1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్


1962-war1962 నాటి ఇండియా-చైనా యుద్ధంలో మొదట దాడి చేసింది ఇండియాయేనని చైనా కాదని  సీనియర్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు నెవిల్లే ప్రకటించారు. ఆనాటి యుద్ధానికి సంబంధించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న పత్రాలను తాను త్వరలో ప్రచురిస్తానని మాక్స్ వెల్ తెలిపారు. పత్రాలను ప్రచురించడం ద్వారా తాను “భ్రాంతిజనకమైన భారతీయ అభిప్రాయాలను పారద్రోలతానని” మాక్స్ వెల్ చెప్పడం విశేషం.

1962 నాటి యుద్ధం చైనా వల్లనే సంభవించిందని భారత దేశంలోని పాఠ్య పుస్తకాలు చెబుతాయి. హిందూ మతోన్మాద సంస్ధలు కూడా చైనా అన్యాయంగా దాడి చేసిందని, భారత భూభాగాన్ని దురాక్రమించిందని చెప్పడానికి ఇష్టపడతాయి. అయితే వాస్తవం ఇది కాదని ఇటీవల ది హిందు, ఫ్రంట్ లైన్ పత్రికలు వెల్లడించిన కొన్ని వివరాల ద్వారా తెలుస్తున్నది. నిజానికి ఈ పత్రికల కంటే ముందే పలువురు చరిత్రకారులు భారత్-చైనా యుద్ధానికి సంబంధించిన వాస్తవాలను వివిధ వేదికలపైన, వివిధ రూపాల్లో వెల్లడి చేశారు. అయినప్పటికీ వాటిలో మెజారిటీ భాగం ఇంకా మరుగునే ఉండిపోవడంతో అసలు ఏమి జరిగిందన్న వివరాలు తేలికగా అందుబాటులో లేకుండా పోయాయి.

ఈ నేపధ్యంలో మాక్స్ వెల్ చొరవ సరికొత్త చర్చ జరగడానికి దోహదం చేయవచ్చు. చైనా “ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దాడి” చేసిందని, అందుకే యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చిందని భారత ప్రభుత్వం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. ఇది నిజం కాదని మాక్స్ వెల్ చెబుతున్నారు. తాను ప్రచురించే పత్రాలు భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ “చైనా పై బలవంతంగా యుద్ధాన్ని రుద్దిన వాస్తవాన్ని” వెలుగులోకి తెస్తాయని మాక్స్ వెల్ వెల్లడించారు.

మాక్స్ వెల్ చెబుతున్న పత్రాలు ఇద్దరు భారత ఆర్మీ జనరల్స్ యుద్ధానంతరం 1963లో తయారు చేసిన నివేదిక. హేండర్సన్ బ్రూక్స్, ప్రేమ్ భగత్ అనే ఈ ఇద్దరు జనరల్స్ తయారు చేసిన నివేదికలోని అంశాలను వెల్లడి చేయడానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఏప్రిల్ 2010లో ఈ విషయమై రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని పార్లమెంటులో వివరణ ఇస్తూ నివేదికలోని అంశాలు అత్యంత సున్నితమైనవని వ్యాఖ్యానించారు. “భారత ఆర్మీ జరిపిన అంతర్గత అధ్యయనంపై ఆధారపడిన ఈ నివేదికలోని అంశాలు అత్యంత సున్నితమైనవి. కానీ ఇప్పుడు కూడా వాటికి ఆపరేషనల్ విలువ ఉంది” అని రక్షణ మంత్రి పార్లమెంటుకు తెలిపారు.

బ్రూక్స్, భగత్ ల నివేదిక కాపీలు రెండు మాత్రమే ఉన్నాయనీ, అవి కూడా భారత ప్రభుత్వం కాపలాలో ఉన్నాయని ఇటీవలి వరకూ భావిస్తూ వచ్చారు. నెవిల్ మాక్సెల్ ప్రకటనతో మూడో కాపీ కూడా ఇతరుల వద్ద అందుబాటులో ఉందని లోకానికి తెలిసింది. అయితే మాక్స్ వెల్ ఈ రోజు కొత్తగా ప్రకటించలేదు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా బ్రూక్స్ నివేదికను వెలుగులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యుద్ధ కాలంలో ‘ద టైమ్స్’ పత్రికకు న్యూ ఢిల్లీ విలేఖరిగా పని చేసిన నెవిల్లే మాక్స్ వెల్ 1992 నుండీ నివేదికను బహిరంగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండియా టుడే పత్రిక ద్వారా తెలుస్తోంది.

87 యేళ్ళ మాక్స్ వెల్ 1970 లోనే ‘ఇండియాస్ చైనా వార్’ పేరుతో ఒక పుస్తకం రచించారు. దానికి ఆధారం కూడా బ్రూక్స్, భగత్ ల నివేదికే అని మాక్స్ వెల్ వివిధ సందర్భాల్లో చెప్పారు. 50 యేళ్ళ తర్వాత కూడా నివేదికను బహిరంగం చేయడానికి భారత ప్రభుత్వం నిరాకరించడంతో మాక్స్ వెల్ తానే నివేదికను పత్రికలకు ఇవ్వడానికి ప్రయత్నించారు. 5 భారత పత్రికలకు నివేదిక ప్రతులను ఇచ్చినప్పటికీ అందులోని అంశాలను ప్రచురించడానికి పత్రికలు అంగీకరించలేదు.

దానితో మాక్స్ వెల్ తన వెబ్ సైట్ లో సదరు నివేదికను ఉంచారు. కానీ వెనువెంటనే భారత దేశంలో సదరు నివేదిక డౌన్ లోడ్ కాకుండా అడ్డంకులు విధించబడ్డాయి. భారత ప్రభుత్వమే ఈ చర్యకు పాల్పడిందని అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం మాత్రం మాక్స్ వెబ్ సైట్ అందుబాటులోనే ఉన్నది. ఆసక్తి ఉన్నవారు కింది లింక్ లోకి వెళ్ళి నివేదికను చూడవచ్చు.

Read: Henderson Brooks-Bhagat report

భారత ప్రభుత్వం చెబుతున్నట్లుగా బ్రూక్స్-భగత్ నివేదిక భారత జాతీయ భద్రతకు సంబంధించిందేమీ కాదని మాక్స్ వెల్ హాంగ్ కాంగ్ పత్రిక ‘సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్’ తో మాట్లాడుతూ అన్నారు. నివేదికను రహస్యంగా ఉంచడానికి భారత ప్రభుత్వం సాకులు చెబుతోందని ఆరోపించారు. నివేదికను తన వెబ్ సైట్ లో ఉంచడం ద్వారా భారత ప్రభుత్వం కుంటి సాకులను వమ్ము చేశానని ఆయన వ్యాఖ్యానించారు.

“50 యేళ్ళ నుండి ఏదైతే సాధించడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నానో దానిని ఇప్పటికైనా సాధించాలని ఆశిస్తున్నాను. 1962లో ఎటువంటి ముందస్తు సూచనలేని చైనా దాడికి ఇండియా బాధితురాలన్న భారతీయ అభిప్రాయం భ్రాంతిజనకం మాత్రమే. 1962 యుద్ధం నిజానికి భారత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల సంభవించిన ఫలితం అని భారత ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ యుద్ధాన్ని బలవంతంగా చైనాపై రుద్దారు” అని మాక్స్ వెల్ తెలిపారు.

తాను 2012లో అనేక భారతీయ పత్రికలకు నివేదిక ప్రతులు అందజేశాననీ, తద్వారా నివేదికను బహిరంగం చేయడానికి ప్రయత్నించాననీ మాక్స్ వెల్ తెలిపారు. కానీ భారత పత్రికలు నివేదికను ప్రచురించలేదని తెలిపారు. తన వెబ్ సైట్ లో నివేదికలో ఉంచిన సంగతిని ది హిందూ పత్రిక బహిర్గతం చేసినప్పటినుండీ ఇండియాలో తన వెబ్ సైట్ కు ప్రవేశం లేకుండా పోయిందని మాక్స్ వెల్ తెలిపారు. దీనికి కొన్ని పత్రికలు చెప్పినట్లుగా భారత ప్రభుత్వ సెన్సార్ షిప్ వల్ల కాదనీ, కేవలం తన బరువు తాను మోయలేకే వెబ్ సైట్ కూలబడిందని మాక్స్ వెల్ చెప్పడం విశేషం. అనగా ఒక్కసారిగా వచ్చిపడిన ట్రాఫిక్ వల్ల మాక్స్ వెల్ వెబ్ సైట్ అందుబాటులో లేకుండా పోయిందా? ఇప్పుడు మాత్రం మాక్స్ వెల్ వెబ్ సైట్ అందుబాటులోనే ఉంది.

“చైనాయే చెప్పా పెట్టకుండా, ఆశ్చర్యకరంగా ఇండియాపై దాడి చేసిందన్న ప్రచారం పచ్చి అబద్ధం. నిజం ఏమిటంటే ఇండియాయే 1962 లో నిజంగా దాడికి పాల్పడింది” అని మాక్స్ వెల్ స్పష్టం చేశారు. ఇదే సంగతిని ఆయన 1970 నాటి పుస్తకంలో కూడా రాశారని ది హిందూ తెలిపింది.

14 thoughts on “1962: చైనా కాదు ఇండియాయే దాడి చేసింది -మాక్స్ వెల్

 1. నేనూ మా పక్కింటాయనా కొట్టుకున్నాం. ముందు ఆయనే నా మీదకొచ్చాడు. తప్పు ఆయనదే. ఆ విషయాన్నే నేను అందరికీ చెప్పాను. మధ్యలో ఒక కోన్ కిస్కా గొట్టంగాడు వచ్చి.. తప్పు నాదేనన్నాడు. ఆ విషయం చెప్పాల్సింది మా పక్కింటాయన కదా? మరి ఆయనెందుకు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాడు?

 2. మీ లాజిక్ బాగుంది. కాని పక్కింటాయన ఇన్నాళ్ళూ మౌనంగా లేడు. ఆయన చెప్పేది చెబుతూనే ఉన్నాడు. మనమే వినిపించుకోలేదు. నిజం తెలిసినవాళ్లని ‘కోన్ కిస్కా గొట్టం గాడు’ అని ఒకటే తిడుతుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పక్కకి తప్పుకున్నారు. ఒకాయన తప్పుకోలేదు. ఆయన వల్ల ఇప్పుడైనా నిజం తెలిసింది.

 3. అమెరికా, చైనాలు ‘పాపం’ తమ వాదనలను వినిపిస్తూనే ఉంటాయి. కానీ, వాటిని ఎవరూ పట్టించుకోరు. మన భూభాగాన్ని పాకిస్థాన్ ధారాదత్తం చేస్తే.. ‘పాపం’ చైనా ఆ భూమిని ఉదారంగా పుచ్చుకుని భారతదేశాన్ని పుచ్చుకుంది ‘పాపం’. గత కొన్నాళ్లుగా మన భూభాగంలో గుడారాలు వేస్తోంది ‘పాపం’.

 4. ఎప్పుదూ శాంతి శాంతి అని మాట్లాడే నెహ్రూ యుద్దం ఆరంబించాడు మల్లీ తనే అక్కడ (ఆక్సైచిన్) గడ్డి కూడా మొలవదు అని చెప్పడం ఆశ్చర్యం గా ఉంది. the link is not working, could you provide another alternative like cloud/online drive links… thank you for bringing verity into public

 5. అప్పల్నాయుడు గారూ చైనా నాకిష్టం అని ఎవరు చెప్పారు? పైగా మీరు నన్ను ఎగతాళి చేస్తూ వరసబెట్టి కామెంట్లు రాసేస్తూ ఉంటే నేనేమో వాటిని ప్రచురిస్తూ కూచోవాలేం? మీ ఎగతాళి చూపించడానికి మచ్చుకు ఒక కామెంట్ ప్రచురించాను. మిగిలిన మీ వ్యాఖ్యలన్నీ అదే ధోరణి. కొత్తగా చెప్పిందేమీ లేదు. అందుకే ప్రచురించలేదు.

  మీకు యిష్టం ఉన్నా లేకున్నా ఒక సంగతి మాత్రం తప్పనిసరిగా చెప్పాలి.

  అదేమిటంటే… చరిత్ర మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉండదు, నడవదు. సామాజిక (చారిత్రక) గమనానికి తనకంటూ ఒక పద్ధతి ఉంది. ఆ దారిలో అది వెళ్తూ ఉంటుంది. దానికి మన యిష్టాయిష్టాలతో నిమిత్తం ఉండదు.

  గతంలో జరిగిన ఘటనల్ని పది మందీ పది రకాలుగా బాష్యం చెప్పుకున్నా జరిగిన వాస్తవం మాత్రం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటి తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మనం నమ్మిందానికి వ్యతిరేకంగా ఉన్నా తప్పదు. లేదంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది.

  చైనా దాడి చేసిందా లేక ఇండియా దాడి చేసిందా అన్నది ఎవరు చెప్పారు? నేను కాదు. మాక్స్ వెల్ కూడా కాదు. మన సైన్యంలోని జనరల్సే చెప్పారు. వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ నివేదిక తయారు చేశారు. అది జనానికి తెలియడం మన పాలకులకి ఇష్టం లేదు. అందుకని ఎవేవో సాకులు చెప్పి రహస్యంగా దాచిపెట్టారు. దాన్ని నిరసిస్తూ మాక్స్ వెల్ మనవాళ్లు తయారు చేసిన నివేదికను తానే బయటపెట్టాడు. వాస్తవం యాభైయ్యేళ్ల తర్వాతయినా జనానికి తెలియకుండా దాచిపెడతారా అన్నది అతని ప్రశ్న.

  మన సైనిక జనరల్స్ వెల్లడి చేసిన నిజం మనం ఇన్నాళ్లూ నమ్మిందానికి వ్యతిరేకంగా ఉంది. కానీ అది వాస్తవం. చైనా అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు. అంతమాత్రాన వాస్తవం మారిపోదు. మీరు కావాలనుకుంటే బ్రూక్స్-భగత్ నివేదిక అబద్ధం అని నమ్మండి. కానీ ఇక్కడికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తాను అంటే ఎలా? పైగా చైనా మీకు అయిష్టం కాబట్టి నేను రాసింది చైనాకు అనుకూలంగా ఉంది కాబట్టి చైనా అంటే నాకిష్టం అని మీకు మీరే అనేసుకుని నాపైన రుద్దుతానంటే… ఏమన్నా అర్ధం ఉందా చెప్పండి.

 6. అప్పల్నాయుడు గారూ చైనా నాకిష్టం అని ఎవరు చెప్పారు?

  నాకు చైనా అంటే ఇష్టం లేదని మీకెవరు చెప్పారో వాళ్లే మీకు చైనా అంటే ఇష్టమని నాకూ చెప్పారు.
  ఇప్పుడు నిజం చెప్తా వినండి.. నాకు చైనా మీద ఇష్టమో అయిష్టమో లేదు. నా దేశం మీద ఇష్టం ఉందంతే.
  ===
  పైగా మీరు నన్ను ఎగతాళి చేస్తూ వరసబెట్టి కామెంట్లు రాసేస్తూ ఉంటే నేనేమో వాటిని ప్రచురిస్తూ కూచోవాలేం?

  నాకు మిమ్మల్ని ఎగతాళి చెయ్యాలన్న ఉద్దేశమేమీ లేదు. నా ఎగతాళి చైనా మీద. అయినా, మీరు మచ్చుకు ఒకటి ప్రచురించానన్నారు. మిగతావి కూడా ప్రచురించండి. నాది అదే ధోరణి అయినా సరే మీ బ్లాగుకొచ్చి మీ రాతల మీద కామెంట్ చేస్తే ప్రచురించడం మీ బాధ్యత. ‘అదే ధోరణి’ ఉన్నంత మాత్రానా వాటిని ప్రచురించకూడదనేమీ లేదు. నా రాతల్లో బూతులు ఉన్నా, సంస్కారం లేని వ్యాఖ్యలు ఉన్నా అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నావ్యాఖ్యల్లో ఆరెండూ లేవని.. నా దేశంపై చైనా కన్నేసిందన్న బాధతో కూడిన వ్యంగ్యమే ఉందని నా నమ్మకం. లేదూ.. బూతులు, సంస్కారరహిత పదాలు నా వ్యాఖ్యలో ఉన్నాయని మీరనుకుంటున్నారా? లేవని నమ్మి కూడా మీరు నా వ్యాఖ్యలను ప్రచురించనంటే.. నేను చేయగలిగిందేమీ లేదు.
  ===

  ‘‘మీకు యిష్టం ఉన్నా లేకున్నా ఒక సంగతి మాత్రం తప్పనిసరిగా చెప్పాలి.

  అదేమిటంటే… చరిత్ర మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉండదు, నడవదు. సామాజిక (చారిత్రక) గమనానికి తనకంటూ ఒక పద్ధతి ఉంది. ఆ దారిలో అది వెళ్తూ ఉంటుంది. దానికి మన యిష్టాయిష్టాలతో నిమిత్తం ఉండదు.

  గతంలో జరిగిన ఘటనల్ని పది మందీ పది రకాలుగా బాష్యం చెప్పుకున్నా జరిగిన వాస్తవం మాత్రం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటి తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మనం నమ్మిందానికి వ్యతిరేకంగా ఉన్నా తప్పదు. లేదంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది.‘‘

  ఇదంతా మీక్కూడా వర్తిస్తుంది. చైనా మీకు ఇష్టమైనంత మాత్రాన అదేదో పెద్ద పత్తిత్తు అయిపోదు. మాక్స్ వెల్ అనే కోన్ కిస్కా గొట్టం.. అవును, కోన్ కిస్కా గొట్టమే.. చెప్పినంత మాత్రాన అదేదో బైబిలో, ఖురానో అయిపోదు. సరే, మీరు చెప్పినట్టే బ్రూక్స్, భగత్ చెప్పారనే అనుకుందాం. వాళ్లు లోపలి పేజీల్లో ఏం చెప్పారో నేనింకా చదవలేదుగానీ.. నివేదికలోని మొదటి పేజీలోనే ఉన్న ఈ పేరా చదివితే తప్పు ఎవరిదో తెలిసిపోతుంది.
  In october, 1959, the INDO-TIBET Border became the responsibility of the army. This was as a result of chinese aggressive action at longju in NEFA in August, 1959, and at KONGKALA in ladakh in october, 1959.

  దీనికి సంబంధించి డీసీలో వచ్చిన వార్త ఇది.
  DC 50 years ago: Chinese intrude in NEFA, Delhi lodges protest
  PTI | 30th May 2013
  New Delhi: Twenty Chinese in blue uniform came to a place south of Longju in NEFA on April 26, it is stated here today.

  Ten members of the party came to about three miles south of Longju and stayed there from morning till afternoon.

  Th government of India has lodged a strong protest against this provocative entry and unwarranted violation of India territory.

  The protest note was delivered to the Chinese Embassy here yesterday.

  The Chinese government had repeatedly state that Longju was “an area under dispute” and that they would refrain from establishing a civilian checkpost there.

  The note said that the unwarranted violation of Indian territory (near Longju) “clearly exposes the hollowness of the Chinese ministry of defence on March 1 and in their note of March 2, 1963 that Chinese Army personnel had completed their plan of withdrawals 20 kms away from the so-called ‘Line of Actual Control’ unilaterally fixed by the Chinese government.”

  The note said that the intrusion was patently contrary to China’s professed aims of finding a peaceful solution to India-China differences and designed purely to foment tension between the two countries.

  దీన్ని తిప్పికొట్టడానికి భారత్ ఫార్వర్డ్ పాలసీని అవలంబించింది. అంటే.. వివాదాస్పద మెక్మోహన్ సరిహద్దు రేఖ వద్ద భారత భూభాగాన్ని దాటిన చైనీయులను వెళ్లగొట్టే పని. మన జాగాని ఎవడైనా ఆక్రమిస్తే.. నిరోధించడం సిగ్గు, శరం ఉన్నవాడెవడైనా చేసే పని. (అయితే, ఇక్కడ భారత్ చేసిన పిచ్చి పనేంటంటే.. చైనా ఆర్మీతో తలపడగల శక్తి తనకుందా లేదా అని గమనించుకోకపోవడం. 1961లో ఆర్మీ చీఫ్‌ అయిన జనరల్ థాఫర్ సైతం మనకు ఆ శక్తి ఉందా లేదా అని తర్కించుకోకుండా గుడ్డిగా ముందుకెళ్లారు).
  సరే.. ఇవన్నీ పక్కన పెడితే.. 1959లో భారత్ ను కవ్వించింది చైనాయేనని నేనంటాను. అది అడుగుపెట్టిన వివాదాస్పద భూమి భారత్ దేనని నేనంటాను. చైనాది అని మీరు అంటే.. చైనా భూభాగంలోకి చైనా సైనికులు అడుగుపెట్టిన నేరానికి భారతదేశమే కవ్వించి, యుద్ధం చేసి ఓడిపోయిందంటే నేనేం చేయలేను.

  పైగా చైనా మీకు అయిష్టం కాబట్టి నేను రాసింది చైనాకు అనుకూలంగా ఉంది కాబట్టి చైనా అంటే నాకిష్టం అని మీకు మీరే అనేసుకుని నాపైన రుద్దుతానంటే… ఏమన్నా అర్ధం ఉందా చెప్పండి.

  నా ఉద్దేశం కూడా అదే.
  =====

  ఇక నా ప్రశ్న.. తన తప్పు లేకుండా చైనా ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. తన తప్పు లేకుంటే చైనా ఊరూవాడా ఏకం చేసేది. ఈవిషయంలో (అనగా.. తనవి కాని భూభాగాలను (టిబెట్) ఆక్రమించుకోవడం, పక్కోడి భూభాగాలను మీద కన్నేయడం లాంటివన్నమాట) అమెరికాకూ, చైనాకూ పెద్ద తేడా లేదని నా ఉద్దేశం.

 7. BTW… మీరు లింకు ఇచ్చిన నివేదికలోనే, మూడో పేజీలో చైనా చేసిన లుచ్చా పనుల గురించి.. మీరు చెప్పిన మన ఆర్మీ జనరల్సే రాశారు చూడండి.

 8. మన దేశం పైన యిష్టం దేశ సరిహద్దుల్లో ఉండదు. మన వనరుల్ని బైటి దేశపోడు తన్నుకుపోకుండా కాపాడుకోవడంలో ఉంటుంది. మన వనరుల్ని మనకే ఉపయోగపడేలా కాపాడుకోవాలి అనుకోవడంలో ఉంటుంది. గురజాడని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదనుకుంటాను. చైనాని కోన్ కిస్కా అంటే మన దేశం మీద ఇష్టం ఉన్నట్లు, అలా అనకపోతే లేనట్లా? పాక్ ని తిడితేనే దేశభక్తి అనుకునే అధములూ ఉంటారు. అది కరెక్ట్ అయిపోద్దా? అలాంటి అవగాహన నాకు లేదు. మీకుంటే నేను చేసేదేమీ లేదు.

  ఎగతాళి చేసినా ప్రచురించే బాధ్యత నాకు లేదు. ఉన్నచోట చేసుకోండి. నేనయితే ప్రచురించను. ఒకరి నమ్మకాలతో ఏమిటి పని? మీరు రాసింది పైన చక్కగా కనపడుతుంటేను. అలాగే చైనా విషయంలో మీ సెంటిమెంట్, బాధ మీరు ఉంచుకోండి. ఎగతాళి చేస్తూ బాధ అని చెప్పుకుంటే నమ్మే ఉద్దేశ్యం నాకు లేదు.

  చైనా, ఇండియాల మధ్య ఎప్పటినుండో సరిహద్దు రేఖలు ఉన్నాయి వాటిని చైనా ఉల్లంఘించింది, అనుకుంటే అది నిజం కాదని నా అభిప్రాయం. చైనా-ఇండియా, పాక్-ఇండియా ల మధ్య సరిహద్దులు ఇంకా నిర్ణయం కాలేదు. వలస పాలన నుండి మనకు సంక్రమించిన సమస్య ఇది. సరిహద్దులు నిర్ణయం కావాలంటే ముందు ఇరు దేశాలూ కూర్చొని చర్చించుకోవాలి. పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాలి. చరిత్రలో దేశాల మధ్య సరిహద్దులు అలానే నిర్ణయం అయ్యాయి. అలా కాని చోట ఇప్పటికీ ఘర్షణలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు సరిహద్దుల నిర్ణయం జరగాలి. అది జరగనన్నాళ్ళూ అపోహలూ, అపార్ధాలూ తప్పవు.

  కానీ సరిహద్దులో శాంతి నెలకొనడం పాలకులకి ఇష్టం ఉండదు. కొన్ని పశ్చిమ దేశాలకు కూడా ఇష్టం ఉండదు. ఇక్కడ సమస్య రగులుతూ ఉంటేనే జనాన్ని రెచ్చగొట్టడానికి వీలుంటుంది. దేశ వనరులని విదేశీ కంపెనీలు కొల్లగొట్టుకుపోవడం ఇప్పుడు జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ కొల్లగొట్టుడులో మన పాలకులకి కూడా వాటా ఉంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అంతా ఇందులో భాగస్వాములే. ఈ దోపిడీ సజావుగా కొనసాగాలంటే జనాన్ని డైవర్ట్ చేసే సమస్యలు కొన్ని ఉండాలి. అవి కూడా ఇన్ స్టంట్ గా ఉద్రిక్తతలు రెచ్చగొట్టగల సమస్యలై ఉండాలి. వాటిలో మన ఉత్తర సరిహద్దులు ఒకటి. సరిహద్దు పరిష్కారం అయితే మన పాలకులకి జనాన్ని ఏమార్చే పెద్ద అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి వారు చర్చించరు. సెంటిమెంట్లు మాత్ర రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ల దోపిడి చక్కగా సాగిపోతుంటుంది. వాళ్లు రేపిన సెంటిమెంట్లలో పడిపోయి మనం మాత్రం మా నేల, మా భూమి, సిగ్గూ, శరం అంటూ ఒకళ్లనొకళ్లు తిట్టుకుంటూ గడిపేస్తాం. అదేమంటే దేశభక్తి అని ఎంచక్కా మన భుజాలు మనమే చరుచుకుంటుంటాం.

  ఓసారి బాగా బాగా వెనక్కి వెళ్లండి. కనీసం ఒక వందేళ్లు వెనక్కి వెళ్ళినా భారత్, పాక్ లు లేవు. ఉన్నదల్లా బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతం. ఇంకా కొన్ని వందల స్వతంత్ర సంస్ధానాలు. ఇంకా వెనక్కి వెళ్తే అసలు చైనా, ఇండియా, అమెరికా, యూరప్ అన్న తేడాలు కూడా లేని కాలం ఉంది. ఇదంతా ఎందుకంటే దేశాల సరిహద్దులు అనేవి రిజిడ్ గా భూమి పుట్టినప్పుడే ఉన్నవి కావు. చారిత్రక క్రమంలో వివిధ జాతుల అభివ్రుద్ధిలో ఏర్పడ్డాయి. బానిస, ఫ్యూడల్ దశలను దాటి ప్రజాస్వామ్య దశకి వచ్చాం. అంటే గతం కంటే నాగరీకులం అయ్యాం. కాబట్టి ఏ సమస్యనయినా చర్చించుకుని పరిష్కరించుకోగల నాగరిక దశలో మనం ఉన్నాం. అలాంటి దశలో కూడా గతంలో ఎన్నడూ నిర్ణయం కాని సరిహద్దు రేఖను పక్క దేశం ఉల్లంఘించే సమస్య ఉండదని గ్రహించలేకపోతే అనవసర ద్వేషంలో మురిగిపోవడమే మిగిలేది. ఇక తప్పొప్పులంటారా, అవి రెండువైపులా ఉంటాయి. చెప్పకుండా చైనా దాడి చేసిందనడంలో నిజం లేదని అప్పటి మన మంత్రులు, కార్యదర్శులే వివిధ సందర్భాల్లో చెప్పారు. మెక్ మెహన్ రేఖ దాటి మనవాళ్లు ముందు శిబిరాలు పెట్టారు. వాటిని వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే తీవ్ర చర్య తప్పదనీ యూరప్ లో కలిసినప్పుడు వారి అధికారి మన అధికారితో చెప్పారు. మనవాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ విషయాలు నేను గతంలో రాశాను.

  సరిహద్దుల నిర్ణయానికి చర్చలు అవసరం అని గుర్తిస్తే అందులో ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అది సాధారణ సూత్రం. మన సమస్య ఏమిటంటే మన పాలకులే మనల్ని కావలసినంత రెచ్చగొట్టి పెట్టారు. చరిత్రలో జరిగిన వాస్తవాలని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్ధితి. నిజానికి మెక్ మెహన్ ఎవరు? ఒక బ్రిటిష్ వలస పాలనాధికారి. వాడొక గీత గీస్తే అది సరిహద్దు అయిపోద్దా? అయినా మెక్ మెహన్ రేఖను సరిహద్దు చేసుకుందామని చైనా ప్రతిపాదించినా మనవాళ్లు ఒప్పుకోలేదన్నది ఒక వాస్తవం.

  ఇప్పటికన్నా ఇరు దేశాల ప్రభుత్వాలూ చర్చించుకుని సరిహద్దు ఎక్కడో నిర్ణయించుకోగలిగితే ఒక సమస్య తప్పుతుంది. లేదంటే పశ్చిమ దేశాల గేమ్స్ లో మనం పావులుగా ఉండడం కొనసాగుతుంది. జనానికి కావలసింది సరిహద్దు దేశభక్తి కాదు. విదేశీ కంపెనీల దోపిడీలేని నిజమైన దేశభక్తి. ఆ దేశభక్తితోనే బ్రిటిష్ పై పోరాడాం. ఇప్పుడు పిలిచి మరీ అప్పగిస్తున్నాం. అది మాత్రం ఎవడూ అడగడు.

  తప్పులేకుండా చైనా ఇన్నాళ్ళూ ఎందుకు ఊరుకుంది అన్నది మీ ఊహాజనిత ప్రశ్న. ఎందుకంటే చైనా ఊరుకోలేదు. 1964 వరకి ఉన్న పత్రాలను పొల్లుపోకుండా చైనా విడుదల చేసింది. అందులో చైనా వైపు వాదనలు ఏమిటో మన పత్రికలూ రాశాయి. నెట్ లో వెతికితే దొరక్కపోవు.

  చర్చించాలి అనుకుంటే సజావుగా రాయండి, చర్చిద్దాం. మీరు మళ్ళీ మరో విధంగా రాస్తే నేను ప్రచురించను.

 9. పాక్ ని తిట్టడమే దేశభక్తి అనుకునే దేశభక్తి అనుకునే అధముల గురించి నాకు తెలీదుగానీ.. చైనా చంక నాకి, ఆ దేశం ఏం చేసినా వెనకేసుకొచ్చేవాళ్లు, కాశ్మీర్ని పాకిస్థాన్ కి ఇచ్చెయ్యమనేవాళ్లు నా దృష్టిలో అధములే. మీరు ప్రచురించినా ప్రచురించకపోయినా మీ బ్లాగులో ఇదే నా ఆఖరి కామెంట్. ఎంజాయ్…

 10. ఈ కామెంటు నుంచి నన్ను మీరేమైనా తిట్టదలచుకున్నా, తిట్టినా.. అవన్నీ మీకూ వర్తిస్తాయి. ఎంజాయ్…

 11. సంస్కారం గురించి లెక్చర్ దంచి ఇదేంటి నాయుడు గారూ? పోన్లెండి, మీ స్వరూపం చూపారు. ఆఖరి కామెంట్ అంటూనే మరో కామెంట్! ఒకసారి తప్పితే తప్పారు గానీ, ఇక మాట తప్పకండి.

 12. stop your war of words immediately! you are fighting on a war which ended morethan 50 years ago. as vishekar rightly said china never accepted mcmohan line as a border it was an agreement between british india and tibet(an autonomous country then) and china just participated as the 3rd party to the meeting. though india attacked firtst it was china that provoked india. think of that inspite of outnumberd by chinese army india attacked china i.e nobody wanted to be defeated but india attacked means it was china that provoked india.
  as indian army ready to take on chinese army india should have solved through international arbitrator.
  any how thank you vishekar for bringing this article into light.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s