ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి


Modi with Karzai

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు జరిపి స్నేహ పూర్వక సంబంధాలవైపు అడుగులు వేశారన్న వాస్తవాన్ని వారు ఎలా స్వీకరిస్తున్నారు?

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ నేతలతో నయితే రెండుసార్లు మోడి మాట్లాడారట! “ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి ముందే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో రెండు సార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. ఆ విధంగా ఇప్పటికే దృఢతరం కావించబడిన సంబంధాలను మరింత శక్తివంతం కావించడానికి ఆయన మార్గం ఏర్పరిచారు” అని భారత రాయబార వర్గాలు చెప్పాయని ది హిందూ తెలిపింది. ఈ మేరకు మోడి నేతృత్వంలోని ఇండియాతో సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని ఆఫ్ఘన్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారని ఆఫ్ఘన్ వర్గాల ద్వారా కూడా తెలుస్తోంది.

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం కూడా తమకు అనుకూలంగా జరిగిన పరిణామంగా ఆఫ్ఘన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. “ఆఫ్ఘనిస్తాన్ విషయంలో దోవల్ భద్రతా ప్రధామ్యాల గురించి మాకు బాగా తెలుసు. మాతో దృఢమైన మిలట్రీ సంబంధాలకు ఆయన నియామకం దోహదపడుతుంది” అని ఆఫ్ఘన్ రాయబార వర్గాలు చెప్పాయని పత్రిక తెలిపింది.

ఆఫ్ఘన్-ఇండియాల మధ్య మిలట్రీ సంబంధాలు గట్టిపడినట్లయితే అది ఇరు దేశాల మధ్య ఇతర సంబంధాలను మరింతగా ముందుకు తీసుకెళ్తుందని ఆఫ్ఘన్ పాలకుల అభిప్రాయంగా తెలుస్తోంది. 2014 చివరి నుండి అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ను ఖాళీ చేసి వెళ్తున్నందున ఇండియా పాత్ర మరింత పెరగాలని వారు కోరుతున్నారు. 2014 తర్వాత కేవలం 10,000 అమెరికన్ సైనికులు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారు. ఆ మేరకు ఆఫ్ఘన్ భద్రతా బలగాల పరంగా ఖాళీతనం ఏర్పడుతుంది. ఈ ఖాళీని ఇండియా తన మిలట్రీ ఒప్పందాలతో భర్తీ చేయాలని ప్రస్తుత పాలకులు కోరుతున్నారు.

తమ బలగాల కోసం ఇండియా నుండి భారీ యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకోవాలని ఆఫ్ఘన్ పాలకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. రష్యా తయారీ అయిన MiG-21 ఫైటర్ జెట్ విమానాలు, T-72 ట్యాంకులతో పాటు స్వీడన్ నుండి దిగుమతి చేసుకున్నా బోఫోర్స్ హోవిట్జర్ తుపాకులు కూడా ఇండియా సరఫరా చేస్తుందని ఆఫ్ఘన్ ఆశీస్తోంది. అయితే పాకిస్ధాన్ వాయుతలం నుండి ఈ సామాగ్రిని సరఫరా చేయడం కుదరదని యు.పి.ఏ II ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరో అంతర్జాతీయ మార్గాన్ని ఆఫ్ఘనిస్తాన్ వెతుకుతోంది.

Modi with Sharif

పాకిస్ధాన్ వాయుతలం నుండి ఆయుధ రవాణాకు ఆ దేశం అభ్యంతరం చెప్పవచ్చన్న ప్రతిబంధకం ఆఫ్ఘనిస్తాన్ కు మరో విస్తారమైన అంతర్జాతీయ సంబంధం నెలకొల్పడానికి అవకాశం ఏర్పరిచింది. పాకిస్ధాన్ అవరోధాన్ని అధిగమించడానికి బ్రిక్స్ కూటమి సభ్య దేశాలయిన ఇండియా, రష్యా, చైనాలతో సమాంతర సంబంధాలు నెలకొల్పుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు ఇండియా నిధులతో రష్యాయే సంబంధిత ఆయుధాలు సమకూర్చాలని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే రష్యాను కోరినట్లు తెలుస్తోంది. తద్వారా మరింత సంక్లిష్టమైన ఇండియా-రష్యా-ఆఫ్ఘనిస్తాన్ త్రైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకునే సువర్ణావకాశం ఆఫ్ఘనిస్తాన్ కు అందుబాటులోకి వచ్చింది. ఇండియా పలుకుబడితో రష్యా ఆయుధాలు కొనుగోలు చేసినట్లయితే ఏకకాలంలో రెండు దేశాలతో దౌత్య, రాజకీయ, మిలట్రీ సంబంధాలు బలవత్తరం చేసుకునే అవకాశం ఆఫ్ఘనిస్తాన్ కు వస్తుంది.

మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ భద్రత, ఆయుధ అవసరాలను ఎలా తీర్చాలన్న విషయాన్ని ఇండియా ఇప్పటికే చైనా, జపాన్, ఇరాన్ దేశాలతోనూ చర్చించింది. ఈ మూడు దేశాల్లో రెండు (చైనా, ఇరాన్) భౌగోళిక రాజకీయాల్లో అమెరికాకు ప్రత్యర్ధులు కాగా జపాన్, అమెరికాకు మిత్ర దేశం కావడం గమనార్హం. అనగా ఆఫ్ఘన్ దళారులు ఇండియా ద్వారా అటు అమెరికా శిబిరంతోనూ, ఇటు అమెరికా వ్యతిరేక శిబిరంతోనూ సంబంధాలకు ప్రయత్నిస్తున్నారు. ఇవి గనుక సఫలం అయితే భారత్ కు 4 బిలియన్ డాలర్ల ఆయుధ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. పైగా ఇండియాకు కూడా అటు జపాన్ ను, ఇటు చైనాను, మరోవైపు చమురు దేశం ఇరాన్ ను వాణిజ్య పరంగా ఆకర్షించే అవకాశం లభిస్తుంది.

చైనాతో మరిన్ని దగ్గరి సంబంధాలకు కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నిస్తోంది. చైనా తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆఫ్ఘన్ బేరం ఆడుతోంది. చైనానుండి వచ్చే ఆర్ధిక, వాణిజ్య పెట్టుబడులు తమ దేశాన్ని ఏ అంతర్జాతీయ శిబిరం వైపుకు నెట్టకుండా స్ధిరీకరణ సాధించడానికి దోహదపడతాయని ఆఫ్ఘనిస్తాన్ ఆశిస్తున్నారని ది హిందూ తెలిపింది. ఇదే నిజమైతే ఇండియాకు మరో ఫ్రంట్ ద్వారా చైనాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను పెంచుకునే అవకాశం వచ్చినట్లే. ఇప్పటికే బ్రిక్స్ వేదిక ద్వారా చైనాతో వాణిజ్య, ఆర్ధిక సంబంధాలను పెంచుకోగల అవకాశం ఇండియాకు ఉన్నది.

మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభం పుణ్యమాని రష్యా, చైనాలు మరింత దగ్గరవుతున్నాయి. రష్యా సహజవాయువుపై ఆధారపడడం తగ్గించాలని ఐరోపా దేశాలు భావిస్తుండడంతో రష్యాకు చైనా అవసరం ఇంకా పెరిగింది. రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవించిన చైనాకు చమురు దాహం (శక్తి వనరు) నానాటికీ పెరుగుతోంది. ఆ దాహం పొరుగునే ఉన్న రష్యా తీర్చితే చైనాకు అంతకంటే కావలసింది మరొకటి ఉండబోదు. ఇటీవలే చైనా, రష్యాలు ఏకంగా 400 బిలియన్ డాలర్ల చమురు, సహజవాయువు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ నేపధ్యంలో ఇండియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడి అనివార్యంగా చైనా, ఆఫ్ఘన్ లతో సత్సంబంధాలు ఏర్పరుచుకోక తప్పదు. ఆఫ్ఘన్ తో వాణిజ్య సంబంధాలు నిరాటంకంగా కొనసాగాలంటే పాకిస్తాన్ తోనూ శతృత్వం మానుకుని స్నేహ సంబంధాలు పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే నరేంద్ర మోడి తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి సార్క్ కూటమి పేరు చెప్పి ఆఫ్ఘన్, పాక్ నేతలను ఆహ్వానించారు. సార్క్ నేతలందరూ హాజరు కావడంతో సార్క్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారత పత్రికల్లో కార్టూన్ లు సైతం వెలిశాయి.

కాంగ్రెస్ పాలనలో అదే పనిగా ఆఫ్ఘన్, పాక్ వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టిన మోడి, తదితర బి.జె.పి నేతలు తీరా అధికారం చేపట్టాక ఆ కాంగ్రెస్ విధానాలనే అవలంబించక తప్పలేదు. ఓట్ల కోసం చెప్పిన మాటలను, సిద్ధాంతాలను, విధానాలను అధికారంలోకి వచ్చాక కూడా అవలంబిస్తే అంతర్జాతీయ సంబంధాల్లో ఒంటరితనం ఎదుర్కోక తప్పదు. ఈ వాస్తవం మోడీకి తెలియనిదేమీ కాదు. కానీ మోడీ భక్తాగ్రేసరులకు తెలుసా అన్నదే తెలియాల్సిన విషయం. పాక్, ఆఫ్ఘన్ లను తిట్టినప్పుడల్లా వీళ్ళు కూడా పూనకం తెచ్చేసుకుని బ్లాగుల్లో బూతులు కుమ్మరించిన హిందూత్వ అభిమానగణం ఇప్పుడు మోడి అనుసరిస్తున్న ముస్లిం-స్నేహపూర్వక విధానాలకు ఎలా స్పందిస్తారు? పాత ధోరణిలోనే పోయి మోడిని ద్వేషిస్తారా లేక మోడి చెప్పారు గనుక తమ ధోరణి కూడా మార్చుకుని ‘ప్రపంచం మారుతోంది, మనమూ మారాలి’ అంటూ చిలక పలుకులు పలుకుతారా? ఏ పలుకు పలికినా వారి దురభిమానాన్ని మాత్రం సిగ్గు విడిచి చంపుకోక తప్పదన్న అనివార్యతను మాత్రం వారు గుర్తించి తీరాలి.

ఇవి సవాలు కోసమో వెక్కిరింపు కోసమో రాస్తున్న మాటలు కావు. నేతలు రెచ్చగొట్టినంతనే రెచ్చిపోయి తోటి మనుషుల పైన బూతులు గుప్పించే గబ్బు సంస్కృతిని విడిచిపెట్టమని కోరడానికి మాత్రమే. తమ అభిమాన పార్టీ అధికారంలో ఉంటే ఒక విధానం, ప్రతిపక్షంలో ఉంటే దానికి విరుద్ధమైన విధానం అవలంభించడమే సరైంది అని నమ్మితే ఇక సంస్కృతి గురించి పాఠాలు, నీతులు చెప్పడం అన్నా మానుకోవాలి.

ప్రకటనలు

4 thoughts on “ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

  1. ఆఫ్ఘన్ తో మన దేశానికి ఎలాంటి విభేదాలు లేవు. హమిద్ కర్జాయ్ మనదేశంలో చదివాడు. ఈ మధ్యే అతని భార్య డిల్లిలో ప్రసవించింది. కూతురు పుట్టింది. ఆఫ్గన్ లోని వైద్యులు ఆయన భార్య కానుపు కి అక్కడ తగిన సౌకర్యాలు లేవని చెప్పి, వేరే దేశంలో డెలివెరికి తీసుకుపొమ్మంటే, ఆయన ఇండియాకి వచ్చాడు. ఎందుకంటే ఇవే వీద్య సౌకర్యాలు పక్క దేశం ఇరాన్ లో ఉన్నా అక్కడికి వెళ్లలేదు.ఆయనకి మన దేశం అంటే ఇష్టంలో/ గౌరవమో/నమ్మకమో ఎక్కువగా ఉందని తెలుసుతున్నాది .
    ఆఫ్ఘన్ లో చైనా అడుగుపెట్టటానికి కారణం పాకిస్థానే. గత సంవత్సరం నుంచి మొన్నటివరకు ఎప్పుడులెని విధంగా చైనాలో ఇస్లామిస్ట్ లు చేసిన బాంబుల దాడి, వారి మూలాలు ఆఫ్-పాక్ లలో తేలాయి. అమేరికా వెళ్లిన తరువాత వీరి గొడవ మరింత ఎక్కువైతుందేమో అన్న అనుమానంతో ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తున్నాది.

    మోడి నాయకత్వంలో మనదేశం ఆసియా దేశాలతో జపాన్,చైనా లకు దగ్గరగా జరుగుతుంది. విదేశంగా విధానంలో ఒక దేశ ప్రధాని కొత్తగా అధికారం చెప్పటిన తరువాత, మొదట ఏదేశానికి వెళతాడో అనేది,చాలా ప్రాముఖ్యత ను సంతరించుకొంట్టుంది. అది భవిషత్ ప్రణాలికను సూచిస్తుంది. నమో ను అమెరికా వారు ఎంత వేడుకొన్నా,అపాలజిలు చెప్పినా, ఆయన మొదట అమేరికాకు, లండన్ కి (యురోప్ కి)పోవటంలేదు. జపాన్ కి పోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మోడి చైనాకు చాలా సార్లు వెళ్ళాడు. చైనా వారికి నమో అంటే సదభిప్రాయం ఉంది. ఆయనతో కలసి పనిచేయాలని వారుకూడా ఆశిస్తున్నారు. ఇదొక శుభపరిణామం.
    _______
    Sometime in 2005, goes the story at the Indian Embassy in Beijing, the then Gujarat Chief Minister Narendra Modi got in touch as he wanted to visit China and study business and investment opportunities. The Ministry of External Affairs in Delhi was cold to the idea, given the taint of the Gujarat riots of 2002, while the Embassy was unsure of what kind of protocol Mr. Modi could receive as no dignitary was available to meet him.

    Mr. Modi’s reply startled them as he said his was a “study tour,” and if they wished to, they could treat it as a personal visit. Officials describe how Mr. Modi arrived a few months later, on his own, armed with only a notebook and pen. Gujarati businessmen helped open a few doors for him, but for the most part Mr. Modi travelled to state capitals and economic zones like Shenzhen, taking furious notes. At the end of his visit, Mr. Modi said that he had been struck by three things – the importance of economic diplomacy, the marvel of urban planning (his plan for the Sabarmati riverfront possibly came from here), and the fact that China was hampered most by the lack of spoken English in the country.

    http://www.thehindu.com/opinion/lead/new-realities-in-the-world-order/article6075692.ece
    __________

    More consensus than differences with India, says Chinese Minister
    http://www.thehindu.com/news/national/more-consensus-than-differences-with-india-says-chinese-minister/article6093108.ece

    ‘‘పర్చేసింగ్ పవర్ పారిటీ మెథడ్ (పిపిపి)’’ ద్వారా లెక్కించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన మైఖేల్ ఫోర్‌సైధి, నీల్ గౌథ్‌లు, 2011 నాటి ప్రపంచ బ్యాంకు గణాంకాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలతో బాహ్యగణన నిక్షేపం ద్వారా..‘‘ఈ ఏడాది చైనా అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందనున్నదని’’ నిర్ధారించారు. ప్రపంచంలోని వివిధ ఆర్థికవేత్తలు గతంలోనే దీన్ని అంచనా వేసినప్పటికీ, మరీ ఇంత వేగంగా చైనా ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని మాత్రం వారు ఊహించలేదు. ఇక భారత్ విషయానికి వస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలో ఉన్న జపాన్‌ను అధిగమించి ముందుకు దూసుకుపోనున్నదని కూడా ఇవే గణాంకాలు స్పష్టం చేశాయి.
    http://andhrabhoomi.net/content/feature-4

  2. క్రితం సారి ప్రధాని పదవిచేపట్టిన ఐదు రోజుల తరువాత అభినందనలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు, ఈసారి మోడి గెలిచాడనే వార్తలు రాగానే పోన్ చేసి అభినందనలు తెలిపి అమేరికాకు రావాలని ఆహ్వానించాడు. జాన్ కెర్రి అభినందనలు తెలిపినా మోడిపట్టించుకోకపోతే, నమో దృష్ట్టిలో పడటానికి ఎంతో పాట్లు పడ్డాడు. అంతటి తో ఆగకుండా అమేరికా వారు మోడిని విమర్శించిన వారితోనే మేము చేసింది తప్పు అని అపాలజి చెప్పించటమే కాక, మా ప్రభుత్వం కూడా నమోకు టాసిట్ అపాలజి చెప్పింది అని భారత ప్రజలకు తెలియజేశారు. అమెరికన్ మీడీయా ప్రభుత్వ కనులసన్నలలో పని చేస్తుందన్న సంగతి బహిరంగ రహస్యమే.

    Denying visa to Modi was a big mistake by the US: Analyst Fareed Zakaria

    It was a mistake, it was short-sighted, it was foolish. As you probably know this was a result of a rather bizarre set of circumstances in America, somebody created this Congress on religious tolerance in 1998

    Zakaria also said that the US has extended its invitation to Modi and it was now Modi’s chance to take a step ahead. “The US has to dig itself out of that hole and as I said, Obama has tried, the question is now whether Modi will be gracious,” he said.

    తెల్లవారు గుజరాత్ సంఘటన అడ్డుపెట్టుకొని మోడిని బెదిరించాలను కొన్నారు. బెదరలేదు. గెలిచిన తరువాత అపాలజి చెప్పారు. నమో పెద్దగా పట్టించుకొలేదు. వాళ్లదేశాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన వేసుకొనే డ్రెస్ కొత్త ట్రెండ్ అని అమెరికన్ మీడీయా వాళ్లు ప్రచారం మొదలుపెట్టారు. తెల్లవాళ్లు పొగిడితే పులకరించిపోవటానికి నమో,చాచా నెహ్రు కాడు వాళ్ల వలలో పడిపోవటానికి. దేశానికి ఏది లాభమో అదే మోడి ప్రభుత్వం చేస్తుంది.
    దానికి నిదర్శనం నల్ల డబ్బు మీద SIT వెంటనే వేయటం.

    Chopper scam: India recovers Rs.1,818 crore from AgustaWestland
    http://indiatoday.intoday.in/story/chopper-scam-india-recovers-1818-crore-from-agustawestland/1/365727.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s