మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది


modi-3

“మోడి అధికారంలోకి వస్తారన్న ఆలోచనే భయం గొలుపుతోంది” అని విదేశాల్లోని భారతీయ మేధావులు ఒక సంయుక్త ప్రకటనలే పేర్కొన్నారు. బ్రిటన్ లోనే అనేక ప్రసిద్ధి చెందిన యూనివర్సీటీలకు చెందిన బోధకులు ఈ ప్రకటన జారీ చేసినవారిలో ఉన్నారు. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు. 

ప్రపంచ ప్రసిద్ధి చెందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఎస్.ఓ.ఏ.ఎస్, కింగ్స్ కాలేజ్ తదితర విద్యా సంస్ధల్లోని భారతీయ సంతతి విద్యావేత్తలు ప్రకటనపై సంతకం చేసినవారిలో ఉన్నారు. 75 మంది మేధావులు, విద్యావేత్తలు ప్రకటనపై సంతకం చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) పత్రిక తెలిపింది. వారికి ప్రొఫెసర్ చేతన్ భట్ నాయకత్వం వహించారని తెలుస్తోంది.

హిందూ జాతీయవాద ఉద్యమంలో భాగంగా ఆర్.ఎస్.ఎస్ తదితర సంఘ్ పరివార్ గ్రూపుల్లో మోడి పెరిగిన సంగతిని వారు గుర్తు చేశారు. మైనారిటీలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన చరిత్ర ఈ గ్రూపులకు ఉన్నదనీ, మోడిని సమర్ధించే గ్రూపులు కొన్ని ఇటీవల పౌరులపై జరిగిన టెర్రరిస్టు దాడుల్లో నిందితులుగా కూడా ఉన్నారని వారు గుర్తు చేశారు.

డా. లీనా కుమరప్పన్ (లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ), డా. సుబీర్ సిన్హా (స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్), డా. విష్ణు ప్రియ గుప్త (యూనివర్సిటీ ఆఫ్ వార్విక్), డా. అమిత్ ఎస్. రాయ్ (క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్), డా హ్యూగో గారింగే (యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బరో), ప్రొఫెసర్ బార్బర హారిస్ వైట్ (ఆక్స్ ఫర్డ్), ప్రొఫెసర్ అమృతా ధీల్లాన్ (కింగ్స్ కాలేజ్ లండన్), ప్రొఫెసర్ జోయా చటర్జీ (కేంబ్రిడ్జి), డా దిబ్యేష్ ఆనంద్ (వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ) మొదలైనవారు ప్రకటనపై సంతకం చేశారని టి.ఓ.ఐ తెలిపింది.

“భారత ప్రజలు తమ తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోడి నేతృత్వంలోని బి.జె.పి ప్రభుత్వం వల్ల భారత దేశంలోని ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి, మానవ హక్కులకు ఎదురయ్యే ప్రభావం గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. గుజరాత్ లో 2002లో జరిగిన తీవ్ర హింసను మేము గుర్తు చేస్తున్నాము. అందులో 1000 మందికి పైగా చనిపోగా వారిలో అత్యధికులు ముస్లింలు. ఈ హింస మోడి పాలనలోనే చోటు చేసుకుంది. హింసలో ఆయన పాత్ర గురించి, ఇచ్చిన ప్రోత్సాహం గురించి సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు సాక్ష్యం కూడా ఇచ్చారు” అని ప్రకటన పేర్కొంది.

“ఆయన సన్నిహితులు కొందరు హింసలో భాగం పంచుకున్న దోషులుగా నిరూపించబడ్డారు. గుజరాత్ హై కోర్టులో న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో మోడి పాత్ర వహించారని తేలే అవకాశం ఉంది. తన విద్వేషపూరిత ప్రసంగాలకుగానీ ముస్లింలు, క్రైస్తవులు, మహిళలు, దళితులు మున్నగు వివిధ గ్రూపుల ప్రజలపై తాను చేసిన ఖండనాపూర్వక వ్యాఖ్యలకు గానీ ఆయన ఎన్నడూ క్షమాపణలు చెప్పలేదు. ఆయన సన్నిహితుడు ఒకరు ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేష ప్రసంగం చేసినందుకు భారత ఎన్నికల కమిషన్ అభిశంసించింది” అని భారత సంతతి బ్రిటన్ మేధావుల ప్రకటన పేర్కొంది.

ఈ ప్రకటన ప్రకారం మోడీ గుజరాత్ లో ఆధిపత్యపూర్వక పాలన సాగించారని అనేకమందికి ఏకాభిప్రాయం ఉన్నది. బి.జె.పి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులను పక్కకు నెట్టివేయడం కూడా మోడి ఆధిపత్య (authoritarian) స్వభావాన్ని రుజువు చేస్తుందని ప్రకటన అభిప్రాయపడింది. ఇటువంటి పాలనా విధానం భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనం చేయడానికే దోహదం చేస్తుందని ప్రకటన పేర్కొంది. “పైగా మోడి-బి.జె.పి ప్రతిపాదిస్తున్న ఆర్ధిక వృద్ధి నమూనా ప్రభుత్వానికి బడా వ్యాపారులకూ దగ్గరి సంబంధాన్ని ప్రబోధిస్తోంది. ప్రజల వనరులను ధనికులకు, శక్తివంతులకు ఉదారంగా బదిలీ చేయాలనీ తద్వారా పేదలకు హానికర చర్యలు చేపట్టాలని ప్రబోధిస్తుంది” అని ప్రకటన పేర్కొంది.

ఇటీవలే భారత దేశంలోని కళాకారుల బృందం మోడీ ప్రధాన మంత్రిత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వారిలో విదేశాలలోని భారతీయ కళాకారులతో పాటు, దేశంలోని కళాకారులు కూడా ఉన్నారు. రచయిత సల్మాన్ రష్దీ, సినిమా డైరెక్టర్ దీపా మెహతా, శిల్పి అనీష్ కపూర్ తదితరులు వారిలో ఉన్నారు. బ్రిటిష్ లాయర్లు, కార్యకర్తలు, విద్యావేత్తలు కూడా వారి ప్రకటనపై సంతకాలు చేశారని టి.ఓ.ఐ తెలిపింది.

వారి ప్రకటన “2002లో గుజరాత్ లో జరిగిన భయానక ఘటనలకు ఎలాంటి బాధ్యత స్వీకరించడానికి గానీ, క్షమాపణ చెప్పడానికి గానీ మోడి నిరాకరిస్తున్నారు. భారత ఎన్నికల ప్రక్రియ విలువను మేము ప్రశ్నించడం లేదు. కానీ 2002 నాటి గుజరాత్ భయానక ఘటనలలో మోడి ప్రభుత్వం పాత్రను గుర్తుంచుకోవాల్సిన కీలక అవసరం ఉందని భావిస్తున్నాము. హత్యలు, టెర్రర్, దోపిడీ తదితర చర్యలకు అత్యధిక బాధితులు ముస్లింలే. ఈ అల్లర్లలో 2,000 మంది వరకు పురుషులు, స్త్రీలు, పిల్లలు మరణించారు. ముఖ్యంగా మహిళలు క్రూరమైన హింసోన్మాద చర్యలకు గురయ్యారు. భద్రగా బలగాలు వారిని కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు” అని కొద్ది రోజుల క్రితం విడుదల అయిన ప్రకటన పేర్కొంది.

ఈ దేశంలోని మేధావుల ఆక్రోశానికే దిక్కు లేదు. ఇక బ్రిటన్ మేధావుల ప్రకటనలని పట్టించుకునేదెవ్వరు?

16 thoughts on “మోడి గెలుపు ఆలోచనే భయం గొలుపుతోంది

 1. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని, ముఖ్యంగా మహిళలు అనేక నిర్బంధాలకు గురవుతారని వారు అంచనా వేస్తున్నారు. హిందూత్వ గ్రూపులు రెచ్చిపోతాయని, పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు.

  These are the exact words I said to one of my friends. But my words don’t end there. Modi’s rule might re-instate the bygone cast system and the Brahmin rule. Cast and Religion would start paying a major role in our lives. Our situation would not be much different to that of Afghanistan under Taliban rule. These people who express much abhorrence towards Indira’s attempted assassination of democracy and never miss a chance to talk ardently of the tolerance of the Hinduism will be active perpetrators of the crimes against the people if India.

  Get a preview here : http://saveindiansnow.blogspot.in/2014/04/blog-post_23.html
  This guy, who doesn’t have a decency to answer the questions (and deletes the posts), defines secularism as something that is against Hinduism (this is exactly the definition of secularism under Taliban rule), blames everything foreign hand (Indira and Taliban again), anyone opposing the opinions is anti-Hindu (Hitler and Taliban). Such is are the IQ levels and logical and analytical capabilities of the people vouching for Modi-ist rule.

 2. బారత దేశ ప్రజలు మరి ఎవరిని ప్రధానమంత్రిని చేసి తరించాలో ఆ విదేశీ మేధావులు సెలవిస్తే బావుండేది. గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడేవారు అంతకు ముందు జరిగిన రైలు ప్రమాదం గురించి ఎందుకు మాట్లాడరు? నిన్న గాక మొన్న జరిగిన ముజఫర్ నగర్ అల్లర్ల గురించి ఎందుకు మాట్లాడరు? సిక్కుల ఊచకోత వారికి ఎందుకు గుర్తు రాదు. కాశ్మీరి పండిట్లను వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టి, నానా హింసలు పెట్టారే, అదెందుకు మాట్లాడరు? ఈ దేశంలో 2002 లో గుజరాత్లో జరిగిన మతఘర్షణలే మొదటివా? అవే చివరివా? 2002 గాయం మానకుండా చూడటానికి , కొన్ని దారుణ ఘోరాలను మరుగుపరచటానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు.
  అవినీతి, స్కాంలతో నిండిన కాంగ్రేస్ పాలన పదేళ్ళు చూశాం. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఈ దేశంలో లేదు. ప్రాంతీయ పార్టీలకు తలలు కుదరవు. ఇలాంటి పరిస్తితులలో బలమయిన నాయకత్వం, సుస్థిరమయిన ప్రభుత్వం కావాలి. అది ఇవ్వగలిగేవాళ్ళు ఎవరో ఈ మేధావులను చెప్పమనండి చూద్దాం. ఒకర్ని విమర్శించటం చాలా సులువు. కేవలం ఒక్క సంఘటన ఆధారంగా ఒక వ్యక్తిని ఇంతగా తూలనాడటం ఈ దేశంలో తప్ప ఎక్కడా జరగదు.
  మోడీ తప్పు చేసినట్లు ఇంతవరకూ నిరూపణ జరగలేదు. అల్లర్లలో అతని పాత్రపై వస్తున్న విమర్శలు కేవలం ఊహాజనితాలు లేదా విద్వేషపూరితాలు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రినయినా కేవలం అనుమానం ఆధారంగా ఇంతగా హింసించారా? నరేంద్ర మోదీ ముస్లిములకు లేదా క్రిష్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట ఒక్క వీడియో చూపించండి. అసలు మతపరమయిన ప్రస్తావన తనంతట తాను ఏనాడూ తీసుకురాలేదు. భారతీయులు అని మాత్రమే ఆయన వాడారు. ఒక వ్యక్తి మీద ఇంత ద్వేషం మంచిది కాదు.
  మోడీని అభిమానించేవారు అన్ని మతాలలోనూ ఉన్నారు. నోరు ఉంది కదా అని ఆ మతం, ఈ కులం అనే ప్రస్తావన ప్రతి సారి తేకూడదు. దుర్మార్గులు, మంచివాళ్ళు అన్ని మతాలలోనూ, అన్ని కులాలలోనూ ఉన్నారు. ఉన్నవి రెండే మంచి-చెడు.

 3. మోదీని ప్రధాన మంత్రిని చెయ్యడానికి బిజెపి కొంత కాలం హిందూత్వ పేరు ఎత్తడం మానేసింది. “మేము కులమతాలకి అతీతం” అని బిజెపి హిందీ చానెల్‌లలో ప్రచారం చేసుకుంటోంది. కానీ ఇదే సమయంలో బిజెపి నేత గిరిరాజ్ సింగ్ మోదీ వ్యతిరేకులని పాకిస్తాన్‌కి పంపేస్తామనడం బిజెపికి మింగుడుపడని విషయమైంది. మోదీ గ్లోబలైజేషన్‌ని బలంగా సమర్థించే వ్యక్తి. అతన్ని ప్రధాన మంత్రిని చెయ్యాలంటే కులాన్నీ, మతాన్నీ వదులుకోవాల్సిందే. కానీ ఇప్పుడే ఆ రెండితినీ పూర్తిగా వదులుకోలేనివాళ్ళు ఎన్నికలలో గెలిచిన తరువాత మాత్రం వదులుకుంటారని అనుకోలేం.

 4. when it is inevitable to (s)elect between two devils – one has to be necessarily rational and
  choose the lesser evil doer. anyway, we ve seen the evil doings of the congress for the past 10 years and its time we give chance to the other devil. na?

  who knows, this devil may prove good in its deeds comparatively…

  and let us invite the intellectuals, from here or elsewhere, to kindly view this video clip
  and publish their verdict as to who would be better, for taking the reigns of 120 crore
  populated country.

  and what were the socalled intellectuals doing when the congress was unashamedly playing
  the cruel division game with andhra pradesh with clear political motives?

  and what would they say about congress advocating the people of india, excepting andhra pradesh, against the socalled harmful divisive policies of the bharteeya janata party, boasting, without any conscience, about the division of andhra pradesh by them, at the same time?

  please, the socalled intellectuals, who signed the declaration opposing Modi, have the patience to go through the full interview cited above and advise the people, or the world,
  as to who would be better for the country in the coming years…

  i was not for Modi at any time…
  but the country’s better being becomes the primary context…

 5. @kiran, @vasanth

  అవును మోదీ కులమత ప్రస్తావనలు తీసుకురారు. కానీ మాట్లాడిన ప్రతిసారీ ఆరెంటిగురించి మాట్లాడే VHP, భజరంగదళ్ లాంటీ సోదరసంస్థలను మాత్రం అలా చెయ్యవద్దని వారించరు. బ్లాగుల్లో మోదీ ని సమర్ధించేవారు దేశంనుండి ఇతరమతాలవారిని తరిమేస్తారనో, హిందువులకు పట్టంగట్టి మిగిలినవారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారనీ కీర్తిస్తారు. అప్పుడెవరూ అది తప్పూఅలోచన అని చెప్పేందుకు మీలాంటివారు ముందుకురారు.

  సంఘటన! చైనా యుధ్ధంకూడా ఒక సంఘటనే. ఘజనీ, ఘోరీలు దేవాలయాల్ని కొల్లగొట్టినవీ, బొంబాయిలో బాంబుపేలుళ్ళుకూడా కేవలం సంఘటనలే వాటి గురించి ప్రస్తావించేటప్పుడు ఆరెస్సెస్ వాళ్ళు పూనకంతో ఊగిపోతారు. దీనికి నేనే సాక్ష్యం. నా చిన్నప్పుడు మావీధికొచ్చి ఇలాంటివన్నీ ఏవరువుపెట్టి ప్రతీకారానికి సిధ్ధంకండీ అని పిలుపునిచ్చేవారు. మీ వదిలివేయవలసిన-సంఘటన సిధ్ధాంతం ఆసంఘటనలకీ, ఆ సంస్థలకీ వర్తించవా?

  గోద్రా ఘటన గురించి భేషుగ్గా మాట్లాడుకోవచ్చు. కొందరు అల్లరిమూకలు బాధ్యతారహితంగా సాగించిన నరమేధానికి ఒక బాధ్యతగల ప్రభుత్యం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి, దర్యాప్తు, శిక్షల బాధ్యతలు గాలికొదిలి చేసిన సాగించిన మరోపెద్ద నరమేధం గుజరాత్ అల్లర్లు. ఇది అధికారిక రాక్షసత్వం. ప్రభుత్వపు రాక్షసత్వం. ఇదీ సంఘటనే. ఈ సంఘటన మోదీ వెలుగులోకి రావడానికి ఉపయోగపడింది. ఊహాజనిత ‘ముస్లిం విదేశీ శక్తుల’కు వ్యతిరేకంగా ‘దేశభక్త హిందువుల’ను సంఘటితం చేయడానికి ఉద్దేశించబడినదీ సంఘటన (అచ్చు మాలెగావ్ పేలుళ్ళలాగానే!)

  జగన్ తప్పుచేసినట్లు ఎక్కడ ఋజువయ్యింది? సోనియా అవినీతి ఎక్కడ ఋజువయ్యింది? దేశానికి నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్న so called విదేశీ శక్తుల ఉనికికిమాత్రంఋజువులేవి?

  విడేశాలకెళ్ళినవారందరూ పారిపోయినవారే అయితే. వివేకానందుడు ఎందుకు చికాగో పారిపోయినట్లు(of course తిరిగొచ్చారనుకోండి)? హరగోవోవిందఖొరానా, జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాధ్ బోస్ and also the bunch of people listed in here : http://en.wikipedia.org/wiki/List_of_Indian_Americans. వీళ్ళందరూ ఎందుకు, ఎవరినుంచి పారిపోయారో తెలుసుకోవచ్చా? ఇలాంటి వాళ్ళందరూ కూడా పారిపోయినవాళ్ళేనయితే అది ఎవరికి అవమానకరం? వాళ్ళు పంపించే డాలర్లుమాత్రం కావాలా దేశానికి? డాలర్లదగ్గర మనవాళ్ళేకానీ, కొంచెం విభేదిస్తేమాత్రం పారిపోయినవాళ్ళూ, పిరికి సన్నాసులూ అవుతారా? భేష్!

 6. ఈ మేధావులకు బంగ్లాదేశ్ విభజన సమయంలో పాకిస్తాన్ పాలకులు సాగించిన మారణ హోమం, మానభంగాలు కళ్లకు కనపడలేదా? వీరు పాక్ మిలటరి పాలకుల గురించి ఏనాడైనా ఆందోళన చెందారా? పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య పాలన ఆవశ్యకత గురించి వీరు ఎంత ఆందోళన చెందారా? అమెరికాకి,యురోప్ లను పాకిస్తాన్ కు ఆయుధాలు,బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం ఎందుకు చేస్తున్నారని ఎనాడైనా నిలదీశారా?
  బంగ్లాదేశ్ లో పదిలక్షల మంది బీహారి ముస్లిం లు స్టేట్ లెస్ సిటిజన్స్ గా జీవిస్తున్నారు. స్టేట్ లెస్ సిటిజన్స్ అంటే వీళ్లు భారత,బాంగ్లా,పాకిస్తాన్ దేశాలకు చెందరు. దేశ విభజన సమయం లో బీహార్ నుంచి తూర్పు పాకిస్తాన్ కు వెళ్లి, అక్కడ నివాసం ఏర్పరచుకొన్నారు. బంగ్లాదేశ్ విభజన సమయం లో పాకిస్తాన్ కు మద్దతు నిచ్చారు. యుద్దంలో పాకిస్తాన్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ వీరిని వాళ్లదేశ పౌరులుగా గుర్తించలేదు. పాకిస్తాన్ వాళ్లు వీరికి వారిదేశానికి తీసుకుపోలేదు. ఈ పది లక్షల మంది పరిస్థితి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లు ఉంది వారి ప్రస్తుత పరిస్థితి. వీరి గురించి ఆ లండన్ మేధావులు, బంగ్లా వాడైన అమర్త్య సేన్ ఏనాడైనా ఆందోళన చెందారా? ఇక ఆ లిస్ట్ లో ఉండే వారి పేర్లను ఏనాడైనా మనదేశ ప్రజలు విన్నారా? ఈ మేధావులు భారత దేశ మధ్య తరగతి ప్రజలలో వారి పరపతి ని కోల్పోయారు.

 7. శ్రీరామ్ గారూ, ఇతర హత్యాకాండలను మీరు ఎన్నైనా చెప్పండి. పాకిస్ధాన్, బంగ్లాదేశ్ ల దాకా ఎందుకు? కాంగ్రెస్ నేతలు చేసిన, చేయించిన హత్యాకాండలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎన్నైనా ఉదహరించవచ్చు. కానీ మీకు ఇష్టం లేని పాలకులు చేసిన హత్యాకాండలు, మీకు ఇష్టులైన పాలకుల హత్యాకాండలను మాపుతాయా చెప్పండి!

  మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట! ఎవరికైనా వర్తించే మాట! తప్పుని తప్పుగా చెప్పలేకపోతే మనిషిగా మన ఉనికి వ్యర్ధం కాదా?

  అందునా మూకుమ్మడిగా ప్రాణాలు తీసే తప్పు, మూకుమ్మడిగా ఆస్తులు తగలేసే తప్పు, ఎప్పుడో చరిత్రలో జరిగిన తప్పుల్ని చూపి వాటితో ఏమాత్రం సంబంధం లేని ఇప్పటి మనుషుల్ని ద్వేషించే తప్పు… ఇలాంటి తప్పులు పాలకులు తమ స్వార్ధం కోసం చేస్తారు తప్ప కనీసం తమని అభిమానించే మాస్ ప్రయోజనం కోసం కూడా చెయ్యరు. అవసరం అయితే తామే ఉసిగొల్పిన ఒక కొడ్నాని, ఒక భజరంగి, ఒక వంజార లను బలిపీఠంపై బలి ఇవ్వడానికి కూడా వెనుకాడని స్వార్ధం అది.

  ఒక గుంపుని మరొక గుంపుపైకి ఉసిగొల్పి అలాంటి విద్వేష బీజాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎలా సమర్దించగలం? మాట్లాడితే కోర్టులు అంటారు. చుండూరులో ఏమీ జరగలేదని శిక్షలన్నీ రద్దు చేసింది హై కోర్టు. ఒప్పుకుందామా? లొంగేదాకా బెయిల్ రాకుండా చేసి, లొంగిన తర్వాత జగన్ కి బెయిల్ ఇచ్చేశారు. న్యాయం జరిగిందని అంగీకరిద్దామా?

 8. శేఖర్ గారు,
  నేను రాసింది ఆమేధావులను దృష్టిలో ఉంచుకొని అండి. నాకు పాకిస్థాన్ పాలకుల మీద ఇష్టత,అయిష్టత అంట్టూ ఎమీ లేదండి. జియోపాలిటిక్స్ ఆసక్తి గనుక, ఆదేశం లో మిలటరి పాలన/ఆధిపత్యం ఇప్పటి వరకు కొనసాగటానికి అమెరికా,బ్రిటన్ దేశాలు కారణం అని నమ్ముతాను. ఈ మేధావులందరు ఆ దేశాల ప్రముఖ యునివర్సిటిలో పనిచేస్తూ నీతులు చెప్పటమే, ఆసక్తి, ఆశ్చర్యం కలిగించే విషయం. అన్ని లక్షల కోట్ల స్కాం లు జరుగుతూంటే వీరేందుకు నోరు తెరవలేదు? అప్పుడు లేఖ రాయకుడదా? మూడో ఫ్రంట్ ప్రధానులు అయితే పదవి ఎన్ని రోజులు ఉంట్టుందో అన్న అభద్రతా భావం వల్ల స్కాములు చేసిన అర్థం చేసుకోగలం. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం వారికి డబ్బులను జౌరుకుందామన్న తీవ్ర కాంక్ష, ఆశ ఎందుకో ఇప్పటికి అర్థం కాదు. ఈ దేశ ప్రజలు పనితీరు కొద్దిగా మెరుగు ఉంటే చాలు నెత్తిన పెట్టుకొంటారు కదా! తిన్నదంతా తిని, చేసిందంతాచేసి ఇప్పుడు మళ్లీ వెంటనే మూడోసారి అధికారం లోకి రావలనుకోవటం ఎలా సాధ్యపడుతుంది?

  చూండూరు గుజరాత్ సంఘటనలకు పోలిక లేదు. చూండూరు ఘటనధనవంతులు,బలవంతులు,పల్లేలో బలహీనుల పైన రాత్రి/సాయం సమయంలో చేసిన దాడి. గుజారత్ ఘటన అలాంటి కాదు. పట్ట పగలు పట్టణ ప్రాంతాలలో జరిగింది. చుండురు బాధితులకు అండగా కోట్లు ఖర్చు పెట్టి, న్యాయం కోసం తిరిగిన వారు ఉన్నట్లు ఎక్కడా చదవలేదు. గుజరాత్ వారి కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అన్ని ప్రయత్నాలను చేసి, ఫలితం లేక ప్రస్తుతానికి వెనుకడుగేశారు.

  మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట! ఎవరికైనా వర్తించే మాట! తప్పుని తప్పుగా చెప్పలేకపోతే మనిషిగా మన ఉనికి వ్యర్ధం కాదా!

  ఇటువంటి ప్రశ్నలకు ఒక్క ముక్కలో సమాధానం ఇవ్వటం కష్టం. మొన్న హెడ్ లైన్స్ టి వి చానల్ లో అనుపం ఖేర్, మహేష్ భట్ మధ్య చర్చ జరిగింది. అనుపం ఖేర్, మహేష్ భట్ ని గురువు లాగా భావిస్తాడు. కాని ఇప్పుడు ఇద్దరు వేరు వేరు శిబిరాలలో ఉన్నారు. చర్చ చివరిలో, మా అభిప్రాయాలు రూపాయి నాణ్యానికి రెండు వైపులను ప్రతిభింబిస్తున్నాయని చెప్పి మహేష్ భట్ ముంగించారు. మనస్పూర్తిగా మీరు నమ్మింది, మీరు ఫాలో అవ్వటమే ఉత్తమం.

 9. మోడి అధికారంలోకి వస్తే ‘మోరల్ పోలీసింగ్’ తీవ్రం అవుతుందని ..*
  సి.యన్.యన్.ఐ.బి.యన్. చానల్ చేసిన సర్వేలలో ప్రతి ముగ్గురి మహిళలో ఒకరు మోడికి, ఎనిమిది మంది మహిళలో ఒకరు రాహుల్ కి మద్దతు ఇస్తున్నారని లో చూపించారు. సామాన్య గృహిణులకు ,మహిళలకు పెరుగుతున్న ధరలు ప్రభావితం చేస్తాయి. జీవన ప్రమాణాలు రోజురోజుకి దిగజారుతుంటే మహిళలు మోడికి మద్దతు చూపుతున్నారని పిస్తుంది. ‘మోరల్ పోలీసింగ్’ ఇటువంటి వాదాలు బ్లాగులో , midia lo వాదులాడుకొవటనికి
  పనికొస్తాయి. క్షేత్రస్థాయి లో వాటి ప్రభావం ఎమి ఉండదు.

  *పొరుగు దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారుతాయని వారు ఊహిస్తున్నారు. *
  ఏ పొరుగు దేశాలు? చైనాతో యుద్దం చేయం. పాకిస్తాన్ తో యుద్దం అనవసరం. ఆ దేశం ఎటుపోతుందో వాళ్లకే తెలియదు. మొదట్లో హిందువులను హింసించారు. తరువాత మొహజిర్లు, అహ్మదీలు, క్రైస్తవులు అంతా అయ్యి ఇప్పుడు సున్ని, షియాల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి అవి ఎటువైపుకు దారితీస్తాయో సామాన్య పౌరులు, ఆ దేశం సౌభాగ్యం కోరుకొనే మేధావులు ఆందోళన చెందుతున్నారు. తాలిబన్లకి వేరే దేశంలో కాంట్రక్ట్ దొరికింది. సౌది వారికి మద్దతుగా సిరియా యుద్దంలో పాల్గొంట్టున్నారు. కనుక మన వైపుకి రాకపోవచ్చు .ఈ మధ్య అక్కడి మేధావులు,మీడీయావారైన రాజా రుమి,హమిద్ మిర్ ల పైన హత్యాయత్నాలు జరగటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాది. అంతూపొంతూ లేని ఈ గొడవలు చూసి చూసి అక్కడి మేధావులు భారత దేశం నుండి విడిపడటం వలన తీవ్రం గా నష్టపోయామని టి.వి.లలో చర్చిస్తూంటారు. ముస్లిం దేశాలు అనునిత్యం ఎదో గొడవలతో సతమతమౌతుంటయి. దానికి భిన్నంగా, ఎన్నో తెగల ముస్లింలు కొట్టుకోకుండ భారతదేశంలో నివసించటానికి కారణం హిందువులని తేల్చేశారు.
  http://www.thefridaytimes.com/tft/leasing-out-pakistan/
  http://www.dw.de/is-pakistan-aiding-syrian-rebels/a-17528187

 10. బర్ఖాదత్ సెక్యులరిజం గురించి పది సంవత్సరాలుగా ఊదరగొడుతునాది.ఈ చర్చ దేశానికి ఉపయోగం లేదు. పైపెచ్చు ప్రో మోడి వాళ్లు దుమ్ము దులిపారు. ప్రమోద్ మూథాలిక్ బిజెపి లో చేరితే రచ్చ చేసిన మీడియా వాళ్లు, ! అదే యన్.కె. సింగ్ (నీరా రాడియా ఫేం) పార్టిలో దూరుతూంటే ఎందుకు గోడవ చేయకుండా ఉన్నారని చర్చించి ఉంటే బాగుండేది. బిజెపి పార్టిని ముథాలిక్ విషయం లొ మాదిరిగా నిలదీసి ఉంటె, సింగ్ బిజెపిలో చేరకుండా అడ్డుకొని ఉంటే ఇంగ్లిష్ మీడియా వారి నిజాయితిని ఒప్పుకోవచ్చు. జాతీయ మీడియాకి అంత నిజాయితి లేదు. వాళ్లు ఏనుగులను (యన్.కె.సింగ్) వదలి దోమల్ని(ముథాలిక్) పట్టటానికి అలవాటు పడీఫొయారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s