పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్


Black money

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.

పాత నోట్ల ఉపసంహరణ ద్వారా నల్లధనాన్ని అరికట్టాలని భావిస్తున్నట్లు ఆర్.బి.ఐ గవర్నర్ మొదట తెలిపారు. ఈ పద్ధతిలో నల్లధనం ఏ మేరకు తగ్గించగలనరన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ఆర్.బి.ఐ ఇప్పుడు మరో కారణం చెబుతోంది. పాత నోట్లకు భద్రత విషయంలో తక్కువ లక్షణాలు (features) కలిగి ఉన్నాయని, 2005 తర్వాత ముద్రించిన నోట్లకు మరిన్ని భద్రతా లక్షణాలను చేర్చామని తెలిపారు. పాత నోట్లను పోలిన దొంగనోట్లు ముద్రించడం తేలిక కాబట్టి ఉపసంహరిస్తున్నామన్న అర్ధం ఇక్కడ ధ్వనిస్తోంది.

నల్ల డబ్బు దొంగ నోట్ల రూపంలో ఉండేది చాలా తక్కువ. అసలు నల్ల డబ్బు విదేశీ బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. ఈ డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో లేదు. వివిధ పెట్టుబడుల రూపంలో, షేర్ల రూపంలో, అనేకానేక బాండ్ల రూపంలో, బినామీ ఖాతాల రూపంలో నల్లధనం చెలామణిలో ఉంది. ఇలాంటి నల్ల డబ్బును వెనక్కి తెప్పించేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయకుండా చిన్న చిన్న చిట్కాలు ప్రయోగించడం వల్ల ఏమిటి ఉపయోగం?

జూన్ 30, 2014 లోపు మార్చుకోవాలని కోరిన ఆర్.బి.ఐ మళ్ళీ అంతలోనే ఆ తర్వాత కూడా మార్చుకోవచ్చని ప్రకటించింది. మరిక గడువు విధించి ప్రయోజనం ఏమిటో తెలియలేదు. నల్లడబ్బు చలామణిదారులు తమ డబ్బును 2005 ముందు నాటి పాత నోట్ల కట్టలలో ఎంత మేరకు నిలవ చేసి ఉంటారు? గడువు లోపు వారు మార్చుకోగలిగితే వారి నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారినట్లేనా?

అదీ కాక నల్లడబ్బుదారులకు బహుమతులు ఇచ్చి ఆకర్షించాలనుకోవడం సరైన ఎత్తుగడేనా? అక్రమంగా సంపాదించిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు కఠినమైన నిర్ణయాలను అమలు చేయకుండా ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఇంకా అలాంటి మార్గాల ద్వారా నల్లడబ్బును నిరోధించడానికి ఆర్.బి.ఐ గతంలో కూడా ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వాలు కూడా పన్నులు వెయ్యబోమన్న తాయిలాలను అనేకసార్లు ప్రకటించి నల్లధనం వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కూడా ఆర్ధికమంత్రి చెబితేనే ఈ చర్య తీసుకున్నామని ఆర్.బి.ఐ గవర్నర్ వెల్లడించడం గమనార్హం. ఈ చర్యల వలన ఎన్నడూ ప్రయోజనం సిద్ధించింది లేదు.

ఇప్పుడు కూడా ఓ క్యారట్ ను ఎరగా వేసి నల్ల డబ్బు వెలికి తీస్తున్నట్లు చెబుతున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఆంగ్లంలో క్యారట్ అండ్ స్టిక్స్ అని ఒక సామెత ఉంది. క్యారట్ అంటే ఒక ఆశ చూపి ప్రయోజనం సాధించడం కాగా స్టిక్స్ అంటే శిక్ష వేయడం ద్వారా ప్రయోజనం సాధించడం. ఈ కార్టూన్ లో పాత నోట్లపై ఆర్.బి.ఐ ఇచ్చిన ఆదేశాన్ని స్టిక్ గా కార్టూనిస్టు పోల్చారు. లెక్కలో లేని డబ్బును తన వీపు కింద భద్రంగా దాచుకున్న తాబేలు క్యారట్ కోసం డబ్బు బైటికి తెస్తుందని ఆర్.బి.ఐ/ప్రభుత్వం భ్రమిస్తున్నట్లుగా కార్టూన్ సూచిస్తోంది.

లెక్కకు రాని డబ్బు బైటికి రావాలంటే తాబేలు వీపుకు కర్ర కట్టడం కాదు, ఆ కర్రతో దాని వీపు బద్దలు కొట్టాల్సిందే అని కార్టూనిస్టు చెప్పదలిచినట్లు కనిపిస్తోంది. క్యారట్ కోసం తాబేలు ఎంత దూరం ‘తాబేలు నడక’ నడిచినా ఆ డబ్బు అటూ ఇటూ తిరుగుతుందే గాని బైటికి రాదని కూడా కార్టూనిస్టు సూచిస్తున్నారు.

చిత్తశుద్ధి లేని పనులు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం! నల్లడబ్బు సొంతదారులే ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు వారికి చిత్తశుద్ధి ఎక్కడి నుండి వస్తుంది?

5 thoughts on “పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్ | ugiridharaprasad

  2. బహుశా త్వరలోనే రాబోతున్న ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవడానికి…., బహిరంగ సభల్లో చెప్పకోవడానికి , అవినీతిని తాము కూకటి వేళ్లతో పెకలిస్తామని రాహుల్ గాంధీగారు చెప్పుకోవడానికే ఈ ప్రయత్నాలు కాబోలు.

  3. Not related to above post.

    Its mythology over ideology for the Communist party of India as a survival strategy. Left staring at a rapidly shrinking support base, and unable to attract the new generation of voters, the Communist Party of India (CPI) is turning to the power of Hinduism to stay relevant
    Today, a three-day seminar begins in one of the last red bastions in the country which will focus on the “power of the past”.
    “Vedas and Upanishads are part of our collective past. Why should we let the RSS hijack it? We all have lessons to learn from these ancient texts,” said a CPI leader when asked about the apparent incongruity in the topic of the seminar and the tenets of Leftist ideology
    For the first time in the history of any Left party, sessions will be held on traditional Indian knowledge systems, Indian philosophy and culture.
    Going a step further, the brochure proudly declares that CPI leaders like Veliyam Bhargavan and K Damodaran are “scholars of Vedic literature and classic Sanskrit.”

    .

    http://www.newindianexpress.com/thesundaystandard/Tough-Times-Reds-Cite-Vedas-to-Win-Hearts/2014/01/26/article2020286.ece

  4. పింగ్‌బ్యాక్: పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్ – agkanth's weblog

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s