ప్రధాని మన్మోహన్ సింగ్ కు మొదటి పదవీ కాలంలో మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ప్రత్యర్ధుల ప్రయోజనాలకే అన్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈ పుస్తకాన్ని బి.జె.పి వినియోగించదలుచుకుందని ఆ పార్టీ విమర్శలు చెబుతున్నాయి.
బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడి సైతం ఆ అవకాశాన్ని వదల్లేదు. మన్మోహన్ సింగ్ ను బలహీన ప్రధానిగా గతంలోనూ అనేకసార్లు విమర్శించిన బి.జె.పి సంజయ్ బారు పుస్తకం తమ ఆరోపణలను ఋజువు చేసిందని చెప్పుకున్నారు. రిమోట్ కంట్రోల్ తో యు.పి.ఏ ప్రభుత్వం నడిచిందని మోడి విమర్శించారు.
“రిమోట్ ద్వారా ప్రభుత్వాలను నియంత్రించడం గురించి విన్నాను. కానీ రిమోటే ప్రభుత్వాన్ని నడపడం గురించి ఇప్పుడు వింటున్నాను. పుస్తకం విడుదల అయ్యాక నిన్ననే ఆ సంగతి తెలిసింది” అని మోడి ఏప్రిల్ 12 తెడీనా ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్నారు.
మరి మోడి ప్రధాని అయితే! ఆయన ప్రధాన మంత్రి ఇంకా కాలేదు గానీ కేవలం ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తేనే పరిస్ధితి ఎలా ఉందో చూడమని కార్టూన్ సూచిస్తోంది. మాజీ ప్రధాని వాజ్ పేయి తనను ముఖ్యమంత్రి పదవినుండి తప్పించకుండా చక్రం అడ్డు వేసిన తన గురువు అద్వానీ కోరిన నియోజకవర్గాన్ని ఆయనకు దక్కనివ్వలేదు. మానవ వనరుల మంత్రిగా హిందూత్వ ఎజెండాను నిష్టతో అమలు చేసిన మురళీ మనోహర్ జోషిని ఆయన నియోజకవర్గం వారణాసినుండి గెంటివేశారు. బి.జె.పి ఫైర్ బ్రాండ్ ను భోపాల్ నుండి ఝాన్సీకి తరలించేశారు.
“ప్రధాని అభ్యర్ధిగానే ఇంత చేస్తే, ప్రధాని అయ్యాక ఇంకేమి చేస్తారో మరి!” అని కార్టూన్ సూచిస్తున్నట్లుగా ఉంది.
సోనియమ్మ ప్రమోదాల నిలయం – ప్రధానమంత్రి ప్రమాదాల వలయం.
వృద్ధాప్య రాజకీయ ఆతిధ్యాలు అనారోగ్య పాలనకు విలయ తాండవం !