మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్


Modi's development

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు.

గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు.

తీరా ఎన్నికలతో పాటు ప్రచారం కూడా చివరిదశల్లోకి అడుగు పెట్టేకోందీ మోడి క్రమంగా హిందూత్వ ప్రచారంలోకి వెళ్ళిపోయారు. అస్సాం, బెంగాల్ వెళ్ళి బంగ్లాదేశీయులు వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఆయన అనుచరుడు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని హిందువులను కోరారు.

బీహార్ లో నేమో మరో నేత మోడి విమర్శకులు పాకిస్ధాన్ వెళ్లిపోవాలని హుంకరించారు. ఎలక్షన్ కమిషన్ కేసులయితే పెట్టింది గానీ వాటివల్ల ఒరిగేదేమీ లేకపోగా హిందూత్వ ప్రకటనలు, హెచ్చరికలు, బెదిరింపుల ప్రయోజనం మాత్రం నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకుల అంచనా.

మోడి క్రమక్రమంగా శక్తివంతులు అయ్యారని తెలుగు పత్రికలతో పాటు, కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా శ్లాఘిస్తున్నాయి. మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇలా ఉందని కార్టూనిస్టు సూచిస్తున్నారు.  

 

3 thoughts on “మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

  1. వ్యక్తిగతంగా అవినీతికి వ్యతిరేకం గా ఆప్ పార్టి ని సమర్ధించే యన్. రాం,వేణు & మాలిని పార్థశరథి టీం, తమిళ నాడు కొచ్చేసరికి డియంకే అవినితి గురించి చూసిచూడనట్లు నటిస్తారు. డియంకె పార్టి ఎన్నికల అభ్యర్దుల లిస్ట్ ప్రకటిస్తే చాలా బాలేన్స్డ్ గా (పాత తరం, కొత్త తరం) టికేట్లు ఇచ్చారని హిందూ లో రాశారు. ఆ టికేట్లు ఇచ్చిన వారిలో రెండు పేర్లు A. రాజ, టి.ఆర్. బాలు ఉన్నారు. 2జి స్కాం లో A. రాజా పాత్ర అందరికి తెలిసిందే, నిన్న జైరాం రమేష్ టి.ఆర్.బాలు వెధవ పనుల వలన యుపిఏ కి చెడ్డ పేరు వచ్చిందని విరుచుకు పడ్డాడు. ఇటువంటి వారికి మళ్ళీ డియంకే పార్టి నిర్లజ్జగా టికేట్లు ఇస్తే ,భలే ఉందని కితాబిస్తూ హిందూ పేపర్ ఎంత దిగజారాలో అంత దిగజారిపోయింది.
    ఇక యన్ రాం గారి డబల్ స్టాండర్డ్స్ గురించి. న్యుక్లియర్ డీల్ అమెరికాతో కుదిరినపుడు, దేశానికి చాలా మంచిదని వ్యాసం రాశాడట, దానిని పబ్లిష్ చేయబోతుంటే, ఇంతల్లో ఆయన పార్టి సి.పి.ఐ.(యం)న్యుక్లియర్ డీల్ కి వ్యతిరేకం గా నిర్ణయం తీసుకొందని తెలియటం వలన,తన అభిప్రాయం మార్చుకొని , పార్టి అభిప్రాయానికి అనుగుణంగా న్యుక్లియర్ డీల్ వ్యతిరేకిస్తూ పెద్ద వ్యాసం రాసి ప్రచూరించాడని, ఆయన మిత్రుడు సంజయ్ బారు గారు ఇంటర్వ్యులో చెప్పారు. సి.పి.ఐ.(యం) పార్టి విధానాలకుకి కొమ్ము కాస్తమని పాఠకుల దగ్గర దాచిపెట్టటం ఘనత వహించిన హిందూ పేపర్ వాళ్లు డబ్బాకొట్టుకొనే నీతి, నిజాయితి,పాత్రికేయ విలువలను సూచిస్తుంది.

  2. శేఖర్ గారు,

    పైన రాసిన కామేంట్ కి ఈ టపాకి సంబంధం లేదు. కాని మీరు హిందూ పేపర్ ను చాలా ఎక్కువ గా కోట్ చేస్తారు,ఆ పేపర్ లో ఏ లోపాలు లేనట్లు. అందువలన ఆపేపర్ గురించి నాలుగు ముక్కలు రాశాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s