సబ్సిడీ సిలిండర్ల పెంపు, విషం కక్కుతున్న పరిశ్రమ వర్గాలు


ficci

సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంచడం తిరోగామి చర్య అని ఫిక్కి అధ్యక్షుడు సిద్ధార్ధ్ బిర్లా జారీ చేసిన ప్రకటనలో అభివర్ణించాడు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ఈ చర్య భారం అవుతుందని ఆయన చాలా బాధపడిపోయాడు. ఆధార్ కార్డు తో ఎల్.పి.జి సిలిండర్ కు పెట్టిన సంబంధం తెంచడం వలనా, సబ్సీడీ సిలిండర్లు పెంచడం వలనా దేశానికి ఆర్ధిక కష్టాలు పెరుగుతాయని, కోశాగార క్రమశిక్షణ (Fiscal descipline) మరియు కోశాగార సమతూకం (Fiscal balance) పాటించాల్సి ఉండగా ఈ చర్య దానికి విరుద్ధం అనీ సిద్ధార్ధ్ బిర్లా గారు వాపోయారు.

“నగదు బదిలీ పధకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. ఇది సరైన దిశలో తీసుకున్న చర్య అని ఫిక్కి నమ్ముతోంది. దీని అమలు ప్రక్రియ కొంతకాలం పడుతుంది. ఆటంక రహితం ఏమీ కాదు. కానీ రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి వేసే లగ్జరీ మనకు లేదు” అని సిద్ధార్ధ బిర్లా తన ఆమ్ ఆద్మీ వ్యతిరేక తెలివి తేటల్ని వెళ్ళగక్కారు.

ఈ పెద్ద మనిషి చెప్పని సంగతి ఏమిటంటే పరిశ్రమల కోసం ప్రభుత్వం యేటా 6 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం ధారపోస్తోంది. పన్ను రాయితీలు, ఎగుమతి రాయితీలు, ఉచిత సేవలు… ఇలా అనేక రూపాల్లో పరిశ్రమాధిపతులు ఏటా దిగమింగుతారు. బడ్జెట్ లో ఇచ్చే రాయితీలు కాకుండా అత్యంత తక్కువ ధరలకు ఇచ్చే భూములు, అడపా దడపా ఆ వంకా ఈ వంకా చూపి  దిగుమతి సుంకాల రాయితీలు లేదా రద్దులు అదనం. రైతులు, మధ్యతరగతి ప్రజల కోసం కేటాయించిన బ్యాంకు రుణాలు కూడా వీరే భోచేస్తుంటారు. వీళ్ళు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకుండా ఎగవేయడం వల్ల బ్యాంకుల బ్యాలన్స్ షీట్లలో నిరర్ధక ఆస్తుల మొత్తం ప్రతి యేడూ పెరుగుతూ పోతోంది. పెరిగి, పెరిగీ అసహ్యంగా కనపడినప్పుడు ఒక శుభ ముహూర్తంలో ఈ నిరర్ధక ఆస్తుల రూపంలో ఉన్న పరిశ్రమాధిపతుల రుణాలను అమాంతం రద్దు చేసేయడం మన పాలకులకు ఉన్న మహా మంచి అలవాటు.

ఇది రికార్డులకు ఎక్కేది మాత్రమే. 2జి కుంభకోణంలో ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ కంపెనీల మాటున దాగిన ధనిక వర్గాలు మేసింది లక్ష 76 వేల కోట్లు. బొగ్గు కుంభకోణంలో మెక్కబోయింది 2 లక్షల కోట్లకు పైమాటే. ఆల్రెడీ మెక్కింది లెక్కకు రాలేదు. కామన్ వెల్త్ కుంభకోణంలో మెక్కింది పది వేల కోట్లకు పైనే. మహారాష్ట్రలో ఇరిగేషన్ కుంభకోణంలో మెక్కింది 70,000 కోట్లు. మన రాష్ట్రంలో జల యజ్ఞం పేరుతో మెక్కింది పూర్తిగా లెక్క వేసే సాహసానికి ఇంకా ఎవరూ పూనుకోలేదు. ఒరిస్సాలో అక్రమంగా, ఇష్టారీతిన, చట్టాలన్నీ తొక్కి పారేసి ఇనప గనుల్ని తవ్వితీసి అమ్ముకున్న కుంభకోణం ఖరీదు 50,000 కోట్లకు పై మాటే అని కొద్ది రోజుల క్రితమే విడుదలయిన షా కమిషన్ మధ్యంతర నివేదిక స్పష్టం చేసింది.

స్విస్ తదితర విదేశీ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు దాచిన అక్రమ డబ్బు విలువ 50 లక్షల కోట్ల నుంచి, కోటి కోట్ల వరకూ లెక్కలు వేశారు. అంచనా వేసిన వారికి అందుబాటులో ఉన్న వనరులను బట్టి ఈ అంకె 50 లక్షల కోట్ల నుంచి కోటి కోట్ల వరకూ మారుతూ ఉంటాయి.

మరిదంతా ఎవడబ్బ సొమ్ము? ఈ దేశం గడ్డమీద ఉన్న ప్రతి ఒక్క వనరూ ఈ దేశ ప్రజల ఉమ్మడి సొత్తు. కానీ వీటిని అమ్ముకునే హక్కు మాత్రం ఒక్క భూస్వాములకు, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు, విదేశీ సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్ధలకు మాత్రమే ఎలా దక్కింది. ఒరిస్సాలో ఇనప ఖనిజం తవ్విన భూములన్నీ గిరిజనులకు చెందినవి. దట్టమైన అడవులను నరికిపారేసి నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని తవ్వి ఈ దేశ ప్రజలకు ఉపయోగపెట్టకుండా చైనా లాంటి దేశాలకు అమ్ముకుని తిన్న దగుల్బాజీలు మన పరిశ్రమాధిపతులు. ప్రైవేటు ఆస్తి హక్కును పరమ పవిత్రంగా చెప్పే ప్రభుత్వాలు గిరిజన భూముల్ని వారి నుండి లాక్కుని ప్రైవేటు కంపెనీలకు అప్పజెపితేనే ఈ ఒరిస్సా ఇనుప ఖనిజ కుంభకోణం సాధ్యం అయింది.

ఫిక్కి అనీ ఆసోచాం అనీ, ఎఫ్.ఐ.ఐ అనీ రకరకాల సంఘాలు (లాబీలు) పెట్టుకుని ప్రభుత్వాలను ఆడించే ఈ దగుల్బాజీలు తాము నడిపే కంపెనీల్లో కార్మికులకు మాత్రం సంఘం పెట్టుకునే హక్కును నిరాకరిస్తారు.

దేశ సంపదలను ఈ రకంగా అంతూపోంతూ లేకుండా సుబ్బరంగా మెక్కి తింటూ అది చాలక సామాన్యుడికి ఇచ్చే సబ్సిడీ రద్దు చేయాలని కోరడం ఎంత అసహ్యంగా, ఎంత రోతగా ఉంది? 9 నుండి 12 సిలిండర్లకు పెంచితే కేంద్రంపై పెరిగే భారం కేవలం 5,000 కోట్లు. నిజానికి ఇది భారం కానే కాదు. జనం సొమ్ము జనానికి ఇస్తున్నారంతే. ప్రజాస్వామ్యం అంటే అదే మరి. జనం సొమ్ము జనానికి తిరిగి ఇవ్వడమే ప్రజాస్వామ్యం తప్ప కొద్ది మంది ధనికవర్గాలకు దోచిపెట్టడం ప్రజాస్వామ్యం కానే కాదు. అది ధనిక స్వామ్యం మాత్రమే.

కోటి కోట్ల సొమ్ముని విదేశాల్లో దాచుకుని యేటా 6 లక్షల కోట్ల రాయితీలను దిగమింగుతూ కేవలం 5,000 కోట్లను భారంగా చెబుతూ విషం కక్కడం ఒక్క తినమరిగిన బాపతుకే చెల్లుతుంది. నిజానికి సబ్సిడీ ఇస్తున్నది ప్రభుత్వం కాదు. ప్రభుత్వాన్ని ఏలుతున్న ధనిక వర్గాలు అసలే కాదు. ఏ సంపద తీసుకున్నా ఒళ్ళు వంచి శ్రమ చేస్తేనే పుడుతుంది. శ్రమ లేకుండా ఒక్క పూచిక పుల్ల కూడా నడిచి రాదు. అంటే సంపదలన్నీ శ్రామికులవి తప్ప తరాల తరబడి జనం మీద పడితిన్న ధనిక వర్గాలవి కాదు. కాబట్టి జనమే నిజానికి ధనికవర్గాలకి సబ్సిడీ ఇస్తున్నారు. వారు దాచుకున్న కోటి కోట్ల డబ్బంతా శ్రామికులు సబ్సిడీ ఇవ్వగా తరలించ్చిందే. సిద్ధార్ధ బిర్లా గారు ఈ సంగతి తెలుసుకోవాలి.

10 thoughts on “సబ్సిడీ సిలిండర్ల పెంపు, విషం కక్కుతున్న పరిశ్రమ వర్గాలు

 1. ఒక్కసారి ప్రపంచంలో వ్యాపారం మొత్తం దివాలా తీసిందనుకోండి. అప్పుడు ప్రజలకు జరిగే నష్టమేలా ఉంట్టుందో ఎవరైనా ఊహించి,పుస్తకం రాశారా?

 2. Over 40 per cent of GDP in India comes from the non-corporate sector,” said Mr. Gurumurthy. Family-based society, values and the system in India was the real driver of domestic savings; but a cultural catastrophe in the United States had transformed into an economic catastrophe, he said.“Indian economy grew because of domestic savings between 1991 and 2011. By 2016, Indian families will contribute to 40 per cent of savings. But 51 per cent of first marriages in the U.S. end in divorce. American family crisis in 2008 turned into a global economic crisis,” said Mr. Gurumurthy.

 3. Corporate sector contributes 15 per cent of GDP. It should stop advising govt. Insted they shoild close non performing industries like media. Business TV channels are jnder loses, it will be great if they close those channels. So that middle class people save money by not investing in share market.
  http://www.thehindu.com/news/cities/chennai/revamp-understanding-of-economics-students-urged/article5635997.ece

 4. “American family crisis in 2008 turned into a global economic crisis.”

  What is this nonsense?! I never come across such a bizarre statment.

  For any society economics is the basis and culture is one of the super structures. Family is a small part of the culture. Saying that family crisis lead to economic crisis is utter nonsense. Super structures stand on base. The base doesn’t stand on super structure.

  Is Gurumurty an educated fool or he thinks all else are fools.

 5. శ్రీరామ్ గారూ గురుమూర్తి గొప్పతనం గురించి దయచేసి చెప్పకండి. బి.జె.పి-ఆర్.ఎస్.ఎస్ ల కోసం శ్రమించే ఆయన స్వచ్ఛత గురించి కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు. ఆయన చెప్పిన పై ఒక్క వాక్యం చాలు. గురుమూర్తి గొప్పతనం పై లింక్ లు ఇవ్వడం వృధా ప్రయాస.

  “He is not a fool.”

  Then, Definately he is trying to fool others.

 6. *For any society economics is the basis *

  ఆ ఒక్క స్టేటెమెంట్ వెనుక ఎంతో కథ ఉంది. దాని అర్థం తెలుసుకోవలంటే, గురుమూర్తి ఉపన్యాసాలు యుట్యుబ్ లో చాలా ఉన్నాయి. వీలైతే చూడండి. ఆ విషయం పక్కనపెట్టి మీరు రాసిందాని మీద నా అభిప్రాయం. మీ స్టేట్మెంట్ మొదట ఎకనామిక్స్ చివర కుటుంబం అని చెప్తున్నారు. ఇది పశ్చిమదేశాల నుంచి వచ్చిన భావన అయి ఉంట్టుంది. కాని ఆసియా దేశాల వారికి మొదట కుటుంబం (అది పిల్లల కొరకు) చివర ఎకనామిక్స్. మగవాడు ఎన్నో రకాల వ్యవస్థలను నిర్మించటానికి ప్రథాన కారణం మొదట పిల్లలు. వారి రక్షణ కొరకు ఎన్నో చర్యలు తీసుకొన్నారు.
  Modern psychologists consider the child as the magical nucleus of all: Erik Erikson puts it tersely “Defenseless as babies are, they have mothers at their command, families to protect the mother, societies to support the structure of families, and traditions to give a cultural continuity to systems of training and tending”

  మగవాడువ్యవస్థలను నిర్మించే క్రమంలో జ్ణానాన్ని,సంపదను అభివృద్దిచేయటం, దానికి వారసులకు అందించటం జరిగింది.

 7. ఎకనమిక్స్ చివర కుటుంబం ఉండడం ఏమిటి?

  మొదలూ చివరా కాదు నేదు చెప్పింది. ఏ సమాజానికైనా పునాది ఆర్ధిక సంబంధాలు అని. దానిపైన ఇతర సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఆధారపడి ఉంటాయి.

  ‘సమాజం ఇలా ఉంది’ అని చెబితే ‘అది అలానే ఉండాలి’ అని చెప్పినట్లు కాదు.

  మనిషి, మానవత లాంటి ఉదాత్త భావాలపై కాకుండా ఆర్ధిక సంబంధాలపైన సమాజం ప్రస్తుతం ఆధారపడి ఉంది. అలా కాకుండా మానవీయ సంబంధాల ఆధారంగా సమాజం ఉండేలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే సమాజంలోకి మధ్యలో జొరబడిన డబ్బు లెక్కలు తీసేయాలి. అది మళ్లీ వ్యవస్ధల మార్పుతోనే సాధ్యం.

  కుటుంబ విలువలు గడ్డకట్టిపోయిన నిర్మాణాలేమీ కాదు. మనిషి (హోమో సెపియన్) పుట్టినపుడు అవి లేవు. పుట్టాక అనేక మార్పులకు గురవుతూ వచ్చాయి. పశ్చిమ దేశాల్లో పెట్టుబడిదారీ సమాజం కుళ్లిపోయే దశకు చేరింది. అంటే ప్రతిదీ డబ్బుతో కొలుస్తారక్కడ. ఇండియాలో భూస్వామ్య విలువలు, పెట్టుబడిదారీ విలువలు కలగలిసి ఉంటాయి. దిగుమతి విలువలు, స్ధానిక విలువలు కలగలిసి ఉంటాయి. కాబట్టి కుటుంబాల నిర్మాణంలో కూడా ఈ రెండూ కలిసి కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు ఉంటే, పట్టణాలు నగరాల్లో న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగాయి. నగరాల్లో ఆర్ధికంగా ఇంకా పైకి వెళ్తే కుటుంబ విలువలు దాదాపు పతనమై కేవలం బహిర్గత రూపాల్లోనే ఒక విలువగా నిలిచి ఉండడం గమనించొచ్చు. ఇదంతా డబ్బు మహిమ. మానవ సంబంధాలు వ్యాపారమయం అయిన ఫలితం. మనిషి దగ్గర డబ్బు ఎంత పెరిగిపోతే సామాజికంగా అంత పతనం జరుగుతుంది. వీటన్నింటికీ మూలం ఆయా సమాజాల ఆర్ధిక సంబంధాలే.

  సమజంలో కుటుంబం ఒక భాగం. ఒక యూనిట్, అంతే. అలాంటి కుటుంబ సంబంధాల పైన మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆధారపడడం ఏమిటి? నాన్సెన్స్ కాకపోతే. దేశం కూడా కాదు మొత్తం ప్రపంచ సంక్షోభమే అమెరికా కుటుంబ సంబంధాల వల్ల వచ్చిందని చెప్పడం మన దగ్గర ఇంకేదో గొప్పది ఉందని చెప్పుకోడానికి తప్ప అందులో విషయం ఏమీ లేదు.

  గురుమూర్తి స్వదేశీ జాగరణ్ మంచ్ నాయకుడు. ఆర్.ఎస్.ఎస్ నేత. ఆయన చెప్పేది ఏమిటో, ఆయన మాటల అర్ధం ఏమిటో నాకు అవగాహన ఉంది. ఎటొచ్చీ ఆర్ధిక సంబంధాలకీ, సమాజంలోని ఇతర వ్యవస్ధలకీ మధ్య ఉన్న సంబంధాన్నే ఆయన తలకిందులుగా కాకుండా నిటారుగా నిలబెట్టి చూడాలి. ఇది నా అభిప్రాయం. మీరు అంగీకరించాలని రూల్ లేదు. కాని గురుమూర్తి గొప్పల జోలికి మాత్రం మనం పోనవసరం లేదు.

 8. ఐనా వ్యాపార వర్గాలు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలో అడగాలి.
  ఎగుమతి పన్నో, దిగుమతి పన్నో, కరెంటు సబ్సిడీనో….ఇలాంటివి అడగాలి కానీ, పేద, మధ్య తరగతి ప్రజలకు సబ్సిడీ సిలిండర్లు ఇవ్వద్దని చెప్పాల్సిన అవసరమేమిటి.?
  ఎవరి అవసరం గురించి వారికి తెలుస్తుంది….వాళ్లు ఎలాగూ సాయం చేయరు. ఆఖరుకు ప్రభుత్వాన్ని కూడా చేయనివ్వరా…? కొన్నాళ్లు పోతే ఈ దేశంలో నివసిస్తున్నందుకు కూడా పేద జనం నుంచి పన్ను వసూలు చేయాలని అనేలా ఉన్నాయి వ్యాపార వర్గాలు. వాళ్లేవో కారుకూతలు కూస్తే…కొన్ని మీడియా ఛానళ్లు, పేపర్లు అదో గొప్ప వార్తగా ప్రచారం కూడా చేస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s