‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ శీర్షికన ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ అధినేత రాధాకృష్ణగారు వివిధ రంగాల్లో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి విదితమే. ఈసారి ఆయన సినీ నటుడు రంగనాధ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అదే ఇంటర్వ్యూను ఈ రోజు (మార్చి 3) ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రచురించారు. ఆయన ఇంటర్వ్యూ చూడలేదు. కానీ పత్రికలో ఇంటర్వ్యూ చదివాను.
ఆయన ఇంటర్వ్యూ గురించి కాదు గానీ అందులో ఆయన రాసిన కవిత నాకు భలే నచ్చేసింది. కవిత రాసిన రంగనాధ్ గారికి తెలుసో లేదో గానీ ఈ కవితలో ‘శ్రమయే దైవం’ అన్న సందేశం కనిపిస్తుంది. తన కవితకు ఆయన ఇచ్చుకున్న లక్ష్యం వేరు. నాకు మాత్రం శ్రమని గౌరవించండి అన్న సందేశమే కనిపించింది.
మీరే చదవండి. (రంగనాధ్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత | ugiridharaprasad
Very Nice, thank you very much sir
ఆయన కవితకు మీరిచ్చిన అర్థం ఇంకా బాగుంది. చిన్న సవరణ..ఆంధ్రజ్యోతి ఎండీ రామకృష్ణ కాదు. రాధాకృష్ణ కదా..
ఔను గదా రాజు గారూ, మర్చిపోయాను. ఇప్పుడు సవరించాను.
కవితలో సామాజిక స్పృహవుంది.
అవును శేఖర్ గారు. నేను కూడా ఈ కవిత చదివి అద్భుతంగా ఉందనుకున్నాను. దాన్లోనే ఆయన రాసిన మరో కవిత అమ్మ కడుపులోని చిన్నారి గురించి రాసింది కూడా చాలా బాగుంది.
ఐతే మీరన్నట్లే శ్రమే అసలైన దేవుడని చెప్పిన రంగనాథ్ గార్ని నిజంగా అభినందించాల్సిందే. రంగనాథ్ గారు మరిన్ని కవితలు రాస్తే….,సినిమాల కన్నా మంచి పేరు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న ఆయన కవితలు పాఠకులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.