పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుంటున్నాయి.
దళితులు, ఆదివాసీలు, ముఖ్యంగా మహిళలు, తమ జీవితాల్లోని ప్రతి ఒక్క నిమిషమూ అవమానపడుతూ, దోపిడీకి గురవుతూ బతుకులీడుస్తున్నారు. తిరస్కారం, వివక్ష, కక్ష సాధింపుల కారణంగా నిరంతర అసౌకర్య భారం వారిని పౌరవిహీనం చేస్తోంది, క్రుంగదీస్తోంది, అమానవీకరిస్తోంది. ఆ భారాన్ని, మిస్టర్ మోడి, మౌఖికంగానూ, స్పష్టంగానూ పట్టించుకోండి. వారి ప్రయోజనాలకు మొట్టమొదటి ప్రతినిధి మీరే అవుతారన్న హామీ ఇవ్వడం ద్వారా అది మీరు సాధించగలరు.
బహుళత్వ రిపబ్లిక్ కు బదులుగా చక్రవర్తి తరహా ఏకత్వ భాషను, అనేకత్వాల దార్శనికతకు బదులు ఏకీకృత శబ్దజాలాన్ని, వైవిధ్యాల లోపలా, పైనా వర్ధిల్లే సున్నితత్వానికి బదులు ఏకీకరించాలన్న వ్యాకరణాన్ని ప్రయోగించే అవివేకాన్ని, దుడుకుతునాన్ని ఏ ఒక్కరూ కలిగి ఉండకూడదు. భారత దేశం వైవిధ్యభరితమైన అడవి. అత్యంత గొప్పదైన తన వైవిధ్యతను నిరంతరాయంగా స్ధిరపరిచే పచ్చి ఎరువును వేసి తనను పోషించాలని అది మిమ్మల్ని కోరుతోంది. అంతే తప్ప ఒక రాజకీయ ఏకీశ్వరవాదం యొక్క ఏక వర్ణక ఏక సంస్కృతీ వాదాన్ని తన ముందు ఉంచాలని కోరుకోవడం లేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 పట్ల మీరు తీసుకున్న వైఖరి, అరిగిపోయి అర్ధరహితంగా మారిన ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్యలో రామమందిరం మున్నగు అంశాలతో పాటు మన ఉత్తర మరియు వాయవ్య ప్రాంతంలోని హిందూ శరణాగతుల పట్లా, మన తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాల్లోని ముస్లిం శరణాగతుల పట్లా మీరు జారీ చేసినవిగా మీడియా నివేదిస్తున్న ప్రకటనలు నమ్మకానికి బదులు భయాన్ని కలిగిస్తున్నాయి. మూకుమ్మడి భయం, మిస్టర్ మోడి, భారత రిపబ్లిక్ లక్షణం కాజాలదు. ఇంకా చెప్పాలంటే భారత దేశ ప్రధానిగా మీరు రిపబ్లిక్ యొక్క కనపడని అహం (ఆల్టర్ ఈగో).
భారతీయ మైనారిటీలు కేవలం భారత దేశంలోని ఒక భాగం మాత్రమే కాదు, వారు దేశం ప్రధానంలోనే కలగలిసిపోయినవారు. తాడును ఎవ్వరైనా కాల్చి నుసి చేయవచ్చు, కానీ ఎవ్వరూ దాని నుండి పురిని వేరు చేయలేరు. భారత్ మాతా కి జై, నిస్సందేహంగా మిస్టర్ మోడి, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కొమ్ము బూర నుండి వెలువడ్డ బలీయమైన ‘జై హింద్!’ నినాదాన్ని అదెంత మాత్రం కొట్టివేయజాలదు.
ఇది మీకు చరిత్రాత్మక విజయం, మిస్టర్ మోడీ, అందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను. చరిత్రాత్మక ఇన్నింగ్స్ తదనంతరం సంభవించనివ్వండి. ఆశ్చర్యకారకాలతో ప్రపంచాన్ని నివ్వెరపరచండి. మీ మద్దతుదారులు మీ నుండి దానిని ఆశించకపోవచ్చు. కానీ మీరావిధంగా ఆవిష్కృతం కావాలని మరింతమంది వేచి చూస్తున్నారు. మీ తెలివితేటలు అపారమైనవి, మీ ముందరి తరం నుండి అవాంఛనీయ మరియు అనాసక్తమైన సలహా వచ్చినట్లయితే స్వీకరించడానికి మీరు సిద్ధపడవచ్చు. మీ మౌలిక మద్దతుదారుల కరతాళ ధ్వనులకు బహుమతులివ్వండి, కానీ అదే విధంగా మీకు మద్దతు ఇవ్వనివారి నుండి నమ్మకాన్ని సంపాదించుకోండి.
మైనారిటీస్ కమిషన్ లో మీరు పునర్నియామకాలు చేసేటప్పుడు అన్ని పేర్లను ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరండి. ఎటువంటి విఎస్వ2 `1క-02వ1మార్పులు లేకుండా వాటిని ఆమోదించండి. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు, భాషీయ మైనారిటీల విషయంలోనూ అదే పద్ధతిని పాటించండి. తదుపరి ప్రధాన సమాచార కమిషనర్ (సి.ఐ.సి) ను ఎన్నుకునేప్పుడు గానీ, తదుపరి సి.ఏ.జి, సి.వీసీ లను నియమించేప్పుడు సెలక్షన్ కమిటీలలోని ప్రభుత్వేతర సభ్యుల సిఫారసులను, అవి పాక్షికం కానంతవరకూ, అనుసరించి వెళ్ళండి. మీరు బలవంతులు కనుక మీకు అటువంటి విపత్ శ్రమ తీసుకోగలరు.
దక్షిణాది లోటును సవరించుకోవడం గురించి
మిస్టర్ మోడి, మీ భారతీయ లెక్కలో దక్షిణాది లోటు ఒకటుంది. మీ విజయోల్లాసానికి తాపడం అయి ఉన్న హిందీ-బెల్టు సాదృశ్యం తనను తాను ఇరుకు చేసుకుని ఉత్తర-దక్షిణ విభజనను సృష్టించకూడదు. మీరు దక్షిణాదికి చెందిన వ్యక్తిని ఉప ప్రధానిగా నియమించండి. ఆయన రాజకీయ నాయకుడు ఎంతమాత్రం కాకూడదు. నిపుణుడయిన సామాజిక శాస్త్రవేత్త లేదా పర్యావరణవేత్త, ఆర్ధిక వేత్త లేదా జనాభా శాస్త్రవేత్త ఇలాంటి వారయితే మేలు. నెహ్రూ కేబినెట్ లో షణ్ముఖ చెట్టి, జాన్ మత్తయి, సి.డి.దేశ్ ముఖ్, కె.ఎల్.రావు లు ఉండేవారు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు. కనీసం రాజకీయ నాయకులు కూడా కాదు. ఇందిరా గాంధీ కొలువులో ఎస్.చంద్ర శేఖర్ వి.ఆర్.కె.వి.రావు లు ఉండేవారు.
రాజ్యసభకు నామి నేట్ చేయబడిన ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామి నాధన్, శ్యామ్ బెనెగల్ లాంటి వారిని యు.పి.ఏ ప్రభుత్వం ఎందుకని మంత్రులుగా నియమించలేదో నా జీవితకాలంలోనైనా అర్ధం కాకపోవచ్చు. ఒక సంప్రదాయం ఉంది. కొంతమంది దానిని ఆరోగ్యకరమైన సంప్రదాయం అని కూడా అంటుంటారు. నామినేటెడ్ సభ్యులను మంత్రులుగా నియమించకూడదన్నది ఆ సంప్రదాయం. కానీ అవసరాలు అవసరాలే. నామినేటెడ్ సభ్యులే అయిన ప్రొఫెసర్ నూరుల్ హాసన్, మనకు పని చేసిన విద్యామంత్రుల్లో అత్యంత శ్రేష్టులు!
సార్వభౌమ మరియు సైద్ధాంతిక ఉదాహరణలు మిమ్మల్ని అమితంగా ఆకర్షిస్తాయి. కనుక వాటిని సాధించేందుకు మీరు చేసే పోరాటంలో ఒక మహారాణా ప్రతాప్ అవండి కానీ విశ్రాంతిలో ఉన్నపుడు ఒక అక్బర్ అవండి. తప్పదనుకుంటే హృదయంలో సావర్కార్ గా ఉండండి, కానీ ఆలోచనల్లో అంబేడ్కర్ లా ఉండండి. మీ డి.ఎన్.ఏ లో సుశిక్షిత ఆర్.ఎస్.ఎస్ విశ్వాసిగానే ఉండండి, కానీ అవసరం వచ్చినపుడు మీకు ఓటు వేయని 69 శాతం మంది కోసం వారు కోరుకునే విధంగా హిందూస్ధాన్ యొక్క వజీర్-ఏ-అజమ్ కావాలి.
మన దేశం యొక్క అత్యున్నత పీఠాన్ని అధిష్టిస్తున్న సందర్భంగా మీకు అన్నీ విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
నేను మీ సహచర పౌరుడిని,
గోపాలకృష్ణ గాంధీ
A WELL ADDRESSED LETTER AT A RIGHT TIME..THANKS FOR TRANSLATING THIS..HOW CAN A SINGLE MAN CHANGE THE SYSTEM WITH IN OVER NIGHT..EVERY ONE,ESPECIALLY YOUTH ARE BELIEVING THAT MODI CAN TRANSFORM INDIA OVERNIGHT..HOW CAN IT POSSIBLE..FIRST THE SYSTEM SHOULD CHANGE..WITH OUT THIS MODI OR WHOM SO EVER CAN NOT MOVE OUR COUNTRY AN INCH FORWARD..MODI ACHIEVED THIS MASSIVE VICTORY BECAUSE OF CONGRESS UTTER FAILURE AND ITS SCAM HIT HISTORY..IT TRIED TO APPEASE MUSLIMS BY SHOWING MODI CARD..ONE THING IS CLEAR EVERYTHING THAT IS GOOD IN GUJARAT IS NOT BECAUSE OF ONE PERSON AND EVERYTHING THAT IS BAD ALSO NOT BECAUSE OF ONE PERSON..ANOTHER HIGHLIGHT OF THIS ELECTION IS MUSALMANS AGAIN SHOWED THEIR SECULAR NATURE BY VOTING FOR BJP IN UP..SO HIS TOP PRIORITY SHOULD BE TO CLEAR THE FEAR IN THE MINDS OF MINORITIES..
http://m.ndtv.com/article/south/karnataka-students-selling-engineering-medical-seats-as-part-of-rs-700-crore-scam-529080
గతంలో బెంగాల్ గవర్నర్ గా పనిచేసి తనదైన శైలితో ఆకట్టుకున్నారు గోపాలకృష్ణ గాంధీ. తాజాగా భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ రాసిన ఈ లేఖను మోడి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. తన పాలనలో ఈ అంశాలకు చోటు కల్పించాలి.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2 | ugiridharaprasad
As Bloomberg reports, “Italy will include prostitution and illegal drug sales in the gross domestic product calculation this year
http://www.zerohedge.com/news/2014-05-22/hookers-and-blow-how-changing-definition-gdp-officially-jumped-shark
ఈ కాంగ్రెస్ నాటకాలు చాలా బాగుంటాయి. మరి వీరికి ఇంతక్రితం జరిగిన మతకలహాలు మీద వారి అభిప్రాయం ….
పొనీ బెంగాల్ లొని మహ అరాచకాలు…
ఇది మన పెద్దల సుద్దులు.
అలాగని మనం మోది ని గుడ్డి సమర్ధన వద్దు.
ee salahalu modiki ivvatam enduku sonia ki manmohan ki ivvaleka poyada kaneesam rahul kannaaaa ivvalsind 44 ki badulu 100 anna vacheyi
ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఏంటో తెలియ చేశాడు.