రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్


Rahul's battle

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కనీసం ఉత్తర కుమారుడు కూడా కాదనీ, ఆయన సోనియా గాంధీకి ‘ఉత్త కుమారుడే’ అనీ ఆయనగారి ధోరణి చెబుతోందని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తామిద్దరమే బాధ్యులమని తల్లిగారితో పాటు గంభీరంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.

కానీ తీరా పార్లమెంటరీ సమావేశాలు మొదలయ్యాక ఆయన పత్తా లేకుండా పోయారు. ఎక్కడో చివరి వరుసలో కూర్చుని ‘ఎందుకొచ్చిన గొడవ’ అన్నట్లుగా ఉండిపోయారని పత్రికలు కోళ్లై కూస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడి హోదాలో మొత్తం ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపడతారని అందరూ భావించగా అనూహ్యంగా దళిత నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆ స్ధానంలో ప్రత్యక్షం అయ్యారు.

రాహుల్ గాంధీ నిరాకరించినందునే వేరొకర్ని చూసుకోవాల్సి వచ్చిందని పత్రికలు తమ భాష్యం తాము చెప్పుకున్నాయి. పార్టీ పునరుద్ధరణకు అంకితం కావడానికే ఆయన ప్రతిపక్ష నేత పదవిని వదిలేశారని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది. ఏదో ఒకటి చెప్పుకోక తప్పదు కదా!

లోక్ సభలో చూస్తేనేమో ఆయన ముందు వరుసలు వదిలేసి తొమ్మిదో వరుసలో సెటిలై పోయారని పత్రికలు సమాచారం ఇచ్చాయి. ఆయన ఎక్కడ కూర్చుంటేనేమీ, సమస్యలపై పోరాడతారా లేదా అన్నదే చూడండని శశిధరూర్ ఈ వార్తను కూడా కవర్ చేశారు. రాహుల్ గారు కత్తీ డాలు విసిరేసి ఆడుకోడానికి పరుగెత్తగా, చివరికి రాహుల్ గాంధీ చేయాల్సిన ప్రాధమిక యుద్ధాన్ని కూడా అనుచరగణమే చేయాల్సి వస్తోంది!

ఎక్కడి 206 సీట్ల అధికార కాంగ్రెస్, మరెక్కడి 44 సీట్ల ఉత్త కాంగ్రెస్?! బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అంటే ఇదేనేమో!

2 thoughts on “రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్

  1. అదే కాంగ్రెస్ ఏ మాత్రం మెజారిటీ సాధించినా రాహుల్ గాంధీ ఇలాగే ప్రవర్తించేవారా…
    ఓటమినైనా…, గెలుపునైనా సమానంగా స్వీకరించగలవాడే ఉత్తముడు. గెలిస్తే నాది. ఓడిపోతే సంబంధం లేదనేవాడు ఉత్తముడు కాదు. ఉత్త వాడు కూడా కాదు. పరమ చెత్తముడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s