మోడి నన్నెందుకు కలవరు, నేను టెర్రరిస్టునా? -ఎ.కె


Arvind Kejriwal in Jaipur

Arvind Kejriwal in Jaipur

అరవింద్ కేజ్రీవాల్ నుండి దూరంగా పారిపోతున్న నరేంద్ర మోడి మరోసారి తన పరికితనం చాటుకున్నారు. రిలయన్స్ గ్యాస్ ధరల పెంపు విషయమై గుచ్చి గుచ్చి అడిగినా బదులు ఇవ్వని మోడి చివరికి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా గుజరాత్ వచ్చి ఇంటర్వ్యూ కోరినా మొఖం చాటేశారు. తనను కలవడానికి వస్తున్న అరవింద్ బృందాన్ని తన నివాసానికి 5 కి.మీ దూరంలోనే అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కలవకపోతే పోయే, కలవలేకపోతున్నానని కనీసం ఫోన్ కాల్ కూడా చేయకుండా మోడి తన భయాన్ని చాటుకున్నారని, కి.మీటర్ల దూరంలోనే నిలిపేయడానికి నేమన్నా టెర్రరిస్టునా అని ఎ.కె ప్రశ్నించారు.

గుజరాత్ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకునే బి.జె.పి, మోడిలు ఆ అభివృద్ధిని కళ్ళారా చూద్దామని వచ్చిన కేజ్రీవాల్ ను పదే పదే అడ్డుకోవడం ద్వారా తాము టాం టాం వేసుకున్న అభివృద్ధి అంతా ఉత్తదే అని చెప్పకనే చెప్పేశారు. దేశానికే నమూనా రాష్ట్రంలో నిజానికి అభివృద్ధి అన్నది భ్రాంతి మాత్రమేనని, ఉన్నదంతా దోపిడి, అణచివేత, అవినీతి మాత్రమే అని కేజ్రీవాల్ చెప్పారు.

నాలుగు రోజుల గుజరాత్ పర్యటన అనంతరం శుక్రవారం ఉదయం (మార్చి 7) మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ దేశాన్ని నడిపిస్తున్నది వాస్తవానికి కాంగ్రెస్, బి.జె.పిలు కాదని, ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలో ఉన్నా వారి వెనుక ఉన్నది మాత్రం అంబానీలే అని అసలు గుట్టు విప్పారు. కమ్యూనిస్టు విప్లవ సంస్ధలు దాదాపు నలభై యేళ్లుగా చెబుతూ వచ్చిన చేదు వాస్తవాలనే అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం బట్టి భారత దేశ సామాజిక వ్యవస్ధ స్ధితి గతులను అంచనా వేయడంలో వారు నాలుగు దశాబ్దాలు ముందే ఉన్నారని స్పష్టం అవుతోంది.

“నేనిప్పుడు ఆయన్ని కలవాలని అనుకుంటున్నాను. కానీ ఆయన ఇంటికి 5 కి.మీ దూరంలోనే మమ్మల్ని ఆపేశారు. నేనేమీ టెర్రరిస్టును కాదే. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మోడి నుండి కనీసం మర్యాద పూర్వక పలకరింపుకైనా నేను అర్హుడిని. దానికి బదులు మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాజాలదు” అని అరవింద్ కేజ్రీవాల్ జైపూర్ లో విలేఖరుల సమావేశంలో చెప్పారు.

గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఒక నమూనా రాష్ట్రం అని చెప్పడాన్ని ఎ.కె కొట్టిపారేశారు. తీవ్రమైన అవినీతి తప్ప గుజరాత్ లో ఇంకేమీ లేదని ఆయన అన్నారు. రైతుల గొంతు నొక్కి పెట్టి లేని అభివృద్ధిని చాటుతున్నారని అసలు విషయం చెప్పారు. గత సంవత్సర కాలంగా మోడి గానీ, మీడియాలోని ఒక సెక్షన్ గానీ గుజరాత్ గురించి మన ముందు ఉంచిన దృశ్యం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నదని రెండు రోజులుగా గుజరాత్ లో పర్యటించిన ఎ.కె చెప్పారు.

“గుజరాత్ ప్రభుత్వం చెబుతున్న దానితో పోలిస్తే నేను గత మూడు రోజులుగా చూస్తున్నది పూర్తి భిన్నంగా ఉంది. మా బృందాలు గ్రామాలు సందర్శించి నిజాలను వెలికి తీసాయి. ఎఎపి సందర్శనల గురించి తెలుసుకున్న గ్రామస్ధులు మమ్మల్ని పిలిచారు. వాస్తవం ఏమిటో వారు మాకు తెలియజేశారు. అని కేజ్రీవాల్ తెలిపారు. ఆయన ఇంకా ఇలా అన్నారు.

 • “గుజరాత్ లో అవినీతి తీవ్ర స్ధాయిలో ఉంది. ఆయా బదిలీలకు, నియామకాలకు ఫిక్స్ డ్ రేట్లు ఉన్నాయని నాకు చెప్పారు. స్టేట్ రిజిస్ట్రార్ పదవికి ఉన్న రేటు రు. 33 లక్షలు. డి.ఎస్.పి బదిలీ రేటు రు. 2.75 కోట్లు. లంచం లేకుండా లైసెన్స్ గానీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారికి ఇచ్చే కార్డు గానీ లభించవు. ఒక పరిశ్రమ స్ధాపించాలన్నా లంచం ఇవ్వాల్సిందే.”
 • “గ్యాస్ ధరల విషయంలో నా లేఖకు బదులు ఇవ్వనందునే నేను మోడిని కలవాలని అనుకున్నాను. (కానీ ఆ అవకాశం ఇవ్వలేదు.) పోలీసులు నన్ను అడ్డుకోవడానికి, అది కూడా నరేంద్ర మోడి నివాసానికి 5 కి.మీ దూరంలోనే నిలిపేయడానికి నేనేమన్నా టెర్రరిస్టునా? మరో ముగ్గురితో సహా నేను ముఖ్యమంత్రిని కలవాలని భావించాను. కానీ మమ్మల్ని అడ్డుకున్నారు.”
 • “తనకు ముందే నిర్ణయించబడిన పనులు ఉంటాయని నేను అంగీకరిస్తాను. కానీ సమావేశాన్ని ఎగవేసే పద్ధతి మాత్రం ఇది కాదు. మమ్మల్ని కలవడానికి ఆయనకు సమయం లేకపోయినా సరే, ఒక మాజీ ముఖ్యమంత్రిని అయిన నాకు కనీసం ఫోన్ చేసే మర్యాదయినా చూపవలసి ఉంది. నన్ను తన ఆఫీసుకు ఆహ్వానించి నన్ను కలవలేకపోతున్నానని అయినా చెప్పి ఉండాల్సింది.”
 • “ఒక ప్రభుత్వ అత్యున్నత ప్రాధామ్యాలు భద్రత కల్పించడం, ఆ తర్వాత సమయానికి న్యాయం అందేలా చూడడం, అవినీతి రహిత పాలన అందించడం… ఇవే. గుజరాత్ సందర్శనలో మా పైన మూడుసార్లు దాడి చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి పరిస్ధితే ఇలా ఉంటే ఇక గుజాట్ ప్రజల పరిస్ధితి ఎలా ఉంటుంది?”
 • “పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య భద్రతా కేంద్రాల పరిస్ధితి అత్యంత ఘోరంగా ఉన్నది. నేనొక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సందర్శించాను. అది చెత్తను పారేసే చోటును తలపించింది. 2005లో నర్మదా డ్యాం ఎత్తు పెంచారు. కానీ దానివల్ల అది ఉద్దేశించిన లక్ష్యం మాత్రం నెరవేరలేదు. డ్యాం గోడలు నెర్రెలు విచ్చి ఉన్నాయి. ఈ వాస్తవమే అవినీతి గురించి చక్కగా చెబుతోంది. తమ భూములు లాక్కుని పారిశ్రామిక వేత్తలకు పంచి పెట్టారని నష్టపరిహారంగా తమకు ఒక్క పైసా ఇవ్వలేదని రైతులు చెప్పారు. అలాంటి గుజరాత్ ను అభివృద్ధికి నమూనాకా చెప్పడం ఆశ్చర్యకరం.”
 • “వచ్చే లోక్ సభలో ఎ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. కొత్త ప్రభుత్వం ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే నిలుస్తుంది. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ వీళ్ళు కాదు అసలు దేశాన్ని నడిపిస్తున్నది… ముఖేష్ అంబానీ, అలాంటి వ్యక్తులే దేశాన్ని వాస్తవంగా నడిపిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులంతా కేవలం ముందు నిలబడే మొఖాలు మాత్రమే. మోడి గాలంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా మోడీకి తన సొంత రాష్ట్రంలోనే బాధ, కోపం తాలూకు గాలి మాత్రమే. గుజరాత్ లో అదానీ గ్రూపుకు చట్టాలంటూ ఏమీ వర్తించవు. ఎంచుకున్న కార్పొరేట్ కంపెనీలకు కోస్తా ప్రాంతాన్ని అమ్ముకున్నారు.”
శంఖంలో పోస్తేనే తీర్ధం అవుతుందన్నట్లు, కేజ్రీవాల్ లాంటివారు చెబితేనే కాస్తో, కూస్తో విలువ తప్ప సామాన్యుల అసంతృప్తి, నిరసనలు ఎన్నటికీ లెక్కలోకి రాజాలవు.

12 thoughts on “మోడి నన్నెందుకు కలవరు, నేను టెర్రరిస్టునా? -ఎ.కె

 1. @శంఖంలో పోస్తేనే తీర్ధం అవుతుందన్నట్లు, కేజ్రీవాల్ లాంటివారు చెబితేనే కాస్తో, కూస్తో విలువ తప్ప సామాన్యుల అసంతృప్తి, నిరసనలు ఎన్నటికీ లెక్కలోకి రాజాలవు.
  నిజమే శేఖర్ గారు. పార్లమెంట్ అసెంబ్లీలు బాతాఖాని షాపులని….నలభై ఏళ్ల కిందట తరిమెల నాగిరెడ్డి గారు చెబితే….ఎవరూ అంగీకరించలేదు. కానీ ఇవాళ అసెంబ్లీలు, పార్లమెంట్లలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూసిన జనానికి అసలు సంగతి అర్థమైంది.
  ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇవాళ్టి వరకూ దేశాన్ని నడిపిస్తోంది….వ్యాపార శక్తులేనని కమ్యూనిస్టులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నా జనం గ్రహించలేదు. ఇవాళ కేజ్రీవాల్ అదే సంగతి చెబుతున్నారు. మొత్తానికి జనానికి ఉన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగిపోతుండడం సంతోషకరమే.
  ఇటువంటి పరిణామాలే క్రమంగా మార్పు వైపుకు నడిపిస్తాయి. జనం, ప్రధానంగా యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. తమదైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు సాగుతారు.
  సంస్కరణ వాదిగా ఉండి తర్వాత క్రియాశీలక రాజకీయనాయకుడిగా మారిన కేజ్రీవాల్….మన పాలకుల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయడం సంతోషకరం.

 2. ఇన్ని వ్యయప్రయాసలకు లోనైన కేజ్రివాలాకు వివిధ రాష్ట్రాల ప్రజలు నైతిక బాధ్యతతో వెన్నుదన్నుగా ఎందుకు నిలవరో అర్ధం కానీ విషయం. వీటిని బట్టి చూస్తుంటే భారత రాజకీయం వాణిజ్య దిగ్గజాల చేతిలో మరబొమ్మగా కదలాడుతోంది. రాజకీయానికి నిర్వచనం నాయకులు, కానీ వారి సంఖ్యాబలం స్వల్పం. ఆశేష ప్రజానికం ఏకమైతే వాణిజ్య దిగ్గజాలను రాజకీయాలకు కొన్ని వేల గజాల దూరంలో కట్టడిచేయవచ్చును. బహుశ అన్నాకేజ్రిల విభేదాలు ఆమ్ ఆద్మీ నమ్మకాన్ని వమ్ముచేసాయనే భావన కలగకపోదు.

 3. మోడి నాయకత్వములో భారతదేశము అభివ్రుద్ది పథంలో నడుస్తుందని సామాన్య ప్రజలు యెంతో ఆశతో యెదురుచూస్తున్న తరుణములో గుజరాత్ సందర్శనానంతరము కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు నమ్మలేని నిజాలు లాగ తోస్తున్నవి . నిజము తెలిసినవారు దయచేసి వాస్తవాన్ని తెలియచేయండి

 4. అంతా తమాషాగా ఉందే అంటాడొకాయన ఒక పాత సినిమాలో. ఇప్పుడు కేజ్రీవాల్‌గారు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆయన మోడీని అపతిష్టపాలు చేయటానికి కాంగ్రెసువారితో సమానంగానో లేదా మరికొంచెం హెచ్చుగానో తహతహలాడుతున్నాడని అనిపిస్తోంది. కోట్లు వెచ్చించి ఓట్లూ సీట్లూ కొనుగోలు చేసే రాజకీయనాయకుల వెనకాల వ్యాపారశక్తులుంటాయని ఇన్నాళ్ళకు గాని భారతీయులకు జ్ఞానోదయం కాలేదని చెప్పటం హాస్యాస్పదం. అందరికీ తెలిసిన విషయమే కేజ్రీవాల్ చెబుతున్నదీను. అంబానీయూ‌ డంబానీయూ నేటి పేరు. మొన్నమొన్నటి దాకా, టాటాలూ బిర్లాలను ప్రస్తావించే వారం. అంతే. అన్నట్లు శ్రీమాన్ కేజ్రీవాల్‌గారు కేవలం మోడీ వెంట కత్తిపట్టుకొని నేను తీవ్రవాదిని కానంటే నమ్మవేం అంటూ తిరుగుతున్నాడు సరే, ఈ కాంగ్రేసువారిని పాపం పల్లెత్తు మాట అంటున్నట్లు లేదేం? ఏమన్నా బేరం కుదిరిందా కాంగ్రెసువారితో?

 5. అదే విచిత్రం! కాంగ్రెస్ వెంటపడితేనేమో బి.జె.పితో ఒప్పందం అంటారు. బి.జె.పి వెంటపడితేనేమో కాంగ్రెస్ తో ఒప్పందం అంటున్నారు. కానీ ఆయన ఇద్దరి వెంటా పడుతున్న సంగతి మాత్రం విస్మరణకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. పైన కూడా అరవింద్, కాంగ్రెస్, బి.జె.పి లు ఇద్దరినీ అంబానీ మొఖాలు అన్నారు గానీ ఒక్క బి.జె.పి నే అనలేదు కదా.

  ఢిల్లీలో జరిగిందీ అదే. పెద్ద పార్టీ బి.జె.పి, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆ బాధ్యత ఎఎపి మీద ఉందంటూ విచిత్ర వాదన చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎఎపికి భయం అని కాంగ్రెస్ విమర్శించింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక కాంగ్రెస్ తో కుమ్మక్కు అంటూ బి.జె.పి విరుచుకుపడింది.

  అంబానీల మీద విచారణకు ఆదేశిస్తేనేమో అరాచకం అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనేమో ఫిస్కల్ డిసిప్లీన్ లేదు అన్నారు. అలాగని ప్రైవేటు డిస్కమ్ ల పైన ఆడిట్ కి ఆదేశిస్తేనేమో పరిశ్రమలపై పగబట్టాడని వాపోయారు.

  ‘అంబానీ గ్యాస్ ధర అక్రమంగా పెంచితే చర్య తీసుకున్నాం. మీ స్పందన ఏంటీ?’ అని మోడిని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. సమాధానం ఎందుకు ఇవ్వలేదని మోడిని అడగడం మానేసి మోడిని ప్రశ్నించినందుకు ‘వెంటపడుతున్నాడని’ ఈసడించడం ఎలా అర్ధం చేసుకోవాలి?

  ఇంతకీ అరవింద్ ఏం చేయాలంటే ఫిస్కల్ డిసిప్లీన్, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, జి.డి.పి వృద్ధి… ఇలాంటి అందమైన అబద్ధాలు చెబుతూ నాలుగు డబ్బులు మిగుల్చుకుంటూ జనాన్ని మర్చిపోయి కూర్చోవాలి. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలని కూడా వదిలేసి కూర్చోవాలి. ఇప్పటిదాకా కాంగ్రెస్, బి.జె.పి లు చేస్తున్నట్లన్నమాట!

  అలా చేస్తే అప్పుడు అరవింద్ పాలన ‘భేష్’ అని మెచ్చుకోవచ్చు. దేశం, ప్రజలు, వారి జీవితాలు అంతా ట్రాష్! వాటిని చూసుకునే భారం అయోధ్యలో రాముడికి, కాశీలో విశ్వనాధుడికి, మధురలో కృష్ణుడికి ఇంకా అనేకానేక దేవుళ్ళకి అప్పగిస్తే సరి! ఈశ్వరాజ్ఞ లేకుండా చీమన్నా కుట్టదు కదా మరి!

  వెర్రి నాగన్న! ఈ అరవింద్ కి ఎప్పుడు బుద్ధొస్తుందో కదా?

 6. కరెక్ట్‌గా చెప్పారు. పాత సినిమాలో రావుగోపాలరావు పాత్రనుకుంటాను. మంత్రిగారు వరదబాధితులను పరామర్శించడానికి భార్యా సమేతంగా వెళిటే ఒకటి, అలాకాకుంటే ఇంకొకటి విమర్శ దగ్గరగా ఉంచుకుంటుంది. కేజ్రీవాల్ పరిస్థితి నా ఉదాహరణలోని మంత్రిపాత్రలా తయారయ్యింది.

  మన బ్లాగుల్లో :
  1) కేజ్రీవాల్‌గారు అధికారం వద్దంటేనేమో ఆయనకు లౌక్యం లేదని విమర్సిస్తారు మన ఆస్థాన నరసింహావతారి. తీరా ఆయన లౌక్యం ప్రదర్శిస్తేనేమో అన్యాయమంటారు.

  2) ఆయన భాజపా అభ్యర్ధులమీద పోటీకి తన అభ్యర్ధులను నిలబెడుతున్న విషయమే కొందరికి గుర్తుంటుంది. వారు ఆయన ఆపాటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పరాభవించారన్న విషయాన్ని సావకాశంగా మర్చిపోతారు. రేప్పొద్దున రాహుల్‌కి పోటీగా నిలబడటానికి ఆప్‌వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. ఇదిమాత్రం మనం మర్చిపోవాలంటారు. పత్రికలు మాఫియాలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించేమనం ఒక బ్లాగ్‌మాఫియాగా వ్యవహరించవచ్చన్నమాట!

  3) రైలుప్రమాదానికి బాధ్యత వహించి శాస్త్రిగారు రాజీనామా చేస్తే అది నిజాయితీ. అదే పరిస్థితుల మధ్య కేజ్రీవాల్ రాజీనామా చేస్తే అది చాతకానితనం మరియు తగనిపోలిక.

  మీరన్నట్లు, మనకి కావలసింది మందిరాలూ, మసీదులూ, మనమతం అధిరారంలో ఉండటమేతప్ప, మనం బాగుపడ్డంకాదు.

 7. “మంత్రిగారు వరదబాధితులను పరామర్శించడానికి”

  అని రాయాలనుకున్నది కాస్తా మధ్యలో వాక్యనిర్మాణమ్మార్చి సరిచూసుకోకపోవడంతో ఇంకోలా తయారయ్యింది. గమనించగలరు.

 8. విశేషజ్ఞ గారూ, మీ వ్యాఖ్యని మీరు వివరించినట్లు నేను సవరించాను.

  బ్లాగ్ మాఫియా ఏమిటో అర్ధం అయింది గానీ, ఆస్ధాన నరసింహావతారి ఎవరో తట్టడం లేదు. తట్టకపోయినా ఫర్లేదులెండి.

 9. Hi All,

  It seems everyone is right except modi & bjp, you guys expect modi to give appointment to ak otherwise you will take it as he is running away from him and worried about the development in Gujarat, if you guys have doubts about you can go there and check, why you want AK to stamp it, this vsekhar talks too bit and too much and so callled intellectual na then why dont he go and check him self.

  You are pointing about AK criticising Congress, if you all remember and recollect our own chiranjeevi criticised more than AK and finally what happend, everyone is aware why prajarajayam started then and why AAP started now, as congress cannot come into power directly they have created this aap and ak. just wait for sometime to understand but the problem is that will be too late for you people.

  Hope you all can read and understand english, if not anyway vsekhar is there to translate but i have doubt whether he has open mind to do so or not.

  why dont you people check mediacrooks.com to get answers to your all questions and then discuss.

  For god sake or alteast country sake dont see everything and/or anything modi/bjp does through your so called ‘communal’/hate hindus lenses, finally hindus are also people like others so they also have right to live, express and rule this country. It is becoming like a crime and betrayal to talk about majority hindus in this country you wont find this any country where any other community has majority. poor hindus, god may help hindus.

 10. This AK guy says how modi can avoid meeting ex cm but he nevers realises and try to understand with cong filth filled braing that he should take an appointment and meet if he wants to meet someone. He want to make big circus about his visit to Gujarat but dont have time or interest to intimate Modi to seek an appointment.

  Some of you are saying he is equally criticising congress, but what happend to his promise to arrest sheila dixit once him comes to power (ofcourse, this stupid felllow lost the power and at the same Sheila dixit became governor, eventhough for just 3-4 months, that is his strategy and his opposition against congress.

  So tragic to this country is you people are became blind followers of aap and ak and haters of bjp, thinking that by hating this party you will be called seculars.

 11. శశిక్ గారూ, అరవింద్ తో నాకు బంధుత్వం ఏమీ లేదు. కనీసం పరిచయం కూడా లేదు. పై వ్యాఖ్యాతలది కూడా అదే పరిస్ధితి అనుకుంటాను. ఆ పార్టీ అధికారంలో ఉన్న కొద్ది రోజులు తీసుకున్న కాసిని చర్యలైనా ప్రజలకు అనుకూలం. ఆ ఒకటి రెండు చర్యలు కూడా తీసుకునే దమ్ము కాంగ్రెస్, బి.జె.పి లకి లేదు. అవి రెండూ ఢిల్లీని ఏలినవే. ఎఎపి పట్ల ఇక్కడ వ్యక్తం అయ్యే సానుకూలతకి అది తప్ప వేరే కారణం ఏమీ లేదు.

  కానీ మీ బాధే అర్ధం కాకుండా ఉంది. బి.జె.పి, మోడి ఏం చేసినా సమర్దించాల్సిందే అన్న అవగాహన మీకు ఉంటే ఉంచుకోండి. అది మీ యిష్టం. మీరు కోరుకున్నట్లు ఇక్కడ అందరూ రాయాలంటే అది సాధ్యం కాదు. అందుకు ఇంకోచోటు చూసుకోవాలని కోరడం తప్ప మేమేమీ చేయలేం. మీ అభిప్రాయాలు చెప్పడం ఒక పద్ధతి. కానీ మీ అభిప్రాయాలతో ఏకీభవించలేదని నిందలకు దిగడం అసలు పద్ధతి కానే కాదు.

  గుజరాత్ అభివృద్ధి గురించి ఈ బ్లాగ్ లో రాశాను. వాటికి లింక్ లు పైన సేతురామ్ గారికి ఇచ్చిన రిప్లైలో రాశాను. వీలయితే ఆ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. ఒక ప్రాంతంలో అభివృద్ధి జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళితీరాలన్న నియమం నాకయితే లేదు. (మీకుంటే నాకు సంబంధం లేదు.) అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అక్కడికి వెళ్ళి తన అనుభవాలు చెప్పారు. నిజాలు రాసే పత్రికలు కొన్ని ఉన్నాయి. గుజరాత్ గురించి కనీసంగా తెలుసుకోవడానికి అవి చాలు.

  “So tragic to this country is you people became blind followers of BJP and Modi and haters of AAP, thinking that by hating this party you will be called patriots” అని నేను అనొచ్చా? మీరొక మాటా, నేనొక మాటా అనుకుంటూపోతే ఉపయోగం ఉండదు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s