ఈ వ్యక్తి పేరును ఉటంకించే ధైర్యం నేను చేయలేకున్నాను. ఆ పేరు నిజానికి హిందూ ప్రజలు ఇష్టంతో కొలుచుకునే దైవం పేరు. కానీ ఈయనగారి బూతు పాండిత్యం చూస్తేనేమో హిందూ భక్తులకు తధ్యంగా అసహ్యం వేస్తుంది. మరీ ముఖ్యంగా హిందూ సంస్కృతి గొప్పదనం గురించి, సుప్రిమసీ గురించి వివరించే వ్యాసాలకూ, వీడియోలకూ ఎక్కడెక్కడ నుండో లింకులు తెచ్చే పోస్ట్ చేసే సంస్కృతీ పరిరక్షకుడు తాను రక్షిస్తానని చెప్పే సంస్కృతిని పీక నులిమి చంపడానికి ఏ మాత్రం వెనుదీయని బూతాగ్రేసరులు.
ఈ రోజు నేను ఈ కింది ఆర్టికల్ రాసి పోస్ట్ చేశాను. ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతకర్త ఎం.జి.వైద్య గారు మోడి ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను విచికిత్స చేస్తూ రాసిన ఆర్టికల్ అది.
హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్
ఈ ఆర్టికల్ లో కాశ్మీర్ గురించి రాసిన అంశాలు ఇతనికి నచ్చలేదు. దానితో పొద్దుటి నుండి ఒకటే విషం కక్కుతూ వ్యాఖ్యలు రాస్తున్నారు. నేను వాటిని ప్రచురించలేదు. దానితో ఆయనకు తన వాస్తవ సంస్కృతి ఏమిటో ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. ఆ సంస్కృతిని అంతా ఇలా వెళ్ళగక్కారు.
you fucking bitch – why u saying lies on kashmir, if i get chance i will broke your bones , fucking communist motherfucker. they raped , killed and kicked out more than 10 lakhs hindu pandits. what about that. u bloody commie – only thing you can do is deleting others comments and barking like stray dog. i will kick out all commie dogs from my country…
ఈ వ్యాఖ్యని తెలుగు లోకి అనువదించే ధైర్యం నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను హిందూ సంస్కృతీ పరిరక్షకుడిని కాను. కేవలం మానవీయ సంస్కృతిని పాటించాలని మాత్రమే నేను భావిస్తాను. ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం మానవీయ సంస్కృతిలో కనీస భాగం. అది ఈ వ్యక్తికి చేతగాదని ఆయన వ్యాఖ్య చెబుతోంది.
ఈయన హిందూ సంస్కృతిని ఎంత గాఢంగా అభిమానిస్తారంటే ఎదుటి వారి తల్లిని తీవ్రంగా అవమానించేంతగా. నాకూ, నా తల్లికి మధ్య ఉన్న తల్లీ కొడుకుల సంబంధాన్ని ఈ వ్యక్తి ఎంత గౌరవంగా వ్యాఖ్యానించారో పై రాతల్లో చూశారుగా! నా ఎముకలను విరగ్గొడతానని కూడా సవాలు చేస్తున్నారీ వ్యక్తి. మోడి ప్రభుత్వం వస్తే నీ లాంటి అంతు చూస్తానని గతంలో హెచ్చరించిన ఈ వ్యక్తి, గట్టిగా నిలదీసేసరికి రాను రాసిందానికి ఇంకేవో అర్ధాలు చెప్పారు. ఇప్పుడేమో ఏకంగా ఎముకలే విరగ్గొడతానని హెచ్చరించారు. ఈ మాటలకు ఈ బూతుల రాయులు ఇంకేమి సొగసైన అర్ధాలు ఇస్తారో వేచి చూడాలి.
ఇహ ఈయన ఇంతగా బూతు తాండవం చేయడానికి కారణం ఏమిటి? కాశ్మీర్ విషయంలో అబద్ధాలు రాశానని ఈయన ఆరోపణ. ఈ వ్యాఖ్యకు ముందు దూషిస్తూ రాసిన వ్యాఖ్యలను ప్రచురించకపోవడం కూడా ఈయన బూతాగ్రహానికి కారణం అని పై వ్యాఖ్యను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
10 లక్షల మంది కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ నుండి తన్ని తగలేసారు గదా, ఆ సంగతి ఏమిటని ఈయన ప్రశ్న.
ఇంతకీ కాశ్మీరీ పండిట్ల జనాభా దేశం మొత్తంలో 10 లక్షలకు పైగా ఉందా? జనాభా లెక్కలను బట్టి చూస్తే దేశ జనాభాలో కాశ్మీరీ పండిట్ల సంఖ్య 4 లక్షల లోపలే. కాశ్మీరీ పండిట్ల సంఘర్షణ సమితి నిర్వహిస్తున్న వెబ్ సైట్ ప్రకారం చూసినా దేశం మొత్తం కలిపి కాశ్మీరీ పండిట్ల కుటుంబాల సంఖ్య 75,343 కాగా జనాభా సంఖ్య 3,67,289. కానీ ఈ బూతురాయుడు మాత్రం ఈ సంఖ్యని ఏకంగా మూడు రెట్లు పెంచి చెబుతూ అబద్ధాల్ని ప్రచారం చేయడానికి తెగిస్తున్నారు. 10 లక్షల మంది పండిట్లు వలసపోగా మొత్తం పండిట్ల సంఖ్య 15 లక్షలని ఈయన నిర్ధారించేస్తారు. ఎదుటి వారిపైన అబద్ధపు ఆరోపణలు చేయడమే కాకుండా తాను సైతం అబద్ధాలకు లంకించుకోవడం బూతు సంస్కృతీ పరిరక్షకుల జన్మ హక్కు కాబోలు!
పండిట్లను తన్ని తగలేశారని చెబుతున్న కాశ్మీరీ ముస్లింలు మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనగా కాశ్మీరీ పండిట్లు మాత్రం 84 శాతం మంది ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కేవలం 16 శాతం మాత్రమే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో బి.జె.పి 3 స్ధానాలు గెలుచుకోగా బి.జె.పి తో స్నేహం (అలయన్స్ కాదు) ప్రకటించిన పి.డి.పి కి 3 స్ధానాలు వచ్చాయి. అనగా కాశ్మీరీ ముస్లింలు కూడా బి.జె.పి తో స్నేహం ప్రకటించిన పార్టీనే గెలిపించారు గానీ పండిట్లు మాత్రం దూరంగా ఉన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం కాశ్మీరు లోయలో 77,162 మంది, బారాముల్లా-కుప్వారాలో 18,257 మంది, అనంతనాగ్-పుల్వామ లో 27,235 మంది వలస పండిట్ ఓటర్లు ఉన్నారు. వారిలో శ్రీనగర్-బుద్గామ్ లో 16.39 శాతం, అనతనాగ్-పుల్వామ లో 15.05 శాతం, బారాముల్లా-కుప్వారా లో 17.23 శాతం పండిట్లు ఓటు వేశారు. అనగా మొత్తం కలిపి 16.11 శాతం మాత్రమే. వలస వెళ్ళిన పండిట్ల కోసం ఎన్నికల కమిషన్ జమ్ము, ఉద్ధంపూర్, ఢిల్లీ లలో ప్రత్యేక బూత్ లు ఏర్పాటు చేసినా ఓటు వేసింది మాత్రం కేవలం 26 మంది మాత్రమే. అది కూడా ఒక్క ఢిల్లీ లోనే. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? పండిట్లు తిరిగి కాశ్మీర్ లోయకు రావడం కోసం చొరవ తీసుకోవాలని గత జనవరిలోనే మోడిని కలిసి కోరిన కాశ్మీరీ పండిట్ల సంఘం ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా?
దీనికి కాశ్మీరీ పండిట్లను అని ప్రయోజనం లేదు. మొత్తం జమ్ము & కాశ్మీరు రాష్ట్రమే దశాబ్దాల తరబడిన సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభానికి కారణం భారత పాలక వర్గాలు మాత్రమే. కాశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభిప్రాయం ప్రకారం పరిష్కరిస్తే పండిట్ల పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోతాయి. అసలు సమస్యను అలాగే ఉంచి దానికి అనుబంధంగా ఉత్పన్నం అయిన సమస్యలను 10 లక్షలు అంటూ అబద్ధాలతో భూతద్ధంలో పెట్టి చూపడానికి ప్రయత్నిస్తే అది కనీసం పండిట్ల సమస్యకు కూడా ఉపయోగం ఉండదు.
ఇక పోతే ఈ బూతుల రాయుడుకి ఈ బ్లాగ్ లో వ్యాఖ్యలు రాసే అవకాశం ఉండదు. నీ బ్లాగ్ కి ఇక రాను అని అనేకసార్లు చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ బూతులు, దూషణలు కుమ్మరించడం ఈ సంస్కృతీ పరిరక్షకుడి సంస్కృతి! అలాంటి వారిని ఎవరు తమ ఇంటికి ఆహ్వానిస్తారు చెప్పండి?
ఎదుటి వ్యక్తి అభిప్రాయాలు నచ్చక పోతే…మన వాదంలో న్యాయం ఎంత ఉందో అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పటికీ వినకపోతే వదిలేయాలి తప్ప…భయపెట్టో, బెదిరించో, బూతులు తిట్టో ఒప్పించగలమనుకుంటే అది దౌర్జన్యమే అవుతుంది. దౌర్జన్యంతో సాధించేది వినాశనమే తప్ప విజ్ఞానం కాదు.
దయచేసి ఎదుటి వారి అభిప్రాయాలు గౌరవిద్దాం. అభ్యంతరాలుంటే సామరస్యంగా చర్చించుకుందా.
naakemi ardam kaalaa
తన వాదనల మీద తనకే నమ్మకంలేని వారు ఇలాగే ప్రవర్తిస్తారు
శేఖర్ గారూ..
కాశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభిప్రాయం ప్రకారం పరిష్కరించటం అంటే ఏంటొ కొంచెం వివరించండి.
అక్కడి ప్రజల అభిప్రాయం ఏంటొ మీకు తెలిస్తే చెప్పండి.
i condemn the statements and usage of unparliamentary words in his critic. any debate irrespective of ideology should be in democratic way.
evadi gurincho evado edo raaste marevado inkedo raasadani ardam aindi