భారత దేశపు రేప్ అనుకూల లాబీ -ది హిందూ సంపాదకీయం


Shakthi mills rape convicts 1

(ముంబై శక్తి మిల్స్ అత్యాచార నిందితుల్లోని ముగ్గురు రిపీట్ అఫెండర్స్ కు కోర్టు మరణ శిక్ష విధించిన నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ “అబ్బాయిలు అబ్బాయిలే. వారు తప్పు చేయరా” అని వ్యాఖ్యానించి పెను దుమారానికి తెరతీశారు. అవి ఆయన పొరబాటుగా అన్న మాటలు కావనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారని ది హిందూ సంపాదకీయం సరిగ్గా వ్యాఖ్యానించింది. మనకు కనపడని ప్రొ-రేపిస్టు లాబీ ఒకటి మన దేశంలోనూ ఉందని చెబుతున్న ఈ రచన ఒక చేదు నిజానికి ప్రతిబింబం. -విశేఖర్)

“అబ్బాయిలు తప్పులు చేస్తారు” సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ గురువారం చెప్పిన మాటలివి. అలాంటి హీనమైన నేరాన్ని తేలిక చేస్తున్న ఆయన మాటలే, భారత దేశంలో ఫెమినిస్టుల యుద్ధం ప్రారంభ దశలోనే ఉందనడానికి తార్కాణం. 2012లో ఆ మహిళ అత్యాచారం, హత్యలకు గురైన అనంతరం వచ్చిన కొత్త అత్యాచార చట్టాలను తమ బాయ్ ఫ్రెండ్స్ ను శిక్షించడానికి మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని ములాయం నమ్ముతున్నారు. “వారి స్నేహం ముగిసిపోయినపుడు తాను అత్యాచారానికి గురయ్యానని అమ్మాయి ఫిర్యాదు చేస్తుంది” అని ఆయన నొక్కి చెప్పారు. ఈ లోపు ములాయం లెఫ్టినెంట్ అబు అసిమ్ అజ్మీ, షరియా చట్టాన్ని గుర్తుకు తెచ్చారు, మరణ శిక్ష వేయాలని చెప్పడం కోసం… ఎవరికి? నిందితుడికి కాదు, బాధితురాలికి! “మహిళ కూడా నేరస్ధురాలే” అని అజ్మీ ఒక ముంబై వార్తా పత్రికతో అన్నారు. “ఏ మహిళ అయినా సరే, వివాహిత అయినా కాకపోయినా, తన అనుమతి ఉన్నా లేకపోయినా, ఒక పురుషుడితో వెళితే గనక ఆమెను ఉరి తీయాలి” అని అజ్మీ నమ్ముతున్నారు.

విచారకరమైన నిజం ఏమిటంటే, ఇటువంటి ధోరణులు కేవలం సమాజ్ వాదీ పార్టీకి మాత్రమే పరిమితం కావు. స్కూల్ అమ్మాయిలు గౌనులు వేసుకుంటున్నందున వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని భావిస్తున్న రాజస్ధాన్ శాసన సభ్యుడి నుండి అమ్మాయిలు తమను తాము ఓవర్ కోట్ తో కప్పుకోవాలని కోరే పుదుచ్చేరి మంత్రి వరకూ; వలస కార్మికులను తప్పు పట్టే శివ సేన నాయకుల నుండి ఆఫ్రికన్లను బలిపశువులను చేసే ఢిల్లీ కమ్యూనిటీ నాయకుల వరకూ; “పాశ్చాత్య విలువలే” అత్యాచారాలకు ప్రేరేపిస్తున్నాయని భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భగవత్ నుండి చౌమీన్ (చికెన్ నూడుల్స్) తినడం వల్ల హార్మోన్లు అదుపుతప్పి అది జరిగిపోతుందని చెప్పే హర్యానా ఖాఫ్ పంచాయితీ నాయకుడి వరకూ – ఒక్క రేపిస్టును తప్ప ఇంకెవరినైనా, దేనినైనా తప్పు పట్టడానికి ఇష్టపడే భారతీయులకు కొదవ లేదు.

(ములాయం సింగ్) యాదవ్ మాటలు పొరబాటున అన్నవి కావని మనం సకారణంగానే నిర్ధారించుకోవచ్చు. ఎన్నికల ప్రచారం గాయాలమయం అయిన  నేపధ్యంలో ఇటువంటి వైఖరి తీసుకోవడం వలన రాజకీయంగా లాభం పొందవచ్చని ఆయనకు తెలుసు. వికారం కలిగించే నిజం ఏమిటంటే, ఇతర అనేక దేశాలకు మల్లే భారత దేశంలోనూ రేప్ అనుకూల లాబీ గా మాత్రమే చెప్పగలదేదో ఒకటి ఉనికిలో ఉంది. అది రాజకీయ గురుపీఠాలను దాటి విస్తరించి వీధుల్లోకీ, ఇళ్ళల్లోకీ పాకిపోయింది. గత సంవత్సరం ఫెమినిస్టు కార్యాశీలత పునరుద్ధరించబడడంతో పితృస్వామికం తనను తాను రక్షించుకోవడానికి కొత్త మార్గాలనూ, బోగీలను వెతుక్కునే పనిలో పడిపోయింది. లైంగిక దాడికి సంబంధించిన చట్టాలకు చేర్చిన కొత్త సవరణలలోని కొన్ని అంశాలు “మరీ కిరాతకంగా” ఉన్నాయనే వాస్తవరహిత బుద్ధిపూర్వక భయాలు దాని చేతికి అందివచ్చాయి.

భారత మహిళకు, అత్యాచారం అనేది గర్భంలోనే మొదలయ్యే హింస కొనసాగింపులో ఒక భాగం. అంతే కాకుండా పాశ్చాత్యీకరించబడిన ఇండియా కంటే గ్రామీణ భారతం మహిళలకు భద్రమైన చోటు అన్న భ్రాంతికి విరుద్ధంగా, 2012లో పోలీసులు నమోదు చేసిన 24,923 కేసుల్లో కేవలం 3,035 మాత్రమే ప్రధాన నగరాల్లో నమోదయ్యాయి. సాధారణ రేపిస్టు అంటే క్రూరమైన బాల నేరస్ధుడో, దుముకుతున్న హార్మోన్ల తాకిడికి గురయి పిచ్చిపట్టినవాడో లేదా చెడ్డ పెంపకం వల్ల దారితప్పినవాడో కాదని ఈ లెక్కలు చెబుతున్నాయి. మెజారిటీ కేసుల్లో నేరస్ధులు బాధితులకు బాగా తెలిసినవారే. యాదవ్ మాటలు తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేగడానికి సరిగ్గానే దారి తీసాయి. ఆ మాటల యొక్క మరింత దయాళు రూపంలోని వ్యక్తీకరణలను మనలోని ఎంతమందిమి నమ్ముతున్నామోనన్న కఠినమైన ఆత్మావలోకనానికి కూడా దారి తీయవలసి ఉంది.

6 thoughts on “భారత దేశపు రేప్ అనుకూల లాబీ -ది హిందూ సంపాదకీయం

 1. మూలాయం గారి సతీమణి కానీ , వారి కోడలు కానీ రేప్ చేయబడితే కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చుతారా ?
  లేక పాలకులకు వారి అభిప్రాయం వర్తించదా ?

 2. //భారత దేశపు రేప్ అనుకూల లాబీ// పిత్రుస్వామిక వ్యవస్తే ఒక అనుకూల లాభి. ఈ దేశంలో ఎంతమంది పురుషులు రేప్‌ అవకాశం అచ్చినా ముందుకు ఉరకకుండా ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్ట వచ్చేమో? పవిత్రతచాటున సాంప్రదాయక హిందు కుటుంబ వ్యవస్త ఎంత పవిత్రంగా వుందో మీరు చెప్పిన అంకెలు మాత్రమే కాదు అనేక రకాల అద్యయనాలు దాని డొళ్ల తనాని బలపరుస్తున్నాయి. గ్రామీన వ్యవస్తలో అవిధ్య, మూడ నమ్మకాలు అవగాహన లేమీ మగ దురహాంకారం స్త్రీల పాలిట ఎముల్లుగా మారాయి అంటే అతిశయోక్తికాదు.
  //భారత దేశంలో ఫెమినిస్టుల యుద్ధం ప్రారంభ దశలోనే ఉందనడానికి తార్కాణం.//
  ” ఫెమినిష్టులు ” అనే మాట ఈ బ్లాగులో వాడాక పోవటామే బాగుంటుంది. ఎందుకంటె బూర్జువా ఫెమినిష్టులు ఈ పురుష స్వామ్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఆదిపత్య భావ జాలాన్ని వ్యతిరేకించటం లేదు. ఆదిపత్య భావజాలం పోకుండా స్త్రీ సమానత్వం రాదు.

 3. కొన్ని దశాబ్దాల క్రితం ఒక అమెరికా అధ్యక్షుడు కొరియాలోని శాంతి పరిరక్షక దళాల కీచకపర్వాన్ని సమర్ధిస్తూ They are after all young boys, let them have some fun అన్న సంఘటన గుర్తుకు వచ్చింది.

  సరిగ్గా గమనించండి చాందసవాదులేమతంలో ఉన్నా ఇతర విషయాల్లో ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించినా స్త్రీల హక్కులు, సమానత్వం విషయంలో వారి అభిప్రాయాలన్నీ perfectగా సరిపోలుతాయి. మానవ సమాజపు దౌర్భాగ్యం ఏంటంటే మేధావులైనవాళ్ళు ఒకతికి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు. ఇలాంటి మూఢులుమాత్రం ఉన్నది మిడిమిడిజ్ఞానమే ఐనా, అనితరసాధ్యమైన convictionతో మాట్లాదుతారు. మొన్న ఆశారాం, ఈనాడు ములాయం, అజ్మి. ఎంచెయ్యాలి వీళ్ళను? దేవతలకు అవమానం జరిగిందంటూ ఇళ్ళమీదకు దాడిచేస్తారే, మరి దేవతలను సంతోషింపజేయడానికి స్త్రీలను పూజిస్తామని చెప్పుకునేదేశంలో ఇలాంటివాళ్లను ఎవరూ ఎందుకు silence చెయ్యడంలేదు? ఇలాంటివాళ్ళు ధైర్యంగా ఎన్నికల్లో పోటీచెయ్యడమేకాక, ఎలా గెలవ గలుగుతున్నారు? సంస్కృతి పరిరక్షకులు ఇలాంటి వాళ్లపైన తమ ప్రతాపాన్ని ఎందుకు చూపరు?

 4. వస్త్రధారణ కేవలం రేపుకు ప్రేరణయితే, రేపటినుంచి ములాయం పుత్రరత్న ప్రభుత్వం నగ్నంగా కార్యకలాపాలను సాగిస్తూ ఓటరుల జాబితాను పెంచుకుంటూ పోతేసరి!

 5. Rarely do we see people condoning theft, robbery, murder, extra-marital relationship (which by the way involves mutual consent). Enter rape! we will find hoards of of politicians and god-men trying to reason away and arguing the human side of the perpetrators of the most heinous crime. I think some where, some time back we got our morals wrong.

  I feel ashamed of living in a country infested with this kind of people. If a similar thing were to happen in any western country (which we regard as ‘mlechcha’), that single incident itself would have ensured the end of his/her political career.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s