హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్


Victory lap

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది.

“అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు… ఈ అంశాల అమలుపై ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించి తీరాలి” అని ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతకర్త ఎం.జి.వైద్య పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన ముక్తాయించారు. 2004 లో ఎన్.డి.ఏ కూటమి ఓడిపోవడానికి కారణం ఈ డిమాండ్లను వెనక్కి నెట్టమేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. గత ఎన్.డి.ఏ పాలనలో ఈ డిమాండ్లు అమలు చేసి ఉన్నట్లయితే లేదా అమలు చేయడం ప్రారంభించి ఉన్నట్లయితే ఎన్.డి.ఏ ఓటమి చెందడానికి బదులు విజయం సాధించి ఉండేదని ఆర్.ఎస్.ఎస్ నిశ్చితాభిప్రాయంగా ఆయన చెప్పారు.

వివాదాస్పద హిందూత్వ డిమాండ్లు అమలు చేయడానికి రాజ్యాంగంలోనే ఏర్పాటు ఉందని ఎం.జి.వైద్య పేర్కొనడం గమనార్హం. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని కాబట్టి దాన్ని రద్దు చేసే అవకాశం రాజ్యాంగం కల్పించిందని వైద్య పేర్కొన్నారు. ఉమ్మడి శిక్షా స్మృతి రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో ఒకటి గనుక దాని అమలుకు కూడా రాజ్యాంగపరమైన ఆటంకాలు లేవన్నారు. ఇక అయోధ్యలో మసీదు కింద మందిరం పునాదులు ఉన్నట్లు రుజువయిందని వైద్య చెప్పుకొచ్చారు.

ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు అన్నది నిజమే గానీ కాశ్మీరీల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ఏక పక్షంగా ఆర్టికల్ ను రద్దు చేయొచ్చని మాత్రం రాజ్యాంగ నిర్మాతలు చెప్పలేదు. స్వతంత్ర కాశ్మీర్ రాజ్యం ఇండియాలో పాక్షికంగా కలుస్తున్న సందర్భంగా భారత రాజ్యం అక్కడి ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చింది. వారి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడతామని చెప్పింది. ముఖ్యంగా ఫ్లెబిసైట్ నిర్వహించి దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పింది. ఈ మేరకు ఐరాసకు కూడా భారత రాజ్యం హామీ ఇచ్చింది.

ఇవేవీ నెరవేరకపోగా అనేక రాజ్యాంగ సవరణల ద్వారా ఆర్టికల్ 370 ను మృత శిశువుగా మార్చివేసిన ఘనత భారత పాలకులది. ఈ ఘనతలో ప్రధమ ప్రధాని నెహ్రూ దగ్గరి నుండి వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ తమ తమ పాత్ర పోషించాయి. కాశ్మీరు ప్రజలను నిత్యం సైనికుల పహారాలో ఉంచుతూ, ఉక్కుపాదంతో పాలిస్తూ వచ్చారు. ఫలితంగా ఆర్టికల్ 370 ఎన్నడూ తన వాస్తవ అర్ధంలో అమలు కాలేదు. నిర్దిష్ట కాలం మేరకు ఆర్టికల్ 370 ని అమలు చేసి అక్కడి ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాక వారి ఆమోదంతో ఆర్టికల్ 370 ని రద్దు చేయొచ్చన్న అవగాహను మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చారు తప్ప వారి హక్కులన్నింటినీ అణచివేసి ఏకపక్షంగా రద్దు చేయొచ్చన్న అవగాహనను మాత్రం ఇవ్వలేదు.

ఉమ్మడి శిక్షా స్మృతి అమలు కూడా దాదాపు ఇదే అవగాహనతో ఆదేశక సూత్రాలలో చేర్చబడింది. సోషలిస్టు, సెక్యులరిస్టు, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా తనను తాను చెప్పుకున్న భారత రాజ్యం వాస్తవంలో ఆయా జాతులను (గణాలను) అణచివేయడం ద్వారా మాత్రమే పాలన సాగించారు తప్ప జాతుల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఎన్నడూ గౌరవించలేదు. జమ్ము కాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకూ అనేక జాతులు సాయుధులై పోరాడుతున్న సంఘటనలే భారత రాజ్యం దేశాన్ని జాతుల బందిఖానాగా మార్చిందన్న సంగతిని స్పష్టం చేస్తున్నాయి.

అదీ కాక ఉమ్మడి పౌర స్మృతి ఒక్కటి మాత్రమే ఆదేశాక సూత్రాలలో ఉన్నదా? ప్రజల సంక్షేమం కోసం సామాజిక భద్రతను సమకూర్చాలనీ, పౌరులందరికి సమాన న్యాయం అందజేయాలనీ, అవసరమైనవారికి ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలనీ, గ్రామ పంచాయితీలకు అధికారాలు ఇవ్వాలని, పని హక్కు, విద్యా హక్కు, అవసరం అయిన చోట ప్రభుత్వం సహాయం పొందే హక్కులు కల్పించాలని ఆదేశక సూత్రాలు పేర్కొన్నాయి. పని స్ధలాల్లో న్యాయమైన, మానవతా పని పరిస్ధితులు కల్పించాలని, కార్మికులకు గౌరవప్రదమైన జీవనం ఇవ్వగల వేతనాలు ఇవ్వాలని, పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని, పిల్లలందరికి నిర్బంధ విద్య అందించాలని, ఎస్.సి, ఎస్.టి ల విద్యా, ఆర్ధిక ప్రయోజనాలకు ప్రోత్సాహం ఇవ్వాలని, పౌరులందరికీ పోషకాహార విలువలు పెంచుతూ, జీవన ప్రమాణాలు పెంచుతూ ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశక సూత్రాలు పేర్కొన్నాయి. పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని, అడవులను పరిరక్షించాలని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక స్మృతి చిహ్నాలను, నిర్మాణాలను కాపాడాలని, ప్రభుత్వ ఆజమాయిషీ నుండి న్యాయ వ్యవస్ధను వేరు చేయాలనీ, అంతర్జాతీయ శాంతిని బధ్రతను కాపాడేందుకు దోహదపడాలని ఆదేశక సూత్రాలు పేర్కొన్నాయి.

ఇన్ని ఆదేశక సూత్రాలు ఉండగా ఆర్.ఎస్.ఎస్ కి కేవలం ఉమ్మడి పౌర స్మృతి కోసం మాత్రమే దశాబ్దాల తరబడి ఎందుకు పట్టుబడుతోంది? పౌరులందరికీ సమాన న్యాయం అందడం లేదన్న సంగతి ఆర్.ఎస్.ఎస్ కు తెలియదా? గ్రామ పంచాయితీల అధికారాలన్నీ ప్రభుత్వాలు తమ గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తుండగా ఆ విషయమై ఆర్.ఎస్.ఎస్ ఎప్పుడన్నా డిమాండ్ చేసిందా?

దేశంలో అనేక చోట్ల కార్మికులకు కనీస హక్కులు లేని పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం వలన ఉపాధి కరువైపోయింది. ప్రైవేటు కంపెనీల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదు. చివరికి సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉమ్మడి బేరసారాల హక్కులను సైతం కాలరాచే చట్టాలను ప్రభుత్వాలు తెచ్చాయి. అలాంటి చట్టాలను అమలు చేసిన నాయకుల్లో నరేంద్ర మోడి, చంద్రబాబు నాయుడులు అగ్రగణ్యులుగా ఉన్నారు. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు యాజమాన్యం ఇవ్వాలని ఆదేశాక సూత్రాలు పేర్కొనగా అసలు ఉద్యోగాలనే ఊడబెరికి గోల్డెన్ షేక్ హేండ్ అనీ, వి.ఆర్.ఎస్ అనీ సవాలక్ష కార్మిక వ్యతిరేక విధానాలను గత రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వాలు అమలు చేస్తుంటే ఆర్.ఎస్.ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయింది?

పనిస్ధలాలలో న్యాయమైన, మానవతా యోగ్యమైన పరిస్ధుతులు కల్పించాలన్న ఆదేశాక సూత్రం ఆర్.ఎస్.ఎస్ కు పట్టదా? కార్మికులకు గౌరవప్రదమైన జీవనం కల్పించే వేతనాలు ఇవ్వాలన్న ఆదేశక సూత్రం అనేక ప్రభుత్వ రంగ కంపెనీల్లోనే అమలు కావడం లేదు. ఈ సంగతిని ఎన్నడన్నా ఆర్.ఎస్.ఎస్ పట్టించుకుందా?

పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాధమిక విద్య ఇవ్వాలని దశాబ్దాల క్రితమే ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఇటీవల విద్యా హక్కు సైతం కల్పించారు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లోనూ పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. ఆదేశక సూత్రాల్లో భాగంగా ఉనికిలోకి వచ్చిన ఈ చట్టాల అమలు గురించి ఆర్.ఎస్.ఎస్ ఆందోళన చేయగా, కనీసం మాట్లాడగా కూడా ఎప్పుడూ వినలేదు.

పౌరులందరికీ పోషకాహార విలువలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలన్నది ఆదేశక సూత్రాలలో భాగమే. కానీ నరేంద్ర మోడి ప్రభుత్వం హయాంలో గుజరాత్ పిల్లలు దేశంలోనే అత్యధిక నిష్పత్తిలో పోషకాహారం అందక బలహీనంగా ఉన్నారని ఐరాస సర్వేలు తేల్చాయి. ఈ విషయమై ప్రశ్నించిన విదేశీ పత్రికలకు మోడి సరైన సమాధానం ఇవ్వకుండా, బాధ్యత కూడా తీసుకోకుండా నెపాన్ని ఆడపిల్లల సౌందర్య పిపాస పైకి నెట్టేశారు. పాలు తాగితే ఒళ్ళు వస్తుందని భావిస్తూ ఆడపిల్లలు పాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని చెబుతూ బోడి గుండుకు మోకాలుకూ ముడి పెట్టే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడి. రాజ్యాంగం లోని ఆదేశక సూత్రాలు పౌరులందరికి పోషకాహారం ఇవ్వాలని నిర్దేశించాయనీ కాబట్టి మోడి కుంటిసాకులు వెతకడం మాని తగిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎస్.ఎస్ ఎందుకు సుద్దులు చెప్పలేకపోయింది?

అడవులు పరిరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఆదేశక సూత్రాలు నిర్దేశించాయి. కానీ ఎన్.డి.ఏ, యు.పి.ఏ ప్రభుత్వాల ఆచరణ ఏమి చెబుతోంది? అడవులను సహజసిద్ధంగా పరిరక్షించేది గిరిజనులేననీ కాబట్టి వారికి అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలనీ అటవీ హక్కుల చట్టం పేర్కొంది. ఆదేశాక సూత్రాలతో పాటు, అటవీ హక్కుల చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ కేంద్రంలోని ప్రభుత్వాలు అటవీ సంపదలను స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు కట్టబెడుతున్నాయి.

అంతటితో ఊరుకోకుండా గిరిజనుల గ్రామాల కింద ఉన్న ఖనిజ వనరులను కంపెనీల పరం చేయడం కోసం ‘సల్వా జుడుమ్’ పేరుతో ఊళ్ళకు ఊళ్లే తగలబెడుతూ, లక్షలాది గిరిజనుల అడవులనుండి తరిమి కొడుతున్నారు. పారా మిలట్రీ బలగాలను దించి అడవి బిడ్డలను భయ భ్రాంతులకు గురి చేస్తూ విదేశీ కంపెనీల కోసం వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఒడిషా లో పోస్కో కోసం, ఛత్తీస్ ఘర్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ లలో వేదాంత బాక్సైట్ కంపెనీ కోసం, బెంగాల్ లో జిందాల్, సలీం కంపెనీల కోసం గిరిజనులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ ఆర్.ఎస్.ఎస్ దృష్టికి పట్టవా? పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఆదేశక సూత్రానికి ఆర్.ఎస్.ఎస్ దృష్టిలో విలువ లేదా?

జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక చిహ్నాలను పరిరక్షించాలని ఆదేశక సూత్రం చెబుతుంటే ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ హిందూ సంస్ధలు చేసిందేమిటి? చారిత్రక కట్టడం బాబ్రీ మసీదును కూల్చివేయడం! బహుశా బాబ్రీ మసీదు చారిత్రక స్మృతిగా ఆర్.ఎస్.ఎస్ దృష్టిలో లేకపోవచ్చు. కానీ ఆదేశక సూత్రాల స్ఫూర్తిని నమ్మిన వారు ఎవరన్నా విశ్వాసం పేరుతో యుగాల కిందటి వ్యక్తికి ఆలయం నిర్మించడం కోసం వర్తమానంలో హింసాత్మక చర్యలకు తెగబడగలరా? గురు గోల్వాల్కర్ రాసిన సిద్ధాంత గ్రంధాల్లో ముస్లింలను దేశం నుండి తరిమివేయాలని ప్రబోధించారని గుర్తుకు తెస్తే అవన్నీ ఇప్పుడేందుకు అని ప్రశ్నించే ఆర్.ఎస్.ఎస్ అభిమానులు విశ్వాసం పేరుతో బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చివేయడం ఎలా సమర్ధించుకోగలరు?

ఆదేశక సూత్రాలపైనా, వాటి అమలు పైనా గౌరవమే ఉన్నట్లయితే ఆ సూత్రాలన్నింటి అమలు కోసం ఆర్.ఎస్.ఎస్ ప్రయత్నించాలి, డిమాండ్ చేయాలి. కేవలం తమకు మాత్రమే అనుకూలంగా ఉన్న ఒక్క సూత్రాన్ని పట్టుకొచ్చి దానికి అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని చెప్పడం అవకాశవాదం మాత్రమే. అసమాన సమాజాలలో సమాన సూత్రాలను అమలు చేస్తే వచ్చే అంతిమ ఫలితం అసమానతలను మరింత పెంచడమే. సమాజంలో వివిధ జాతి, మత, లింగ, ప్రాంతాల మధ్య తీవ్రమైన అసమానతలు నెలకొని ఉండగా వారందరికీ ఒకే విధంగా వర్తించే స్మృతులను అమలు చేయాలని కోరడం అసమానతలను, యధాతధస్ధితిని కొనసాగాలని కోరడమే.

భారత దేశంలో హిందూ మత సారం కులమే. తీవ్రమైన అసమానతలను న్యాయబద్ధం చేయడానికి మాత్రమే కులానికి దైవత్వం జోడించి మరీ వ్యవస్ధీకృతమ్ చేశారు. ఇలాంటి వ్యవస్ధలో హిందూత్వ సిద్ధాంతాలను అమలు చేయడానికి పూనుకోవడం అంటే మొదలే బలహీనులపై హింసతో కూడుకుని ఉన్న సమాజాన్ని మరింతగా విధ్వంసం చేయడమే కాగలదు. నరేంద్ర మోడి ప్రభుత్వం ముందు హిందూత్వ డిమాండ్లు ఉంచడం ద్వారా విధ్వంసక పాలనను ఆర్.ఎస్.ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విధ్వంసక పాలన అంతిమంగా పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చబోతోంది.

20 thoughts on “హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

 1. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో బీజీపీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఉమ్మడి పౌరస్మృతి సగటు ముస్లిమును మౌఢ్యంనుంచి బయటకు తెస్తుంది. మత భావజాలం తిరోగామిభావజాలం. హిందువులక్కూడా హైందవధర్మశాస్త్రాల ప్రకారం జీవించే వెసులుబాటు ఉన్నట్లైతే అందులో సోకాల్డు నిమ్నవర్గాల, స్త్రీల పరిస్తితులు దయనీయంగా ఉండటమేగాక హైందవకుటుంబాలన్నీ దారిద్ర్యంలో మ్రగ్గిపోతూ ఉండేవి. ఉమ్మడి పౌరస్మృతి డిమాండు నిజానికి ముస్లిములను (ఆమాటకొస్తే అన్నిమతాలప్రజలనూ తిరోగామి భావజాలమ్నుండి) రక్షించేది. అసలు దీని అమలును కోరుకుంటూ ముస్లిం మేధావి వర్గాలు ఏమైనా డిమాందులు చేశాయేమో వివరించగలరా?

 2. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆర్.యస్.యస్ ప్రయత్నాలు చేస్తుందనడానికి ప్రత్యక్ష ఉదంతాలు ఏమైనాఉన్నాయా? అసలు ఆర్.యస్.యస్ పుట్టుకలో బహులజాతి కంపెనీల పాత్ర ఏమైనా ఉన్నదా? లేదా ఆర్.యస్.యస్ విదానాలద్వారా బహులజాతి కంపెనీలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ప్రత్యేకమైన విదానాలను ఏమైనా అవలంభిస్తున్నాయా? ఆర్.యస్.యస్ వలన బహులజాతి కంపెనీలకు ప్రయోజనాలు కలుగుతున్నయని చెప్పడానికి మీ దగ్గర ఉన్న భూమిక ఏమిటి?

 3. విశేషజ్ఞగారూ మీరు పొరబడుతున్నారనుకుంటాను. హిందూ జాతీయవాద భావాలని వారు ఏదయితే చెబుతున్నారో ఆ భావాలతో కూడిన ఉమ్మడి (కామన్) పౌర స్మృతిని మతాలకు అతీతంగా అమలు చేయాలన్నది వారి అవగాహన. మీరు ఊహిస్తున్నట్లు అది మత భావాలకు అతీతంగా, ఆదర్శయుతంగా ఉండదు. భారత దేశం హిందువుల రాజ్యం కనుక హిందూ పౌర స్మృతినే ఇతర మతాలకు కూడా అమలు చేయాలన్నది వారి డిమాండ్. అంబేద్కర్ చెప్పిన ఉమ్మడి (వాస్తవానికి ఏకీకృత అని అనువదించాలి) పౌర స్మృతి, ఆర్.ఎస్.ఎస్ ప్రభోదించే ఉమ్మడి పౌర స్మృతి ఒకటి కాదు.

  నాకు తెలిసినంతవరకూ ఏకీకృత పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) డిమాండ్ చేసే ముస్లిం మేధావులు ఉన్నారు గానీ, ఉమ్మడి పౌర స్మృతిని (కామన్ సివిల్ కోడ్) డిమాండ్ చేసే ముస్లిం మేధావులు లేరని నా అవగాహన. సెక్యులరిజంను దాని నిజమైన అర్ధంలో గౌరవిస్తూ, ప్రగతిశీల భావాలు ఉన్న ముస్లింలు యు.సి.సి వైపు మొగ్గు చూపుతారు. వారు ఆమోదించే యు.సి.సి, ఆర్.ఎస్.ఎస్ ప్రబోధించే సి.సి.సి ఒకటి కాదు.

 4. మూల గారూ గత ఎన్.డి.ఎ పాలనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మోడి విజయం సాధించినందుకు పశ్చిమ పత్రికలు విపరీతంగా సంతోషిస్తున్నాయి. ఫలితాల సరళితో మూడు రోజుల్లోనే స్టాక్ మార్కెట్లు దాదాపు ఏడు శాతం వరకు పెరిగాయి. ఈ సంవత్సరాంతానికి పాతిక వేలు మార్కు దాటుతుందని జర్మనీ బహుళజాతి బ్యాంకు డ్యూశ్చ్ బ్యాంక్ అంచనా వేసింది. మోడికి మొదటి నుండి ప్రచార వ్యూహాలు సమకూర్చిన మేధావుల్లో వాల్ స్ట్రీట్ బ్యాంకు జె.పి.మోర్గాన్ ఛేజ్ సిబ్బంది ఉన్నారు. డ్యూశ్చ్ బ్యాంక్ సిబ్బంది కూడా మోడి ప్రచార వ్యూహాలు రూపొందించారని రాయిటర్స్ చెప్పింది. గుజరాత్ లో అనుసరించిన విధానాలకు ఆర్.ఎస్.ఎస్ ఆమోదం లేదనుకుంటున్నారా? అక్కడ భూముల్ని రైతుల నుండి లాక్కుని నామమాత్ర ధరలకు (ఒక్కోసారి ఎకరం పది నుండి వంద రూపాయల వరకు) పశ్చిమ ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పారు.

  ఆర్.ఎస్.ఎస్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడలేదన్నది తరచుగా వినిపించే ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి కోసం ప్రజల పోరాటాల్ని నియంత్రించే పాత్ర తీసుకోగా ఆర్.ఎస్.ఎస్ అసలు ఉద్యమంలోనే లేదని మజుందార్ లాంటి హిందూత్వ చరిత్రకారులు కూడా చెప్పారు. స్వతంత్ర పోరాటంతో ఆర్.ఎస్.ఎస్ కు ఉన్న ఏకైక లింకు వి.డి.సావర్కార్. ఆయన కాలపాని జైలులో ఉండగా తన విడుదల కోసం వలస పాలకులతో చర్చలు జరిపి, రాజీ పడ్డారని మజుందార్ రాశారు.

 5. you fucking bitch – why u saying lies on kashmir, if i get chance i will broke your bones , fucking communist motherfucker. they raped , killed and kicked out more than 10 lakhs hindu pandits. what about that. u bloody commie – only thing you can do is deleting others comments and barking like stray dog. i will kick out all commie dogs from my country…

 6. జె.పి.మోర్గాన్ ఛేజ్ సిబ్బంది, డ్యూశ్చ్ బ్యాంక్ సిబ్బంది రూపొందిచిన ప్రచార వ్యూహాలు మోడి గెలవడానికి బాటలు వేశాయా? కనీసం మోడి జాతీయస్థాయి నాయకుడుకూడా కాడే!ఇదెలాసాధ్యం? గ్రామీణ భారతవోటర్లను కూడా ప్రభావితం చేయగలస్థాయిలో అవిఉన్నాయా? వివరించగలరా?
  సెన్సెక్ష్ 29,000 మార్క్ను చేరుకోగలదని డ్యూశ్చ్ బాంక్ అంచనావేసిందని గుర్తు!

 7. ప్రచార వ్యూహాలు రూపొందించిన వారిలో వాళ్ళూ ఉన్నారంటే దానర్ధం అవే విజయానికి కారణం అని కాదు కదా. మీ ప్రశ్నకు సమాధానంగా అది చెప్పాను. ఆ వ్యూహాలు పన్నడానికి జనాన్ని ప్రభావితం చేయగలగడానికి సంబంధం చూడనవసరం లేదు. ఎందుకంటే వ్యూహాలు వేసింది వారే అయినా అమలు చేసింది వారు కాదు కాబట్టి. ప్రచారంలో అనేక కోణాలు ఉంటాయి. వాటన్నింటిని కవర్ చేయడంలో బి.జె.పి ప్రచార వ్యూహకర్తలు సమర్ధవంతంగా పని చేశారు. మనం అర్ధం చేసుకోదగింది అంతవరకే.

 8. సాధారణంగా బ్లాగులో ఒకరి కి సలహాలిస్తే నువ్వు నాకు చెప్పొచేటంతటోడివా అని తిట్లు లంకించుకొంటారు. సాయిభార్గవ కామేంట్ చూసిన తరువాత ఈ వ్యాఖ్య రాయకుండ ఉండలేక పోతున్నాను. సాయి భార్గవ ఆవేశంచూస్తే వయసులో చిన్న వాడుగా ఉన్నట్లు ఉన్నాడు.దేశ చరిత్ర గురించి అవగాహన ఎంత ఉందో తెలియదుగాని , నాకు తెలిసిన నాలుగు ముక్కలు రాయాలనుకొంట్టున్నాను. స్వాతంత్ర సమయం నుంచి భారతదేశ చరిత్ర లో అన్ని పార్టిలు వాటి శాక్తానుసారం దేశం కోసం పోరాటం, త్యాగాలు చేశాయి. కొన్ని తప్పులు దొర్లాయి. ఏ పార్టి ఇందుకు అతీతం కాదు. ఇప్పుడు నేను కమ్యునిస్ట్ అభిమాని కాకపోయినా, ఒకప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. మనదేశ చరిత్రలో భూస్వామ్య వ్యవస్థను కట్టడి చేయటంలో, ప్రజలను ఏడ్యుకేట్ చేయటంలో కమ్యునిస్ట్ల వలన జరిగిన మేలు కూడా చాలా ఉంది. దానిని మరచిపోకుడదు. ఆ సిద్దాంతం ప్రస్తుతానికి ఉపయోగమో లేదో వేరే చర్చ.కమ్యునిస్ట్ అంటే దుర్మర్గులుగా మాట్లాడటం బాగాలేదు.

  శేఖర్ గారు నా వ్యాఖ్యలను కూడ కొన్ని సార్లు పబ్లిష్ చేయలేదు. కాని కోపం రాలేదు. ఆయన బ్లాగు ఆయన ఇష్టం అని అనుకొనే వాడిని. నెట్ లో బ్లాగులు రాసే వారు వయసులో,అనుభవంలో, వేరు వేరు సామజిక, ఆర్ధిక బాక్ గ్రౌండ్ కలిగిన వారు ఉంటారు. మీకు నిజం అని పించేది, ఇతరులు అనిపించకపోవచ్చు. అంగీకరించకపోవచ్చు. మీదగ్గర రాసే నైపుణ్యం ఉంటే ఒక బ్లాగు పెట్టుకొని ,మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. అంతేకాని నోటికొచ్చినట్లు తిట్టటం , బెదిరించటం బాగా లేదు. సాయి భార్గవ గారు మీరన్న మాటలను ఖండిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా రాయరని ఆశిస్తాను. మీకు తెలుసో లేదో హిందుత్వ వాది అయిన సుబ్రమణ్య స్వామి తమ్ముడు కమ్యునిస్ట్. అది గమనించాలి. ఇది చదివి మీరు నన్ను తిట్టినా ప్రతిస్పందించను.తిట్ల వల్ల సాధించేది ఎమి ఉండదు.

 9. శ్రీరాం గారూ, మీ ఉదాత్త అవగాహనకు అభినందనలు. ధన్యవాదాలు కూడా.

  మీరు రిఫరెన్స్ కోసం మరీ ఎక్కువగా లింక్ లు ఇచ్చినపుడు అవి స్పామ్ లోకి వెళ్లిపోతాయి. అలాంటి సందర్భాల్లో నేను చూస్తే అన్-స్పామ్ చేసి ప్రచురిస్తాను. ఒక వేళ చూడకపోతే అవి అక్కడ అలాగే ఉండిపోతాయి. వర్డ్ ప్రెస్ వాళ్లు స్పామ్ వ్యాఖ్యలను కొన్ని రోజులకు వారే ఖాళీ చేసేస్తారు. బహుశా ఆ విధంగా మీ వ్యాఖ్యలు ప్రచురణ జరగలేదేమో గానీ నాకు తెలిసి నేను పూనుకుని మీ వ్యాఖ్యలను ప్రచురించకుండా ఉన్న ఉదాహరణ లేదు. ఒకటి రెండు సార్లు మీరు యూ ట్యూబ్ వీడియో లింక్ ఇచ్చినపుడు ఎందు చేతనో ఆమోదించినా పోస్ట్ అయ్యేవి కావు. అలాంటి సందర్భాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి.

  హిందూత్వ అవగాహనను సిన్సియర్ గా నమ్ముతూ అది దేశానికి మంచి చేస్తుందని నమ్మితే అందులో అభ్యంతరం ఏమీ ఉండనవసరం లేదు. కానీ అదే గొప్పది అని నమ్మి అలా నమ్మనివారిని ఈ విధంగా ద్వేషించడమే అభ్యంతరకరం. ఈ వ్యక్తి గతంలో కూడా తీవ్ర పదజాలంతో దూషించాడు. రెండు, మూడు రోజుల క్రితం కూడా దూషించాడు. అయినా ఓపిక పట్టి దూషణ లేని వ్యాఖ్యలోను ప్రచురించాను. అయినా తన వక్ర బుద్ధిని సవరించుకోలేకపోయాడు. ఈ విధంగా ప్రవర్తించేవారు తాము నమ్ముతున్నామన్న భావాలను కూడా అప్రతిష్టపాలు చేస్తున్నామన్న స్పృహను కలిగి ఉండాలని కోరుకోవడం తప్ప ఏం చేయగలం?

  మీరు ప్రదర్శించిన అవగాహన ఇతర వ్యాఖ్యాతలకు ఆదర్శవంతంగా ఉండగలదని నా ఆశ.

 10. సర్,ఆర్.యస్.యస్ వాళ్ళు బహుళజాతి కంపెనీల వ్యవహారంలో మోడీకే నిర్నయాధికారం కట్టబెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని నేటి(19-5-2014) ఈనాడు పత్రికలో చదివాను.ఆర్.యస్.యస్ వాళ్ళ విషయంలో మీ వ్యాఖ్యల ఆర్ధాన్ని గ్రహించడానికి అవకాశం దొరికింది.
  ధన్యవాదాలు!!

 11. మూల గారూ, సంతోషం. మీ కృషికి అభినందనలు.

  మీకు ఒక సమాధానం బాకీ ఉన్నాను. నేను ప్రస్తుతం ఇతర రాతలో కాస్త బిజీగా ఉన్నాను. అది అయ్యాక రాస్తాను.

 12. భారత దేశంలో హిందూ మత సారం కులమే. తీవ్రమైన అసమానతలను న్యాయబద్ధం చేయడానికి మాత్రమే కులానికి దైవత్వం జోడించి మరీ వ్యవస్ధీకృతమ్ చేశారు

  … చరిత్రను పరిశీలిస్తే మీరు అన్నది నిజమే. కులం ద్వారా అసమానతలు పెంచుతుంటే, కులం అన్న భావనను తుంచేయాలి. కానీ హిందు మతాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారో అర్ధం కావడం లేదు. తెలుగువాడిగా పుట్టి గొప్పవాడిగా గుర్తించబడాలంటే అయితే చచ్చిపోవాలి లేదా హిందూ మతాన్ని విమర్శించాలి అని ఎక్కడో విన్నాను. మీరూ రెండో రకం బాపతులా ఉన్నారు. క్రిస్టియానిటీ, ముస్లిం మతంలోనూ చాలా లోపాలు ఉన్నాయి. ఆయా మతాల వారూ మూర్ఖంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. వాటి ఆధారంగా మీరు లేదా మీ లాంటి వారు ఆర్టికల్స్‌ రాయడం చూడలేదు. బహుశా భయమో.., లేక మీ కీర్తీ కండూతి తీరదు అనే భావమో.

  హిందూ మతంలో ఉన్న చెడు భావనలు (కులం వగైరా లాంటివి ) నిర్మూలనకు సలహాలు అందించండి. అంతే కానీ.., హిందూ జాతికే వ్యతిరేకంగా రాయడం సబబు కాదు. కులం లాంటి కొన్ని చెడు విషయాలు ఎలా ఉన్నాయో.., హిందూ మతంలో అనేక మంచి విషయాలూ ఉన్నాయి. వాటినీ గుర్తుకు తెచ్చుకొండి.

  హిందూ మతంలో కులం అనే విషయం నచ్చకే అప్పట్లో బుద్ధిజం లాంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. నేడు టార్గెట్లు పెట్టుకుని హిందువులును క్రిస్టయన్లుగా మారుస్తున్న వారికి కూడా ఆధారం కులం అసమానతలే ఆధారం. కాబట్టి కుల నిర్మూలన చేసి హిందూ జాతి బలోపేతం చేసుకునే విధంగా సలహాలు ఇవ్వగలరని మనవి.

 13. శ్రీనివాస్ గారు…

  ఇదో “సిక్యులరిజం” లెండి. అయినా హిందువులని అంటే పడతారు గాని, ఏ ముస్లింలనో ఇతరుల్నో అంటే ఊరుకోరుగా..!!! మీరు అడిగిన విషయాల్లో కొన్నింటికైనా విశేఖర్ గారు సమాధానమిస్తారో లేదా అసలు హిందూ మతం మన సమాజానికి వినాశకారి అని తేలుస్తారో చూడాలి.

  “నరేంద్ర మోడి ప్రభుత్వం ముందు హిందూత్వ డిమాండ్లు ఉంచడం ద్వారా విధ్వంసక పాలనను ఆర్.ఎస్.ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విధ్వంసక పాలన అంతిమంగా పశ్చిమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చబోతోంది.”

  మొత్తానికి కొత్త ప్రభుత్వపు ఒకరోజు పాలన కూడా చూడకుండానే, ఇంకా ఒక నిర్ణయము తీసుకోవడం జరగకుండానే మోడి ప్రభుత్వం బహుళజాతి కంపెనీల కోసమే అధికారంలోకి వచ్చిందని తేల్చేశారు.

  చూద్దాం ఏం జరుగుతుందో!!!

 14. అయ్యో రాత! ఇంకా చూడాల్సింది ఉందంటారా కృప గారూ, గుజరాత్ లో చేశాం, అది చూసి ఓట్లు వేయండి అని గదా బి.జె.పి ఓట్లు అడిగింది. స్వయంగా నరేంద్ర మోడి కూడా అన్నారే, గుజరాత్ లో అమలు చేసింది దేశం అంతా అమలు చేస్తాం అని. మోడి, బి.జె.పి లు చెప్పిన మాటలనే నేనూ చెప్పాను. కాకపోతే వాళ్లు అభివృద్ధి అన్నారు. నేను వారి ‘అభివృద్ధి’ కి అసలు అర్ధం ఏమిటో చెప్పాను. కాబట్టి కొత్తగా చూసేదేమీ లేదు.

  హిందూమతం సారం కులమే. కాబట్టి కులాన్ని వ్యతిరేకించేవారు చివరికి ఎక్కడ తేలాలి? కులం పోవాలని కోరేవారు చివరికి ఏమి కోరాలి?

  ఏ మతం అయినా దోపిడీ వర్గాల ప్రయోజనాలనే నెరవేర్చుతోంది. అందులో తేడాలేమీ లేవు. ఆ విషయంలో ఒకటి తక్కువా కాదు, మరొకటి ఎక్కువా కాదు.

  పోతే నాకు తెలిసి హిందూ మతం ఉంది గానీ, హిందూ జాతి అంటూ ఏమీ లేదు. జాతి వేరు, మతం వేరు. జాతి ఆవిర్భావం సామాజికార్ధిక పరిణామంతో కూడుకుని ఉంటుంది. మానవ పరిణామంలో జాతుల ఏర్పాటు ఒక సహజ ప్రక్రియ.

  మతాల ఆవిర్భావం అలాంటిది కాదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మతాలు లాంటివి ఆయా సమాజాలలో అణచివేతకు గురవుతున్న వర్గాల ఆకాంక్షలకు వ్యక్తీకరణగా పుట్టాయి. ఆ తర్వాత దోపిడి వర్గాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. హిందూ మతం అలా కాదు. ఆ మతం పుట్టుకే ఇక్కడి ఆధిపత్య వర్గాల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడంతో ముడిపడి జరిగింది.

  ఇది నేను కాల యంత్రంపైన వెనక్కి వెళ్లి చూసింది కాదు. వివిధ మతాల పుట్టుకల గురించి నేను చేసిన అధ్యయనం ద్వారా తెలుసుకున్నది. మీరు దీన్ని ఆమోదించాలన్న రూల్ లేదు.

  ఈ ‘కీర్తి కండూతి’ ‘గొప్పతనం’ ఏమిటో నా చిన్న బుర్రకు అర్ధం కాలేదు. వాటిని మీవద్దే ఉంచుకోండి.

 15. కామ్రేడ్,

  నేను ఇచ్చిన వివరణాత్మక వ్యాసాన్ని ఎందుకు ప్రచురించలేకపోయవో వివరించగలవా. ఈ చిన్న ఉదాహరణ చాలదా నీలాంటి వాళ్ళు జనాలని వెర్రివాళ్ళని చేసి ఎలా ఆడుకుంటున్నారో చెప్పడానికి. ఇదేదో అందరికీ తెలియాలని కాదు నా వుద్దేశం, కనీసం నీలాంటి సంఘ విద్రోహులకైనా అర్ధమవ్వాలని.

  “హిందూమతం సారం కులమే”, “హిందూ మతం పుట్టుకే ఇక్కడి ఆధిపత్య వర్గాల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడుకోవడంతో ముడిపడి జరిగింది”, “ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మతాలు లాంటివి ఆయా సమాజాలలో అణచివేతకు గురవుతున్న వర్గాల ఆకాంక్షలకు వ్యక్తీకరణగా పుట్టాయి”… ఒక అమ్మ, అబ్బకు పుట్టిన వాడివైతే ఇంత ఘోరంగా మాట్లాడివుండే వాడివి కాదు. ఈ వాక్యాలలోనే తెలుస్తుంది నీ పరిజ్ఞానం మరియు ఉన్మాదం. సాయి భార్గవ్ తిట్టినదాంట్లో ఏ మాత్రం తప్పులేదు నీలాంటి వాడిని.

  బాలథాకరే చెప్పినట్లు, ఈ రోజున దేశానికి హిట్లర్ లాంటి నియంత అవసరం. చరిత్రను అర్ధం చేసుకోలేని, కాస్తో కూస్తో తెలిసినా దానిని వక్రీకరించి సమాజాన్ని కుళ్ళబొడిచే నీలాంటి వాళ్ళని బహిరంగంగా కాల్చివేయాలి. మోడీ లాంటి వాళ్ళు సరిపోరు, నీలాంటి వాళ్ళని ఆపడానికి. కాని అలాంటి రోజు రావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నా.

  ఇంత ఇదిగా అనేసరికి మరో హిందూ అతివాది దొరికాడు, నెపం వెళ్ళబుచ్చుకోవచ్చు అనుకోకు. పూర్వం రాజులు తమ ఆస్థానాలలో ‘చార్వాకులు’ అనే తీవ్ర విమర్శకుల్ని పోషించేవారు. వీరికి మరియు పండితులు, కవులకి మధ్య చర్చ, వాదనలు నిర్వహించేవారు సభలో. వీటిలో దేవుని ఉనికి దగ్గరనుండి రాజు పరిపాలన వరకు అనేకానేక విషయాలమీద తీవ్ర వాదనలు జరిగేవి. ఇక్కడ రాజులు అంటే హిందువులే, మొఘలులు అనుకునేవు యధాలాపంగా నీ ప్రకారం. విమర్శ అనేది సమాజానికి చాలా అవసరం. కాని దాని మాటున వక్రీకరణలతో సమాజం మీదే దాడి చేసే నీలాంటి వాళ్ళని కుక్కని కాల్చినట్లు కాల్చిపారేయాలి. ఇది ఏ మోడీ లాంటి వాళ్ళ వల్లనో అయ్యే పనికాదు. కేవలం హిందువులలో చైతన్యం వల్లనే ఇది సాద్యమవుతుందని నేను భావిస్తున్నా.

 16. సాయి భార్గవ గారు మీరు ఎందుకింత ఆవేసం‍‌(శ)గా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మీకున్న వాదనల్ని వినిపించాలే తప్పా మీకు వ్యతిరేకంగా ఉన్న వాదనల్ని తప్పుపట్టడానికి తిట్లదండకాన్ని అందుకోవడం సబబు కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s