బి.జె.పి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఒక పక్క తెలుగు సినీ తారలు ఆకాశానికెత్తుతుండగా మరో పక్క హిందూ పీఠాధిపతులు ఆయన్ను విమర్శిస్తున్నారు. బి.జె.పి కార్యకర్తలను ‘వ్యక్తి పూజ’ చేసేలా ఆయన ప్రోత్సహిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ‘హర హర మహా దేవ’ కు బదులుగా ‘హర హర మోడి’ అంటున్నా మోడి వారిని వారించ లేదని విమర్శిస్తున్నారు.
వారణాసిలో ఇటీవల జరిగిన బి.జె.పి ర్యాలీలో జరిగిన ఘటన పట్ల వివిధ పీఠాధిపతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వారకా పీఠం శంకరాచార్యులు స్వామీ స్వరూపానంద సరస్వతి, బద్రికాశ్రమం అధిపతి స్వామి ఆవిముక్తేశ్వరానంద సరస్వతిలు మోడి పై విమర్శలు గుప్పించినవారిలో ఉన్నారు.
ఛత్తీస్ ఘర్ బి.జె.పి అధ్యక్షులు అనురాగ్ సింగ్ దేవ్ ఒక శివాలయంలో ఏకంగా లింగాన్నే పెకలించి దాని స్ధానంలో మోడి ఫోటోని ఉంచారట. దీనిపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడి విగ్రహారాధన తగదని నిరసించారు.
మోడి వ్యక్తి పూజని ప్రోత్సహిస్తున్నారని స్వామీ అవిముక్తేశ్వర అభ్యంతరం చెప్పారు. “మోడి సెకండ్ రేట్ నాయకులు. ఆయన ఉన్నత స్ధాయి నాయకులు కాదు. ఆయన నిజమైన నాయకులైనట్లయితే ‘హర హర మోడి’ అంటూ కార్యకర్తలు నినాదాలు ఇస్తున్నపుడే మోడి వారిని కూకలు వేసి ఉండేవారు” అని ఆయన వ్యాఖ్యానించారని మెట్రో న్యూస్ అనే పత్రిక తెలిపింది. (కింద పేపర్ కత్తిరింపులు చూడగలరు.)
‘హర హర మోడి’ అంటూ కార్యకర్తలు నినాదాలు ఇవ్వడాన్ని సమర్ధిస్తున్నారా అని విలేఖరులు అడిగినప్పుడు కూడా మోడి మౌనం వహించారే తప్ప స్పష్టంగా ఏమీ చెప్పలేదనీ, ఆ తర్వాత విమర్శలు వచ్చాక మాత్రమే ట్విట్టర్ లో అలాంటి నినాదాలు కూడదని వ్యాఖ్యానించారని స్వామి అభ్యంతరం చెప్పారు.
పూర్తి వివరాలు కత్తిరింపుల్లో చూడగలరు.
ఈ కత్తిరింపులను కట్టా-మీటా బ్లాగ్ (కట్టా శేఖర్ రెడ్డి) నుండి సంగ్రహించాను. (బొమ్మలపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.)
స్వాముల లాజిక్కులు, రాజకీయ మ్యాజిక్కులు ఉత్తర దక్షిణ ధృవాలు.
Idi vyathi aradhana e manishiki manchidi kaadu devuni prathekatha ayanake chendali mukyamuga modi lanti famous ledar ki assalu manchidi kaadu
రాచరిక వ్యవస్తలో రాజు దేవుని ప్రతినిది. అతని అధి కారం నిరపేక్షామైనది. ఆ విధంగ మోది దైవత్వాన్ని ఆక్రమించాడు.- అంటే మనం మల్లీ మధ్య యుగాలకు వెల్తున్నామన్నమాట?