22వ శీతాకాల ఒలింపిక్స్ రష్యా నగరం సోచి లో ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అధ్యక్షుడు బషర్ కి మద్దతు ఇవ్వడం మానుకుంటే టెర్రరిస్టు దాడులకు గురికాకుండా సజావుగా సాగేలా చూస్తామని సౌదీ రాచరిక ప్రభుత్వంలో గూఢచార విభాగ నేత ప్రిన్స్ బందర్ బేరం పెట్టిన వింటర్ ఒలింపిక్స్ ఇవే. విఫలం అయినా, ఆటంకాలు ఎదురైనా విరుచుకుపడి దాడి చేద్దామని పశ్చిమ పత్రికలు ఆత్రంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ కూడా ఇవే.
ఒలింపిక్స్ కు కొన్ని వారాల ముందు ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులు, పేలుళ్లు జరిగినప్పటికీ సోచి నగరంలో ఎలాంటి దుర్ఘటనా చోటు చేసుకోలేదు. సమస్త రష్యన్ బలగాలు వేయి కళ్ళతో పహారా కాస్తుండగా సోచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఫిబ్రవరి 7 తేదీన అనూహ్య విన్యాసాలతో విజయవంతంగా జరిగాయి. వివిధ కళాకారులు రష్యన్ సాంప్రదాయ కళలు, నృత్యాలు, ప్రదర్శనలు చేస్తూ ఆరంభ వేడుకలను కనుల విందుగా ముగించారు. ఆధునిక బాణసంచా పేలుళ్లు విను వీధులో అద్భుతమైన కళాకృతులను సృష్టిస్తూ చూపరులను ఆకర్షించాయి. పైరో టెక్నిక్స్, వేలాది నృత్యకారుల నాట్య విన్యాసాలు, లైట్ షో లు ప్రేక్షకులను మరో లోకంలోకి కొనిపోయాయి.
క్రీడల సందర్భంగా ఏ చిన్న ఆటంకం గానీ, దుర్ఘటన గానీ జరిగినా విరుచుకుపడడానికీ, చిలవలు పలవలు చేసి ప్రత్యేక కధనాలు వ్యాప్తిలో పెట్టడానికి పశ్చిమ పత్రికలు పంచేంద్రియాలను కేంద్రీకరించి ఎదురు చూస్తున్నాయి. పశ్చిమ దేశాల ఆర్ధిక ఆధిపత్యానికి సవాలు విసురుతున్న BRICS కూటమి సభ్య దేశంగా భారత దేశ ప్రజలంగా ఈ ఒలింపిక్స్ విజయవంతం కావాలని కోరుకుందాం!
ఈ ఫోటోలను బోస్టన్, ది అట్లాంటిక్ పత్రికలు అందించాయి.
Visekhar garu mee posts chala varaku chadivanu chala bagunnayi.
Nenu mimalni oka request cheyadaluchukunanu…..
prathi samvatsaram konni lakshala mandi andhrulu unnathamaina civil service exams,group1 exams koraku potipaduthunaru….atuvanti vidyarthula koraku kuda mee blog upayoga padela
seperate link create chesthe yentho mandi vidyarthulaku upoyoga patduthundi anukuntunanu sir….Entho mandi peda vidyarthulu samachar sekarana kosam dabbulu vechinchaleka pothunaru…ala ge rural areas nunchi vanchina chala mandi vidyarthulu english language tho chala kastapaduthunaru….peda vidyarthulaku,rural areas nunchi vachina vidyarthulu unnathamaina sikaralu adirohinchadaniki mana blog konchem upasamanam kaligisthundani asisthu…
ఉపశమనం మాత్రమేనా శంకర్ గారు. చాలా ఉపయోగకరం కూడా కదా….! జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై ఒక ప్రోగ్రెసివ్ విజన్ కలిగించే ఈ బ్లాగు ఒక్క సివిల్స్, గ్రూప్స్ విద్యార్దులకే కాదు. అంతర్జాతీయ పరిణామాలపై ఆసక్తి చూపించే తెలుగు పాఠకులందరికీ ప్రయోజనకరమే.