ఓ.కె, బై-బై. మళ్ళీ టీ.వి తెరపైన కలుద్దాం!
ఈ రోజుతో చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి కూటమి మెజారిటీ సాధిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయినట్లు పత్రికలు నివేదించాయి కూడాను.
మళ్ళీ నాయకులు ప్రజలకు కనిపించేది ఎప్పటికి? విజయం సాధించినందుకు స్వీట్లు ఒకరి నోట్లో మరొకరు పెట్టుకుంటూనో లేదా ఓటమిని అంగీకరిస్తున్నట్లు గంభీర వదనాలతో ప్రకటిస్తూనో మళ్ళీ కనిపించేది టి.వీల్లోనే.
ఆ తర్వాత పార్లమెంటులో పేపర్లు చించి గాలిలోకి విసిరేస్తూ, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో గోల గోల చేస్తూ కూడా టి.వీల్లో కనిపించవచ్చు.
గెలిచినోళ్ళు విధాన ప్రకటన చేస్తూనో, కుంభకోణాల ఆరోపణలకూ, విమర్శలకూ సమాధానాలు ఇస్తూనో టి.వీల్లో కనిపిస్తే ఓడినోళ్ళేమో ప్రజల సమస్యలపై మహా ఆందోళన, బాధ, ఆక్రోశం వెళ్లగక్కుతూ రోడ్లపైన రాస్తా రోకోల్లోనూ, ధర్నా శిబిరాల్లోనూ, ఛానెళ్ల కెమెరాల ముందు కనిపిస్తారు. వారిలో ఎవరూ మళ్ళీ చస్తే ప్రజల ఇళ్ల వద్ద మాత్రం కనిపించరు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అంటే ఇలాగేనా ఉండేది?
ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. అంధ ప్రదేశ్ లో.. ఇంకొ 5 యేళ్ళు ఎన్నికలు లేవు. కాబట్టి 5 యేళ్ళూ కూడా డ్రామా పెద్దగా ఉండక పోవచ్చు. ఎలెక్శన్స్ ఉంటేనే కదా.. డ్రామా??