చైనా ఇప్పుడు అతిపెద్ద సరుకుల వ్యాపారి


China-Trade

ఆర్ధిక రంగంలో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సరుకుల వ్యాపారిగా కూడా అవతరించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లెక్కల ప్రకారం 2013లో చైనా ఈ మైలు రాయిని అధిగమించిందని జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది.

2013 సంవత్సరంలో చైనా సరుకుల వ్యాపారం మొత్తం 4.16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రపంచ వాణిజ్య సంస్ధ గణాంకాలు తెలిపాయి. మరే దేశమూ ఈ స్ధాయిలో సరుకుల వాణిజ్యం చేయలేదు.

2013లో చైనా మొత్తం 2.21 ట్రిలియన్ డాలర్ల సరుకులను ఎగుమతి చేసింది. అదే సం. లో చైనా దిగుమతి చేసుకున్న సరుకుల విలువ 1.95 డాలర్లు. ఎగుమతులు, దిగుమతుల మొత్తం విలువ 4.16 ట్రిలియన్ డాలర్లు. కాగా 2013లో చైనా వాణిజ్య మిగులు 260 బిలియన్ డాలర్లు. ప్రపంచం మొత్తం బలహీన వృద్ధితోనూ, ప్రతికూల వృద్ధి తోను వేగుతున్న దశలో కూడా చైనా 260 బిలియన్ల వాణిజ్య మిగులు నమోదు చేయడం విశేషమే.

చైనా అభివృద్ధి చెందిన దేశం కూడా కాదు. ఒఇసిడి సభ్య దేశం కాదు. అదింకా అభివృద్ధి చెందుతున్న దేశమే. అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచంలో అతి పెద్ద సరుకుల వ్యాపారిగా అవతరించడం నిస్సందేహంగా ఒక మైలు రాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ఈ మైలు రాయి చేరుకోవడం పట్ల సంతోషం ప్రకటించింది.

సంస్కరణల అమలు ఫలితంగా చైనా ఈ వృద్ధి సాధించిందని వాణిజ్య శాఖ ప్రకటన చెప్పుకుంది. ముఖ్యంగా తాము ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్య దేశంగా చేరిన తర్వాత అతి పెద్ద గెంతులతో ప్రగతి సాధించామని ప్రకటన తెలిపింది.

చైనా ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు 120కి పైగా దేశాలకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ప్రాంతాల వారీగా చూసినా ఎక్కువ ప్రాంతాలతో అత్యధిక వాణిజ్యం చేస్తున్న దేశం చైనాయే. ఈ వాణిజ్య భాగస్వామ్య దేశాల నుండి 2 ట్రిలియన్ డాలర్ల సరుకులను చైనా యేటా దిగుమతి చేసుకుంటోంది. తద్వారా ఆయా దేశాల్లో ఉద్యోగాలను కల్పిస్తూ పెట్టుబడి అవకాశాలను పెంచుతోందని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి యావో జియాన్ తెలిపారు.

ఇంత భారీ వాణిజ్యం చేస్తున్నప్పటికీ ఇందులో చైనా స్వయంగా కలుపుతున్న విలువ తక్కువే అని చెప్పుకోవచ్చు. చైనా అమలు చేసిన సంస్కరణల ఫలితంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి, స్ధానిక చౌక శ్రమను వినియోగించుకుని అత్యంత తక్కువ ధరలకు సరుకులు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. వీటిల్లో చైనా ఆధారిత బహుళజాతి కంపెనీలు తక్కువే. అనగా తనకంటూ సొంతగా సృష్టించుకున్న స్వతంత్ర బ్రాండులు చైనాకు తక్కువ.

యావో జియాన్ ప్రకటన ప్రకారం చూసినా చైనా ఎగుమతి చేసే సరుకుల క్వాలిటీ చెప్పుకోదగ్గది కాదు. మార్కెటింగ్ సంబంధాలు కూడా బాగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికీ పశ్చిమ బహుళజాతి కంపెనీల స్వాధీనంలోనే కొనసాగుతున్నాయి. అనగా చైనా స్వతంత్ర బ్రాండుల అభివృద్ధికి పశ్చిమ బహుళజాతి బ్రాండులతో ఘర్షణ పడాల్సి ఉంది. పోటీపడి నెగ్గాల్సి ఉంది.

చైనా తనకంటూ సొంతమైన, స్వతంత్ర అభివృద్ధి నమూనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని, ఆర్ధిక వ్యవస్ధను ఆ వైపుగా పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉందని యావో జిన్ ప్రకటన తెలిపింది. తమ వాణిజ్య భాగస్వాములకు కూడా లబ్ది చేకూరే విధంగా సరికొత్త నమూనాలను నిర్మించాల్సి ఉందని తెలిపారాయన.

3 thoughts on “చైనా ఇప్పుడు అతిపెద్ద సరుకుల వ్యాపారి

  1. అగ్ర రాజ్యమైన అమెరికా చైనా ఆంక్షలకు, వత్తిడిలకు తలవొగ్గక తప్పదు. పారిశ్రామిక వాణిజ్య ఉత్పత్తులలో ఆర్ధిక సాలంబనం జంతు చుంబనం. అమెరికా తన పక్షపాత అహంకారపూరిత వైఖరికి స్వస్తిపలికి అభివృద్ధిచెందే దేశాలకు ఆర్ధిక స్వాలంబన దిశగా చేయుతనియ్యాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s