నూతన దిగజారుడుతో వేగడం ఎలా -ది హిందు సంపాదకీయం


Pepper spray victim

(లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో పెప్పర్ స్ప్రే జల్లి తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఈ రోజు -ఫిబ్రవరి 14- ది హిందూ పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

సుదీర్ఘమైన, నిష్ప్రయోజనకరమైన పార్లమెంటరీ గలాటా చరిత్ర కలిగిన దేశానికి కూడా సభ ముందుకు సాగకుండా అడ్డుకోవడం కోసం ఒక సభ్యుడు తన తోటి సభ్యుల పైన పెప్పర్ స్ప్రే జల్లడానికి తెగించడం కంటే మించిన సిగ్గుమాలినతనం, గౌరవ హీనం మరొకటి ఉండబోదు. సభలో పోకిరిగా వ్యవహరిస్తున్నందుకు అంతకు ముందే బహిష్కరణ వేటు పడిన ఆరుగురిలో ఒకరైన కాంగ్రెస్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోక్ సభలో తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నంలో నిస్పృహతో ఈ ఆయుధాన్ని చేతబట్టారు. స్పీకర్ సైతం ఈ పదార్ధం వల్ల ప్రభావితులు కావడంతో ఆమె కంటినుండి నీరు వచ్చింది. కొద్ది మంది సభ్యులు ఆసుపత్రి పాలు కావలసి వచ్చింది. తాను ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడానని రాజగోపాల్ చేస్తున్న వాదన అర్ధరహితం. కత్తి చూపినట్లుగా మరో సభ్యుడిపై ఆరోపణ వచ్చింది. కానీ ఆయన దాన్ని నిరాకరించారు. తాను కేవలం మైక్రోఫోన్ ని మాత్రమే పట్టుకుని ఉన్నానని ఆయన చెబుతున్నారు. బహుశా తన స్ధానం నుండి పీకేసిన మైకు అయి ఉండాలి.

వివాదాస్పద బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణకు మార్గం ఏర్పరిచే  తెలంగాణ బిల్లు విషయంలో ఇక ఇదే అంతిమ సమరం అని సభ్యులు భావించారు. బహుశా పార్లమెంటరీ భద్రతా సిబ్బంది కూడా అందుకు సిద్ధపడి ఉండాలి. బిల్లును ప్రవేశపెడితే తనను తాను తగలపెట్టుకుంటానని ఒక సభ్యుడు బెదిరించారు కూడా. కానీ ఒక వర్గీకరించబడిన ఆయుధం దారి చేసుకుని తన వాస్తవ వినియోగం కోసమే సభలో ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సభలో నెలకొంటున్న గందరగోళ పరిస్ధితులను బహు వ్యాకులతతో పరిశీలిస్తున్న అనేకమంది ఇలాంటి సంఘటన జరగొచ్చని భయపడుతూనే ఉన్నారు. నిస్పృహకు లోనైన సభ్యుడు ఎవరైనా రొటీన్ గా మారిన గలాభా వర్తనకు అతీతంగా ప్రవర్తించడమే ఇక మిగిలిన పరిస్ధితి. సభ మర్యాద నిలవాలంటే స్పీకర్ మీరా కుమార్ ఇక బలహీనమైన వేడుకోళ్ళకే తనను తాను పరిమితం చేసుకోకుండా కఠిన చర్యలకు ఉపక్రమించాలి. కొన్ని ఎంచుకున్న సంఘటనల విషయంలో సభనుండి తొలగించాలని ఆదేశించడం దగ్గర్నుండి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు అనుమతించడం వరకూ చర్యలు తీసుకోవాలి.

అనుచిత ప్రవర్తనల వల్ల తరచుగా నష్టపోతున్నది సభా కార్యకలాపాలే. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంలో ఎలాగో సఫలం చెందినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అసలు బిల్లును ప్రవేశపెట్టారా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఈ సంఘటన వల్ల పార్లమెంటు కూడా రాష్ట్ర చట్ట సభల మార్గంలోనే వెళ్ళి గొడవకు దిగుతున్న సభ్యులను తొలగించడం ద్వారా సభ సజావుగా సాగేలా చూసుకోవాలా అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. రాష్ట్రాల అసెంబ్లీల్లో వివిధ గ్రూపుల సభ్యులను మూకుమ్మడిగా సభ నుండి తొలగించడం సర్వ సాధారణం. పార్లమెంటు మరింత ప్రజాస్వామ్యయుతంగానూ సహన పూర్వకంగానూ వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఈ ఓపికే తరచుగా కొద్దిమంది గలాభా సభ్యులు మహిళల రిజర్వేషన్ లాంటి  కీలకమైన చట్టాలను అడ్డుకోవడానికి దారితీసింది.

ప్రస్తుత ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలి. చర్చల ద్వారా తగిన మద్దతును కూడగట్టడంలో అది విఫలం అయింది. బి.జె.పి అవగాహన సైతం అస్పష్టంగా ఉన్నది: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అది సూత్ర రీత్యా సమర్ధిస్తుంది, సీమాంధ్రుల ఆందోళనను పట్టించుకోవాలంటుంది. మళ్ళీ పార్లమెంటులో జరుగుతున్న గొడవకు యు.పి.ఏ నే నిందిస్తూ, అదే సమయంలో పార్లమెంటు సజావుగా సాగాలని నిబంధన విధిస్తుంది. రాజకీయ ఏకాభిప్రాయం ఆదర్శప్రాయం అయితే కావచ్చు గానీ, సభా కార్యక్రమాలు ఎప్పటికీ ఉద్దేశ్యపూర్వక గలభాకు బందీగా మిగలడానికి వీలు లేదు.

8 thoughts on “నూతన దిగజారుడుతో వేగడం ఎలా -ది హిందు సంపాదకీయం

 1. (దుష్టరాజకీయుల వికృతచేష్ట)
  చవకబారు రౌడీయిజం!

  దేశంలో అత్యున్నత
  సభలోపల సీమాంధ్రులు
  చవకబారు రౌడీయిజ
  మును చేయుట సిగ్గుచేటు!

  తెలంగాణ బిల్లు పార్ల
  మెంటులోన పెట్టగానె
  సీమాంధ్రకు చెందినట్టి
  నేతలపని సిగ్గుచేటు!

  అత్యున్నత సభలోననె
  రౌడీయిజమును చేసిరి!
  అమాయకపు తెలగాణతొ
  నెటులుండిరొ గ్రహియింపుడు!!

  అరువదేండ్ల నుండి తెలం
  గాణ సహించుచునున్నది!
  ఇంక దుష్ట జనులతోడ
  నెట్లు కలిసి యుందురయా?

  సీమాంధ్రుల దుశ్చర్యలు
  అరువదేండ్లుగా చూడని
  కేంద్రమునకు విదితమాయె
  స్పష్టముగా నేటిరోజు!

  మొగుడిని కొట్టియు మొఱ మొఱ
  యనుచును మొగసాలకెక్కు
  రీతిగాను ఎంపిలిట్లు
  చేయుటయే సిగ్గుచేటు!

  గౌరవప్రదమైన సభను
  కత్తులిట్లు తెచ్చుటేల?
  సభ్యులపై దాడి జరిపి
  పెప్పర్ స్ప్రే చేయుటేల??

  చవకబారు రౌడిలవలె
  ప్రవర్తించి ఈ ఎంపీ
  లయిరయ్యా తీవ్రవాద
  దేశద్రోహులే నిజముగ!

  ఇట్టి దౌష్ట్యమును జేసిన
  ఎంపీలకు పార్లమెంటు
  తీవ్రమైన శిక్షవేసి
  తీరవలెను నేటిరోజు!

  తీవ్రవాదులకు వీరికి
  తేడాయే లేదయ్యా!
  రాజద్రోహులకిచ్చెడు
  శిక్షవేయవలెనయ్యా!!

  రౌడీలకు దొంగలకును
  టిక్కెటిచ్చి సభకు దెచ్చు
  పార్టీలకు బుద్ధిచెప్పు
  నట్లు శిక్షయుండవలెను!

  అవమానము, సిగ్గు, సిగ్గు!
  దుర్మార్గపు చేతలివియె!
  తెలగాణుల మిట్టి చర్య
  లను వేగమె ఖండింతుము!!

  జై తెలంగాణ! జై జై తెలంగాణ!
  (నా తెలంగాణ కోటి రత్నాల వీణ…ratnaalaveena.blogspot.com)

 2. ” చర్చల ద్వారా తగిన మద్దతును కూడగట్టడంలో అది విఫలం అయింది. ” N Ram thisukuvasthe baga cahrachalu chesi … iddari madhya sayodhya jaruputhadu …. ee hindu pathrika vodu maradu mata meeda nilabade vani tho charcahalu jarapavachu kani .. prapachamu lo telangana meeda jariginatha charchaa indian history lo deni meeda jaragaledu ….

 3. సంపాదకీయంలో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా కొన్ని అంశాలున్నాయి. వాటిని వదిలి వ్యతిరేకంగా మీకు అనిపించిన భాగం పట్టుకుని పత్రిక పైన తీర్పు ఇస్తున్నారు.

  ఉదాహరణకి: పెప్పర్ స్ప్రే ఆత్మ రక్షణ కోసం కాదనీ, అది బిల్లును అడ్డుకోవడానికేనని విస్పష్టంగా చెప్పింది. అది కనపళ్ళేదా మీకు? బి.జె.పి రెండు నాల్కల ధోరణిని ఎత్తి చూపింది. ఉద్దేశ్యపూర్వకంగా గలాభా సృష్టిస్తున్నవారితో ఏకాభిప్రాయం కుదరదనీ, ఏకాభిప్రాయం కేవలం ఆదర్శం మాత్రమేననీ చెప్పింది. అదీ మీకు కనపళ్లేదు. అనుకూలంగా రాస్తేనేమో ‘రాయక చస్తారా’ అన్న ధోరణి. ప్రతికూలంగా రాస్తేనేమో తూలనాడే ధోరణి. ఏమిటిది?

  ఏ రైటప్ నైనా మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటూ సారాన్ని అర్ధం చేసుకుని వ్యాఖ్యానం చేయడం తగిన పని. అలా కాకుండా ‘నక్కలు బొక్కలు వెతుకును’ టైప్ లో వ్యతిరేకంగా ఏముందా, దాన్ని పట్టుకుని వేలాడుదామా అనే ధోరణిలో ఉంటే మిత్రులెవరూ మిగల్రు. మొదట భిన్నాభిప్రాయాల్ని గౌరవించడం తెలంగాణ వ్యతిరేకులకే కాదు, అనుకూలురుకి కూడా అవసరమే.

 4. హహ్హహ్హహ్హ….

  నక్కలు బొక్కలు వెతుకునా… ఇదెక్కడి సామెతండి…. నేనెక్కడా వినలేదు. కానీ భలేగా ఉంది.

  ఇక మీరన్నట్లు అవతలి వారి వాదన కూడా వినడం తప్పకుండా అవసరమే. బహుశా ప్రస్తుతం మన రాష్ట్రంలో అది లోపించడం వల్లే ఈ గందరగోళం. ఇటు తెలంగాణ వాళ్లైనా…సీమాంధ్ర వాళ్లైనా.

 5. ayya hindu paper gurunchi ye telangana vadi naiyeena adagandi …. telangana meedha dhani stand ento … N Ram stand ento …vallla CPM stand ento …….goppa viluvalu maintain chestham antu cheppukone …. athyantha telivigaa chivariki conclution vache time ku sannayee nokulu nokkuthu thana agenda nu pettadam,,,ilaa chesthunnaru andam bokka lu eradama …. naku telisi oka artcile
  conclude dhani saram ki samanam anukuntunaanu …. ala kadu nenu bokkalu eruthunna nakka anukunte alla artcles rase varu kukkalu anukuntaa

 6. చందు తులసి గారూ,

  అది సామెత కాదు, చాటువు లాంటి పద్యం. తెలుగులో తరచూ కోట్ చేస్తుండేదే. మీరు ఇంతవరకూ వినకపోవడం ఆశ్చర్యకరమే!.

  ‘‘ నక్కలు బొక్కలు వెదకున్;
  నక్కరతో యూర పంది యగడిత వెదకున్;
  కుక్కలు చెప్పులు వెదకున్;’’

  నాలుగో పాదం అసభ్య దూషణతో ఉంటుంది.

 7. చందుగారూ, నేనన్నది మీరు నక్క అని కాదు. తినడానికి ఏమి దొరుకుతుందా అని బొక్కలు వెతకడం నక్కల ధోరణి. తెలంగాణకు వ్యతిరేకంగా ఏమి దొరుకుతుందా తూలనాడడానికి అని వెతకడం మీ ధోరణి. ఈ ధోరణులను పోల్చాను. మీరేమో ఆర్టికల్స్ రాసేవారినే కుక్కలు అని నిందిస్తున్నారు.

  తెలంగాణ వల్ల మిన్ను విరిగి మీదపడదు, నిజమే.కాని తెలంగాణ వల్ల స్వర్గం దిగివస్తుందని భావించడమూ భ్రమే. తెలంగాణ వచ్చాక కూడా జనం మళ్ళీ కె.సి.ఆర్, యాష్కీ, కోమటిరెడ్డి లాంటి దోపిడి పాలకులతో పోరాటాలు చెయ్యక తప్పదు. సీమాంధ్ర ధనిక వర్గాలు సీమాంధ్ర ప్రజల కోసం పనిచేయనట్లే తెలంగాణ ధనికవర్గాలు కూడా అక్కడి సామాన్య ప్రజల కోసం పని చేయరు. తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు, భూములు…వీటికోసమే వారు పని చేసేది.

  ఇది ఒక అవగాహన. వ్యవస్ధ తీరుతెన్నులపైన మనం కలిగి ఉండాల్సిన అవగాహన. దీన్ని వదిలేసి మీరు తరచుగా వ్యక్తిగత నిందల్లోకి దిగుతున్నారు. మీ గత వ్యాఖ్యలను కూడా దృష్టిలో పెట్టుకుని పైన చాటువు ఉపయోగించాను. మీరు యధావిధిగా దూషణల్లోకి దిగారు. మీకు వీలయితే తెలంగాణ వ్యతిరేకత ఎంత అప్రజాస్వామికమో చర్చించండి. కొద్దోగొప్పో ప్రయోజనం ఉంటుంది.

  ప్రపంచంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదు. జనం ఎదుర్కొనే సమస్యలు తెలంగాణకు అతీతంగా చాలా ఉంటాయి. వాటిలో చాలా వరకు వ్యవస్ధల మార్పుతో ముడిపడి ఉంటాయి. ఆ విషయంలో ది హిందూ పత్రిక ప్రజాపక్షం తీసుకుంటుంది. అంతవరకు ఆ పత్రికను ఆహ్వానించవచ్చు.

  తెలంగాణ వ్యతిరేకించినవారంతా చెడ్డవారు కాదు. అలాగే తెలంగాణకు అనుకూలంగా ఉన్నవారంతా ప్రజాస్వామ్య ప్రియులు, యుగపురుషులు కానవసరం లేదు. సామాజిక అవగానలు ఎప్పుడూ ఒక అంశం కేంద్రంగా ఉండవని గుర్తిస్తే వ్యక్తిగత ద్వేషాలకు, దూషణలకు తావు ఉండదు.

 8. ది హిందు సి పిం ఎం వాల్లది. ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్స్‌ బి జె పి వల్లది ఇంకోటి ఇంకొకరిది — ఇలా మాట్లడు కొంటు పోతుంటే ప్రజల పక్ష్మ వహించేది ఎవరు? ఏ పార్టి? మీ డి య మొత్తం నిజాలు చెప్పక పో వచ్చు. అయితే నిజాలే లేవనుకుందామా? ఇది అవగాహన్‌ లోపం తప్ప మరోటి కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s