సంగ్రహించాడు.

ఆల్బర్ట్ ఐనిస్టీన్ స్వయంగా ఇలా అన్నారు, “భారత దేశమే మాకు లెక్కలు బోధించింది. ఆ బోధనే లేకపోతే ఎటువంటి శాస్త్రబద్ధ ఆవిష్కరణాలూ ప్రపంచంలో సాధ్యమయ్యేవి కావు.”

హిట్లర్, ఆయన శాస్త్రవేత్తలూ తమ సైన్స్ ని అధర్వణ వేదం నుండే సంగ్రహించారు. హిట్లర్ ఓడిపోయాక ఆ శాస్త్రవేత్తలను రష్యా, అమెరికాలు వశం చేసుకున్నాయి.

మార్క్ ట్వయిన్ ఓసారి స్వయంగా ఇలా అంగీకరించారు, “భారత దేశం మానవ జాతికి ఊయల, మానవుడి మాటకూ, ఇండో-యూరోపియన్ భాషలకూ పురిటిగడ్డ.”

పైధాగరస్ తన గణిత విజ్ఞానాన్ని, తన సిద్ధాంతాన్నీ గంగా నది ఒడ్డునే అభ్యసించారు.

చాలా తమాషాగా ఉంది కదా!?

18 thoughts on “ఇండియాయే అందరికీ నేర్పింది -రష్యా టుడేలో ఓ వ్యాఖ్య

 1. మీరు ఇచ్చిన లింక్ చదివాను, అతను ఎవరో కొంచెం వెటకారం ఎక్కువ మనస్తత్వం అనుకుంట .రష్యాలో గత సంవత్సరం భగవద్గీతని నిషేధించాలని ఎవరో ఉద్యమించారు, బహుశా ఆ ఉద్యమంలోని వ్యక్తి ఏమో ఇతను.. 🙂 🙂

 2. ప్రాచీన కాలంలో తత్వచింతన, ఖగోళ శాస్త్రం, రేఖాగణితం మొదలైన అంశాల్లో భారతదేశం ఒక వెలుగు వెలిగిందనడంలో సందేహం లేదు. భగవంతుడి జ్ఞానాన్నే సందేహించిన నాదసూక్తం లాంటి గ్రంథం ప్రపంచ మత సాహిత్యాల్లో ఎక్కడా కనపడదు. అంతటి విజ్ఞాన పిపాస మన ప్రాచీన కాలం జనానిది. మధ్యలో కొందరు జ్ఞానాన్ని అందరికీ అందకుండా తమ బతుకు దెరువుగా మార్చుకున్నారు.ప్రజల్ని వర్గాలుగా, కులాలుగా విడగొట్టి దోచుకున్నారు. ఆ క్రమంలోనే పరాయి దేశస్థులకి కూడా ఈ దేశ ప్రజల్ని బానిసల్ని చేశారు.

  ఐతే పై పోస్టులో ఆయనెవరో అన్నట్లు టెస్లా….వివేకానందుడి దగ్గర సైన్స్ నేర్చుకోవడమేమిటి…?
  ఎందుకంటే వివేకానందుడు పశ్చిమ దేశాలకు వెళ్లింది 1891 లో, కానీ అప్పటికే టెస్లా1886 నాటికే ఏసి కరెంట్ గురించి చాటి చెప్పాడు. ఇది కచ్చితంగా నాగ శ్రీనివాస్ గారు అన్నట్లు వెటకారమే….

  మరీ “వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష.” అనేంత చాదస్తం కాదు కానీ….మన ప్రాచీన జ్ఞాన సంపద ఎంతో ఉత్కృష్టమైనదే.

 3. ఈ అశాస్త్రీయ వాదులంతా దబాయింపు సెక్షన్‌ కిందనే పని జరుపుకుంటారు. మీరు టీవి ల చర్చలో అవతలి వ్యక్తిని మాట్లాడ నివ్వక పోవడం వీరి కి వెన్నతో పెట్టిన విధ్య. ఎందుకంటే అవతలి వాళ్లు మాట్లాడి నిజం చెబితే తమ వాధానికు ఎక్కడ పటిమ దో నని వీరి భయం! అలాంటి శాల్తే ఇతను.

 4. లేదు లెండి… భారతీయులు ఎందుకూ పనికిరాని వారు.. వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా తెలియనప్పుడు పాశ్చాత్యులు పట్టు బట్టలు ధరించేవారు. మనం రోమన్ నంబర్స్ వాడేటప్పుడు వాళ్ళు “హిందూ” అంకెలు, దశాంశ పద్దతి వాడేవాళ్ళు. మనమే వాళ్ళ సైన్సు ని కాపీ కొట్టాము. ఆ మాటకొస్తే, మన భాషలు కూడా వాళ్ళ పుణ్యమే. ఇంకా చెప్పాలంటే భారతీయులందరూ, వాళ్ళకి పుట్టిన వాళ్ళమే. అందుచేతా, మన చరిత్ర గురించి తెలుసుకోకుండా, మనకి మనం ఆలోచించకుండా, వాళ్ళు చెప్పిందే గొర్రెల్లాగా తలాడించి, ఇలాగే బానిస బ్రతుకు బ్రతికేద్దాం. ఎందుకంటే, వాళ్ళ నోట్లోంచి వచ్చిందే అసలయిన చరిత్ర కదా.. మనవన్నీ పుక్కిట పురాణాలు కదా. మనకి సొంత ఆలోచనతో పాటు సిగ్గు కూడా లేదాయే…

 5. అయ్యో! మీకు తెలీదులాగుంది. మనకి సిగ్గు టన్నుల కొద్దీ ఉందిలెండి. ఆ మధ్య దర్బన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కులం గురించి చర్చించాలని మన జనమే అడిగితే ‘అబ్బే ఇండియాలో అసలు కులం ఎక్కడిది, ఎప్పుడో రద్దు చేసేసుకున్నాం’ అని ఎందుకు బొంకాం అనుకుంటున్నారు? కులం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడే.

  అదేం ఖర్మో (ఖర్మభూమి గందా) గానీ వేదాల్లోనే అన్నీ ఉన్నా వెధవది పారిశ్రామిక విప్లవం మాత్రం యూరప్ లోనే వచ్చి తగలడింది. ఎందుకంటారు? ప్రపంచం అంతా వెనకబడి ఉంటే మనం ముందు పడిపోవడం ఏమిటా అని మనవాళ్ళు సిగ్గుపడిపోయారు. ఐరోపా ఎట్లాగూ సిగ్గులేని జాతులు కదా, పరుగెత్తి ముందుపడిపోయారు.

  బోలెడు నాలెడ్జీ ఉన్నా, ఇక్కడ జనానికి అవసరమూ ఉన్నా, భరత గడ్డ పైన పని చేయడానికి సిగ్గుపడిపోయే కదా, మన మేధావులంతా అమెరికా, ఐరోపాల వెళ్లిపోతంది! అసలు తెల్లవాడు ఇక్కడికి దండెత్తి వచ్చినా వాళ్లమీద పోరాడ్డానికి సిగ్గుపడే కదా మనలో మనం వెన్నుపోట్లు పొడుచుకుని వాడికి దారిచ్చింది!

  మన నాలెడ్జిని మనమే ఉపయోగపెట్టుకోవడం బాగోదని మనోళ్ళు మహా సిగ్గుపడిపోయి పరాయి దేశాలోళ్లకి ఇచ్చేశారు. వాళ్ళింకా పూర్తిగా డెవలప్ కాలేదన్న అనుమానంతోనే గ్రీన్ కార్డుల కోసం వలస కడుతున్నాం. చూసే మనసుండాలే గాని, మనవాళ్ల సిగ్గు గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.

 6. @SP Jagadeesh

  ప్రాచీన భారతీయులు చాలా సైన్సు విషయాలు చెప్పారనుకున్నా. దాంట్లో చాలావరకు కల్పనలు కూడా కలిసే ఉన్నాయి. మీరొకవేళ పురాణాల్లో ఉన్నవన్నీ సైన్సే అనుకున్నా అవన్నీ లోతైన మార్మికత చాటున కప్పబడి ఉన్నాయి. ఏది నిజం ఏది కల్పన అని చెప్పడానికీ, డీ-కోడ్ చెయ్యడానికీ experimental verification అవసరం. మన దురదృస్టవశాత్తు అది మనం చెయ్యడంలేదు. ఎవరైనా ఆపని చేశాక ఇది మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పుకోవడానికి మాత్రమే మన ప్రతిభ మనకు పనికొస్తుంది ప్రస్తుతం.

  మన సంస్కృత గ్రంధాల్లో సైన్సు విషయాలున్నాయనుకుంటే ఎందుకు మనం వాటిని పరిశోధించి ఒక్క మోడల్ కూడా అందజేయలేకపోతున్నాం? ఏం? నోస్ట్రడామస్ predictionsలాగా అంతా అయ్యాక ‘ఇది మావాళ్ళు ఎప్పుడో చెప్పారు’ అని జబ్బలు జరుపుకోవడానికి తప్ప మన వేద విజ్ఞానం మరొకదానికి ఎందుకు అక్కరకు రావడంలేదు?

 7. భారతీయ భాషలలో ఉర్దూ తప్ప అన్ని భాషలూ phonetic alphabetని ఉపయోగిస్తాయి. ఈ విధానంలో spelling ఎలా ఉంటుందో pronunciation కూడా అలాగే ఉంటుంది. కనుక ఈ భాషల లిపులు నేర్చుకోవడం చాలా సులభం. అయినప్పటికీ భారత దేశంలో ఇంత మంది నిరక్షరాస్యులు ఎందుకు ఉన్నారు? ఇంగ్లిష్‌లో spelling & pronunciation rules కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ అమెరికా అక్షరాస్యతలో బాగా అభివృద్ధి సాధించింది. మా చిన్నప్పుడు “అమెరికాలో దాలర్లు పండును, ఆంధ్రాలో సంతానం పండును” అనేవాళ్ళు కుటుంబ నియంత్రణ చెయ్యించుకోకుండా నలుగురైదుగురు పిల్లల్ని కనేవాళ్ళని చూసి.

 8. శేఖర్ గారు,

  వివేకానందుడు గురించి నికొలస్ టెస్లాల వెబ్సైట్ లో ఈ క్రింది వివరాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యాంశాలు
  Nikola Tesla, the great scientist who specialized in the field of electricity, was much impressed to hear from the Swami his explanation of the Samkhya cosmogony and the theory of cycles given by the Hindus. He was particularly struck by the resemblance between the Samkhya theory of matter and energy and that of modern physics.

  Swami Vivekananda, late in the year l895 wrote in a letter to an English friend, “Mr. Tesla thinks he can demonstrate mathematically that force and matter are reducible to potential energy. I am to go and see him next week to get this new mathematical demonstration. In that case the Vedantic cosmoloqy will be placed on the surest of foundations. I am working a good deal now upon the cosmology and eschatology of the Vedanta. I clearly see their perfect union with modern science, and the elucidation of the one will be followed by that of the other

  Tesla apparently failed in his effort to show the identity of mass and energy.Swamiji seems to have sensed where the difficulty lay in joining the maps of European science and Advaita Vedanta and set Tesla to solve the problem. It is apparently in the hope that Tesla would succeed in this that Swamiji says “In that case the Vedantic cosmology will be placed on the surest of foundations.” Tesla apparently failed to show the identity of energy and matter. If he had, certainly Swami Vivekananda would have recorded that occasion. The mathematical proof of the principle did come until about ten years later when Albert Einstein published his paper on relativity. What had been known in the East for the last 5,000 years was then known to the West

  The meeting with Swami Vivekananda greatly stimulated Nikola Tesla’s interest in Eastern Science. The Swami later remarked during a lecture in India, “I myself have been told by some of the best scientific minds of the day, how wonderfully rational the conclusions of the Vedanta are. I know of one of them personally, who scarcely has time to eat his meal, or go out of his laboratory, but who would stand by the hour to attend my lectures on the Vedanta; for, as he expresses it, they are so scientific, they so exactly harmonize with the aspirations of the age and with the conclusions to which modern science is coming at the present time
  ___________
  పూర్తి వివరాల కొరకు ఈ క్రింది వెబ్సైట్ చూడవచ్చు.

  http://www.teslasociety.com/tesla_and_swami.htm

 9. ఆల్బర్ట్ ఐన్ స్టిన్ దగ్గర మొదట అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి, క్వాంటం ఫిజిక్స్ లో నిష్ణాతుడైన డేవిడ్ బాన్ పై జిడ్డు కృష్ణమూర్తి, యు జి కృష్ణముర్తి ల ప్రభావం ఉంది. ఆయన వారిని చాలా సార్లు కలసి వారితో చర్చించారు.
  మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ క్రింది లింకు ల లో పూర్తి వివరాలు చూడవచ్చు.
  http://bohmkrishnamurti.com/

 10. The Inventor of Email: VA Shiva Ayyadurai

  Statements from Noam Chomsky (Pls see Right side)

  http://www.inventorofemail.com/

  Dr. VA Shiva Ayyadurai visited Infosys Chennai. He stressed the need for Innovation and Innovative Thinking. He shared his experiences in life and how he invented email as a 14 year-old poor Indian immigrant in Newark, NJ, one of the poorest cities in the USA. Dr. Shiva said that the most important thing to remember is that

  Innovation Can Happen Any Time, At Any Place, By Anybody.

  Dr. VA Shiva: The True Story of an Indian Patriot
  http://innovationdemandsfreedom.com/

  http://vashiva.com/

  Meenakshi Ayyadurai – An Amazing Woman Who Bridged Multiple Worlds – See more at:
  http://vashiva.com/vashiva-honoring-meena-ayyadurai/

  Va Shiva Ayyadurai- Sages and Scientists

  Systems thinking is the foundation for creating a real revolution to solve the massively complex problems of the world. The beauty of life perhaps lies in our common struggles to find patterns of connection across those worlds. While the particular scenes and characters of that journey may differ, the search for meaning to face our self with kindness, love and acceptance remains unchanged.
  The ancient sages of many millennia ago recognized the power of systems thinking to find such meaning. They perceived reality as a system of systems, possessing foundational properties. Major breakthroughs in modern engineering science, also have been the result of such a
  systems thinking. By appreciating the core of what ancient sages and modern engineering scientists recognized, we today have the power to create revolutionary solutions to the seemingly complex problems of the world, through embracing synergy, diversity and the power of combinations.
  In this talk, I will share my journey across those worlds, ancient and modern, art and science, mind and body, where I discovered a connection between the magical holism of the East with the scientific rigor of the West.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s