ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్,
నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు అంత తేలికయిన విషయం కాదు. ఎందుకంటే మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే ఇతరుల కన్నా కూడా మీకు ఎక్కువగా తెలుసు.
మీరు అక్కడికి చేరుతారని చెప్పినవారిని నేను ఇటీవలి వరకూ నమ్మలేదు. కానీ, మీరు అక్కడికి చేరుకున్నారు! జవహర్ లాల్ నెహ్రూ కూర్చున్న డస్క్ దగ్గర కూర్చుని ఉన్నారు, లాల్ బహుదూర్ శాస్త్రి కూర్చున్న దగ్గర, ఇంకా, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా చరిత్రాత్మకమైన పోరాటం చేసిన తర్వాత మరో గుజరాతీ అయిన మొరార్జీ దేశాయి కూర్చున్న దగ్గర, అనంతర కాలంలో మీ రాజకీయ శ్రేయోభిలాషి అతల్ బిహారీ వాజ్ పేజీ కూర్చున్న దగ్గర మీరు కూర్చుని ఉన్నారు. మీరు అక్కడికి వెళ్లడం ఇష్టం లేనివారు సైతం, మీరు అక్కడికే చేరుకున్న నిజాన్ని అంగీకరించక తప్పదు.
ఆ అరుదైన అవకాశం మీకు దక్కడం సముచితమేనా అన్న విషయంలో నాకు భారీ సంకోచాలు ఎన్ని ఉన్నప్పటికీ, తీవ్రమైన అననుకూల సామాజిక సమూహానికి చెందిన మీ లాంటి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి భారత దేశ ప్రధాన మంత్రి కాగలిగినందుకు నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మన సర్వసమానత్వ రాజ్యాంగ దర్శనాన్ని ఆ అంశం అత్యంత సర్వోత్కృష్టమైన రీతిలో సుసంపూర్ణం కావించింది.
దేశం అనే భావాన్ని పునర్దర్శించడం గురించి
మీరు ఒకప్పుడు ‘చాయ్ వాలా’ అయిన సంగతి గురించి దూకుడుగా, అవమానకరంగా కొందరు మాట్లాడినప్పుడు నాకు కడుపులో దేవేసినట్లుగా అయింది. నేను నాతో చెప్పుకున్నాను, ‘జీవిక కోసం చాయ్ తయారు చేసి వడ్డించిన వ్యక్తి భారత ప్రభుత్వానికి నాయకత్వం వహించగలగడం ఎంతటి అద్భుతమైన విషయం!’ అని. ఒకరికి చంచాగా బతకడం కంటే అనేకమందికి కప్పుడు (చాయ్ ని) మోసే ప్యాలాగా బతకడం ఎంతో మెరుగు!
కానీ, మోడి గారూ, ఆ సంగతి చెప్పిన తర్వాత, భారత దేశ అత్యున్నత అధికార పీఠంపై కూర్చోబోతున్నందుకు మిలియన్ల మంది ఎందుకు వికలం చెందుతారో మీకు చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు ప్రధానంగా మోడికి అనుకూలంగానా లేక వ్యతిరేకంగానా అని ఆలోచించి వేశారని మరే ఇతరుల కన్నా మీకు ఎక్కువ స్పష్టంగా తెలుసు. "నరేంద్ర మోడి దేశానికి అత్యంత గొప్ప సంరక్షకుడు -దేశ్ కా రఖ్వాలా- కాగలరా, లేదా?" అని వారు ప్రశ్నించుకున్నారు. మన జనాభాలో 31 శాతం (మీకు పడిన ఓట్ల నిష్పత్తి) మంది ఓటర్ల ఊహలను, మీరు దేశానికి అత్యంత మెరుగైన సంరక్షకుడు కాగలరన్న ఊహలను, మీరు పట్టుకోగలినందుకే బి.జె.పి తాను గెలుచుకున్నన్ని సీట్లను గెలుచుకోగలిగింది. నిజానికి మిమ్మల్ని వారు తమ రక్షకుడని (saviour) భావించారు.