ముస్లిం టెకీ హత్య: హిందూ రాష్ట్ర సేన ఘాతుకం


Shiv Sena protest in Pune

Shiv Sena protest in Pune

నరేంద్ర మోడి నేతృత్వం లోని హిందూ జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో సరిగ్గా వారం రోజులు పూర్తయింది. బి.జె.పి గానీ, మోడి గానీ అట్టహాసంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలులోకి వచ్చేదీ వివరాలేవీ ఇంకా వెల్లడి కానేలేదు. కాంగ్రెస్/యు.పి.ఏ అమలు చేసిన నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను మరింత దీక్షతో నిర్నిరోధంగా అమలు చేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు పెట్టుకున్న ఆశలను ప్రజలను మెప్పిస్తూ ఎలా నెరవేర్చవచ్చో తగిన ఐడియాలేవీ ఇంకా ప్రకటించబడనే లేదు. కానీ అప్పుడే ఉన్మాద మూకల చేతుల్లో ఒక ముస్లిం ఐ.టి ఇంజనీర్ హతం అయ్యాడు.

పూనే నగరంలో సోమవారం జరిగిన ఈ దుర్మార్గం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఎవరో శివాజీ విగ్రహం పైకి రాళ్ళు విసిరారన్న కక్షతో ఐ.టి ప్రొఫెషనల్ అయిన మోహిసిన్ సాదిక్ షేక్ ను ఇష్టారీతిన కొట్టి, చంపేశారని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం ప్రార్ధనలను ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దుండగులు దాడి చేశారని వారు తెలిపారు. అతనితో పాటు ఉన్న మిత్రుడు రియాజ్ చూడడానికి ముస్లిం లాగా లేకపోవడంతో ఆయన బతికిపోయినట్లు తెలుస్తోంది.

మరాఠా రాజు ఛత్రపతి శివాజీ, శివ సేన దివంగత నేత బాల్ ధాకరేల ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని పోలీసులు చెప్పారు. ఫలితంగా పూనే నగరంలో కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయని తెలుస్తోంది. ఫేస్ బుక్ పోస్టులకు ప్రతీకారంగా హిందూ రాష్ట్ర సేనకు చెందిన యువకులు వీధులకెక్కి ముస్లిం సెటిల్మెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రారంభించారని డి.సి.పి మనోజ్ పాటిల్ తెలిపారు.

“సోమవారం సోషల్ మీడియాలో వివిధ పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. శివాజీ విగ్రహం పైకి రాళ్ళు విసిరేశారని ఈ పుకార్ల సారాంశం. దానితో హిందూ రాష్ట్ర సేనకు చెందిన యువకులు గుంపులుగా వీధుల్లోకి వచ్చారు. వాళ్ళు ముస్లిం సెటిల్మెంట్లను లక్ష్యంగా చేసుకున్నారు. మోహిసిన్ పైన దాడి జరిగిన చోట లభ్యం అయిన మోటార్ సైకిళ్ళ ఆధారంగా అనుమానితులను పట్టుకున్నాము” అని డి.సి.పి మనోజ్ పాటిల్ చెప్పారని ది హిందు తెలిపింది.

దాడి జరిగినప్పుడు మోహిసిన్ తో పాటు అతని మిత్రుడు రియాజ్ కూడా ఉన్నారు. అయితే రియాజ్ చూడడానికి ముస్లింలాగా లేకపోవడంతో అతనిపై హిందూ మూకల దృష్టి పడలేదు. “నాకు గడ్డం లేదు. స్కల్ కేప్ కూడా ధరించలేదు. కానీ మోహిసిన్ కి అవి రెండూ ఉన్నాయి. ముస్లిం అని చూడగానే తెలిసిపోతుంది. దానితో నేను బతికిపోగా మోహిసిన్ బలైపోయాడు” అని రియాజ్ చెప్పారని పత్రిక తెలిపింది.

మూకలు దాడి ప్రారంభించడంతో సహాయం పొందడం కోసం తాను పరుగెత్తానని, మోహిసిన్ సోదరుడిని వెంటబెట్టుకుని వచ్చేసరికి కర్రలతో ఇష్టారీతిన చావబాది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని రియాజ్ తెలిపారు. మోహిసిన్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 1 గంటలకు మోహిసిన్ చనిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంకర్ కాలనీ లోని మోహిసిన్ నివాసం సమీపంలోనే దాడి జరిగిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.

హిందూ రాష్ట్ర సేన అధిపతి ధనంజయ్ దేశాయ్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయనని మోహిసిన్ కేసులో అరెస్టు చేయలేదని మార్చి నెలలో అభ్యంతరకర పాంప్లెట్లు ప్రచురించిన కేసులో  అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. మోహిసిన్ కేసులో 7 గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఐ.టి మేనేజర్ గా పని చేస్తున్న 24 యేళ్ళ మోహిసిన్ మరణంతో ఆయన కుటుంబం విలపిస్తోంది.

పోలీసుల ప్రకారం మార్ఫింగ్ చేసిన శివాజీ, ధాకరే ల ఫోటోలు మహారాష్ట్రలోని ఒస్మానాబాద్ జిల్లాకు చెందినవారు ఎవరో పోస్ట్ చేశారు. తదనంతరం పూనే నగరంలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. 7 హిందూ మితవాద సంస్ధలకు చెందిన కార్యకర్తలు ఈ అల్లర్లలో భాగం పంచుకున్నారని పోలీసుల సమాచారం. వారు జరిపిన దాడుల్లో గత వారం దాదాపు 200 బస్సులు ధ్వంసం అయ్యాయని పోలీసులు తెలిపారు. శివాజీ, ధాకరే ల ఫోటోలను అభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసినందుకు వ్యతిరేకంగా నిరసన చేసే పేరుతో మూకలు ఈ అల్లర్లకు పాల్పడ్డారు.

హిందూ రాష్ట్ర సేన నేత ధనంజయ్ మాటలు, సదరు సంస్ధ కార్యకర్తల నిర్వాకానికి బద్ధ విరుద్ధంగా ఉండడం విశేషం. “అవమానకర చిత్రాలను (ఇంటర్నెట్ లో) సర్క్యులేట్ చేయడం సైబర్ నేరం కిందికి వస్తుంది. కానీ అమాయకులను చంపడం వలన సమస్య పరిష్కారం కాదు. అవమానకర చిత్రాలను అప్ లోడ్ చేయడాన్ని మేము ఖండించాము తప్పితే అమాయకులపై దాడికి మేము పధకం వేయలేదు. రాష్ట్రం అంతటా మాకు శాఖలు ఉన్నాయి. కానీ మా కార్యకర్తలెవరూ ఇలాంటి దాడికి పాల్పడిన ఘటన ఎన్నడూ లేదు” అని ఆయన అన్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.

ప్రస్తుతం అసలు ఉనికిలోనే లేని శివాజీ పైన అవమానకర చిత్రాలు సర్క్యులేట్ చేయడం సైబర్ నేరం సరే! కానీ ఉనికిలో ఉన్న 24 సంవత్సరాల యువకుడిని కేవలం అతని మత విశ్వాసం కారణంగానే అమానుషంగా కర్రలతో కొట్టి చంపడం ఇంకే నేరం కావాలి? అమాయకులను చంపడానికి ప్రత్యేకంగా పధకం వేస్తేనే అల్లర్లు జరుగుతాయా? అర్ధం పర్ధం లేని భావోద్వేగాలను కార్యకర్తలలో రెచ్చగొట్టి పెట్టాక ఆ తర్వాత జరిగే దాడులకు మాత్రం తమ బాధ్యత లేదనడం ఎంతవరకు సబబు? బాబ్రీ మసీదును కూలదోసి రాముడికి గుడి కట్టాలని రధయాత్రలు నిర్వహించి మరీ ప్రచారం చేసిన అద్వానీ, తీరా మసీదును కూల్చినాక తమ బాధ్యత లేదని తప్పుకున్నట్లే ఉన్నాయి ధనంజయ్ మాటలు!

4 thoughts on “ముస్లిం టెకీ హత్య: హిందూ రాష్ట్ర సేన ఘాతుకం

 1. Why have people started taking Facebook and other networking sites so seriously ? Why police cases, jails, murders and bloody riots on the basis of online posts ? They are there just for the sake of fun and time-pass. They are just gossip. Why do people refuse to look at gossip as gossip ? Why do they take them to be a sort of life and death problem ? With technology comes freedom. Bow to it. Else boycott technology altogether.

 2. దారుణం.ఎవరో ఏదో చేస్తే అమాయకుల్ని చంపుతారా? ఉన్మాదం కాదా ఇది? బొంబాయి సినిమా గుర్తొచ్చింది. దోషుల్ని వెంటనే సిక్షించాలి.మతం అంటూ మానవత్వాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?

  మోదీ పాలనకు మొదటి పరీక్ష, పాస్ అవుతారా? ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా స్పందిస్తారా,లేక బాధ్యత గల పి.ఎం. లా చర్యలు తీసుకుంటారా /చూడాలి.

  మహొజస్ ,

  సామజిక మాధ్యమాలు సమాచార మాధ్యమాలుగా అంతకు మించిన పాత్రను పొషిస్తున్నాయి. వాటి ప్రభావం సమాజంపై చాలా ఉంది.ఒకరిని లేదా ఒకరి నమ్మకాలని విమర్సించే హక్కు మనకు లేదు.
  గాసిప్ అంటూ మనల్ని అవమాన కరంగా మాట్లాడితే మనం బాధపడమా? టెక్నాలజీ ని అత్యున్నతం గా ఉపయొగించుకోవచ్చు. దాన్ని సంస్కారాన్ని, సభ్యతనూ నిలబెట్టుకుంటూ కూడా చేయవచ్చు.

 3. Expression used to be the prerogative and privilege of a few journalists and famed writers in the in the age of print and electronic media. With technology, it came into the hand of everyone. It is not true that expression influences the society. Rather everyone in the society is now an expressor. When we talk of responsibility, we should also examine the aspect of civil right (right to expression). How an expression infulences, whom it influences, what it results in – these are not in the hands of the expressor. Genuinely innocuous expressions may or may not lead to a riot, or a police case. It depends on how the reader receives it. It can not be foreseen by the expressor while expressing himself. It also very difficult and almost impossible to define what is an offensicve expression and what is not.

  So, when you set out to limit people’s right to expression in the name of offensiveness, howmany areas are a strict no-no ? For example :

  We should not express anything political
  We should not express anything sexual
  We should not express anything religious
  We should not express anything gender-related
  We should not express anything caste-related
  We should not express anything prejudicial to the interests of corporates
  We should not express anything regional
  We should not express anything personal
  We should not express anything against Govt. policies
  ……….so on and so forth

  The list seems endless. Everything is termed dangerous. Everything is banned. Everyone qualifies to be arrested or attacked, provided there is a complainant. So, in the ultimate analysis, what are we finally left with to talk about on-line ? We are apparently back to the dark ages when people have no democratic rights.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s