బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్


Modi toofan

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది.

నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ నాటకంగా కొట్టి పారేశాడు. నితీష్ రాజీనామాకు ముందే ఆయన ప్రభుత్వం మరో రెండు, మూడు నెలల్లో తనంతట తానే కూలిపోతుందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. తాను చెప్పినట్లే జరుగుతోందని ఆయన కాలర్ కూడా ఎగరేశారు.

నితీష్ రాజీనామా చేసినందున ఆయన స్ధానంలో మరో నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని జె.డి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రకటించడంతో సంక్షోభం సర్దుకున్నట్లు కనిపించింది. కానీ అంతలోనే నిన్న జె.డి(యు) శాసన సభా పక్ష సమావేశం జరగడం, ఎమ్మేల్యేలు అంతా కలిసి రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరడం జరిగిపోయింది. నితీష్ కూడా మెత్తబడినట్లు పత్రికలు, ఛానెళ్లు చెప్పాయి.

మళ్ళీ ఈ రోజు చూస్తే రాజీనామా ఉపసంహరణకు నితీష్ ఒప్పుకోలేదని పత్రికలు చెబుతున్నాయి. దానితో కొత్త నేతను ఎన్నుకుంటామని అధ్యక్షుడు శరద్ యాదవ్ మళ్ళీ ప్రకటించారు. ఎవరిని కొత్త నాయకుడుగా ఎన్నుకుంటారో వేచి చూడాలి. ప్రభుత్వ సంక్షోభం అలా ఉంచితే, అసలు మోడి గాలి ఎన్నికలకు ముందు ఎలా ఉందో గానీ ఎన్నికల అనంతరం మాత్రం బీహార్ ని ఊపేస్తోందని, ఈ గాలి దెబ్బకి నితీష్ కుమార్ కుర్చీలో నుండి ఎగిరి కిందపడ్డారని  కార్టూనిస్టు చెబుతున్నట్లుగా ఉంది.

3 thoughts on “బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

 1. ఇది పతంజలి, ఉదయం దినపత్రిక, 29.12.1984 లో రాశారంట. ఈ నాటి పరిస్తితులకు ఎంత అంవైంపుగా ఉందో చూడండి.:

  ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
  ————————————————————-
  ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
  దగాపడిన ఒక ఆడకూతిరిలా వుంటుంది!
  దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం.
  ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది.
  తీరని కోరికలతో లక్ష్య బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది దేశం.
  గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
  చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
  ఎన్నికలైపోయినాక దేశం ఎలాగుంటుంది.?
  ఐదేళ్ళ నిద్రకు కొంగుపరుచుకొంటున్న పిల్లల తల్లిలాగుంటుంది.
  నా దేశం ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
  అసత్య ప్రచారాల, జయ విజయధ్వానా ఘోష తగ్గినాక మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్ర హోరు వినిపిస్తుంది.
  మనకి భోజనం లేదని గుర్తుకువస్తుంది.
  మనకి ఉపాది లేదని, మనకి దిక్కు దివాణం లేదని,
  మనకి తెరువూ, తీరు లేదని మళ్ళి గుర్తుకు వస్తుంది.
  మనకి మళ్ళి వెనుకటి మన చక్రవర్తుల బిడ్డలా పట్టాభిషేకం గుర్తుకు వస్తుంది.
  మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడలు పడుతున్నాయని, మనకి మళ్ళి భయం వేస్తుంది. పంచ వర్ష ప్రణాళికల ఓటి చప్పుడు వినిపిస్తుంది.
  ఇరవై సూత్రాలకు ముడి లేదని, పథకాలు పారడం లేదని మనకి మళ్ళీ గుర్తుకు వచ్చి మన మీద మనకి జాలేస్తుంది.
  సమస్యల పరిష్కారం కోసం కాక ఓటు నెల్లుకొవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
  మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమపెట్టి, మన భయాల్ని మనకి ఎరగా చూపి మనల్ని మనవాళ్ళే వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
  రోగాలతో కుళ్ళి పోతున్న మన అమాయక దేశాన్ని మోసం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
  గోపి చిన్న వాడని పడుచుని మందలోడు మోసం చేసినంత తేలికగా
  మనల్ని “మనవాళ్ళు” చేయగలరు.
  సోలడు గింజలకు మందులున్నాయి
  అద్దెడు గింజలకు మందులున్నాయి
  పిడికెడు గింజలకు మందులున్నాయి
  తల నొప్పులకు మందులున్నాయి
  శిరసు బాధలకు మందులున్నాయి
  సూతిక నొప్పులకు మందులున్నాయి…
  అని సైకిలెక్కి అసత్య ప్రచారం చేస్తాడు.
  ఉత్తరాంద్రలో జానపదంలో మందుల మోసగాడు.
  దారిద్రానికి మందులున్నాయి.
  నిరుద్యోగానికి మందులున్నాయి.
  సమైక్యతకు మందులున్నాయి.
  సౌష్టవానికి మందులున్నాయి
  అంటారు ఎన్నికలలో మనవాళ్ళు
  సమస్యలు మిగిలిపోతాయి
  నినాదాలు మారిపోతాయి
  మందలోడు మారు వేషం వేసుకుని, మరో అసత్యప్రచారం ఆరంభిస్తాడు.
  గోపిచిన్న వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మళ్ళీ వాటినే నమ్ముతారు. అందుకనే.
  ఎన్నికలైపోయినాక ఒక విషాదాంతమైన ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది.
  ఎన్నికలైపోయినాక దేశం పరాయి వాడి పాలనలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
  ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్త్తున్నట్టే అనిపిస్తుంది.
  ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
  ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా మునుపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువుగా అగమ్యంగా వున్నట్టు అర్ధం అవుతుంది.
  పంచుకోలేక మనం తగవులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్టు తెలుస్తుంది.
  అందరు సమానులేనని మనకి ఎన్నికలైపోయినాక తెలుస్తుంది.
  పరాయి గజనీలైన, మన సొంత నిజాములైన ఒకటే అని బోధపడుతుంది.
  శ్రీకృష్ణ దేవరాయలైన, ఔరంగాజేబైనా ఒకటేనని అర్ధం అవుతుంది.
  మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
  మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
  తెలిసి తెలిసీ అయిదేళ్ళకోసారి జీవితాంతం మోసపోవటం గురించి ఏడుపొస్తుంది.
  మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
  మన మీద కొంత రోత పుడుతుంది.
  మన బుద్ది గడ్డి తింటున్నాదని తెలిసీ సిగ్గేస్తుంది.
  ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
  పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
  తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
  మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
  ఈ మొహం మరో అయిదేళ్ళ వరకూ ఎవరికి చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.

 2. Now I am sure you understand that WE count…

  69 % of Indian voters did not vote for BJP or Modi.

  The total population of India today is 1.27 billion people. The total electoral is 810,000,000 (810 Milllion people), out of which the total polling percentage in this election was 66.3%, which brings the number of people who voted to roughly 541,000,000 people. The election commission website says that 165,480,309 people voted for the BJP. In other words, the BJP’s vote share in this election hovers around 31% of those who voted.

  If you add to the number of people who are not eligible to vote (the very young, the uncounted, the ones who were missing from electoral rolls for some reason) it is clear that Narendra Modi cannot claim to represent a billion Indians. The people who voted for the BJP in this election do not amount to more than 14% of the current Indian population. Is /Was this transformative history in the making (in India/Germany) or is/was this sleight of hand or is/was it both?

  Comparison with vote shares of winning tickets in past elections is instructive. In 1977, the Janata Party got 41.1% for 295 seats. If we add the Janata Party’s allies, who took part in the government, it got 52% votes for 345 seats. The combined NDA vote share (BJP + allies) of votes polled in 2014 does not exceed 35%.

  Interestingly, in 1977 in the post Emergency election which saw a decisive defeat for the Indira Gandhi regime, her party, the Congress (I) got 34.2% of the vote share, which is 3% more than what the BJP has managed to get in 2014.

  In other words, the defeated Congress in 1977 was more representative (if vote shares are assumed to represent the popular will) than victorious BJP’s of 2014. There has been a persistent decline in the ‘representative’ character of elected governments in India over the last twenty five years. But if we take a cold look at the numbers than it is clear that the 2014 elections have given us the least representative government so far.

  – courtesy Shuddhabrata Sengupta on Kafila.org

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s