ఈ ఫోటో ఫేస్ బుక్ లో చూశాను. ఈ కుక్కలకు తాము కాపలా కాస్తున్నది ఏ.టి.ఎం కి అని తెలుసో లేదో గానీ ఫోటోకి భలే విలువ తెచ్చి పెట్టాయి.
లేకపోతే ఆ పక్కనే ఉన్న ‘అంబికా వైన్స్’ కి కాపలా కాస్తున్నాయా? కొంపదీసి ఇవి తాగుబోతు కుక్కలు కావు కదా?
కాపలా కాస్తున్నాయో, పడిగాపులు పడుతున్నాయో తెలిస్తే అవి ఏ కుక్కలో తెలుస్తుంది.
కాపలా కాస్తే గనక ఎ.టి.ఎం కి కాపలా కాస్తున్నట్లు. పడిగాపులు పడుతుంటే గనక అది నిస్సందేహంగా అంబికా వైన్స్ కోసమే అయి ఉండాలి.
కుక్కల (పొజిషన్) భాష తెలిస్తే కూడా ఇవి ఏ కుక్కలో తెలియవచ్చు. ఎందుకంటే దాదాపు కుక్కలన్నీ ఒకే పొజిషన్ లో ఉన్నాయి. నీరసంగా, ఇదెక్కడి ఖర్మరా బాబూ అన్నట్లుగా తలలు అటూ ఇటూ వాల్చి ఉన్నాయి. ఈ పొజిషన్ ని బట్టి అవి ఏం చేస్తున్నాయో తెలుసుకోవచ్చేమో.
కుక్కకి గ్రామ సింహం అని పేరు. ఆఫ్ కోర్స్! పట్టణ సింహం, నగర సింహం అని కూడా అనవచ్చేమో. బడా బాబులకు స్టేటస్ సింబల్ కూడా కదా కుక్కలు!
కేసీఆర్‌కి అవసరం జడ్ ప్లస్ సెక్యూరిటీ