బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు


Kiran

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ బిల్లును కేంద్రానికి వెనక్కి తిప్పి పంపాలని స్పీకర్ కు నోటీసు ఇవ్వడం ద్వారా మరోసారి ‘సమైక్యాంధ్ర ఛాంపియన్’ బిరుదును సార్ధకం చేసుకునే వ్యూహంలో ముందు నిలబడ్డారు.

రూల్ 77 కింద సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి తిప్పి పంపాల్సిందిగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టాలని కిరణ్ కుమార్ ఇందులో కోరారు. శాసన సభలో 90 మంది సభ్యుల వరకు బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాక, ముఖ్యమంత్రి సైతం రెండు రోజుల పాటు బిల్లుపై అభిప్రాయం చెప్పిన తర్వాత ఆ బిల్లును వెనక్కి పంపాలని తీర్మానం పెట్టాలంటూ స్పీకర్ కు నోటీసు ఇవ్వడం కుట్ర పూరితం తప్ప మరొకటి కాదు. బిల్లులో అనేక లోపాలున్నాయని, వచ్చింది ముసాయిదా బిల్లా లేక అసలు బిల్లా అన్న విషయంలో కేంద్రానికి కూడా స్పష్టత లేదని కిరణ్ కుమార్ తన నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.

సి.ఎం కిరణ్ కుమార్ చెబుతున్న కారణాలు ఈ రోజు కొత్తగా కనిపెట్టినవి కావు. ముసాయిదా బిల్లు లేదా అసలు బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన మరుసటి రోజే అనేకమంది సీమాంధ్ర శాసన సభ్యులు ఈ అభ్యంతరాలు లేవనెత్తారు. బిల్లు లక్ష్యం, కారణాలు ఏమిటో చెప్పలేదని, ఆదాయాలు, ఖర్చులు, సిబ్బందిలను ఎలా పంపిణీ చేయాలో తెలిపే ఎకనమిక్ మెమోరాండం బిల్లులో పొందుపరచలేదని, అసలు బిల్లు రాష్ట్రపతికి పంపాల్సి ఉండగా ముసాయిదా బిల్లు పంపారని ఉండవల్లి, లగడపాటి లాంటి కాంగ్రెస్ నాయకులు పయ్యావుల కేశవ్, మోదుగుల లాంటి టి.డి.పి నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కోరస్ లో వివిధ సందర్భాల్లో సి.ఎం కిరణ్ కూడా గొంతు కలిపారు.

ఈ లోపాలపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో వీటికి సమాధానం వస్తుందని ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వానికి తాము ఇచ్చే వివరణ ఏమీ లేదనీ, పంపిన బిల్లుపై అభిప్రాయాలు చెప్పి తిప్పి పంపితే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తరపున హోమ్ శాఖ చెప్పినట్లు పత్రికలు తెలిపాయి కూడా. ఇంతకాలం బిల్లును వెనక్కి తిప్పి పంపే ఆలోచన చేయకుండా బిల్లుపై చర్చకు మరింత గడువు కూడా కోరిన తర్వాత, ఆ గడువేదో రాష్ట్రపతి ఇచ్చిన తర్వాత… ఇప్పుడు హఠాత్తుగా వెనక్కి పంపాలని తీర్మానం ప్రవేశ పెట్టాలని స్పీకర్ కు నోటీసు ఇవ్వడం కుట్ర తప్ప మరొకటి కాదు.

చేయవలసిన చర్చ అంతా చేసి, గడవవలసిన రోజులన్నీ గడిపి… ఆనక బిల్లును వెనక్కి పంపాపమనడం అంటే… సమయం వృధా చేసి కేంద్ర ప్రభుత్వానికి సమయం లేకుండా చేసే కుట్రకు పాల్పడడమే. సమయం లేకుండా చేస్తే బిల్లు ఆమోదానికి సమయం లేక ఎన్నికల తర్వాత వరకూ తెలంగాణ ఏర్పాటు వాయిదా వేయాలనీ, ఆ తర్వాత రాజులు బంట్లు కాక తప్పదని, తద్వారా తెలంగాణ ప్రజల కల సాకారం కాకుండా అడ్డుకోవచ్చని సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి పధకం పన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రూల్ 77 కింద సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుపై స్పీకర్ సోమవారం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సోమవారమే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ బిల్లుపై తన అభిప్రాయం చెప్పవలసి ఉంది. రూల్ 77 కింద బిల్లును వెనక్కి పంపాలని తీర్మానం ప్రవేశపెట్టాలంటూ తాను స్పీకర్ ను కోరనున్నట్లు ప్రతిపక్ష నేత కూడా ప్రకటించారు. ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందే స్పీకర్ కు నోటీసు ఇవ్వడం ద్వారా పాలకపక్ష నేత, ప్రతిపక్ష నేత కంటే ముందున్నట్లు చాటుకున్నారు. సీమాంధ్ర ప్రజల ముందు సమైక్య ఛాంపియన్ గా అవతరించాలని కాంగ్రెస్, టి.డి.పి పార్టీల నేతలు పాట్లు పడుతూ ఆ క్రమంలో తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు తూట్లు పొడవడం మిక్కిలి గర్హనీయం, ఖండనార్హం, స్వార్ధపూరితం, మోసపూరితం, అనైతికం, నయవంచన! తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, రానున్న ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీమాంధ్ర ఓట్లు నోల్లుకోవడం కోసం ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గడ్డిపోచ విలువ కూడా ఇవ్వని ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఈ లగడపాటి… ఇత్యాదులంతా రేపు సీమాంధ్ర ప్రజలను కూడా అదే గడ్డిపోచ లెక్కన తీసేస్తారనడంలో ఎలాంటి సందేహమూ అనవసరం.

రెండో రోజూ తన అభిప్రాయాలూ చెప్పడం కొనసాగించిన సి.ఎం కిరణ్, ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు’ సంబద్ధత (validity) ను ప్రశ్నించారు. పార్లమెంటరీ ప్రక్రియలతో పాటు, భారత రాజ్యాంగాన్ని కూడా బిల్లు ఉల్లంఘించిందని ఆయన చెప్పుకొచ్చారు. “రాష్ట్రపతి, రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లు అనేక తప్పులతోనూ, లోపాలతోనూ కూడుకుని ఉంది. నిజానికి అది అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్న విషయంలో కేంద్రానికే స్పష్టత లేదు… ‘లక్ష్యాలు, కారణాలు’ (objects and reasons) ఈ బిల్లులో లేవు. ప్రతిపాదనల విస్తృతి లేదా ఫైనాన్షియల్ మెమోరాండం గానీ లేవు. రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలని తాము భావిస్తున్నామో వాళ్ళు (కేంద్రం) చెప్పలేదు. కేంద్రం తన అభిప్రాయాలూ చెప్పకుండా మేము (రాష్ట్ర అసెంబ్లీ) మా అభిప్రాయాలు ఎలా చెప్పాలి?” అని కిరణ్ ప్రశ్నించారు.

“మొదట వాళ్ళు దానిని బిల్లు అన్నారు. మేము కొన్ని వివరణలు, లక్ష్యాలు-కారణాలు, ఫైనాన్షియల్ మెమోరాండం ఇవ్వాలని కోరాము. అప్పుడు ఇది బిల్లు కాదు ముసాయిదా బిల్లు మాత్రమే అని హోమ్ శాఖ కార్యదర్శి బదులిచ్చారు. ముసాయిదా బిల్లును వాళ్ళు రాష్ట్రపతికి ఎలా పంపిస్తారు?” అని కిరణ్, బహుశా మిలియన్ డాలర్ల ఇరుకున పెట్టే ధర్మ సందేహం అని తాను భావిస్తున్న ప్రశ్న వేశారు. పూర్తి వివరాలతో కూడిన బిల్లును రాష్ట్రపతికి పంపాలి తప్పితే ముసాయిదా బిల్లు కాదని ఆయన ఆర్టికల్ 3 ను ఉదహరిస్తూ కేంద్రానికి రాజ్యాంగ మర్మం ఎరుకపరిచారు. పార్లమెంటరీ ప్రొసీజర్స్ మాన్యువల్ ప్రకారం కేంద్ర కేబినెట్ ఒక బిల్లును ఆమోదించిన తర్వాత అది తప్పనిసరిగా న్యాయ శాఖకు పంపాలని సి.ఎం ఎత్తిచూపారు. న్యాయ మంత్రి పరిశీలన తర్వాత మాత్రమే ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపాలని అందులో లక్ష్యాలు-కారణాలు, ప్రతిపాదనల విస్తృతి (scope of proposals), ఫైనాన్షియల్ మెమోరాండం.. ఇవన్నీ ఉండాలని కిరణ్ చెప్పారు. ఇవి జరగకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రొసీజర్స్ లోని రూల్స్ 11, 12, 9, 4, 5, 32, 54 లను ఉల్లంఘించ్చిందని బిల్లు రూపొందించే క్రమంలో భారత రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిందని వాదించారు.

అయితే సి.ఎం కిరణ్ కుమార్ బండి ముందు గుర్రాన్ని నిలబెట్టానని భ్రమిస్తూ గుర్రం ముందు బండి నిలబెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వరుసగా జరిగే రాజ్యాంగ పరమైన, పాలనా పరమైన పరిణామాల పైన ఇండియా టుడే పత్రిక అక్టోబర్ 6 తేదీన తయారు చేసిన స్టేట్ మెంట్ ను కింది లింక్ లో చూడండి:

The next steps in the creation of Telangana: Timeline

అలాగే తెలంగాణ ప్రక్రియ గురించి హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివరించిన విధానాన్ని బిజినెస్ లైన్ (ది హిందు అనుబంధం) పత్రిక అక్టోబర్ 10 తేదీన ప్రచురించింది. ఆ వార్తను కింద లింక్ లో చూడండి.

Govt to go ahead with decision to create Telangana: Shinde

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఏమి చెబుతోంది?

Article 3 in The Constitution Of India 1949

3. Formation of new States and alteration of areas, boundaries or names of existing States: Parliament may by law

(a) form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;

(b) increase the area of any State;

(c) diminish the area of any State;

(d) alter the boundaries of any State;

(e) alter the name of any State;

Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament

except on the recommendation of the President and

unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired.

Explanation I In this article, in clauses (a) to (e), State includes a Union territory, but in the proviso, State does not include a Union territory

Explanation II The power conferred on Parliament by clause (a) includes the power to form a new State or Union territory by uniting a part of any State or Union territory to any other State or Union territory.

ఈ అంశాలన్నీ కలిపి చూసినపుడు మనకు అర్ధం అయ్యే విషయం: రాష్ట్రపతి, రాష్ట్ర చట్ట సభలకు (అసెంబ్లీ, కొన్సిల్) పంపే బిల్లు అసలు బిల్లా లేక ముసాయిదా బిల్లా అన్న చర్చే అసంగతం. శాసన సభ, శాసన మండలి సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించి కేబినెట్ తయారు చేసేదే ముసాయిదా బిల్లు. ఈ ముసాయిదా బిల్లును న్యాయశాఖ పరిశీలిస్తుంది. అనంతరం దానిని కేబినెట్ ఆమోదిస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అది అసలు బిల్లు అవుతుంది. దానిని లోక్ సభ, రాజ్య సభలు చర్చించి ఆమోదిస్తాయి. అనంతరం రాష్ట్రపతి సంతకంతో చట్టం అవుతుంది.

శాసన సభ, శాసన మండలిల అభిప్రాయాలను అవసరం అని కేబినెట్ భావిస్తే బిల్లులో ప్రవేశపెట్టి (అంతిమ) ముసాయిదా బిల్లును కేబినెట్ తయారు చేస్తుంది. అది న్యాయ శాఖ పరిశీలనలోకి వెళ్ళి మళ్ళీ కేబినెట్ ఆమోదానికి వచ్చేవరకు అది ముసాయిదా బిల్లే. కేబినెట్ ఆమోదం తర్వాత మాత్రమే అది అసలు బిల్లు అవుతుంది. ఈ లోపు జరిగే ప్రక్రియలన్నీ అంతిమ ముసాయిదా బిల్లు రూపొందించడానికి జరిగేవే. ఈ ప్రక్రియకు ప్రధాన సారధ్యం కేంద్ర కేబినెట్ వహిస్తుంది. ఇందులో రాష్ట్ర చట్ట సభలది ఒక పాత్ర మాత్రమే. కేవలం అభిప్రాయాలు చెప్పడం వరకే రాష్ట్రం పాత్ర. అభిప్రాయాలూ చెప్పడానికి కూడా అసలు బిల్లు కావాలని వాదించడమే రాజ్యాంగంపై అవగాహనలేనితనం అని ది హిందూ, ఇండియా టుడేల వివరణాలను బట్టి అర్ధం అవుతోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఎం.పి ఎప్పుడూ కాదు. అలాంటి వ్యక్తి ఎం.పి లుగా దశాబ్దాల తరబడి పని చేసి తలపండిన మంత్రులకు ఆర్టికల్ 3 పైనా, పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైనా పాఠాలు చెప్పబోవడం తాతకు దగ్గులు నేర్పడం కాదా?

6 thoughts on “బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

 1. పింగ్‌బ్యాక్: బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు | ugiridharaprasad

 2. కిరణ్ కుమార్ రెడ్డిలో కుట్ర దాగున్న విషయం అందరికీ తెలిసిందే! బిల్లు తిప్పి పంపితే…అటే పోతుంది…కానీ, తిరిగి రావడమంటూ ఉండదు! అంతా తెలంగాణ మంచికే జరుగుతోందనుకోవాలి. ఎవరు ఎంత విషం కక్కినా, ఎన్ని కుట్రలు చేసినా “తెలంగాణ రాష్ట్ర” ఏర్పాటు ఆగదు. మీరన్నట్టు సీ.ఎం.కు కుట్ర కుమార్ రెడ్డి అని పేరు పెడితే ఎలా ఉంటుంది? టీ.ఆర్.ఎస్.వాళ్ళు “కిరికిరి రెడ్డి” అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. రెండు పేర్లు చక్కగా సరిపోతాయి.

  జై తెలంగాణ! జై జై తెలంగాణ!
  గుండు మధుసూదన్
  చూడండి: “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” (ratnaalaveena.blogspot.in)

 3. మొన్న వీళ్ల తమ్ముడు తిరుమల ఆలయంలో అందరికన్నా ముందుగా దర్శనానికి వెళ్లాడట. తిరుమల దేవస్థానం వాళ్లు కూడా ఆయనకు రాచమర్యాదలు చేశారట. మరి ముఖ్యమంత్రి తమ్మునికి కూడా అధికారాలుంటాయని రాజ్యాంగంలో ఉందేమో….?

  అసలు ఆయన చెప్పే అభిప్రాయం కానీ, ఆయన ఇచ్చిన నోటీసు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చారా….లేక ఆయన వ్యక్తిగతంగా ఇచ్చారా…?

  ప్రజాస్వామ్యంలో అందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంది కాబట్టి…., కేవలం పౌరునిగా ఆయన అభిప్రాయమే ఐతే దానిపై చర్చ అవసరం లేదు. అందరికీ రాజ్యాంగం తెలిసి ఉండకపోవచ్చు.

  కానీ ముఖ్యమంత్రి హోదాలో ఐతే ఆయన మొత్త తన మంత్రివర్గంతో చర్చించిన తర్వాతే నోటీసు ఇవ్వాలి కదా. మరి తెలంగాణ ప్రాంత మంత్రులు దానికి ఒప్పుకున్నారా….? లేదు కదా.

  ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలాగైనా చెప్పుకోవచ్చు కానీ…రాజ్యాంగ బద్ధంగా ఇచ్చే నోటీసుకైనా ….పద్ధతి పాటించాలి కదా…? మరి ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కదా…?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s