దళితులతో రాహుల్ హానీమూన్, రాందేవ్ వెకిలి వ్యాఖ్యలు


Ramdev

స్వయం ప్రకటిత యోగా గురువు బాబా రాందేవ్ రాహుల్ గాంధీపై విమర్శల పేరుతో వెకిలి వ్యాఖ్యలు చేసి తన మకిలి బుద్ధిని చాటుకున్నాడు. హానీమూన్, పిక్ నిక్ లు జరుపుకోవడం కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తున్నాడని కు వ్యాఖ్యలకు దిగాడు. ఆనక దళితులు బాధపడితే క్షమించాలని విన్నవించుకున్నాడు.

ఆలోచించి చేసే వ్యాఖ్యలు బహుశా ఆయా వ్యక్తుల అసలు బుద్ధిని బైటపెట్టలేకపోవచ్చు. ఉద్దేశించిన లక్ష్యానికి మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్న విచికిత్స చేసుకున్నాక చెప్పే మాటలు సహజంగానే మేలుకోసం చెప్పే మాటలే అవుతాయి గానీ మనసులోని అసలు భావాన్ని వెల్లడి చేయడం తక్కువ. అనాలోచితంగా అనే మాటలే అసలు బుద్ధిని వెల్లడిస్తాయి. బాబా రాందేవ్ చేసిన కువ్యాఖ్యలు ఈ కోవలోనివే.

దళితుల ఇళ్లకు వెళ్ళడం అంటే రాజకీయ నాయకులకు ఒక ప్రయోజనంతో సమానం. దళితుల్లో మెజారిటీ ప్రజలు కష్ట జీవులే. శ్రమ చేస్తే తప్ప వారికి పూట గడవదు. శారీరక శ్రమ చేయడం కంటే కాలు మీద కాలు వేసుకుని జీవితం గడపడానికే ఎక్కువ గౌరవం ఉన్న సమాజాల్లో శ్రమ జీవులైన దళితులకు ఏ పాటి విలువ ఉంటుందో తెలియడానికి పెద్దగా సామాజిక జ్ఞానం అవసరం లేదు.

ఓట్ల జాతర మొదలైన తర్వాతయితే దళితుల ఇళ్లకు వెళ్ళడం, వారితో కలిసి సహ పంక్తి భోజనాలు చెయ్యడం, నృత్యాలు చెయ్యడం, కన్నీళ్లు తుడుస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం మామూలు విషయాలు. ఇలాంటి వేషాలను ఓట్ల కోసం వేస్తున్నారని విమర్శిస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘ఎన్నికల్లో వీళ్ళకి దళితులు గుర్తుకొస్తారు. ఆ తర్వాత గుర్తుకు రారు’ అని విమర్శించినా ఒక అర్ధం. అది నిజమే కాబట్టి ఆ విమర్శని స్వీకరిస్తాం కూడా.

కానీ దళితులకి ఇళ్ళకి హానీ మూన్ కోసం, పిక్ నిక్ జరుపుకోవడం కోసమే వెళ్తున్నాడని విమర్శించడం అంటే దళితుల పట్ల వారికి ఉన్న రోత బుద్ధిని ప్రదర్శించడం తప్ప మరొకటి కాదు. పైగా దళితులు బాధపడితే తన మాటల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధం అంటూ కండిషన్ పెట్టి మరీ అర బుద్ధులు చాటుకోవడం ఇంకా రోతగా ఉంది. పైగా ఆ విమర్శకు రాహుల్ బ్రహ్మచర్యాన్ని కూడా జత చేయడం చూస్తే రోత బుద్ధి తప్ప మరొక బుద్ధి లేనే లేదని నిర్ధారణ చేసుకోవచ్చు.

“ఆయన దళితుల ఇళ్ళకి హానీ మూన్, పిక్ నిక్ ల కోసమే వెళ్తాడు. ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆయన అదృష్టం క్లిక్ అయి ఉండేది. తద్వారా ప్రధాన మంత్రి అయి ఉండేవాడు” అని రాందేవ్ వ్యాఖ్యానించాడు. రాహుల్ పొరబాటున ఒక దళిత అమ్మాయినే ప్రేమించి వివాహం ఆడితే అది ప్రశంసలకు బదులు విమర్శలకూ, కు వ్యాఖ్యలకూ గురయి ఉండేదన్నమాట! రాందేవ్ లాంటి ప్రబుద్ధులకు రాహుల్ గాంధీ లాంటివారు దళిత అమ్మాయిలను వివాహం చేసుకోవడం కలలో కూడా ఊహించలేని విషయం. ఎందుకంటే దళితులు అందుకు తగరు. వారి దృష్టిలో దళితులతో వివాహం పరిహాసం చేయగల ఒక నీచ కార్యక్రమం.

ఇలాంటి నీచ బుద్ధులా విదేశాల్లోని నల్ల డబ్బు వెనక్కి తేవాలని ఆందోళన చేసేది?

రాహుల్ బ్రహ్మచర్యాన్ని తనతోనూ, నరేంద్ర మోడి తోనూ పోల్చుకోవడానికి సైతం బాబా రామ్ దేవ్ తెగించాడు. “నువ్వు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రధాన మంత్రివి కాలేవని ఆయన తల్లి చెబుతుంది. ఈ పిల్లాడేమో భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేడు. కాబట్టి ముందు ప్రధాన మంత్రి అయ్యాక విదేశీయురాలిని పెళ్లి చేసుకొమ్మని అతని తల్లి బోధించారు” అని రాహుల్, సోనియాలపై రాందేవ్ విమర్శలు ఎక్కు పెట్టాడు. రాహుల్ గాంధీ లాగా తానూ, మోడి ఒత్తిడి వల్ల ఒంటరిగా మిగిలిపోలేదని రాందేవ్ గొప్పలు చెప్పుకున్నాడు. తనకు పెళ్లయింది మొర్రో అని మోడి చెబుతుంటే ఆయన ఒంటరి అని రాందేవ్ చెప్పడం ఏమిటాని?

అసలు రాహుల్ గాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంటే ఈయనకి ఎందుకుట? రాజీవ్ గాంధీ పెళ్లాడింది విదేశీ అమ్మాయినే కాదా? పెళ్లి చేసుకుని దేశ సేవ పేరుతో భార్యని ఆమె ఖర్మానికి వదిలి పెట్టేసి, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా మారినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవడం కంటే మనసుకు నచ్చిన విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని శుభ్రంగా కాపురం చెయ్యడం మేలు కాదా?

ప్రధాన మంత్రి పదవికి కావలసిన అర్హతలను ఒక దళిత అమ్మాయితో పెళ్లి లేదా ఒక విదేశీ అమ్మాయితో పెళ్లికి సంబంధించిన చర్చ స్ధాయికి రాందేవ్ కుదించివేశాడు. వివాహం అనేది కనీసం తన భాగస్వామిని ఎంచుకునే వరకయినా ఏ వ్యక్తికయినా స్వవిషయం. దళిత అమ్మాయిని ఎంచుకోవచ్చు, విదేశీ అమ్మాయిని ఎంచుకోవచ్చు లేదా అసలు ఎవరినీ ఎంచుకోకుండా ఒంటరిగా మిగిలిపోవచ్చు. అది ఆ వ్యక్తి తన వ్యక్తిగత జీవితం గురించి ఎంచుకున్న ప్రాధామ్యాలకు సంబంధించిన విషయం.

అందులోకి తగుదునమ్మా అంటూ చొరబడడమే కాకుండా దళితుల ఇళ్ళకి వెళ్ళడం అంటే హానీ మూన్ కోసమే అని పిచ్చి పిచ్చి కూతలు కూయడం ఒక పెద్ద మనిషికి తగని పని. అది కూడా తన పేరుకు ముందు బాబా అని తగిలించుకుని, కాషాయ గుడ్డలు ధరించే రాందేవ్ లాంటి వ్యక్తికి అసలే తగదు.

దళితులపై (లేక రాహుల్ గాంధీ పైనో) అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు బాబా రాందేవ్ పై ఢిల్లీ లో ఎఫ్.ఐ.ఆర్ దాఖలు అయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. పోలీసులే ఈ ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారా లేదా ఎవరన్నా పౌరులు చేశారా అన్నది తెలియరాలేదు.

18 thoughts on “దళితులతో రాహుల్ హానీమూన్, రాందేవ్ వెకిలి వ్యాఖ్యలు

 1. ఉదయంచూశానీ వీడియోని. పట్టరానంత కోపం వచ్చింది.
  దళితులంటే రాజకీయనాయకుల పక్కలపైకి కూతుళ్ళని, చెల్లెళ్ళని, భార్యలనీ పంపించేవాళ్ళనా ఈ వెధవగాడి ఉద్దేశ్యం. చెప్పిచ్చుక్కొట్టాలి ఇలాంటి లుఛ్ఛాగాళ్ళని.
  బ్రతికేది ఊరసొమ్ముమీద! జనాలసొమ్ముతిని బ్రతికే నీచుడికి, తమ ఆశ్రమాల, అధికారాల, ప్రతిష్టల రాజపోషకులైన కష్టజీవులమీద ఇంత నీచపు అభిప్రాయమా?!
  ఈతరహా వ్యాఖ్యలు బ్రామ్హణ కులమ్మీద చేస్తే రెండోరోజుకి దాన్ని భారతీయ సంస్కృతిమీద దండయాత్రగా అభివర్ణిస్తూ తెగబారెడు విమర్శలుచేసేవారే! ఏవి ఇప్పుడా నోళ్ళు?

  అయ్యా! కులీన హిందువుల అభిప్రాయాలు వారి పట్ల ఇంతనీచంగా ఉన్నా, ఆ దళితజీవులు ఆచరిస్తున్న మతమేదైనా, తిరుపతికివెళ్ళి ఉచితదర్శనపు వరుసల్లో రోజులతరబడి నిలుచుని, తిరుపతికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ఒక సిగ్గూఎగ్గూలేని మంద అనండి ఒప్పుకుంటాను. ఇంకొకడి సొమ్ముతిని సోంబేరిలాగా బ్రతకడం, తాతల ఆస్తులమీద ఆధారపడి వ్యసనాలపాలై తిరగడం, మోసంచేసి బ్రతకడం, సొల్లుకబుర్లువాగడం ఇతరకులాలతో పోలిస్తే దళితుల్లో తక్కువ. ఎవరులేకపోయినా ఆ కష్టజీవులు బ్రతగ్గలరు. వాళ్ళులేకపోతే సమాజంలో అరాచకత్వం సిధ్ధిస్తుంది. మొత్తం స్థంభించిపోతుంది. ఒక్క సంవత్సరం దళితులు వీడిలా కబుర్లుచెబుతూ బ్రతికితే, అప్పుడు దేశపు సోకాల్డు ఆర్ధికవృధ్ధి రేటు ఒకటిన్నర దాటితే చూసుకుందాం.

 2. ( Baba Ramdev’s business empire worth over Rs 1,100 crore
  PTI Jun 10, 2011, 03.22am IST ( The Economic Times )
  HARIDWAR: Yoga guru Ramdev, who is on an indefinite hunger strike against black money and corruption on Thursday made public details of his business empire worth over Rs 1,100 crore, claiming everything was in order.
  On his sixth day of fast, Ramdev addressed a press conference here during which his close aide Balakrishna said that the capital involving the four trusts run by him totalled Rs 426.19 crore while the expenditure incurred on them amounted to Rs 751.02 crore ).

  ధరించేది కాషాయం !
  చేయించేది యోగం !
  పాలించేది , వేయి కోట్ల వ్యాపార సామ్రాజ్యం !
  చేసే వ్యాఖ్యలు, అగ్గిలో ఆజ్యం !
  స్వాములు,సామాన్యులే !
  ఎక్కడుంది వైరాగ్యం ?

 3. అసలు సన్యాసం అంటే ఐహిక మైన విషయాలన్నీ వదిలేసి పరలోకంలో మంచి స్థానం కోసం …లేదా భగవంతుడిలో ఐక్యం కావడం కోసం కృషి చేయడం కదా. మరి ఈ సన్నాసి గారికి….హనీమూన్ లు….టూర్లు ఎందుకు….?

 4. Ramdev, who was in Vadodara to attend a yoga camp, however, insisted the Congress vice president visited homes of the poor for “publicity stunt, picnic or tourism”.

  “The statement I made has been misrepresented. The term honeymoon period is over is commonly used in political language. I tried to use it in that sense,” Ramdev claimed.

  “I had no intention to insult honourable Rahul Gandhi or Dalit community. But this is also true that Rahul Gandhi goes to houses of poor and uses that opportunity as publicity stunt, picnic or tourism,” he said, adding “I express regret if the use of that term has hurt the feelings of any community, especially Dalit community.”

 5. This is what Times of India reported


  Triggering yet another controversy, the yoga guru on Friday alleged the Congress vice-president went to the houses of dalits for honeymoon and picnic.

  “He goes to dalits houses for honeymoon and picnic. Had he married a dalit girl, then his luck could have clicked and he would have become the Prime Minister,” Ramdev said at a programme.

  He said unlike Rahul, Narendra Modi and Ramdev had not become “fakirs” (single) under compulsion.

  “Us bechare ki bhi kismat kharab hai (Rahul is unlucky)”, Ramdev said.

  “His (Rahul’s) mother says that if you marry a foreigner girl, then you cannot become the PM and this boy does not want to marry an Indian girl. His mother wants that first he becomes PM and then marries a foreigner”, he added.

  Later, in a damage-control exercise, Ramdev claimed he did not make the remarks in a negative sense and was willing to withdraw them if they have hurt the dalit sentiments.

 6. visesagna gaaru

  “కులీన హిందువుల అభిప్రాయాలు వారి పట్ల ఇంతనీచంగా ఉన్నా, ఆ దళితజీవులు ఆచరిస్తున్న మతమేదైనా, తిరుపతికివెళ్ళి ఉచితదర్శనపు వరుసల్లో రోజులతరబడి నిలుచుని, తిరుపతికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ఒక సిగ్గూఎగ్గూలేని మంద అనండి ఒప్పుకుంటాను. ”

  many supposed upper caste guys too uses free darshan mode, so your comment is not proper and derogatory.

 7. Dear Sai Bhargav,
  ఒప్పుకుంటున్నాను. కానీ ఎంతశాతమ్మంది అగ్రకుల హిందువులు ఉచిత దర్శనమ్మినహా వేరేదారిలేని ఆర్ధిక వెనుకబాటులో ఉన్నారు? ఉచితదర్శనపు క్యూల్లో ఉండేవారిలో అధికులు నిమ్నవర్గాలవారు. వారిలో కొందరు అసలు హిందువులుకూడాకారు. అగ్రవర్ణహిందువులకు అన్యాయంగా కనిపించేదల్లా తమను వేచిఉండేలాచేసి వీఐపీలు తొందరగా దర్శనం ముగించుకోవడమేతప్ప, అదేపనిని తాము ఈ అల్పాదాయ వర్గాలవారి పట్ల చేస్తున్న విషయంకాదు.

  నా వ్యాఖ్య ఉద్దేశం. అగ్రకుల హిందువుల అభిప్రాయాలు మీగురించి ఇంతనీచంగా ఉంటున్నాయి, మీరింకా సిగ్గులేకుండా (I mean it) అదే మతానికి, అదే అగ్రకుల హిందువులకు రాబడి కలగడానికీ కారణమవుతున్నారు. అది మానుకుంటేగానీ వీళ్ళకి బుధ్ధిరాదు అని చెప్పడానికి ఉద్దేశించబడినవి.

  పోనీ కులాలు వదిలేయండి, డబ్బు దగ్గరకేరండి. కష్టజీవులను మభ్యపెట్టి, కష్టజీవుల పిల్లలు అనుభవించాల్సిన డబ్బుని పరోక్షంగా దోచుకొని కోట్లుకూడబెట్టి, ఆశ్రమాలు కట్టినవారి ఆలోచనలు ఎంత pervertedగా ఉంటున్నాయో చూడండి. ఈస్వాములవల్ల, ఫాదర్‌ల వల్లా నల్లడబ్బు తెల్లడబ్బుగా మారడం మినహా ప్రజలకు మేలు కల్పించేపని ఏమి జరుగుతుంది? తమను మేపుతున్న ప్రజలను ఇలా అవమానించడం సంస్కారమా?

 8. visesagna gaaru
  ఈ అగ్ర , నిమ్న కులాలు లాంటి విబేదాలు , తేడాలు సమసిపోవాలన్తే దానికి తగిన మందుని సూచించాలి గాని మతాన్ని తప్పు పట్టడం , వారి నమ్మకాలని ఆర్దిక శాస్త్రం తో ముడి పెట్టడం ఎంతవరకు సబబు. హజ్ యాత్ర కొరకు కొన్ని వేల కోట్లు శ్రమ జీవులు కర్చు చేస్తున్నారు కాబట్టి హజ్ యాత్ర మరియు దాని మూలంగా సౌదీ కి వచ్చే వేల కోట్లు శ్రమ జీవులని కొల్లకోట్టడం వల్లే వస్తుంది అంటే అది యంత మాత్రం సమంజసం. ప్రతి మతం లో వర్గాలు ఉన్నాయి , మనలో వున్నా విబేదాల కంటే పెచ్చు స్థాయి లోనే వారిలో విబేదాలు ఉన్నాయి. వాటిని సమసి పోయేలా చేసి unity వాచేలా చూడాలి గాని ఇలా అగ్ర, నిమ్న , దళిత , అగ్ర అనే పదాలు వాడినంత వరకు ఆ gap అలానే వుంతదేమో !!!! అగ్ర, నిమ్న అనే stereotypes పోవాలంటే ఇంటర్ caste మ్యారేజ్ మంచి సొల్యూషన్. quoting some visionaries
  1.”The real remedy is inter-marriage. Fusion of blood can alone create the feeling of being kith and kin -Dr BABA SAHEB AMBEDKAR”.
  2. “To promote unity among the Hindus, intermarriage between castes and sub-castes should be done and the Indian universities should be reorganized so that they might produce real patriots, rather than clerks, lawyers, diplomats, and Government officials.” – SWAMY VIVEKANANDA
  3. truly effective and fulfil a real need of life, ‘must come from within’, AUROBINDO said in the early twenties when inter-caste marriage was sought to be legalised.
  4. CASTE was a trade guild and not a religious institution
  -SWAMY VIVEKANANDA

 9. ramdev baba given solid clarity on this issue, he said he used the term honeymoon in the context of political gymmicks of politicins during elections like wearing muslim caps, visiting dalit houses, inter-dining, etc. he used that term to INDICATE THE PHASE during which politicians lure voters in the name of dalit, muslim, freebies etc. he is very good man , good saint and he dont have any low view/stereotypes on dalits. he is the person along with rajiv dixit who started anti corruption crusade. i have 100% trust on him, he is not such guy, paid media playing anti tunes to him to get over modi wave

 10. చర్చ ఇంకో దోవకు మళ్ళినా , ఇక్కడ , అసలు సంగతిని విస్మరిస్తున్నట్టు అనిపిస్తుంది !
  తిరుపతి ని, ఏ వర్గం వారు లేదా ఏ కులం వారు , ఏ మార్గం ద్వారా దర్శనం చేసుకుంటున్నారో, లేదా ఎంత
  ‘ సమర్పించు కుంటున్నారో ‘ చర్చించు కునే కన్నా, తిరుపతి ఆదాయం , ఏ రకం గా వ్యయం చేయ బడుతుందో ఆలోచించడం మనందరి కర్తవ్యం ! ప్రపంచం లో నే అత్యధిక ఆదాయం ఉన్న దేవాలయాలలో మొదటిది గా పరిగణించ బడుతున్న తిరుపతి యాత్రానుభవమే , ప్రతి ఒక్కరికీ , అక్కడి ధనం ఏ విధం గా ఉపయోగ పడుతుందో తెలుసుకోడానికి తార్కాణం !
  ఇంకో సంగతి : దేవుడికి , పేదా ,గొప్పా తేడా లేదు ( దేవుడు ఉన్నాడనుకుంటే ! ).కానీ, మనం తరచు గా వార్తా పత్రికలలో చూస్తున్నది , రాజకీయ నాయకులూ, సినిమా తారలూ , ‘ ప్రత్యేక ‘ దైవ దర్శనం ( ఎక్కడి దేవాలయానికి వెళ్ళినా ) చేసుకో గానే ,ప్రధానం గా ఆ వార్తను ,వారి ఫోటో తో సహా ప్రచురించడం !
  చాలా సందర్భాలలో , ఆ ఫోటోలలో దేవుడు కనబడడు !
  గంటలు గంటలు, పడి గాపులు గాచి , దర్శనం కోసం క్యూ లలో , ఎదురు చూసే ‘ సామాన్యుల ‘ గతి ( ఫోటోల సంగతి అటుంచి ! ) ‘ గోవిందా ‘ !

 11. Dear Sai Bhargav,
  No theistic religion speaks for equality of all the humans (there is a reason why I didn’t write ‘men’). It can be observed even in your example of Haz. For it establishes the religious hegemony of the Arabs over the Islamic world, in the world where religion is translated to politics, it means political hegemony if not ‘polici-al’ hegemony. Hinduism as we all know has been no exception to this law and has been the cause of having been the reason for the divide among her own people.

  I respect and welcome your views on inter-cast marriages. Can you please come up with the percentage of such marriages? Can you assure me that such kind of marriages are a common place in ‘your world’ (you know what I mean. Don’t you?). In our society 99.9% of marriages happen within cast boundaries. Sir! we live in a world where even extra marital affairs are strictly confined to the boundaries of cast. I wonder if your stance remains the same when it comes to inter-religious marriages (for I know of the groups like R.S.S. dealing such concept with a strong abhorrence).

  The division of caste is one of the matters the Hindu scriptures differ widely. While the Gita claims that the division is based on the deeds, the Rama of Ramayana takes a different stance. The entire Mahabharata epics revolves around the (perceived) cast of birth. I shall say Hindu scriptures, when considered as a whole, are purposefully equivocating on this issue.

  I say… this guy -Ram Das- is twisting his own words. woh bas apne hi baat-o-soch se mukar rahaa heIN jo usne josh me aakar bol diyaa.

 12. ధరించేది కాషాయం !…ఎక్కడుంది వైరాగ్యం!

  ఇటువంటి ప్రాసలతో కూడిన కవిత్వాలు,సెటైర్ లు, విమర్శలు టివి9 లో వస్తూంటాయి. వాటిని ప్రజలు పట్టించుకొంటారని అనుకోను. మీడీయా మీద ప్రజలకి నమ్మకం పోయింది. వైరాగ్యాన్ని కొలవటానికి ఏ సాధనం లేదు. కాని ఆయన డబ్బును ఇంతా అని కొలచవచ్చు. చాలా మంది ఆరోపణ ఆయన దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయన్నేదే కదా? అంతేకాని ఆయన గొప్ప వైరాగా, నిజమైన సన్యాసా అని కాదు. ఆయన దగ్గర దండిగా దొంగ డబ్బు ఉంది. ఆయన బ్లాక్ ని వైట్ చేస్తున్నాడు అని ఆరోపణలు చేసేకన్నా, ప్రభుత్వం ఒక కమిటి వేసి విచారించవచ్చు కదా? చూడబోతే కేంద్ర ప్రభుత్వం వారు, ఆయన డిల్లిలో చేసిన నిరాహారదీక్ష తరువాత ఆ పని చేసినట్లు ఉన్నారు. ఎమీ దొరికినట్లు లేదు. లేకపోతే ఆయనని ఈ పాటికే మీడీయాలో చీల్చి చెండాడి ఉండేవారు.

  తిరుపతి ఆదాయం , ఏ రకం గా వ్యయం చేయ బడుతుందో ఆలోచించడం మనందరి కర్తవ్యం !

  మీరెందుకు ప్రత్యేకంగా అలోచించేది? డిల్లిలో కాంగ్రెస్ పార్టి అధ్యక్షురాలు ఎంతో ఆలోచించాకే టిటిడి బోర్డ్ చైర్మన్ ను నియమిస్తారు. ఆయన డిల్లి నుంచి ఆంధ్రాలోని రాజకీయ నాయకుల వరకు అందరికి తలలో నాలుకవలే ఉంట్టూ, సంతృప్తి పరుస్తూ టిటిడి ని నిర్వహిస్తారు. అంతేనా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి ఆదాయం గురించి, ఎన్నో రకాల నివేదికలు ఇస్తారు. నేట్ లో వెతికి చూడండి ఎక్కడైన ప్రభుత్వ వెబ్ సైట్ల లోనో, టిటిడి వెబ్సైట్లో వివరాలు కనిపిస్తాయేమో!

  మనం తరచు గా వార్తా పత్రికలలో చూస్తున్నది …వారి ఫోటో తో సహా ప్రచురించడం !

  ఈ మధ్య కాలంలో ఇంటర్నేట్ వాడకం పెరిగిన తరువాత, పేపర్ వారు పాఠకులను ఎంగేజ్ చేయటానికి ఇటువంటి వార్తలను ప్రచూరిస్తున్నారు

 13. //తిరుపతి ఆదాయం , ఏ రకం గా వ్యయం చేయ బడుతుందో ఆలోచించడం మనందరి కర్తవ్యం ! //
  గొంగళిలో బోజనం చేస్తూ వెంట్రుకలుండాయనడం ఇల్లంటిదే! తిరుపతిని మాత్రం ప్రత్యేకంగా చూడాలా?
  ఏమైనా వృత్తికి ప్రవృత్తికి ఉన్న తేడా బాగా చెప్పారు శేఖర్‌ గారు. వారి ప్రవృత్తి ఏమిటిననేది ఎంత అణచి పెట్టుకున్నా – సూదిని మూటకట్టినట్లు ఏదో ఒక పక్క బయటకు వస్తూనే ఉంటుంది. అది వారి సంస్కారం లో భాగం. అది ఎక్కడకు పోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s