విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్


TG credit

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు!

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.

నిజానికి ఆయన ఇవ్వని వాగ్దానం ఏమన్నా ఉందా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఉద్యోగాలు, నీళ్ళు, అభివృద్ధి… ఇలా అనేక అంశాలకు సంబంధించి ఆయన వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అన్నింటికీ కలిపి ‘పునర్నిర్మాణం’ అంటున్నారు. ఆ పునర్నిర్మాణం జనానికి సంబంధించినదా లేక స్వయం నిర్మాణానికి సంబంధించినదా అన్నది తేలాల్సి ఉంది.

తెలంగాణ ఉద్యమాన్ని చూపి ఉధృతంగా వసూళ్లు చేసిన ఆరోపణలు కె.సి.ఆర్ కుటుంబంపై ఉన్నాయి. కానీ ఉద్యమ రందిలో ఉన్న జనం వాటిని పట్టించుకున్నట్లు లేదు. అయితే ఉద్యమ లబ్ది కాంగ్రెస్ కి చేకూరుతుందా లేక టి.ఆర్.ఎస్ కి చేకూరనుందా అన్న విషయంపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ఇస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం ప్రకటించాక జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, టి.డి.పి లు ఎక్కువ స్ధానాలు పొందాయి గానీ టి.ఆర్.ఎస్ కాదు. లోక్ సభలో సొంత సభ్యుల తిరుగుబాటును సైతం లెక్క చేయకుండా తెలంగాణ బిల్లు ఆమోదింపజేసిన కాంగ్రెస్ కు రాని క్రెడిట్ టి.ఆర్.ఎస్ కి ఎలా వస్తుందన్నది ఆశ్చర్యకరమే.

10 thoughts on “విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

 1. తెలంగాణ కు కె.సి.ర్ ఇవ్వలనుకొంటున్న తాయిలాలు సంగతి సరే!మరి సీమంద్ర పరిస్థితి ఏమిటి?ఇక్కడి ఉద్యోగులకు నెల జీవాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని,చంద్రబాబు,జగన్ లు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు! మరి మీరు ఎన్నొసార్లు తెలిపి నట్లు ఇంతకుముందు ఎక్కడినుండి జీవాలు వచ్చాయొ ఇప్పుడు కూడ అక్కడినుండే జీతాలు వస్తాయన్నరు? ఎలాగో వివరించి చెప్పగలరా?

 2. >> తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

  ఈ విషయం నాకు తెలియదు విశేకర్ గారు, కెసిఆర్ ప్రకటన గల ఏదైనా విడియో లింకు లేదా ప్రముఖ వార్తా పత్రిక లింకు ఇవ్వగలరా?

 3. తెలుగు పత్రికలు, టి.వి ఛానెళ్లు చెప్పిన, చెబుతున్న విషయమే ఇది. కె.సి.ఆర్, కె.టి.ఆర్ లు వివిధ సందర్భాల్లో ‘తెలంగాణ ఇచ్చాక విలీనం విషయంలో నిర్ణయం తీసుకుంటాం’ అని స్వయంగా చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలంతా ‘కె.సి.ఆర్ ఇచ్చిన విలీనం హామీని నిలబెట్టుకోవాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. ‘నేనెప్పుడు హామీ ఇచ్చాను?’ అని కె.సి.ఆర్ ప్రశ్నించడం లేదు. విలీనంపై చర్చ చేయలేదని మాత్రమే ఆయన చెబుతున్నారు తప్ప హామీ ఇవ్వలేదని అన్లేదు. విజయశాంతి కూడా ఆ మధ్య కె.సి.ఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ లో చేరుతూ అన్నారు. బిల్లు పాస్ కావడానికి ముందు కూడా కె.టి.ఆర్ ఢిల్లీలో ‘ముందు పాస్ కానివ్వండి. ఆ తర్వాత విలీనంపై నిర్ణయించుకుంటాం’ అని ఛానెళ్ల ముందు అన్నారు. పత్రికలు, ఛానెళ్లలో నిత్యం నలుగుతున్న విషయం ఇది. కాబట్టి ప్రత్యేకంగా లింక్ లు అవసరం లేదు గ్రీన్ స్టార్ గారూ. ‘తెలిసిందే’ అన్నది ఒక భాషా ప్రయోగం. మీరెందుకో ఉలిక్కి పడ్డట్టున్నారు. అది మిమ్మల్ని ఉద్దేశించి రాసింది కాదు. ఓ.కే!

 4. >>అది మిమ్మల్ని ఉద్దేశించి రాసింది కాదు.

  నన్ను ఉద్దేశించి రాయలేదు అని మీరెందుకు ఉలిక్కిపడటం :). బేసిక్ ప్రశ్న వేస్తె మీకెందుకు ఉక్రోషం వస్తుందో అర్థం కావటం లేదు.

  కెసిఆర్ తమ పార్టిని విలీనం చేస్తామని ఎన్నడూ స్వయంగా ప్రకటించలేదని నా అభిప్రాయం, నిజా నిజాలతో సంబంధం లేకుండా అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అంటాను అని మీరు అంటే నేనేమి చెయ్యలేను, అది మీ ఇష్టం.

  >> ‘ముందు పాస్ కానివ్వండి. ఆ తర్వాత విలీనంపై నిర్ణయించుకుంటాం’

  అంటే మాట ఇచ్చామని ఒప్పుకున్నట్లు కాదు కదా? ఆలోచిస్తాము అనే అన్నారు.
  తెలంగాణా ఏర్పాటు తర్వాత పార్టి భవిష్యత్తు నిర్ణయించుకుంటాము, అందులో విలీనం, పొత్తు లాంటి దారులు కూడా ఉన్నవి అని గతంలో అనేకసారు తెరాస నాయకులు ప్రకటించారు, ‘విలీనం’ గురించి ‘ఆలోచిస్తాం’ అని కూడా అన్నారు, కాని ‘విలీనం’ మాత్రమె మా దారి అని వారు అన్నట్లు నాకు తెలియదు. కెసిఆర్ అన్నట్లు అస్సలు తెలియదు, మీకేమైనా తెలుసేమో అని అడగటమే నా వాఖ్య ఉద్దేశం. తెలంగాణా వ్యేతిరేక మీడియా ప్రచారంలో మీరు కూడా పడిపోయినందుకు సంతోషం 🙂

  So, కెసిఆర్ గతంలో విలీనం చేస్తామని ప్రకటించినట్లు మీడియా చేస్తున్న హోరు అబద్దం అన్న మాట.

 5. మీ ప్రశ్నకు సమాధానం ఇస్తే ఉక్రోషం అంటారేమిటండీ. దాన్ని వదిలేద్దాం.

  “తెలంగాణ వ్యతిరేక మీడియా అంటే ఎవరు? అలా అని ఎవరన్నా ప్రకటించుకున్నారా? ఆ సంగతి నాకు తెలియదు. ఏమన్నా లింక్ లు ఉంటే ఇస్తారా?” అని నేను అడిగానే అనుకోండి. మీకు లింక్ లు ఎక్కడినుండి వస్తాయండి?

  ‘పత్రికలు, ఛానెళ్ళు చెబుతున్నట్లుగానీ, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లుగానీ విలీనం చేస్తానని నేనెప్పుడూ హామీ ఇవ్వలేదు’ అని కె.సి.ఆర్ అన్లేదు. తప్పుడు ప్రచారం జరుగుతుంటే రాజకీయ నాయకులు ఖండన జారీ చేస్తారు గానీ గమ్మున ఉండరు కదా. ఆయన విలీనం హామీ ఇచ్చారని ఇలాంటి అంశాలే చెబుతాయి. తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో ఆయా పత్రికలు, ఛానెళ్ళు ప్రసారం చేసే వార్తల సారాన్ని బట్టి అవి అనుకూలమో, వ్యతిరేకమో అర్ధం అయినట్లే ఇది కూడాను.

  కె.సి.ఆర్, కె.టి.ఆర్ మాటలకు మీరు చెప్పిన అర్ధాలు కూడా తీయొచ్చు. సందేహం లేదు. రాజకీయ నాయకుల మాటలే అలా ఉంటాయి. అలా మాట్లాడితేనే రియల్ పొలిటిక్ అని ఇప్పటి వాడుక. అంతా అయ్యాక అర్ధం అయ్యేది ఏమిటంటే, ‘ఇద్దరికీ ఏదో బేరం కుదర్లేదు. అందుకే దాటవేస్తున్నారు’ అని. మళ్ళీ దీనికి లింక్ లు కావాలంటే నా వల్ల కాదు.

  పోనీ ‘దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాను’ అని అన్నారా కె.సి.ఆర్? అని ఉంటే ఆ సంగతి ఆయన ఇప్పుడెందుకు ఎత్తడం లేదు? చెప్పగలరా?

 6. విశేకర్ గారు,

  ప్రస్తుతం అందరు అనుకునేది ఏమిటంటే ‘తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రేసులో విలీనం చేస్తానని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు’ అని. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కెసిఆర్ లేదా తెరాసా నాయకులు అలాంటి ప్రకటన ఏనాడు ఇవ్వలేదు అని.

  మీరన్నట్లు లోలోన ఎన్నో జరిగి ఉండొచ్చు, బేరాలు కుదరక మాట మార్చి ఉండొచ్చు, అసలు విలీన మాటనే అబద్దం అయి ఉండొచ్చు, తెర వెనుక ఏదైనా జరిగి ఉండొచ్చు. కాని నేను చెప్పదలుచుకున్న పాయింటు ఒక్కటే ‘కెసిఆర్ లేదా తెరాసా లాంటి ప్రకటన ఏనాడు చెయ్యలేదు, కాని అలా చేసినట్లు తెలంగాణా వ్యేతిరేక మీడియా ప్రచారం చేస్తుంది’ అని. ఇక్కడ తెలంగాణా వ్యేతిరేక మీడియా అంటే ‘తెలంగాణా రాష్ట్రం రావటం ఇష్టం లేని మీడియా’ అని నా ఉద్దేశం.

  కాంగ్రేసు నాయకులు చెప్పేది ఏమిటంటే కెసిఆర్ సోనియాకు మాట ఇచ్చాడు అని. మాట ఇచ్చిన కెసిఆర్ ఖండించలేదు, మాట తీసుకున్న సోనియా కూడా కెసిఆర్ ను నిలదియలేదు 🙂

  >>పోనీ ‘దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాను’ అని అన్నారా కె.సి.ఆర్?

  మీరన్న విధంగానే ‘దళితుడిని అయిన వాడిని ముఖ్య మంత్రి చెయ్యను’ లేదా ‘నేనే ముఖ్య మంత్రిని’ అని కూడా ప్రకటించలేదు 🙂 చివరికి ఏమి చేస్తాడో చూద్దాం.

  ఏది ఏమైయినను నేను కెసిఆర్ ఫాన్ ను కాదు, తెరాసా మద్దతు దారున్ని అంత కన్నా కాదు. So, వారిని వేనుకేసుకోవలసిన అవసరం నాకు లేదు, వారిని సపోర్ట్ చెయ్యటానికి నేను ప్రయత్నించను. వివిధ మిద్యమాలలో వస్తున్నట్లు కెసిఆర్ నిజంగా అలా ప్రకటించాడా లేదా అని తెలుసుకోవతానికే మీ టపలో వాఖ్య రాసాను.

  ధన్యవాదములు.

 7. మూల గారు, చంద్రబాబు, జగన్ లు అధికారంలోకి వస్తే నెల జీతాలు ఇవ్వకుండా పోతారా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం అన్నాక వివిధ పన్నులతో కూడిన స్ధిరమైన ఆదాయం ఉంటుంది. గతంలో జిల్లాల నుండి హైద్రాబాద్ రాజధానికి జమ అయిన ఆదాయంలో ఇప్పుడు 13 జిల్లాల వాటా ఆంధ్ర ప్రదేశ్ కు వస్తుంది. కొత్త ఆంధ్ర ప్రదేశ్ లో రెవిన్యూ వసూళ్లు 64 వేల కోట్ల చిల్లర అని ప్రభుత్వ లెక్కలను ఉటంకిస్తూ ఈనాడు గతంలో చెప్పింది. అక్కడి నుండే వేతనాలు ఇస్తారు. విభజన జరిగాక ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. నూతనంగా వచ్చే ఉద్యోగాలు, పెట్టుబడులు, నిర్మాణాలు ఆదాయం పెరగడానికి దోహదపడతాయి. విభజన వల్ల కొత్త ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా లబ్ది పొందుతారని బి.జె.పి నేత వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పారు, నిన్నో, మొన్నో సభల్లో కూడా ఆయన ఈ సంగతి చెప్పారు. మన నేతలు సరిగ్గా దృష్టి పెడితే కొత్త రాజధాని వల్ల జి.డి.పి వృద్ధి సాధారణం కంటే ఎక్కువగా ఉండేలా చేయవచ్చు.

 8. విశేకర్ గారు,

  ధన్యవాదాలు.

  పై విడియో 2.45 నుండి 5.00 వరకు చూడండి, అసలు అయన ఏమి చెప్పాడో కరక్టుగా అర్థం అవుతుంది, మీరిచ్చిన లింకులో న్యూస్ పేపర్ వారు కెసిఆర్ చెప్పిన కొన్ని విషయాలు ఎగరగోట్టేసారు. అయన చెప్పింది కాంగ్రేసు కూడా ఖండించలేదు, అంటే ‘కెసిఆర్ మాట తప్పాడు’ అనే అవకాశమే లేదు.

  సో నేను చెప్పేది కరెక్టే, గతంలో అయన ‘విలీనం చేస్తానని’ ఏనాడు ప్రకటన చెయ్యలేదు. [ గమనించాలి, తెర వెనుక మాట ఇవ్వ్వలేదు అనేది నా వాదన కాదు, ‘గతంలో అలాంటి ప్రకటన చెయ్యలేదు’ అనేది నా వాదన ]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s